16, జులై 2016, శనివారం

సమస్య - 2088 (అమ్మ కాతఁడు మగఁడయ్యె...)

కవిమిత్రులారా, 
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది... 
"అమ్మ కాతఁడు మగఁడయ్యె నక్కజముగ"
(ఒక అవధానంలో డా. ఇందారపు కిషన్ రావు గారు పూరించిన సమస్య) 

59 కామెంట్‌లు:

  1. తమిళ నాటను మధురై ప్రధాన దేవి
    సొగసు లొలికెడి మీనాక్షి సోయగమ్ము
    లందు కొనుచును దరినుండు సుందరేశు
    డమ్మకాతడు మగడయ్యె నక్కజముగ!

    రిప్లయితొలగించండి
  2. భూత నాధుని గాంచిన భీతి గలుగు
    మసన మందున దిరిగెడు మాయ గాడు
    అమ్మ కాతఁడు మగఁడయ్యె నక్క జముగ
    వమ్ము గాదిది నామాట నమ్ము నిజము

    రిప్లయితొలగించండి


  3. అర్ధ నారిగ నాతడు అమరి యుండె
    కాల భైరవు డటడేను గరళ కంఠు
    నాట్య మాడుచు 'పర ' వశ నటన మాడి
    అమ్మ కాతఁడు మగఁడయ్యె నక్కజముగ !

    జిలేబి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. జిలేబీ గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      కొన్ని లోపాలు... మీ పద్యంలో రెండుపాదాలకు నా సవరణ...

      అర్ధనారీశ్వరుం డయి యమరియుండె
      కాలభైరవు డాతడే గరళగళుడు....

      తొలగించండి
  4. తరుణి నరయక తపమున తననె మరచి
    స్మరుని దహియించి క్రుద్ధుడై కరుణ మాలి
    బెట్టు సడలించి పాణిని బట్టి పార్వ
    తమ్మ కాతడు మగడయ్యె నక్కజముగ.

    రిప్లయితొలగించండి
  5. పాఠములు నేర్చుకొను నొక బాలకుండు
    ప్రేమ చదువుల సారము ప్రీతినొసగ
    గురువునే పెండ్లి యాడగ గోరి పంతు
    లమ్మ కాతడు మగడయ్యె నక్కజముగ!
    (గతంలో ఒక పదవ తరగతి విద్యార్థి తన అధ్యాపకురాలు కలిసి ప్రెమించి పెళ్ళి చేసుకున్నారని వచ్చిన వార్తను గుర్తు చేసుకుంటూ వ్రాసిన పద్యమిది) ధన్యవాదములు.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. శ్రీధర రావు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
    2. గురువు గారికి మరియు కవి మిత్రులు వెంకటప్పయ్య గారికి ధన్యవాదములు.

      తొలగించండి
    3. గురువు గారికి మరియు కవి మిత్రులు వెంకటప్పయ్య గారికి ధన్యవాదములు.

      తొలగించండి
  6. విధివశంబున నిజ భర్త పిన్నఁడవగ
    శంబరాసుర గృహపరిచారికగుచు
    ముద్దు మోమగు బాలున ముదము పెంచు
    నమ్మ కాతఁడు మగఁడయ్యె నక్కజముగ

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఫణికుమార్ గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      ‘పిన్నడైన..పరిచారిక యయి...’ అనండి.

      తొలగించండి
  7. మేనగోడలి పెండ్లికై మేన మామ
    తిరిగితిరిగి చెప్పులజత లరిగిపోవ
    నమ్మమాటను మన్నించి యక్కసుత ధ
    నమ్మకాతడు మగడయ్యె నక్కజముగ

    రిప్లయితొలగించండి
  8. శివుని పిలువక వరమాల చేతికిచ్చి
    దండ వేయుమటంచును దక్షుడనగ
    త్ర్యక్షు ధ్యానించి గాలిన దండ వేయ
    నమ్మ కాతఁడు మగఁడయ్యె నక్కజముగ

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఫణికుమార్ గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      సవరణ కంటే ముందున్నదే బాగున్నది. ‘గాలిలో/ గాలిని’ అనండి.

      తొలగించండి
  9. తల్లు లందరి గన్నమ్మ తపము జేసి
    భవుని పెండ్లాడ దలచగ పట్టు బట్టె
    పంత మొదలని పార్వతి పరమ నిష్ట
    అమ్మ కాతఁడు మగఁడయ్యె నక్కజముగ

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. వెంకటప్పయ్య గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      ‘ఒదలని’ అనరాదు. ‘వదలని’ సాధువు. ‘పంతము విడని’ అనండి.

      తొలగించండి
  10. గు రు మూ ర్తి ఆ చా రి
    ,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

    భూవరుల్ దశముఖుడును , భుజగధరుని

    ధనువు నెక్కిడ జాలక ధరణి గూల

    న౦త రఘువరుడు విరిచి - యలరు జాన

    కమ్మ కాతడు మగ డయ్యె నక్కజముగ ! ! !

    రిప్లయితొలగించండి
  11. పెండ్లి సంబంధ ములతడు వెదకి వెదకి
    విసిగి వేసార చివరకు వీధి చివర
    నుండు భీముడే కుదిరెను చుండ్రు శార
    ద మ్మ కాతడు మగడయ్యె నక్కజముగ

    రిప్లయితొలగించండి
  12. చెలఁగి భస్మాసురుండట శివుని పైనె
    హస్త ముంచగఁ బరుగుల హడల గొట్ట
    నంతుఁ జూడ! హరియగు వయ్యారి మోహి
    నమ్మ కాతఁడు మగఁడయ్యె నక్కజముగ!

    రిప్లయితొలగించండి
  13. రిప్లయిలు
    1. భేతాళ కథ:

      పెద్ద పాదముద్రలు గల ముద్దియ జన
      కునకు చిన్నవి కలయామెకుఁ బతి తనని
      చేరి కని వారలందునఁ జిన్నదాని
      యమ్మ కాతఁడు మగఁడయ్యె నక్కజముగ

      తొలగించండి
    2. కామేశ్వర రావు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      చిన్నప్పుడు చదివిన కథను గుర్తుకు తెచ్చారు, ధన్యవాదాలు.

      తొలగించండి
    3. పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. ధన్యవాదములు.

      తొలగించండి
  14. కట్నకానుకలిమ్మని కర్కశముగ
    పోర,తనకుదా నమ్ముడు బోవుటెయగు
    నంంచు స్వాతంంత్ర్య భావాల నాచరింంచి
    అమ్మకాతడు మగడయ్యె నక్కజముగ.

    (అమ్మక+ఆతడు=అమ్మకాతడు)

    బొమ్మలెన్నెన్నొ సృృష్టింంచి దిమ్మరింంచు
    కర్మఫలముల దీర్చుటె ధర్మమనుచు
    మర్మమును జాటు నలువయె మహిత శార
    దమ్మకాతడు మగడయ్యె నక్కజముగ.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సూర్యనారాయణ రావు గారూ,
      మీ రెండు పూరణలు బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  15. దాశరథిగ తా జన్మించి ధరణిజాత
    సీత నుద్వాహ మాడిన శ్రీహరి, కృత
    యుగములో సీతజనయిత్రి నుర్వరైన
    యమ్మకాతడు మగడయ్యె నక్కజముగ!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. తిమ్మాజీ రావు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      ‘జనయిత్రి నుర్వయ యగు’ అనండి.

      తొలగించండి
    2. గురుదేవుల సూచన మేరకు సవారి౦చిన పద్యము
      దాశరథిగ తా జన్మించి ధరణిజాత
      సీత నుద్వాహ మాడిన శ్రీహరి, కృత
      యుగములో సీతజనయిత్రి నుర్వయ యగు
      యమ్మకాతడు మగడయ్యె నక్కజముగ!

      తొలగించండి
  16. సకల సృష్టికి మూలమౌ స్రష్ట నిలువ
    కోవెలయె లేని వేలుపు, కువలయమున
    భక్త జనుల గుంలో కొలు వైన శార
    దమ్మ కాతడు మగదయ్యె నక్కజముగ

    నిన్నటి సమస్యకు నా పూరణ

    జూనేతెంచెనిక పయిన్
    వానకురియు, నెండు గడ్డి వామున్ వేగన్
    లోనకు చేర్పింపవలెన్
    నానినచో కృళ్ళిపోవు నాతృణ మంతన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. విరించి గారూ,
      మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
      ‘గుం(డె)లో’...? అలా అంటే గణదోషం. ‘గుండెల కొలువైన..’ అనండి.

      తొలగించండి
  17. చదువు సంస్కార మున్నట్టిచక్కదనము
    తెలుగు తేజము నిండిన వెలుగు రేఖ
    గనిన నుద్యోగిమెచ్చిన కన్యగు సుగు
    ణమ్మకాతడు మగడయ్యె నక్కజముగ|
    2.కట్నమనియెడి తాళిని కన్యగట్ట
    వరుడు సంతస మందున వధువు మెడను
    వంచి తలదించి తాళిని బెంచికట్టు|
    అట్టియెగతాళి తాళియే పట్టుదప్ప?
    కట్న మివ్వక యున్నయిక్కట్టగు కమ
    లమ్మకాతడు మగడయ్యె నక్కజముగ.

    రిప్లయితొలగించండి
  18. ముసలివారైన వోలిని ముట్టజెప్పి
    కన్య నమ్ముట పరిపాటి గనగ నాడు
    కట్నమిచ్చియు గొన్నట్టి కాంతకిపుడు
    అమ్మ?కాతడు మగడయ్యె|నక్కజముగ||

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఈశ్వరప్ప గారూ,
      మీ మూడు పూరణలు బాగున్నవి. అభినందనలు.
      ‘కన్య+అగు’ అన్నపుడు యడాగమం వస్తుంది.

      తొలగించండి
  19. తానె సృష్టి చేసెనలువ తరుణి నచట
    మరిసి పోయెను మదిని భామా మణిఁగని
    వదనమందున దాల్చెనా బ్రహ్మ చదువు
    లమ్మ కాతడు మగడయ్యె నక్కజముగ.

    రిప్లయితొలగించండి
  20. మరుడు కాలి బూడిదవగ మాట నోట
    రాక విలపించె నారతి :రక్తి తోడ
    భవుని కొరకు తపముచేయ పడతి పార్వ
    తమ్మ కాతడు మగడయ్యె నక్కజముగ

    రిప్లయితొలగించండి
  21. పతిని గోల్పోయి బిడ్డతో బ్రతుకుచున్న

    పడతి యందమున్ గుణమును పరిగణించి

    ఎవరు చెప్పినా వినక నిర్భీతి తోడ

    అమ్మకాతడు మగడయ్యె నక్కజముగ.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. పిన్నక నాగేశ్వర రావు గారూ,
      శంకరాభరణం బ్లాగు మీకు స్వాగతం పలుకుతున్నది.
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  22. వచ్చినదెవడో యెఱుగక బాలుడపుడు
    సంగరమ్ము జేయుచువీర స్వర్గమంది
    తిరిగి బ్రతికిన పిమ్మటన్ దెలిసికొనియె
    నమ్మకాతడు మగడయ్యె నక్కజముగ

    రిప్లయితొలగించండి
  23. ఉన్న యూరిలోనే నుండ నుత్తమమగు
    పిల్ల తిరిగి చుట్టునగల పల్లె లెల్ల
    దూరపు కొండలు నునుపని యూరి రాము
    లమ్మ కాతడు మగడయ్యె నక్కజముగ

    రిప్లయితొలగించండి
  24. మిత్రులందఱకు నమస్సులు!

    గురుని యాజ్ఞను రాముండు గురుతరమగు
    హరుని విల్ ద్రుంచి సంతస మందఱ కిడి
    మంగళధ్వనుల్ మిన్నుముట్టంగ జాన

    కమ్మ కాతఁడు మగఁడయ్యె నక్కజముగ!

    రిప్లయితొలగించండి
  25. అమ్మ ముగురమ్మలకు మూలమైన దుర్గ
    తప మొనర్చెడి శివునికి దార కాగ
    పార్వతిగ రా ; కపర్ధియే పరవశించె !
    అమ్మ కాతఁడు మగఁడయ్యె నక్కజముగ

    రిప్లయితొలగించండి
  26. షోడశకళా ప్రపూర్ణుడు సోముడయ్యె

    కలువ భామకు నాథుడు కావ్య జగతి;

    పద్మ గర్భుడు పరమేష్టి, బ్రహ్మ చదువు

    లమ్మ కతడు మగడయ్యె నక్కజముగ.

    విద్వాన్,డాక్టర్,మూలె.రామమునిరెడ్డి విస్రాన్త తెలుగు పండితులు ప్రొద్దుటూరు.కడప జిల్లా.

    రిప్లయితొలగించండి
  27. అమ్మహా దేవుడు సతీవియోగపరిత
    ప్తహృదయు డగుఆ శివునకు పార్వతితొవి
    వాహయత్నము చేయగ దేవగణము
    అమ్మ కాతఁడు మగఁడయ్యె నక్కజముగ

    రిప్లయితొలగించండి
  28. సుర్యభగవానుని స్తోత్రం
    ఓం శ్రీ సవిత్రే నమః రచన :వడ్డూరి అచ్యుతరామ కవి
    శా . ఓంకారంబున సంభవించు జగమాయోం కార మందమత మౌ
    నోంకారంబునవృద్ధిజెందు సలంబొంకారమై యొప్పు నా
    యోంకారాకృతి యై వెలింగెడి పరం జ్యోతిన్ పరబ్రహ్మమున్
    ఓంకారప్రణవ స్వరూపునకు దేజోమూర్తికిన్ మ్రొక్కెదన్ .
    ఉ . శ్రీయుననా మయం బయిన జీవన మాయువు నాత్మ విద్యయున్
    బాయని ప్రేమ నిత్తువట భక్తులకున్ జగదీశ సర్వదా
    నాయెడ సత్కృపన్ గలిగి నాస్తవమున్ దయ స్వీకరించి నన్
    శ్రీ యుతమూర్తి బ్రోవగదె చిత్తమునన్ వసియించి భాస్కరా !
    చ. సరసిజబాంధవా!నిగమసన్నుత!దీనశరన్య!మౌనిఖే
    చరగరుడోరగ ప్రముఖ సన్నుత భక్త జనావనా శుభం
    కర శరణంటి బ్రోవగదె కాలనియామక, కాల రూప! యో
    హరిహర ధాతృ తేజ!పరమాత్మ!దయానిధి!దేవ!భాస్కరా!
    మ. వికలాంగుల్ జడులంధులున్ బధిరులున్ విశ్వాత్మకంబై న నీ
    యకలంకోత్తమ దివ్య నామమును నిత్యంబున్ స్మరింపన్ భువిన్
    సకలారిష్టము లంతరింప శుభముల్ సౌఖ్యంబులన్ బొంది పా
    యకస్వర్గంబును గాంతు రంతమున దేవా!సూర్యనారాయణా!
    శా . త్రే తాగ్నుల్ చతురాగమంబులు ధరిత్రిన్ బంచ భూతంబు లున్
    శీతోష్ణాది విబేధ కాల ఋతువుల్ శీతాంశులు గ్రంశులున్
    వాలో ద్దూత మహోగ్ర వృష్టి విలయ వ్యాపార సృష్టి స్టితుల్
    భూతేశా!భువి నీవ!నీవలన వే బోల్పోందు నో భాస్కరా !
    మ. నర దేవాసుర మౌని దివ్యు లేవరైనను గాని నీ రాకచే
    నురు కర్తవ్యము,కాలకృత్యములు,సంధ్యో పాసనల్ సేయుచున్
    ధరలో జీవితయాత్ర సల్పుదురు నిన్ దర్శింప లేకున్న నె
    వ్వరు కర్తవ్య మెరుంగ లేరుగద !దేవా ! సూర్యనారాయణా !
    మ. మహనీయుల్ ఋషులున్,ద్విజుల్ బుధవరుల్ మార్తాండ నిన్భక్తి తో
    గ్రహరాజా !భవదీయ దర్శన మె దన్ గాంక్షించి పూతాత్ములై
    బహు మంత్రోక్తుల నర్ఘ్య పాద్యములతో "బ్రహ్మార్పణం"బంచు నిన్
    బహురీతిన్ ప్రచిం చు చుందురు పరబ్రహ్మ స్వరూపా !రవీ !

    రిప్లయితొలగించండి