సదనము నిదియే కవివరకదనము జేయన్, కవనపు కందివరు సభాసదు లార మీరు కవితామధువును గ్రోలెదరు దైవమందిరమందున్ !సావేజితజిలేబి
sebhaash jilebi
మీ పూరణ బాగున్నది.‘సదన మ్మిదియే’ లేదా ‘అద నిదియే కద కవివర...’ అంటే బాగుంటుందేమో?
గురువు గారికి ప్రణామములు .....మీ ఆరోగ్యమెలా వుందండి? శ్రధ్ధగా మందులు వాడగలరు.1.విదురుడు భగవంతుని సన్నిధిలో రామాయణమును నిత్యము జెప్పన్ మధురమ్మౌ భక్తి రసపుమధువును గ్రోలెదరు దైవ మందిర మందున్ .2.ఉదయము కోవెల యందునవదలక రాముని భజనలు భక్తిగ జరుపన్నదివినుచు రామ నామపుమధువును గ్రోలెదరు దైవ మందిరమందున్ .
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
బెదరక నేర్వగ వచ్చును పదిలము గావ్రాసి యిచట పరిణతి నొందన్సుధలూ రెడికవ నములను మధువును గ్రోలెదరు దైవ మందిర మందున్
మీ పూరణ బాగున్నది. అభినందనలు
మధువాజ్యము దధి యు మరియుమధువును శర్కర కలిసిన మాధుర్యముతోమదిదోచెడు తీర్థమనెడుమధువును గ్రోలెదరు దైవ మందిరమందున్ 1. మధువు=పాలు2. మధువు=తేనె3. మధువు=నీరు
మీ మూడవ పూరణ బాగున్నది. అభినందనలు.
మధు సూదన భక్తులకున్సుధయగు పంచామృతములు! చూడగ ఘృతమున్దధిని జలంబును పాలను మధువును గ్రోలెదరు దైవమందిరమందున్!!
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
సదమలహృదయున్ పరిపరివిధములకొల్తురు సతతము బిడియము లేకన్మధుసూధనునభిషేకపుమధువును గ్రోలెదరు దైవమందిరమందున్.వదలక నేర్చిరి జనములుసుధలూరెడు కవనములను సులలిత రీతిన్పదిలముగానవ కవితామధువును గ్రోలెదరు దైవ మందిరమందున్.
అధునాతనకాలములో మధువునుగ్రోలెదరుదైవమందిరమందున్ మధువునుద్రాగెడువారికి మధనంబేగలుగదెపుడుమందిరమనియున్
. మధుసూధన బృందమ్మెమధుసూధను నెంచు భక్తి మై మరపించేవిధమై భజనల సారపుమధువును గ్రోలెదరు దైవ మందిరమందున్.
మీ పూరణ బాగున్నది. అభినందనలు. ‘మరపించే’ అని వ్యావహారికాన్ని ప్రయోగించారు.
వ్యథలన్ని మాసిపోవగక్షుధయెంతయు క్షోభలిడిన శూలికి భక్తిన్ విధిహిత నివేదిత పరమమధువును గ్రోలెదరు దైవ మందిర మందున్ !
* గు రు మూ ర్తి ఆ చా రి * ,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,అదియే , భద్రాచలము ! ప్రతి దినము వినుచు౦ద్రు రామ దీవ్యత్కథలన్ |మధురమగు రామ భజనల మధువును గ్రోలెదరు దైవ మ౦దిర మ౦దున్
విధివ త్కృత మంత్ర శబ్దప్రధాన పూజాభిషిక్త పరమాత్ముని సన్నిధి పంచామృత సారఘమధువును గ్రోలెదరు దైవమందిరమందున్.
దీర్ఘ సమాసములతో మీ పద్యము శోభిల్లుతున్నది.అభినందనలు. మొదటి పాదములో గణభంగమైనట్లున్నది?
వేంకట సుబ్బ సహదేవుడు గారు ధన్యవాదములు. ముందు “వచః” వ్రాసి తర్వాత “శబ్ద” గా మార్చితిని. గణదోషము గమనించలేదు.సవరణ చేసిన పద్యము చూడ గోర్తాను.విధివత్కృత మంత్రవచః ప్రధాన పూజాభిషిక్త పరమాత్ముని సన్నిధి పంచామృత సారఘమధువును గ్రోలెదరు దైవమందిరమందున్.
ఆర్యా సవరణ తెల్పితిని గదా! ప్రమాదవశమున మీ వ్యాఖ్య పునర్ముద్రిత మైనట్లు భావిస్తాను.
మధురాను భూతులందుచు బుధవర్గము పాడి తూల మోదమటంచున్ మధుర హరినామ స్రవితమధువును గ్రోలెదరు దైవమందిర మందున్!
మూడవపాదంలో గణభంగం.
గురుదేవులకు ధన్యవాదములు. టైపాటు సవరణతో:మధురాను భూతులందుచు బుధవర్గము పాడి తూల మోదమటంచున్ మధుర హరినామ స్రవితఁపుమధువును గ్రోలెదరు దైవమందిర మందున్!
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
అధిదైవము నారాయణు యధావిధిగ పూజజేసి యాకరుణావా ర్నిధి శ్రీచరణాబ్జమ్ముల మధువును గ్రోలెదరు దైవమందిరమందున్.
కదలక క రమగు భక్తిన్ మదిలోనిల్పి కమలాక్షు మాధవు సతమున్ మధురమగువాని నా మపు మధువును గ్రో లుదురు దైవ మందిర మందున్
ఆధివ్యాధుల బాపును సాధించు నకాలమృత్యుజాలము నఘమున్వేధించును శ్రీ తీర్థపు మధువును గ్రోలెదరు దైవ మ౦దిర మ౦దున్.
మధురము సంగీతమిచటమధురము సాహిత్య మన్న మధురము భక్తిన్,మధురపు మాధుర్య మనెడిమధువును గ్రోలెదరు దైవ మందిర మందున్కొరుప్రోలు రాధా కృష్ణ రావు
మధుసూదను సన్నిధిలో విధివిధమున పూజజేసి వేకువ భక్తుల్ అధినాయక సుధ గీతా మధువును గ్రోలెదరు దైవ మందిర మందున్
గోలి హనుమచ్ఛాస్త్రి గారూ, మీ పూరణ బాగున్నది.‘వేకువ జనులా| యధినాయక...’ అని సవరణ సూచించినట్లు గుర్తు.
ఎదలో భక్తియు ముదరన్ సాధులు గానము జేయుచు సామిని గాంచన్; మోదము మీరన్ భక్తుల్ మధువును గ్రోలెదరు దైవ మందిర మందున్. డాక్టర్ మూలె రామమునిరెడ్డి విశ్రాంత తెలుగు పండితులు ప్రొద్దుటూరు 7396564549
రామముని రెడ్డి కవి గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు.
అధములు కొల్లలు కొట్టగ విధివశమున శిథిలమవగ వేడుక కొరకై వెధవలు రాత్రించరులును మధువును గ్రోలెదరు దైవమందిరమందున్
సదనము నిదియే కవివర
రిప్లయితొలగించండికదనము జేయన్, కవనపు కందివరు సభా
సదు లార మీరు కవితా
మధువును గ్రోలెదరు దైవమందిరమందున్ !
సావేజిత
జిలేబి
sebhaash jilebi
తొలగించండిమీ పూరణ బాగున్నది.
తొలగించండి‘సదన మ్మిదియే’ లేదా ‘అద నిదియే కద కవివర...’ అంటే బాగుంటుందేమో?
గురువు గారికి ప్రణామములు .....మీ ఆరోగ్యమెలా వుందండి? శ్రధ్ధగా మందులు వాడగలరు.
రిప్లయితొలగించండి1.
విదురుడు భగవంతుని స
న్నిధిలో రామాయణమును నిత్యము జెప్పన్
మధురమ్మౌ భక్తి రసపు
మధువును గ్రోలెదరు దైవ మందిర మందున్ .
2.
ఉదయము కోవెల యందున
వదలక రాముని భజనలు భక్తిగ జరుప
న్నదివినుచు రామ నామపు
మధువును గ్రోలెదరు దైవ మందిరమందున్ .
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
తొలగించండిబెదరక నేర్వగ వచ్చును
రిప్లయితొలగించండిపదిలము గావ్రాసి యిచట పరిణతి నొందన్
సుధలూ రెడికవ నములను
మధువును గ్రోలెదరు దైవ మందిర మందున్
మీ పూరణ బాగున్నది. అభినందనలు
తొలగించండిమధువాజ్యము దధి యు మరియు
రిప్లయితొలగించండిమధువును శర్కర కలిసిన మాధుర్యముతో
మదిదోచెడు తీర్థమనెడు
మధువును గ్రోలెదరు దైవ మందిరమందున్
1. మధువు=పాలు
2. మధువు=తేనె
3. మధువు=నీరు
మీ మూడవ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిమధు సూదన భక్తులకున్
రిప్లయితొలగించండిసుధయగు పంచామృతములు! చూడగ ఘృతమున్
దధిని జలంబును పాలను
మధువును గ్రోలెదరు దైవమందిరమందున్!!
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిసదమలహృదయున్ పరిపరి
రిప్లయితొలగించండివిధములకొల్తురు సతతము బిడియము లేకన్
మధుసూధనునభిషేకపు
మధువును గ్రోలెదరు దైవమందిరమందున్.
వదలక నేర్చిరి జనములు
సుధలూరెడు కవనములను సులలిత రీతిన్
పదిలముగానవ కవితా
మధువును గ్రోలెదరు దైవ మందిరమందున్.
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
తొలగించండి
రిప్లయితొలగించండిఅధునాతనకాలములో మధువునుగ్రోలెదరుదైవమందిరమందున్ మధువునుద్రాగెడువారికి మధనంబేగలుగదెపుడుమందిరమనియున్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి. మధుసూధన బృందమ్మె
రిప్లయితొలగించండిమధుసూధను నెంచు భక్తి మై మరపించే
విధమై భజనల సారపు
మధువును గ్రోలెదరు దైవ మందిరమందున్.
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి‘మరపించే’ అని వ్యావహారికాన్ని ప్రయోగించారు.
వ్యథలన్ని మాసిపోవగ
రిప్లయితొలగించండిక్షుధయెంతయు క్షోభలిడిన శూలికి భక్తిన్
విధిహిత నివేదిత పరమ
మధువును గ్రోలెదరు దైవ మందిర మందున్ !
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి* గు రు మూ ర్తి ఆ చా రి *
రిప్లయితొలగించండి,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
అదియే , భద్రాచలము ! ప్ర
తి దినము వినుచు౦ద్రు రామ దీవ్యత్కథలన్ |
మధురమగు రామ భజనల
మధువును గ్రోలెదరు దైవ మ౦దిర మ౦దున్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండివిధివ త్కృత మంత్ర శబ్ద
రిప్లయితొలగించండిప్రధాన పూజాభిషిక్త పరమాత్ముని స
న్నిధి పంచామృత సారఘ
మధువును గ్రోలెదరు దైవమందిరమందున్.
దీర్ఘ సమాసములతో మీ పద్యము శోభిల్లుతున్నది.అభినందనలు. మొదటి పాదములో గణభంగమైనట్లున్నది?
తొలగించండివేంకట సుబ్బ సహదేవుడు గారు ధన్యవాదములు. ముందు “వచః” వ్రాసి తర్వాత “శబ్ద” గా మార్చితిని. గణదోషము గమనించలేదు.
తొలగించండిసవరణ చేసిన పద్యము చూడ గోర్తాను.
విధివత్కృత మంత్రవచః
ప్రధాన పూజాభిషిక్త పరమాత్ముని స
న్నిధి పంచామృత సారఘ
మధువును గ్రోలెదరు దైవమందిరమందున్.
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిదీర్ఘ సమాసములతో మీ పద్యము శోభిల్లుతున్నది.అభినందనలు. మొదటి పాదములో గణభంగమైనట్లున్నది?
తొలగించండిఆర్యా సవరణ తెల్పితిని గదా! ప్రమాదవశమున మీ వ్యాఖ్య పునర్ముద్రిత మైనట్లు భావిస్తాను.
తొలగించండివ్యథలన్ని మాసిపోవగ
రిప్లయితొలగించండిక్షుధయెంతయు క్షోభలిడిన శూలికి భక్తిన్
విధిహిత నివేదిత పరమ
మధువును గ్రోలెదరు దైవ మందిర మందున్ !
మధురాను భూతులందుచు
రిప్లయితొలగించండిబుధవర్గము పాడి తూల మోదమటంచున్
మధుర హరినామ స్రవిత
మధువును గ్రోలెదరు దైవమందిర మందున్!
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిమూడవపాదంలో గణభంగం.
తొలగించండిగురుదేవులకు ధన్యవాదములు. టైపాటు సవరణతో:
తొలగించండిమధురాను భూతులందుచు
బుధవర్గము పాడి తూల మోదమటంచున్
మధుర హరినామ స్రవితఁపు
మధువును గ్రోలెదరు దైవమందిర మందున్!
గురుదేవులకు ధన్యవాదములు. టైపాటు సవరణతో:
తొలగించండిమధురాను భూతులందుచు
బుధవర్గము పాడి తూల మోదమటంచున్
మధుర హరినామ స్రవితఁపు
మధువును గ్రోలెదరు దైవమందిర మందున్!
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిఅధిదైవము నారాయణు
రిప్లయితొలగించండియధావిధిగ పూజజేసి యాకరుణావా
ర్నిధి శ్రీచరణాబ్జమ్ముల
మధువును గ్రోలెదరు దైవమందిరమందున్.
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండికదలక క రమగు భక్తిన్
రిప్లయితొలగించండిమదిలోనిల్పి కమలాక్షు మాధవు సతమున్
మధురమగువాని నా మపు
మధువును గ్రో లుదురు దైవ మందిర మందున్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి* గు రు మూ ర్తి ఆ చా రి *
రిప్లయితొలగించండి,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
అదియే , భద్రాచలము ! ప్ర
తి దినము వినుచు౦ద్రు రామ దీవ్యత్కథలన్ |
మధురమగు రామ భజనల
మధువును గ్రోలెదరు దైవ మ౦దిర మ౦దున్
ఆధివ్యాధుల బాపును
రిప్లయితొలగించండిసాధించు నకాలమృత్యుజాలము నఘమున్
వేధించును శ్రీ తీర్థపు
మధువును గ్రోలెదరు దైవ మ౦దిర మ౦దున్.
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిమధురము సంగీతమిచట
రిప్లయితొలగించండిమధురము సాహిత్య మన్న మధురము భక్తిన్,
మధురపు మాధుర్య మనెడి
మధువును గ్రోలెదరు దైవ మందిర మందున్
కొరుప్రోలు రాధా కృష్ణ రావు
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
రిప్లయితొలగించండిమధుసూదను సన్నిధిలో
రిప్లయితొలగించండివిధివిధమున పూజజేసి వేకువ భక్తుల్
అధినాయక సుధ గీతా
మధువును గ్రోలెదరు దైవ మందిర మందున్
గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది.
‘వేకువ జనులా| యధినాయక...’ అని సవరణ సూచించినట్లు గుర్తు.
ఎదలో భక్తియు ముదరన్
రిప్లయితొలగించండిసాధులు గానము జేయుచు సామిని గాంచన్;
మోదము మీరన్ భక్తుల్
మధువును గ్రోలెదరు దైవ మందిర మందున్.
డాక్టర్ మూలె రామమునిరెడ్డి విశ్రాంత తెలుగు పండితులు ప్రొద్దుటూరు 7396564549
రామముని రెడ్డి కవి గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
అధములు కొల్లలు కొట్టగ
రిప్లయితొలగించండివిధివశమున శిథిలమవగ వేడుక కొరకై
వెధవలు రాత్రించరులును
మధువును గ్రోలెదరు దైవమందిరమందున్