28, మార్చి 2016, సోమవారం

సమస్య – 1986 (తాటితోపులోఁ బాలను...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
తాటితోపులోఁ బాలను ద్రాగవలెను.

46 కామెంట్‌లు:

  1. గురువు గారికి నమస్కారములు మీ ఆరోగ్యం కాస్త కుదుటపడిందను కుంటాను.

    1.
    తాతలేనాడొ తెలిపిరి త్రాగ వలదు
    తాటి తోపులఁ బాలను, ద్రాగ వలెను
    కల్తి లేని మధురమైన కల్లునచట
    యనుచు, ననుభవజ్ఞులమాట లాచరించు.

    2.
    పనివానికీ కామందు పని అప్పగించి కల్లు సేవింప వెళ్ళగా పనివాడు తలపోసిన విధము


    మధువు గ్రోలెద ననుచు కామందు వేగ
    బయలుదేరగ గాంచుచు బలికె నిట్లు
    తాటితోపులఁ బాలను ద్రాగవలెన
    నుచు, మధువనగ బాలన నొప్పుగాదె.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఆంజనేయ శాస్త్రి గారూ,
      మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.

      తొలగించండి
  2. శుభోదయం !

    యెవరు నీవు అమ్మణి ? నీకు యేమి వలయు ?
    తాటితోపులోఁ బాలను, ద్రాగవలెను
    నీరు, దప్పిక గొంపోవ నిచట యుంటి!
    దాని కేమి భాగ్యము యిదే ద్రాగు నీరు !

    సావేజిత
    జిలేబి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. జిలేబీ గారూ,
      మీ పూరణ బాగున్నది.
      మొదటిపాదాన్ని ‘ఎవ్వరు నీ వమ్మణీ నీకు నేమి వలయు’ అనండి.
      అన్నట్టు మా ఆవిడ పేరు ‘అమ్మణి’.

      తొలగించండి
  3. జున్నుకోసము పల్లెలో చూచు చుండ
    బర్రె యీనెను మాయింటి ప్రక్క నున్న
    తాటి తోపులోఁ బాలను త్రాగవలెను
    మొదటి రోజు కరమగు ముదముతోడ

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  4. త్రాగుబోతుపకీరయ్య తట్టిజెప్పె
    " నాచతుర్ముఖ పారాయణమ్ము పిదప
    చేరి సేవించి తీర్థమ్ము బారునందు
    తాటితోపులోఁ బాలను ద్రాగవలెను. "

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అంతర్జాలమందుబాటులో లేని కారణమున నేడు స్పందించుచున్నాను. మన్నించగలరు.

      గోలి హనుమచ్ఛాస్త్రి గారు ఘంటసాల వారి బహుముఖ ప్రజ్ఞ ని చక్కగా వర్ణించారు. మీకు నా హృదయపూర్వకాభినందనలు.

      తొలగించండి
    2. గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
    3. మాస్టరుగారూ ! ధన్యవాదములు.
      కామేశ్వరరావు గారూ ! కడుంగడు ధన్యవాదములు.

      తొలగించండి
  5. తాటి తోపులో పాలను త్రాగవలెను
    యనెడి కోరికేలకలిగె నతిశయముగ
    తాటి చెట్టునీడను పాలు త్రాగుచున్న
    కల్లు యందురయ్య జనులు కైపుతోడ

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. డా. బల్లూరి ఉమాదేవి గారూ,
      మీ పూరణ బాగున్నది.
      ‘వలెను+అనెడి’ అన్నపుడు యడాగమం రాదు. ‘త్రాగవలయు| ననెడి’ అనండి. అలాగే ‘కల్లె యందురయ్య’ అనండి.

      తొలగించండి
  6. నీకు కలదని చెప్పకు నిగ్రహమ్ము
    నేను పెట్టు పరీక్షకు నిలువగలవ?
    కల్లుకుండల జోలికి వెళ్ళకుండ
    తాటితోపులోఁ బాలను ద్రాగవలెను.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  7. పొంచి యుండెను నొకపులి పూర్ణ !చూడు
    ,తాటి తోపులో, బాలను ద్రా గ వలెను
    లేని చోమన లను నమ లితిను నమ్మ !
    వేగి రమ్ముగ ద్రాగుము విషము నీవు

    రిప్లయితొలగించండి

  8. * గు రు మూ ర్తి ఆ చా రి *
    ,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

    పాలు త్రాగినన్ గల్లును గ్రోలి నటులె ,

    తాటి తోపులో | పాలను త్రాగ వలను

    సదన మ౦దొ , లేక యల గోశాల. య౦దొ |

    కుజనుల కడ నిలుచు వాని కుజను డ౦ద్రు

    సుజనులc దిరుగు నాతని సుగుణి య౦ద్రు

    " నిన్ను నీ వెరి౦గి యచట నిలుచు మోయి "

    ి

    రిప్లయితొలగించండి

  9. * గు రు మూ ర్తి ఆ చా రి *
    ,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

    పాలు త్రాగినన్ గల్లును గ్రోలి నటులె ,

    తాటి తోపులో | పాలను త్రాగ వలను

    సదన మ౦దొ , లేక యల గోశాల. య౦దొ |

    కుజనుల కడ నిలుచు వాని కుజను డ౦ద్రు

    సుజనులc దిరుగు నాతని సుగుణి య౦ద్రు

    " నిన్ను నీ వెరి౦గి యచట నిలుచు మోయి "

    ి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అంతర్జాలమందుబాటులో లేని కారణమున నేడు స్పందించుచున్నాను. మన్నించగలరు.
      గురుమూర్తి ఆచారి గార్కి హృదయపూర్వకాభినందనలు. చక్కటి పద్యకుసుమాలతో మహా గాయకుడు ఘంటసాల గారిని కీర్తించారు. మీరు ధన్యులు

      తొలగించండి
  10. తామ రాకున దోయంపు ధార వలెను
    బంధు రాలయమ్మున గీతఁ బాడ వలెను
    చోర నికరములకు జాలి సూప వలెను
    తాటి తోపులోఁ బాలను ద్రాగ వలెను.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. పోచిరాజు కామేశ్వర రావు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  11. నడచు దారిని స్థిరముగ నమ్మ వలెను,
    జనుల మాటల కెదురొడ్డి, జంకు వీడి
    తాటి తోపులో బాలను ద్రాగ వలెను,
    నీటి వాటాని కెదురీది నిలువ వలెను!

    గురువు గారికి నమస్కారములు, నిన్నటి పూరణాన్ని కూడా జత చేస్తున్నాను, దయ
    యుంచి చదివి, సవరణ లేవైనా వుంటే తెలుప గలరు. ధన్యవాదములు. శ్రీధర రావు.

    శాంతము సడలక సతతము
    కాంతుని సేవించు, నాతి! గయ్యాళి కదా!
    చింతింపగ, నాది గురువు
    పంతము నెగ్గించుకొనెడి భామల కెపుడున్!

    రిప్లయితొలగించండి
  12. ఇవాళ్టి నా పూరణలోని నాల్గవ పాదంలో 'నీటి వాటాని ' కి బదులుగా 'నీటి వాటమ్ము ' అని అంటే బాగుంటుందేమో ననిపిస్తోంది. మార్చిన పద్యాన్ని ఇక్కడ వేస్తున్నాను. దయ
    యుంచి చదివి, సవరణ లేవైనా వుంటే తెలుప గలరు. ధన్యవాదములు. శ్రీధర రావు.

    నడచు దారిని స్థిరముగ నమ్మ వలెను,
    జనుల మాటల కెదురొడ్డి, జంకు వీడి
    తాటి తోపులో బాలను ద్రాగ వలెను,
    నీటి వాటమ్ము కెదురీది నిలువ వలెను!

    రిప్లయితొలగించండి
  13. ఇవాళ్టి నా పూరణలోని నాల్గవ పాదంలో 'నీటి వాటాని ' కి బదులుగా 'నీటి వాటమ్ము ' అని అంటే బాగుంటుందేమో ననిపిస్తోంది. మార్చిన పద్యాన్ని ఇక్కడ వేస్తున్నాను. దయ
    యుంచి చదివి, సవరణ లేవైనా వుంటే తెలుప గలరు. ధన్యవాదములు. శ్రీధర రావు.

    నడచు దారిని స్థిరముగ నమ్మ వలెను,
    జనుల మాటల కెదురొడ్డి, జంకు వీడి
    తాటి తోపులో బాలను ద్రాగ వలెను,
    నీటి వాటమ్ము కెదురీది నిలువ వలెను!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. శ్రీధరరావు గారు "వాటమ్ముకు" బదులు "వాటమ్మునకు" అనడము సాధువు. "వాటము +నకు + ఎదురు = వాటానకెదురు' అనడము భావ్యమనుకుంటాను."ని" బదులు "న" వస్తుంది. ఇక్కడ "లు, ల, న" ల సంధి వర్తిస్తుంది.

      తొలగించండి
    2. కామేశ్వర రావు గారూ,
      మీ విశ్లేషణ సముచితం. ధన్యవాదాలు.

      తొలగించండి
    3. పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. ధన్యవాదములు.

      తొలగించండి
  14. పెళ్లిఁ దప్పించమంటివి వేడుకొనుచు
    పిల్ల తండ్రియె చూడగన్ వెడలి నీవు
    తాటి తోపులోఁ బాలను ద్రాగవలెను
    తప్పఁ ద్రా గెడు వాడని దప్పు నదియె!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  15. త్రాగవలె చెట్టు పయి కల్లు తనివి తీర
    తాటితోపులోఁ , బాలను ద్రాగవలెను
    కాచి యింటిలో నిత్యము కండ బలము
    పెంచు, బాలల కివి బహు మంచి భుక్తి.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. గండూరి లక్ష్మినారాయణ గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  16. మిత్రులందఱకు నమస్సులు!

    [ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్‍లోఁ బ్రథమ బహుమతి గెలుచుకొనుటకై యొక బాలకుఁడు త్రాగుఁబోతు వేషమును వేసికొని యిటుల నాలోచించిన సందర్భము]

    "నన్నుఁ ద్రాగుఁబోతని యంద ఱనఁగ వలయు
    నపుడె నా వేష మెంతేని యందగించి
    చక్కఁగా గెలుతును గాన జాగు లేక
    తాటితోపులోఁ బాలను ద్రాగవలెను!"

    రిప్లయితొలగించండి
  17. మందలోనీనె సుందరమైన గోవు
    తాటితోపులోఁ; బాలను ద్రాగవలెను
    ముందు దూడయె, బలమును పొంది పిదప
    పాడియావుగ కడవల పాల నిడగ

    రిప్లయితొలగించండి
  18. తాటితోపులో బాలను ద్రాగవలెను
    ననగ మత్తుగలుగు వాడు,.వినును మరల
    పిచ్చివాడును,తోడుగ మెచ్చువాడు
    రచ్చ జేతురు వినకున్న?కచ్చితాన|

    రిప్లయితొలగించండి
  19. తప్పి పోయిన దూడయే తల్లికొరకు
    అలమటించుచు నచ్చట నరచు చుండె
    తాటితోపులో, పాలను ద్రాగవలెను
    తల్లి చెంతకు జేర్చుము దాన్నివేగ!!!


    నిజము బల్కెద నమ్ముము నేటినుండి
    కల్లు జోలికి వెళ్లను ఖచ్చితముగ
    యింత జెప్పిన వినకున్న యేమి జేతు?
    తాటితోపులో పాలను ద్రాగవలెను!!!

    రిప్లయితొలగించండి
  20. వీటి నికజేయ వలదుర వాటి ననగ
    నూరు నీతుల వినుచును నోరు మూసి
    మీసమున్న వాడిలనిక మింటి కెగసి
    తాటితోపులోఁ బాలను ద్రాగవలెను :)

    రిప్లయితొలగించండి