1, మార్చి 2016, మంగళవారం

సమస్య – 1959 (కాకర బెల్లమ్మువోలె...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
కాకర బెల్లమ్మువోలెఁ గడు పులుపు కదా!

51 కామెంట్‌లు:

 1. గురువు గారికి కవిమిత్రులకు నమస్సుమాంజలులు


  చీకటి లో ద్రాగి యొకడు
  మైకము తో ప్రేలెనిట్లు మర్కట మనగా
  కోకిల వలె తెల్లనిదౌ
  కాకర బెల్లమ్ము వోలె గడు పులుపు కదా.

  రిప్లయితొలగించండి
 2. భీకరమగు చేదందురు
  నేకతముగ పులుసు గలిపి నేర్పుగ వండన్
  శాకమునందు నగుడమును
  కాకర బెల్లమ్ము వొలెఁ గడు పులుపు గదా !

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. రాజేశ్వరి అక్కయ్యా,
   మీ పూరణ బాగున్నది.
   ‘అందురు+ఏకతము’ అన్నపుడు అంధి నిత్యం. నుగాగమం రాదు. ‘నీకొఱకై పులుసు...’ అనండి.

   తొలగించండి
 3. పేకాటలోన యోడిన
  కాకారావు మనసేమొ కల్లోలితమై
  శాకము రుచిచూసి యనియె
  కాకర బెల్లమ్ము వోలె గడు పులుపు కదా.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. ఆంజనేయ శర్మ గారూ,
   మీ రెండవ పూరణ బాగున్నది.
   ‘...లోన నోడిన..’ అనండి.

   తొలగించండి

 4. మాకరమున చేసితిమిది
  పాకము యెటులగ లదో! అపారము ! అయ్యర్
  జేకొని రుచిజూచి యనిరి
  కాకర బెల్లమ్ము వోలె గడు పులుపు కదా :)

  సావేజిత
  జిలేబి

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. జిలేబీ గారూ,
   మీ పూరణ బాగున్నది.
   ‘అపారము+అయ్యర్’ అన్నపుడు సంధి నిత్యం. విసంధిగా వ్రాయరాదు. ‘అపారమె అయ్యర్| చేకొని...’ అనండి.

   తొలగించండి
 5. * గు రు మూ ర్తి ఆ చా రి * ,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

  కాకర ముక్కలు తరుగుచు ,
  నేకము గా చేయుము పులు సిక. బెల్లమ్మున్
  శాకము వ౦డిన. రుచి నిడు !
  కాకర బెల్లమ్ము వోలె కడు పులుపు గదా !

  రిప్లయితొలగించండి
 6. కాకినిగని కోకిలయని
  మోకాలికి బోడితలకు ముడులను బెట్టే
  పోకిరులిటులన వింతయె ?
  కాకర బెల్లమ్మువోలె గడు పులుపుగదా !!!

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మంద పీతాంబర్ గారూ,
   మీ పూరణ బాగున్నది.
   ‘పెట్టే’ అనడం వ్యావహారికం. ‘ముడి బెట్టెడి యా|పోకిరు...’ అనండి.

   తొలగించండి
 7. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

  రిప్లయితొలగించండి
 8. రాక తెలుగు, పరదేశియు
  కాకర బెల్లమ్మువోలెఁ గడు పులుపు కదా
  కాక మరేమిటన, పడతి
  కాకర చేదనె, మధురము గాబెల్లమనెన్
  -వెంకోరా.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. ‘వెంకోరా’ గారూ, (మీ పూర్తి పేరు?)
   మీ పూరణ బాగున్నది.
   ‘మధురము గద బెల్ల మనెన్’ అనండి.

   తొలగించండి
  2. కంది శంకరయ్య గారు,
   మీ సూచనకు ధన్యవాదములు.అలాగే మార్చుకుంటానండీ.
   నా పేరు అదేనండీ. :-)

   తొలగించండి
 9. వ్రేకగ గుడముకలుప యగు
  కాకర బెల్లమ్ము వోలె , కడు పులుపు గదా
  శాకము లందున చుక్రిక
  ప్రాకటమగు రసనమిడును పలువంటలకున్!!!

  వ్రేక = అధికము

  రిప్లయితొలగించండి


 10. ఆకాకరయున్దీయనె
  కాకరబెల్లమ్మువోలెగడుపులుపుగదా
  మేకలలక్ష్మీ!వినుమా
  శాకములోచింతపండుజాస్తిగవేయన్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. పోచిరాజు సుబ్బారావు గారూ,
   మీ పూరణలో కొంత సంధిగ్ధత ఉన్నది. వివరించండి.

   తొలగించండి
  2. ఆకాకరకాయకూరకూడ బెల్లముతోవండిన తీయగానుండును.కాకరకాయబెల్లపుకూరవలెనే అనినా భావన.

   తొలగించండి
 11. నాకెఱుక పంచపాండవు
  లాకత మంచమునకున్న యాకోళ్ళ వలె
  న్నేకముగ మూడను నటుల
  కాకర బెల్లమ్మువోలెఁ గడు పులుపు కదా!

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. పోచిరాజు కామేశ్వర రావు గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.

   తొలగించండి
 12. చీకు చెవిటి ముచ్చ్హటలన
  కాకర బెల్లమ్మువోలెఁ గడు పులుపు కదా,
  నాకెందుకు తెలియదురా,
  కోకిల 'మే'యనిపాడు చకోరము వోలెన్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
   మీ పూరణ బాగున్నది.
   చివరిపాదంలో గణదోషం. సవరించండి.

   తొలగించండి
  2. గణదోషము సవరించిన పద్యము
   చీకు చెవిటి ముచ్చ్హటలన
   కాకర బెల్లమ్మువోలెఁ గడు పులుపు కదా,
   నాకెందుకు తెలియదురా,
   కోకిల 'మే'యనె వినుము చకోరము వోలెన్

   తొలగించండి
 13. ఆకలిగ యున్న వానికి
  కాకర బెల్లమ్ము వోలె , కడు పులుపు గదా
  చేకొనిన యుసిరి నదియున్
  ప్రాకటమగు వేల్పుబువ్వ వలె యుండునుగా!!!

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. శైలజ గారూ,
   మీ పూరణ బాగున్నది.
   ‘ఆకలిగ నున్న.. చేకొనిన నుసిరి యదియున్... వలె నుండునురా’ అనండి.

   తొలగించండి
 14. . క్రమాలంకారము
  లోకమ్మునచేదేదన?
  ఆకర్షిత చక్కరదిన-అదియేరుచియౌ?
  పాకంబున చింతబెరుగ?
  1] కాకర 2]బెల్లమ్మువోలె-3]కడుపులుపు గదా|

  రిప్లయితొలగించండి
 15. ఏకూరగాయ చేదగు?
  రూకమ్మ సరసపు మాట రుచి యెటులుండున్ ?
  నీకందని ద్రాక్ష ల రుచి ?
  కాకర, బెల్లమ్ము వోలె , గడుపులుపు కదా!

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.

   తొలగించండి
 16. 1)
  ఏకూర మిగుల హితకర?
  మేకరణిన్ పూలతేనెయే మధుర మగున్?
  లోకమున నిమ్మ రుచి యెది?
  కాకర; బెల్లమ్మువోలెఁ; గడు పులుపు కదా!
  2)
  “కాకర రుచి యెటులుండ న
  యా కేశవ?” యనుచుఁ బంతులయ్య యడుగఁగా
  నే కళనొ యుండి చెప్పెను
  “కాకర బెల్లమ్మువోలెఁ గడు పులుపు కదా!”

  రిప్లయితొలగించండి
 17. శాకమిది కొఱక చేదౌ
  ప్రాకటముగ భార్య మాట బహుతీపియగున్
  ఓకవివర!తల్లి పలుకు?
  కాకర-బెల్లమ్మువోలె-కడు పులుపుగదా!

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. పొన్నెకంటి సూర్యనారాయణ గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   ‘...యగున్| ఓ కవి’ అని విసంధిగా వ్రాశారు. ‘యగు|న్నోకవివర../ తీపికదా|యో కవివర...’ అనవచ్చు.

   తొలగించండి
 18. శాకమిది కొఱక చేదౌ
  ప్రాకటముగ భార్య మాట బహుతీపియగున్
  ఓకవివర!తల్లి పలుకు?
  కాకర-బెల్లమ్మువోలె-కడు పులుపుగదా!

  రిప్లయితొలగించండి
 19. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

  రిప్లయితొలగించండి
 20. కూరలందు చేదు కూర యేదిలయందు
  తేనె దేని వలెనె తీపిగుండు
  నెటుల నుండు ననిన నిమ్మకాయలరుచి
  కాకర బెల్లమ్ము వోలె కడుపులుపు గదా!

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. డా. బల్లూరి ఉమాదేవి గారూ,
   సమస్య కందపాదమైతే మీరు ఆటవెలది వ్రాశారు.

   తొలగించండి
 21. కాకులు కిచకిచ మనగా
  కోకిల బెకబెకయటంచు కూసెనటంచు
  న్నోకవి సుర గ్రోలి బలికె
  కాకర బెల్లమ్మువోలెఁ గడు పులుపు కదా!

  రిప్లయితొలగించండి
 22. 'కాకర','బెల్లము' జూడగ
  మా కోడళ్లింటి పేర్లు మనువుకు ముందు
  న్నే కోడలైన నొకటే!
  'కాకర', 'బెల్లమ్ము' వోలెఁ గడు పులుపు కదా!
  (ఇద్దరు కోడళ్లకు గర్వమే అనే భావం)

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.

   తొలగించండి
 23. చాకలి బూతులు సైచక
  చీకాకగు రాజ్యవిధిని సీతను వీడన్
  నాకీ యేకాంతమ్మున
  కాకర బెల్లమ్మువోలెఁ గడు పులుపు కదా!

  రిప్లయితొలగించండి


 24. రాకేందు బింబపు ముఖీ!
  నీకైవాటమ్మనంగ నీరజ నేత్రా
  పాకంబుగా జిలేబీ
  కాకర బెల్లమ్మువోలెఁ గడు పులుపు కదా:)

  జిలేబి

  రిప్లయితొలగించండి
 25. శోకము మీరగ తినగను
  పోకిరి యత్తయ్య వంట బోగోలందున్
  సోకగ చింతల గుజ్జును
  కాకర బెల్లమ్మువోలెఁ గడు పులుపు కదా!

  రిప్లయితొలగించండి