5, మార్చి 2016, శనివారం

సమస్య – 1963 (అప్పులున్నవారె...)

కవిమిత్రులారా,

ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...

అప్పులున్నవారె గొప్పవారు.

38 కామెంట్‌లు:

 1. అప్పుఁ దెచ్చి మిగుల నభివృద్ధిఁ జెందగన్
  కష్ట పడుచుఁ గలిగి కలిమి బలిమి
  నంద వెసలు బాటు నాదాయ పన్నుల
  నప్పులున్నవారె గొప్పవారు!
  రిప్లయితొలగించండి
 2. అప్పు జేసి నంత యాడిగెలువ వచ్చు
  రేసు లందు మిగుల కాసు లొచ్చు
  కలల తేలి తుదకు కష్టాల కడలిని
  అప్పు లున్న వారె గొప్ప వారు

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మీ పూరణ బాగున్నది.
   ‘వచ్చు’ను ‘ఒచ్చు’ అన్నారు. ‘కాసు లబ్బు’ అనండి.

   తొలగించండి
  2. అప్పుజేసి నంత యాడిగెలువ వచ్చు
   రేసు లందు మిగుల కాసు లబ్బు
   కలల తేలి తుదకు కష్టాల కడలిని
   అప్పులున్న వారె గొప్ప వారు

   తొలగించండి
 3. గురువు గారికి మరియు కవిమిత్రులకు నమస్కారములు

  1.
  అడిగి నంత నెవ్వడప్పునివ్వగ బోడు
  తీర్చ గలుగు నట్టి స్థితిని గాంచు
  పణము గలుగు వాడె ఋణము పొందునిలన
  అప్పులున్న వారె గొప్పవారు.

  2.
  విశ్వమందు జూడ విజయమాల్వాలాంటి
  వణిజులందు కొనరె ఋణము హెచ్చు
  నిలువ నీడలేని నిరుపేద కెవడిచ్చు
  అప్పులున్న వారె గొప్పవారు.

  3.
  భరతదేశ మన్న భాగ్యాల పుట్టరా
  భాగ్యవంతు లంద్రు భరత సుతులు
  అప్పులోన మునుగె నవని భారతమాత
  అప్పులున్న వారె గొప్పవారు

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మీ మూడు పూరణలు బాగున్నవి.
   మొదటి పూరణలో ‘ఋణము పొందెద రిల| నప్పులున్న...’ అనండి.

   తొలగించండి
 4. అష్ట నిర్ధనునికి అప్పివ్వ రెవ్వరు

  ఆస్తులున్న వారి కప్పు పుట్టు

  అప్పు చేసి వారు కొప్పులు పెడుదురు
  అప్పులున్నవారె గొప్పవారు.

  రిప్లయితొలగించండి
 5. తప్పు గాదు మాట తరుణమన జిలేబి
  అప్పు లున్న వారె గొప్ప వారు
  భువిన నిదియె గదవె బువ్వకు మార్గము
  తెలిసి నడచు కొనుమ తెలివి నిదియె

  సావేజిత
  జిలేబి

  రిప్లయితొలగించండి
 6. ఆ.వె.
  వంద రూక లప్పు బ్యాంకున మనకున్న
  ముక్కు పిండి కట్టు మోయ నేరు
  విజయ మల్లయ కడ పిండలేదు కనుక
  అప్పు లున్న వారె గొప్ప వారు.
  - వెంకోరా.

  రిప్లయితొలగించండి
 7. రిప్లయిలు
  1. దొంగ పత్రములతో “ధననిధులను” మోసపుచ్చి అప్పు తీసుకున్నవారి నుద్దేశించి:

   తప్పు లెన్నియైన నొప్పులగు ననియు
   ముప్పు లన్ని యింక తప్పు ననుచు
   గప్పి కళ్ళు దోచ నప్పనముగ దుడ్డు
   నప్పులున్నవారె గొప్పవారు.

   తొలగించండి
 8. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

  రిప్లయితొలగించండి
 9. ఎండ మ౦డుచున్న యిసుక యెడారిలో
  పర్యటించునట్టి పాంథులకును
  దప్పిదీర్చుకొనగ తత్తెర నిండుగ
  అప్పులున్నవారె గొప్పవారు
  అప్పు=నీరు

  రిప్లయితొలగించండి
 10. * గు రు మూ ర్తి ఆ చా రి *
  ,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

  డాబు లాడి > తిరిగి - డ౦బముగ > పిదప.

  నప్పు చేసి > తుదకు " ఐ. పి. " పెట్టి >

  వెనుక. కోట్ల ధనము , వేసు కొనగ వచ్చు |

  నప్పు లున్న వా రె గొప్ప వారు ! ! !

  { గురువు గారూ ఐ . పి. , అ౦గ్ల పదము కాన. స౦ధి చేయ లేదు క్షమి౦చ౦డి.

  డాబులు = అతి మాటలు ి
  ి

  రిప్లయితొలగించండి
 11. ముద్దులప్పు జేయ మున్నేడురాత్రిళ్లు
  శోభనాన మంచిశోభయందు
  అప్పువడ్డిగలిపి ఆపుత్రు లుదయింప?
  అప్పులున్నవారె గొప్పవారు
  2.అప్పు నివురుగప్పు నిప్పనిభావించి
  ముందుచూపు లేక మురిసి బడుచు
  అప్పులున్న వారె గొప్పవారె యనుట
  వరద నీరుగాదు వంకయనుటె|

  రిప్లయితొలగించండి

 12. తిప్పలెన్నొగలుగుధీమంతునకుకూడ యప్పులున్న,వారెగొప్పవారు కష్టసమయమందుకనికరముకలిగి యాదుకొనగవచ్చునార్యులవని

  రిప్లయితొలగించండి
 13. అప్పు బ్యాంకులోన నందుకొని సతము
  దుడ్డుతో డ భూమి దోచుకొనుచు
  గద్దెనెక్కి హాయి గాంచు చుండిరి నేడు
  అప్పులున్నవారె గొప్పవారు

  రిప్లయితొలగించండి
 14. అప్పులనగనెవ్వి? ఆలుబిడ్డలు, బంధు
  జనులు, మిత్రవరులు సంఘమందు
  అప్పుతీర్చవలెను అప్పుచేయవలెను
  అప్పులున్నవారె గొప్పవారు

  రిప్లయితొలగించండి
 15. ముప్పుల బడవేసి ముంచివేయునుగాదె
  అప్పు లున్న, వారె గొప్ప వారు
  అప్పు లేని జనులె నసలైనధనికులౌ
  అన్నమాటె నిజము నవని లోన !!!

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. పూరణ బాగున్నది.
   ‘గొప్పవార| లప్పులేని... మాటే సత్య మవనిలోన’ అనండి.

   తొలగించండి
 16. తప్పు దారిలోన ధనము నార్జింపంగ
  అందినంత మేర నప్పు చేసి
  తీర్చకుండ దాని తిప్పుచూ వారలన్
  అప్పు లున్నవారె గొప్ప వారు.
  అప్పు చేయుటొకటె అసలైన పనియని
  బ్యాంకులందుగాని బంధువులను
  గాని మోసపుచ్చి కడకు నైపిని(I p)పెట్ట
  నప్పు లున్నవారె గొప్ప వారు.
  విద్యుతు సరి లేక వికిరమ్ము లెండగ
  పంట పొలములన్ని వాడి పోయె
  జలముకొరకు జనులు చాలకస్తి బడగ
  నప్పు లున్న వారె గొప్పవారు.
  అప్పు=నీరు.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మీ మూడు పూరణలు బాగున్నవి.
   ఒక పద్యం అయిపోయాక స్పేస్ ఇచ్చి మరో పద్యం టైప్ చేయండి.
   మొదటిపూరణలో ‘తిప్పుచున్ వారల| నప్పు...’ అనండి.

   తొలగించండి
 17. గోప్ప పేరు కొఱకు తిప్ప లెన్ని పడిన,
  ధరణి తాము ధనికులమని జూప
  ఱుణము పొంది ధనము తృణముగాగాల్చరే
  యప్పులున్నవారె గొప్పవారు.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మీ పూరణ బాగుంది.
   రెండవపాదంలో యతి తప్పింది. ‘ధరణి తమను జూప ధనికులుగను| ఋణము...’ అనండి.

   తొలగించండి
 18. అప్పు చేసి నతడె యానంద మొందును

  అప్పు లిచ్చి నతని కాత్మ క్షోభ.

  అప్పులిచ్చి నతని కందరు వైరులే

  అప్పు లున్న వారె గొప్పవారు

  2. అప్పు తీర్చ లేక నప్పుచేసిన వారు

  ఖూని చేయు చుంద్రు గుట్టు గాను

  కలియు గంబ నంగ కపటాల జగమురా!

  అప్పులున్న వారు గొప్ప వారు.

  3.అప్పు లివ్వ వలదు ముప్పు పొంద వలదు

  అప్పు తీర్చ లేక యాలినమ్మె.

  అట్టి వారు గలర? యఖిలాండ మందున

  అప్పులున్న వారు గొప్పవారు.

  రిప్లయితొలగించండి