పద్మావతీ శ్రీనివాసము (ద్విపద కావ్యము)
రచన : పోచిరాజు కామేశ్వర రావు
చతుర్థాశ్వాసము (21-40)
దేవ కన్యను గంటె ద్విజ కన్య నైన
భావాపహరి నర భామినిఁ గంటె 21
చెప్పు మార్య యని యా చేడియ యడుగ
నప్పుండరీకాక్షు డంత నిట్టూర్చి 22
వకుళ మాలికఁ గని వామాక్షు డనియె
సకలమ్ము నుడివెద సత్యమ్ము వినుము 23
త్రేతాయుగ మది వధించితి నేను
సీతాపహారి దుశ్శీలు రావణుని 24
వేదవతీ కన్య వినయ సంపత్తి
యాదరించె సిరి సహాహియై కరము 25
సీతయై లక్ష్మియ క్షితి నుద్భవించె
భూతల పతికి నపుడు పువ్వుబోణి 26
పంచవటిని వీడ వధకు మారీచు
పంచగ సీత యవరజు డే తెంచ 27
అంత సమీపించె నా రావణుండు
పంతమూని మది నపహరింప సీత 28
అగ్ని హోత్ర గతాగ్ని యంత కార్య సుని
మగ్నుడై రావణు మనసు నెఱింగి 29
స్వాహా సతి సరసఁ బాతాల మందు
స్నేహ భావము మీర సీతను దాచి 30
రావణ స్పృష్ట కారణ దగ్ధ తరుణి
నా వేదవతిని సీతాకృతి విడిచె 31
రావణాపహృతయై లంకానగరము
దైవోపహత సేరె దైన్య భావమున 32
దశకంఠుని మరణోత్తరమునఁ దిరిగి
కృశమధ్య దారుణాగ్ని శిఖల దూక 33
పావకుండు మహానుభావుండు రక్షి
తావని సుతను స్వాహాశ్రిత సుమతి 34
సీత వినుత భద్ర శీలిని కీల
వ్రాతమున సవేదవతి నుద్ధ రించి 35
ఐచ్చి పలికె సీత యీమె యని మన
మచ్చెరు వందగ నా వేదవతిని 36
పుణ్యవతినిఁ జూపి పూబోడి బదుల
గణ్య సంకటములఁ గందె యిభ్భామ 37
లంక యందని పల్కి లావణ్య వతిని
నింక కరుణ జూచి యేలుకొను మనె 38
నావిని జానకి ననుజూచి పలికె
దేవ వేదవతి ప్రీతి యొస గనిశము 39
వారిజాక్షి పరమ భాగవతి సతి
కారుణ్యము వహించి కళ్యాణ మాడు 40
ద్విపద పద్యము లన్నియు దే జ ! వినుము
రిప్లయితొలగించండిద్రాక్ష పాకము వోలెను దనరి మాకు
దీ య గుండె జదువు కొలదిని ,యవియును
గొలుసు కట్టెడు రూపాన వెలిగె కూడ
ధన్యవాదములన్నయ్య.
రిప్లయితొలగించండిచిన్నసవరణ:
రిప్లయితొలగించండిపుణ్యవతినిఁ జూపి పూబోడి బదుల
గణ్య సంకటములఁ గందె నిభ్భామ