19, జులై 2016, మంగళవారం

సమస్య - 2091 (శత్రువు లేనివాని కిల...)

కవిమిత్రులారా, 
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది... 
“శత్రువు లేనివాని కిల శాంతి సుఖంబులు గల్గనేర్చునే”
లేదా...
“శత్రురహితున కబ్బునే శాంతి సుఖము”

82 కామెంట్‌లు:

  1. చిత్రము కాదె బంధువులు చేరగ రారది డబ్బు లేక, యే
    మిత్రుఁడు పల్కబోడు, సతి మిక్కిలి లెక్కన పెట్టదింటిలో,
    పుత్రులు ప్రేమఁ జూపరిక, భూవలయంబునఁ జూడ లేమియే
    శత్రువు, లేనివాని కిల శాంతి సుఖంబులు గల్గనేర్చునే!!

    రిప్లయితొలగించండి

  2. శుభోదయం

    కుస్తి జేయకున్న సమస్య కువలయమగు ?
    మహిని రాపిడి లేకున్న మంచి‌‌ గలుగు ?
    శత్రురహితున కబ్బునే శాంతి సుఖము ?
    ఘర్ష ణవలయును జిలేబి గరిమ గలుగ !

    సావేజిత
    జిలేబి

    రిప్లయితొలగించండి
  3. అమ్మ ప్రేమను మరచిన యవని యందు
    తండ్రి యాస్తిని గొలిచెడి తనయు లుండ
    చెలిమి కంటెను మిన్నగు కలిమి ముందు
    శత్రు రహితున కబ్బునే శాంతి సుఖము ?

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అక్కయ్యా,
      మీ పద్యం బాగున్నది. కాని సమస్య పరిష్కారం కాలేదని అనిపిస్తుంది.
      మిన్న + అగు అన్నప్పుడు యడాగమం వస్తుంది.

      తొలగించండి
    2. అమ్మ ప్రేమను మరచిన యవని యందు
      తండ్రి యాస్తిని గొలిచెడి తనయు లుండ
      చెలిమి గలిగిన మిగులదు కలిమి యనగ
      శత్రు రహితున కబ్బునే శాంతి సుఖము ?

      తొలగించండి
  4. మిత్రుడు సర్వకాలముల మేలొనరించగ బూనువాడు, సత్
    పాత్రత గూర్చువా, డికను భాగ్యము బంచుచు నుండి దౌష్ట్యమున్
    వేత్రము చూపుచున్ సతము విస్తృతరీతి నశింపజేయుటన్
    శత్రువు, లేనివాని కిల శాంతి సుఖంబులు కల్గ నేర్చునే.
    (హ.వేం.స.నా.మూర్తి)

    రిప్లయితొలగించండి
  5. మిత్రుడు సర్వకాలముల మేలొనరించగ బూనువాడు, సత్
    పాత్రత గూర్చువా, డికను భాగ్యము బంచుచు నుండి దౌష్ట్యమున్
    వేత్రము చూపుచున్ సతము విస్తృతరీతి నశింపజేయుటన్
    శత్రువు, లేనివాని కిల శాంతి సుఖంబులు కల్గ నేర్చునే.
    (హ.వేం.స.నా.మూర్తి)

    రిప్లయితొలగించండి
  6. మిత్రుడు సర్వకాలముల మేలొనరించగ బూనువాడు, సత్
    పాత్రత గూర్చువా, డికను భాగ్యము బంచుచు నుండి దౌష్ట్యమున్
    వేత్రము చూపుచున్ సతము విస్తృతరీతి నశింపజేయుటన్
    శత్రువు, లేనివాని కిల శాంతి సుఖంబులు కల్గ నేర్చునే.
    (హ.వేం.స.నా.మూర్తి)

    రిప్లయితొలగించండి
  7. మిత్రుడు తల్లి తండ్రియును మేలగు చుట్టము నాతడంచు తా
    నాత్రముతో పరాత్పరుని యండను జేరి రమించ శంక యే
    మాత్రము లేదు లోనగల మచ్చరులన్ దునుమాడు దీక్ష యన్
    శత్రువు లేనివానికిల శాంతి సుఖంబులు గల్గ నేర్చునే?

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మిస్సన్న గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      '... దునుమాడ వాటికిన్ | శత్రువు... ' అంటే ఎలా ఉంటుంది?

      తొలగించండి
    2. అయ్యా మీ సూచన బాగుంది. ధన్యవాదాలు.

      తొలగించండి
  8. గురువు గారికి నమస్కారములు. మీ సూచనల మేరకు ప్రయత్నించి సవరించిన నిన్నటి పద్యములు చూద గోరుతాను. ధన్యవాదములు.

    ఇమ్ముగ పదములు చిమ్ముచు
    బమ్మెర పోతన్న వ్రాసె! వ్యాకరణమ్మున్
    కమ్మని తెలుగు పలుకులకు
    సొమ్ములుగా నిడెను సూరి శోభను గూర్చన్!
    (సూరి = పరవస్తు చిన్నయ సూరి)

    ఇమ్ముగ భక్తి నింపుటకు నీతని బోలిన వారు లేరనన్
    అమ్మల గన్న యమ్మ కృప నందగ, భాగవతమ్ము నిండుగా
    నిమ్మహి శబ్ద భావ లయ లిచ్చుచు, యా ధ్వని పద్యమేయనన్
    బమ్మెర పోతనార్యుడొక వ్యాకరణమ్మును వ్రాసె దెల్గునన్!
    (ధ్వని = ఆనంద వర్ధనుని ధ్వన్యాలోకము లో నిర్వచింప బడ్డ ద్వనికి సమమైనది)

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. శ్రీధర రావు గారూ,
      సవరించిన మీ పూరణలు బాగున్నవి. అభినందనలు.

      తొలగించండి
  9. శత్రువును గూల్చు దీక్షలో సతత మవని
    జనుల కలవడు నేకాగ్ర శక్తి యద్ది
    శత్రు రహితున కబ్బునే? శాంతి సుఖము
    శత్రు నాశన మందు తా జనుడు గాంచు.
    (హ.వేం.స.నా.మూర్తి)

    రిప్లయితొలగించండి
  10. గురువుగారూ, గుగురుపౌర్ణమిశుభాకాంక్షలతో కూడిన ననమస్సుమాంజలి.

    నిన్నటి పూరణ

    వమ్మును కానిమాటలను భాగవతంబును వ్రాసిరెవ్వరో
    సమ్మతమందు రీతిగనసాధ్యుడు చిన్నయ సూరి వ్రాసెగా
    తెమ్మెరవంటి భారతము దిగ్గజ మూర్తులు వ్రాసెనెందునన్
    బమ్మెర పోతనార్యుఁ, డొక వ్యాకరణమ్మును, వ్రాసెఁ దెల్గునన్

    రిప్లయితొలగించండి
  11. ధర్మజుని సంధి మీరలు తగదటన్న
    శత్రు రహితున కబ్బునే శాంతి సుఖము?
    యలిగినన్ సాగరములేక మైనతీరు
    హోరు భరియించఁ జాలరు కౌరవేంద్ర!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సహదేవుడు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      ‘శాంతి సుఖము| లలిగినన్...’ అనండి. అక్కడ యడాగమం రాదు.

      తొలగించండి
    2. గురుదేవులకు ధన్యవాదములు. సవరించిన పూరణ:ధర్మజుని సంధి మీరలు తగదటన్న
      శత్రు రహితున కబ్బునే శాంతి సుఖము?
      లలిగినన్ సాగరములేక మైనతీరు
      హోరు భరియించఁ జాలరు కౌరవేంద్ర!

      తొలగించండి
  12. మిత్రులందఱకు నమస్సులు!

    మిత్రులు గారవించెదరు మెత్తురు బంధులు విత్తమున్నచోఁ
    బుత్ర కళత్రముల్ మిగుల బుద్ధిగ సేవ లొనర్తు రా ధన
    మ్మాత్రత తోడఁ గూర్చక సమర్థుఁడు లేమినిఁ గూల నద్దె యౌ

    శత్రువు! "లేని"వాని కిల శాంతి సుఖంబులు గల్గనేర్చునే?

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మధుసూదన్ గారూ,
      కలిమి లేనివానిని గురించిన మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  13. పాత్రత, పాప పుణ్యములు బాగుగ నెంచి యుమామహేశుడే
    మిత్రత భాగ్యసంపదలు మిక్కుట మిచ్చును కర్మసాక్షిగా
    పాత్రత లేక విత్త సముపార్జన చేయుచు నందునన్ తృషా
    శత్రువు లేనివాని కిల శాంతి సుఖంబులు గల్గనేర్చునే

    తృషా శత్రువు అంటే తృప్తి అని నా భావన.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఫణికుమార్ గారూ,
      ధనార్జనమనే దాహానికి శత్రువు లేనివాడు అనియా మీ భావం? బాగుంది మీ పూరణ. అభినందనలు.

      తొలగించండి
  14. మిత్ర బంధము దెలియ పవిత్ర మవగ
    శత్రు రహితున కబ్బునే! శాంతి సుఖము
    పాత్రతను గని జేరగ మిత్రు నిదరి
    ధాత్రి యందున దొరకును, మైత్రి వెలయు!

    రిప్లయితొలగించండి
  15. గురుమూర్తి ఆచారి గారి పూరణ...

    శత్రువు లేని వాని కిల శా౦తి సుఖమ్ములు గల్గనేర్చు, నే
    మిత్రుడు లేక యు౦డినను మిత్రమ! దైవ సత్కృపా
    పాత్రుడవై మెల౦గుము, శుభ౦బగు; నీదు మదాగ్రహమ్ములే
    శత్రులు, నీ దయాగుణమె శా౦తమె రక్షణ జేయు స్నేహితుల్.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. గురుమూర్తి ఆచారి గారూ,
      వైవిధ్యమైన విరుపుతో మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      రెండవపాదంలో గణదోషం. ‘మిత్రమ! భక్తిని దైవసత్కృపా...’ అందామా?

      తొలగించండి
  16. శత్రు రహితున కబ్బునే శాంతి సుఖము
    నేల గలిగెను సంశయ మేమి సామి !
    శాంతి సుఖము లు గలుగును శత్రు లేమి
    నిజము ముమ్మాటి కియ్యది నిజము సుమ్ము

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సుబ్బారావు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'శాంతి సుఖము | లేల కలిగెను... ' అనండి.

      తొలగించండి
  17. చిత్రమదేమొగాని మనచేతిలొ డబ్బులు లేకపోతెయే
    మాత్రము తోచదింకమరిమానస యెంతయొచిన్నబోవులే
    పుత్రులు బందుమిత్రులొకపూటయుకూర్మితొజూడలేరుుగా
    శత్రువు " లేని" వానికిలశాంతిసుఖమ్ములుగల్లనేర్చునే

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. శ్రీనివాస్ చారి గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'చేతిలొ... కూర్మితొ' అని ప్రత్యయాలను హ్రస్వంగా ప్రయోగించరాదు. 'లేకపోతె' అనడం గ్రామ్యం. మీ పద్యానికి నా సవరణ....
      చిత్ర మదేమొగాని మన చేతను (చేతిని) లేకయున్న నే
      మాత్రము తోచ దింక మరి మానస మెంతయొ చిన్నబోవులే
      పుత్రులు బంధుమిత్రు లొక పూటయు కూర్మిని జూడలేరుగా
      శత్రువు 'లేని' వాని కిల....

      తొలగించండి
  18. ధాత్రిని సూత్రధారి గిరి ధారియు కృష్ణు మురాసురారి యే
    మాత్రపు సత్కృపారస నిమగ్న సమీక్షణ లేక యున్న స
    త్పాత్రుడు నిత్య సత్య ధృత భాషితు డాయమ నందనుండు నే
    శత్రువు లేనివాని, కిల శాంతి సుఖంబులు గల్గనేర్చునే


    కంటి లోపల నలుసును గాలి ముల్లు
    శ్రవణమున నున్న జోరీగ జనుని సరణి
    తలుప సత్య మిది ధరణీ తలమున జిత
    శత్రురహితున కబ్బునే శాంతి సుఖము

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కామేశ్వర రావు గారూ,
      అజాతశత్రువైన ధర్మజునకు కృష్ణసహకారం లేకుండ, శత్రువులను ఓడింపనివానికి శాంతి సుఖాలు లభింపవన్న మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.

      తొలగించండి
    2. పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. ధన్యవాదములు.

      తొలగించండి
  19. శత్రుత్వ మన్న దిలలో
    శత్రు రహితున కబ్బునే?శాంతి సుఖము
    ఛత్ర‌ంబౌను సర్వుల
    మిత్రులుగా నెంచు వాని మెత్తురు జనముల్.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఉమాదేవి గారూ,
      మీరేదో పరాకుగా పూరణ చేసినట్టున్నారు. తేటగీతి పాదం కందంలో ఇముడలేదు. పరిశీలించి మరో పూరణ చెప్పండి.

      తొలగించండి
  20. చిత్రమదేమొగానిమన చేతిలొడబ్బులు లేకపోతె యే
    మాత్రముతోచదింకమరి మానస మెంతయొచిన్నబోవులే
    పుత్రులు బందుమిత్రులొక పూటయు కూర్మితొజూడలేరుగా
    శత్రువు" లేని" వానికిల శాంతిసుఖమ్ములుగల్గనేర్చునే

    రిప్లయితొలగించండి
  21. శత్రువు లేని వాని కిల శాంతి సుఖంబులు గల్గ నేర్చునే
    మిత్రమ !యేమియీ పలుకు మీరుగ బల్కిన మాటయే భళా
    చిత్రము గాదె యిట్లుడువ చిత్రపు బల్కులు వింటిమీ గదా
    శత్రువు లేని వాని కిట శాంతి సుఖంబులు గల్గు నెప్పుడున్

    రిప్లయితొలగించండి
  22. గురు పూ ర్ణిమ దినమున మన
    గురువును బూజించు నెడల గురువే యిచ్చున్
    వరమగు నా శీ ర్వాదము
    పర సుఖములబొందు కొఱకు పావన నరుడా !

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సుబ్బారావు గారూ,
      మీ పద్యం బాగున్నది.
      `పరసుఖముల'... వరసుఖముల.. అయితే?

      తొలగించండి
  23. వెలుగు చీకట్ల మాటున మెలుగునట్టి
    మానవాళియు బ్రతుకులు మసలుచుండ
    “మిత్ర తత్వంబు కంటగ శత్రు గుణము”|
    శత్రు రహితున కబ్బునే శాంతి సుఖము? {మిత్రత్వములో శత్రుత్వము}
    2.మిత్రులు గారునందరును మేధకు జిక్కని వారలెందరో
    పాత్రలు గల్గు లోకమిది|ప్రాణము నిల్పెడిదైవరూపులై
    ధాత్రికి జీవకోటికినిదర్పము నిల్పెడిచెట్ల రీతియే|
    శత్రువు లేనివానికిల శాంతి సుఖంబులు గల్గ నేర్చునే?

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఈశ్వరప్ప గారూ,
      మీ రెండు పూరణలు బాగున్నవి.
      'తత్వంబు కంటగ'?

      తొలగించండి
  24. వెలుగు చీకట్ల మాటున మెలుగునట్టి
    మానవాళియు బ్రతుకులు మసలుచుండ
    “మిత్ర తత్వంబు కంటగ శత్రు గుణము”|
    శత్రు రహితున కబ్బునే శాంతి సుఖము? {మిత్రత్వములో శత్రుత్వము}
    2.మిత్రులు గారునందరును మేధకు జిక్కని వారలెందరో
    పాత్రలు గల్గు లోకమిది|ప్రాణము నిల్పెడిదైవరూపులై
    ధాత్రికి జీవకోటికినిదర్పము నిల్పెడిచెట్ల రీతియే|
    శత్రువు లేనివానికిల శాంతి సుఖంబులు గల్గ నేర్చునే?

    రిప్లయితొలగించండి
  25. వెలుగు చీకట్ల మాటున మెలుగునట్టి
    మానవాళియు బ్రతుకులు మసలుచుండ
    “మిత్ర తత్వంబు కంటగ శత్రు గుణము”|
    శత్రు రహితున కబ్బునే శాంతి సుఖము? {మిత్రత్వములో శత్రుత్వము}
    2.మిత్రులు గారునందరును మేధకు జిక్కని వారలెందరో
    పాత్రలు గల్గు లోకమిది|ప్రాణము నిల్పెడిదైవరూపులై
    ధాత్రికి జీవకోటికినిదర్పము నిల్పెడిచెట్ల రీతియే|
    శత్రువు లేనివానికిల శాంతి సుఖంబులు గల్గ నేర్చునే?

    రిప్లయితొలగించండి
  26. వెలుగు చీకట్ల మాటున మెలుగునట్టి
    మానవాళియు బ్రతుకులు మసలుచుండ
    “మిత్ర తత్వంబు కంటగ శత్రు గుణము”|
    శత్రు రహితున కబ్బునే శాంతి సుఖము? {మిత్రత్వములో శత్రుత్వము}
    2.మిత్రులు గారునందరును మేధకు జిక్కని వారలెందరో
    పాత్రలు గల్గు లోకమిది|ప్రాణము నిల్పెడిదైవరూపులై
    ధాత్రికి జీవకోటికినిదర్పము నిల్పెడిచెట్ల రీతియే|
    శత్రువు లేనివానికిల శాంతి సుఖంబులు గల్గ నేర్చునే?

    రిప్లయితొలగించండి
  27. వెలుగు చీకట్ల మాటున మెలుగునట్టి
    మానవాళియు బ్రతుకులు మసలుచుండ
    “మిత్ర తత్వంబు కంటగ శత్రు గుణము”|
    శత్రు రహితున కబ్బునే శాంతి సుఖము? {మిత్రత్వములో శత్రుత్వము}
    2.మిత్రులు గారునందరును మేధకు జిక్కని వారలెందరో
    పాత్రలు గల్గు లోకమిది|ప్రాణము నిల్పెడిదైవరూపులై
    ధాత్రికి జీవకోటికినిదర్పము నిల్పెడిచెట్ల రీతియే|
    శత్రువు లేనివానికిల శాంతి సుఖంబులు గల్గ నేర్చునే?

    రిప్లయితొలగించండి
  28. వెలుగు చీకట్ల మాటున మెలుగునట్టి
    మానవాళియు బ్రతుకులు మసలుచుండ
    “మిత్ర తత్వంబు కంటగ శత్రు గుణము”|
    శత్రు రహితున కబ్బునే శాంతి సుఖము? {మిత్రత్వములో శత్రుత్వము}
    2.మిత్రులు గారునందరును మేధకు జిక్కని వారలెందరో
    పాత్రలు గల్గు లోకమిది|ప్రాణము నిల్పెడిదైవరూపులై
    ధాత్రికి జీవకోటికినిదర్పము నిల్పెడిచెట్ల రీతియే|
    శత్రువు లేనివానికిల శాంతి సుఖంబులు గల్గ నేర్చునే?

    రిప్లయితొలగించండి
  29. వెలుగు చీకట్ల మాటున మెలుగునట్టి
    మానవాళియు బ్రతుకులు మసలుచుండ
    “మిత్ర తత్వంబు కంటగ శత్రు గుణము”|
    శత్రు రహితున కబ్బునే శాంతి సుఖము? {మిత్రత్వములో శత్రుత్వము}
    2.మిత్రులు గారునందరును మేధకు జిక్కని వారలెందరో
    పాత్రలు గల్గు లోకమిది|ప్రాణము నిల్పెడిదైవరూపులై
    ధాత్రికి జీవకోటికినిదర్పము నిల్పెడిచెట్ల రీతియే|
    శత్రువు లేనివానికిల శాంతి సుఖంబులు గల్గ నేర్చునే?

    రిప్లయితొలగించండి
  30. వెలుగు చీకట్ల మాటున మెలుగునట్టి
    మానవాళియు బ్రతుకులు మసలుచుండ
    “మిత్ర తత్వంబు కంటగ శత్రు గుణము”|
    శత్రు రహితున కబ్బునే శాంతి సుఖము? {మిత్రత్వములో శత్రుత్వము}
    2.మిత్రులు గారునందరును మేధకు జిక్కని వారలెందరో
    పాత్రలు గల్గు లోకమిది|ప్రాణము నిల్పెడిదైవరూపులై
    ధాత్రికి జీవకోటికినిదర్పము నిల్పెడిచెట్ల రీతియే|
    శత్రువు లేనివానికిల శాంతి సుఖంబులు గల్గ నేర్చునే?

    రిప్లయితొలగించండి
  31. . వెలుగు చీకట్ల మాటున మెలుగునట్టి
    మానవాళియు బ్రతుకులు మసలుచుండ
    “మిత్ర తత్వంబు కంటగ శత్రు గుణము”|
    శత్రు రహితున కబ్బునే శాంతి సుఖము? {మిత్రత్వములో శత్రుత్వము}
    2.మిత్రులు గారునందరును మేధకు జిక్కని వారలెందరో
    పాత్రలు గల్గు లోకమిది|ప్రాణము నిల్పెడిదైవరూపులై
    ధాత్రికి జీవకోటికినిదర్పము నిల్పెడిచెట్ల రీతియే|
    శత్రువు లేనివానికిల శాంతి సుఖంబులు గల్గ నేర్చునే?

    రిప్లయితొలగించండి
  32. . వెలుగు చీకట్ల మాటున మెలుగునట్టి
    మానవాళియు బ్రతుకులు మసలుచుండ
    “మిత్ర తత్వంబు కంటగ శత్రు గుణము”|
    శత్రు రహితున కబ్బునే శాంతి సుఖము? {మిత్రత్వములో శత్రుత్వము}
    2.మిత్రులు గారునందరును మేధకు జిక్కని వారలెందరో
    పాత్రలు గల్గు లోకమిది|ప్రాణము నిల్పెడిదైవరూపులై
    ధాత్రికి జీవకోటికినిదర్పము నిల్పెడిచెట్ల రీతియే|
    శత్రువు లేనివానికిల శాంతి సుఖంబులు గల్గ నేర్చునే?

    రిప్లయితొలగించండి
  33. ధాత్రిపై ప్రశాంతి కలుగు దండిగాను
    శత్రురహితున కబ్బునే శాంతిసుఖము
    సచివులెవ్వరులేకుండ సంతతమ్ము
    భావిలోనికప్పవలెతా బ్రతుకు చుండ

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అన్నపరెడ్డి వారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      బావి... భావి అయింది.

      తొలగించండి
  34. ధర్మ నందను చరితము తరచి చూడ
    తనకహితులు లేకున్నను ధరణిలోన
    తనను వైరిగా నితరులు తలచుచుండ
    శత్రు రహితున కబ్బునే శాంతి సుఖము?

    రిప్లయితొలగించండి
  35. ధాత్రిని సౌఖ్యముల్ కలుగు దండిగ, మానవజన్మలోన నే
    శత్రువు లేనివాని, కిల శాంతి సుఖంబులు గల్గనేర్చునే
    తంత్రము లెన్నియో సలిపి ధర్మపుమార్గము తప్పినిత్య మే
    మాత్రము మానవత్వమును మాటలనైనను చూపకున్నచో

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
      మీ వృత్త పూరణ చాలా బాగుంది. అభినందనలు.

      తొలగించండి
  36. గురువర్యులకు గురుపూర్ణిమ శుభాకాంక్షలు. నమస్సులు.

    రిప్లయితొలగించండి
  37. ధర్మ నందను చరితము తరచి చూడ
    తనకహితులు లేకున్నను ధరణిలోన
    తనను వైరిగా నితరులు తలచుచుండ
    శత్రు రహితున కబ్బునే శాంతి సుఖము?

    రిప్లయితొలగించండి
  38. ధర్మ నందను చరితము తరచి చూడ
    తనకహితులు లేకున్నను ధరణిలోన
    తనను వైరిగా నితరులు తలచుచుండ
    శత్రు రహితున కబ్బునే శాంతి సుఖము?

    రిప్లయితొలగించండి
  39. దుర్జనత్వము, క్రౌర్యము,దుష్టబుద్ధి

    శత్రు రహితున కబ్బునే? శాంతి, సుఖము

    లెల్ల కాలమ్ము లందున పల్లవించు

    పగతురులు లేని శాంతి స్వభావులకును.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. నాగేశ్వర రావు గారూ,
      మీ పూరణ ప్రశస్తంగా ఉంది. అభినందనలు.

      తొలగించండి
  40. దుర్జనత్వము, క్రౌర్యము,దుష్టబుద్ధి

    శత్రు రహితున కబ్బునే? శాంతి, సుఖము



    లెల్ల కాలమ్ము లందున పల్లవించు

    పగతురులు లేని శాంతి స్వభావులకును.

    రిప్లయితొలగించండి
  41. పాత్రతలేక దోషగుణ పాలన జేయుచునుండు నెవ్వడున్?
    మిత్రులు సైతమున్ సతము మెచ్చకనెవ్వనికిన్ సుదూరమౌ?
    ధాత్రిని దృప్తిజెందక సదా ధనదాహవిలాసికేమగున్?
    శత్రువు-లేనివానికిల-శాంతిసుఖంబులు కల్గనేర్చునే!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సూర్యనారాయణ రావు గారూ,
      క్రమాలంకారంలో మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  42. వేదమును నాల్గు విధముల విభజనమ్ము
    జెసి విఖ్యాతి నొందిన వ్యాసదేవు
    శత్రు రహితున కబ్బునే శాంతి, సుఖము?
    వ్రాయకున్న భాగవత పురాణ మిలను

    రిప్లయితొలగించండి
  43. ర చ న :-----

    * గు రు మూ ర్తి ఆ చా రి *

    ………………………………………………………


    * శి వ క ళ్యా ణ ము *

    ………………………………………………………

    ప్ర థ మ భా గ క థా సా రా ౦ శ ము =

    ............................................................

    వ చ న ము
    :::::::::::::::::::::::::::


    పార్వతి , పరమేశ్వరుని గూర్చి తప మాచరి౦చుట . పరమేశ్వరుడు ప్రత్యక్షమై ,
    ఆమెను పత్నిగా స్వీకరి౦చుటకు సమ్మతి౦చుట.
    పరమేశ్వరుని పిలుపు మేరకు సప్త ఋషులు
    అరు౦ధతీ సహితులై కైలాసము చేరుట . ఈశ్వరుడు వారిని పె౦డ్లి పెద్దలుగా హిమవ౦తుని చె౦త క౦పుట . సప్తర్షులు ,
    హిమవ౦తుని చె౦త కరిగి " సర్వలోకైక పూజ్యుడైన మహేశ్వరునికి నీ కూతురగు పార్వతి నిచ్చి వివాహము చేయు " మని అడుగుట .


    ........…………………………………………………
    ( 1 )


    శ్రీ కైవల్య వరప్రదాయక ! శివా ! లీలోధ్ధితాకార ! ఈ

    శా ! కారుణ్యపయోనిధీ ! భయహరా !
    చ౦ద్రార్ధమౌళీ ! హరా !
    సాకల్యామర మౌనివ౦ద్యసుగుణా !
    సద్భక్త చి౦తామణీ !
    శ్రీ కైలాసనివాస ! సర్వభువన క్షేమ౦కరా !
    శ౦కరా !

    ………………………………………………........
    ( 2 )


    పర్వత రాజ పుత్రిక తప౦బొనరి౦చె నకు౦ఠ దీక్షతో
    శర్వుని గూర్చి ; దర్శన మొస౦గిన చ౦ద్ర
    కళావత౦సు డా
    పార్వతి వా౦ఛిత౦బెరిగి , పత్నిగ గైకొన
    సమ్మతి౦పగా :---
    సర్వ సుపర్వ మౌని తతి స౦తస మొ౦దెను
    విశ్వమ౦దునన్

    ……………………………………………………
    ( 3 )


    హర్షాల౦కృత మానసాలయమున౦ దాశూలి
    కోరన్ , సము
    త్కర్ష౦ బార సమస్త దివ్యగణముల్ కైలాసము౦ జేరె ; స
    ప్తర్షుల్ జేరి రరు౦ధతీ సహితులై తారాద్రికిన్ ;
    జాహ్నవీ
    శీర్షున్ స్తోత్రము జేసి యెల్లరును స౦సేవి౦చి రాసక్తితో

    { తారాద్రి = కైలాస శిఖరము }

    ……………………………………………………
    ( 4 )


    అనిమిషులున్ - మహర్షులు మహాశివు
    గా౦చి వచి౦చి రిట్లు " పా
    వనగుణధామ ! మా విమల భక్తియు - మా
    తపముల్ ఫలి౦ప ద
    ర్శనము నొస౦గి తీవు ; శివశ౦కర ! మమ్ము
    దల౦చి తేల ? యే
    పని నొనరి౦పగా పిలువ బ౦పితి ? వాఙ్ఞ
    నొస౦గు మో ప్రభూ "

    ……………………………………………………
    ( 5 )


    ముసిముసి నవ్వు లొల్క ఫణిభూషణు డివ్విధి
    పల్కె , " వేల్పులా
    ర ! సత మొనర్చెదన్ భువన రక్షణ ; లోక
    శుభ౦కరార్థ మే
    ను సతిగ స్వీకరి౦చెద , విను౦డు ,
    ధరాధర పుత్రి c బార్వతిన్ ;
    పొసగు వివాహ మారసి ప్రమోదము జె౦ది
    చను౦డు మీరలున్ !

    …………………………………………………………
    ( 6 )


    విను డా శీతమహీధరు౦ , డఖిల పృధ్వీభార
    సధ్ధూర్వ హు౦ ,
    డనఘాత్ము౦డు , ఘను౦డు , మత్ శ్వ శు రు డౌ నర్హు౦డు ; కన్యార్థమై
    చనుడో స౦యము లార ! దోహద మొనర్చ౦
    గల్గు కళ్యాణ శో
    భన కార్యమ్ములలో నరు౦ధతియు వే
    బాటి౦పు డీ యానతిన్ .

    { శ్వశురుడు = మామ }

    ………………………………………………………
    ( 7 )


    మునివరేణ్యులార ! కడు సమ్మోద మెసగ
    మా కొరకు మీరు నేడు హిమగిరికి చను ;
    డిదియె శుభముహూర్థ౦ బాలసి౦చ వలదు ;
    జరుగు :-యుష్మద్ఘటిత కార్య స౦వరములు

    …………………………..... .. .......................
    ( 8 )


    ఆకాశ౦బున ను౦డి డిగ్గి ఋషి వర్య శ్రేణి
    చేర౦గ భూ
    లోక౦బున్ , గిరిరాజు వారినిక నాలోకి౦చి ,
    సౌధానకున్
    గైకొ౦చు , న్నుచితాసనమ్ము లిడి , కై౦కర్యమ్ములన్ సల్పి , మీ
    రే కార్యార్థము వచ్చినారలని ప్రశ్ని౦చెన్
    వినమ్రాత్ముడై .

    …………………………………………… ......
    ( 9 )


    ఎవ్వాని యాకార మీశ్వర౦బై , నామ
    . మో౦కార నాదమై యుజ్జ్వలి౦చు
    ఎవ్వాని పదముల నెల్ల వేల్పులును సే
    . వి౦చి పూజి౦చి తరి౦చ గలరు
    ఎవ్వాని దర్శి౦ప నెల్ల యోగీశ్వరుల్
    . జపతప యఙ్ఞముల్ సలుపు చు౦ద్రు
    ఎవ్వాని కరుణచే నెల్ల విశ్వమ్ములు
    . వర్ధిల్లు చు౦డును ప్రత్యహ౦బు


    అట్టి శ౦భు౦డె యిచ్చటి క౦పె మమ్ము ;
    నీకు జామాత యగుట క౦గీకరి౦చె
    కు౦భినీధర రాజ ! నీ కూతు నిమ్మ
    భాగ్యవ౦తుడ వీవయ్య వసుధ లోన
    మేము పె౦డ్లిపెద్దలమయి మీ కడ కిటు
    వచ్చితి " మని మునీ౦ద్రులు పలికి రపుడు





    *****************************
    ……………………………………………………

    రిప్లయితొలగించండి
  44. గురుమూర్తి ఆచారి గారూ,
    మీ ‘శివకళ్యాణం’ పద్యాలను ఒక ఫైలుగా భద్రపరిచాను. ప్రస్తుతం కామేశ్వర రావు గారి ద్విపద కావ్యాన్ని ఇస్తున్నాను కదా! మరికొద్ది రోజుల్లో అది ఐపోతుంది. వెంటనే మీ కావ్యాన్ని ప్రకటిస్తాను. వీలైతే మిగతా భాగాలను కూడా పంపండి.

    రిప్లయితొలగించండి
  45. Please consider the content of "shiva kalyanam" which i have sent you through mail..

    Thank you sir
    Guru moorthy

    రిప్లయితొలగించండి
  46. పోరపాటును మన్నిచండి.

    వైరి వర్గీయులు సఖులే వసుధ యందు
    శత్రు రహితునకబ్బునే శాంతి సుఖము
    దుష్ట బుద్ధి తోడ మెలగు దోస్తులకును
    నరసి చూడుడు తమరెల్ల నయము తోడ.

    రిప్లయితొలగించండి
  47. మిత్రుడు కాంగ్రెసోడొకడు మెండుగ మెచ్చుచు చెవ్వు లాగెనే
    మిత్రుడు కమ్యునిస్టొకడు మెండుగ కుమ్ముచు ముక్కు పీకెనే
    మిత్రుడు భాజపాడొకడు మెండుగ వాగుచు సుత్తి కొట్టెనే
    శత్రువు లేనివాని కిల శాంతి సుఖంబులు గల్గనేర్చునే!

    రిప్లయితొలగించండి