7, జులై 2016, గురువారం

సమస్య - 2082 (గజమునకు ఖరమ్ము పుట్టి...)

కవిమిత్రులారా, 
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది... 
గజమునకు ఖరమ్ము పుట్టి గంతులు వేసెన్. 

45 కామెంట్‌లు:

  1. నిజమట కలియుగ వింతలు
    గజమునకు ఖరమ్ము పుట్టి గంతులు వేసెన్
    సుజనుడు పలికెను వింతగ
    యజమట బలిజేసెడి తరి హాహా పలికెన్

    రిప్లయితొలగించండి
  2. రజకుడు గొనెనొక గాడిద
    గజమని పేరిడెను కొంత కాలము పిదపన్
    నిజ ఫాల్గుణ మాసమ్మున
    గజమునకు ఖరమ్ము పుట్టి గంతులు వేసెన్.

    రిప్లయితొలగించండి
  3. ప్రజలెల్లరు మెచ్చగఁ దను
    విజయుండాయెను జనకుడె! వెనుకాడు సుతున్
    స్వజనమ్మే తగడన, ది
    గ్గజమునకు ఖరమ్ము పుట్టి గంతులు వేసెన్. 

    రిప్లయితొలగించండి
  4. ఋజు వర్తన గతి దప్పిన
    నజుని రచన విధము దప్పు నది యెట్లన్నన్
    నిజముగ నొకపరి నిటులగు
    గజమునకు ఖరమ్ము బుట్టి గంతులు వేసెన్!

    రిప్లయితొలగించండి
  5. పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. ధన్యవాదములు. నిన్నటి పూరణలో "వర్గయుక్సరళములు పరములగునపు డొకానొకచో ద్రుతమునకుఁ బూర్ణబిందువును గానంబడియెడి". అన్న సూత్రమాధారముగా “శూరుం జగ త్త్రాతం భర్తగఁ” యని వ్రాసితిని. తప్పయినచో సవరించ గలను. సందేహ నివృత్తి చేయ గోర్తాను.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కామేశ్వర రావు గారూ,
      సూత్రంలోనే ‘ఒకానొకచో’ అని పరిమితిని నిర్దేశించారు కదా! ప్రాసస్థానంలో తప్పని పరిస్థితుల్లో ఈ సూత్రాన్ని అన్వయించుకోవాలి. సర్వత్రా కాదు.
      గాంధారిం జూడఁగ వ
      చ్చెం ధృతరాష్ట్రుఁడు.... (ఇలాంటి సందర్భాలలో...)

      తొలగించండి
    2. పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. మీ వివరణ తో సందేహ నివృత్తియయినది. ధన్యవాదములు.
      “గాంధారిం జూడఁగ” ఆదేశ సరళము కాబట్టి పూర్ణ బిందువు విభాషగా రావచ్చనుకుంటాను.

      తొలగించండి
  6. విజయ దశమియె జననమట
    గజమునకు-ఖరమ్ముపుట్టి గంతులువేసెన్
    రజకుని యింటన్నవమిని
    నిజమిది మాయూరి వార్త సుజనుడ వినుమా!

    నిజమయి బ్రహ్మము పలుకులు
    గజమునకు ఖరమ్ము పుట్టి గంతులు వేసెన్
    విజయనగరంపు వాడను
    సుజనుడవినుమా కలియుగ చోద్యములెన్నో!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సూర్యనారాయణ గారూ,
      మీ రెండు పూరణలు బాగున్నవి.
      మొదటి పూరణ చివరి పాదంలో యతి తప్పింది. మన సుబ్బారావు గారు ఇలాంటి సందర్భాలలో ‘నిర్మల వినుమా/ నీరజ వినుమా’ అని గట్టెక్కుతూ ఉంటారు.

      తొలగించండి
  7. సృజియించిరట త్వచములం
    దు జిగురు కరగింప దానిఁ దోరముగ ఘనో
    ష్ణజ సుద్రవమ్ము వారి య
    గజమునకు ఖరమ్ము పుట్టి గంతులు వేసెన్
    [అగజము= జిగురు; ఖరము=వేడి]

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. భజన పరులు తనుఁ బొగడగ
      సుజనులు పాండు తనయులఁ గసుగు నిత్యంబుం
      గుజనుండట కౌరవది
      గ్గజమునకు ఖరమ్ము పుట్టి గంతులు వేసెన్

      తొలగించండి
    2. కామేశ్వర రావు గారూ,
      మీ రెండు పూరణలు బాగున్నవి. ముఖ్యంగా మొదటి పూరణ విలక్షణంగా ఉండి ఔత్సిహిక కవులకు మార్గదర్శకంగా ఉంది. అభినందనలు.

      తొలగించండి
    3. పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. ధన్యవాదములు.

      తొలగించండి
  8. విజనారణ్యమునందున
    భజనను చేయుచునునిటుపరుగులు దీయన్
    రుజయొక్కటిమొదలై
    గజమునకుఖరమ్ముపుట్టి గంతులు వేసెన్.
    ఖరము=వేడిమి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఉమాదేవి గారూ,
      మీ పూరణ బాగున్నది.
      రెండవ, మూడవ పాదాలలో గణదోషం. ‘భజనను చేయుచును నిటుల పరుగులు దీయన్| రుజ యొక్కటి మొదలై త| ద్గజమునకు...’ అనండి.

      తొలగించండి
  9. నిజమా యిది సామీ యిట
    గజమునకు ఖరమ్ము పుట్టి గంతులు వేసెన్
    గజమునకు ఖరము పుట్టుట
    నిజముగ గని కట్టు సుమ్ము నెఱి పరికింపన్

    రిప్లయితొలగించండి
  10. నిజధారను సంజ్ఞను రవి
    త్యజియించని వేడితోడ తను కూడగనే
    ప్రజననమున కాక తగుల
    గ, జమునకు ఖరమ్ము పుట్టి గంతులు వేసెన్. 

    రిప్లయితొలగించండి
  11. సంజ్ఞ, సూర్యుల పుత్రిక య(జ)మున/య(జ)ముడు అనే గాథ ఆధరంగా..

    రిప్లయితొలగించండి
  12. రజకున కుండిన నాలుగు
    గజమజ హయ కేసరులను గార్దభములలో
    గజమీనగ జనులనిరిల
    గజమునకు ఖరమ్ము పుట్టి గంతులు వేసెన్

    రిప్లయితొలగించండి
  13. మధ్యాక్కర
    గజమునకు ఖరమ్ముపుట్టి గంతులు వేసెన్ ననుటకు
    నిజమని నిర్ధార కమిటి నిర్ణయ మందున దెలుప|
    ప్రజలకు నమ్మక మౌన?రైతింటఎద్దీనినదన?
    ఋజువులు నడుగనివారు|నెక్కువగా గనపడగ|

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఈశ్వరప్ప గారూ,
      మీ పూరణ బాగున్నది.
      ‘నిర్ధారణ కమిటి’ అనాలనుకుంటాను.

      తొలగించండి
  14. . నిజమని నమ్మకు యెప్పుడు
    గజమునకు ఖరమ్ముపుట్టి గంతులు వేసెన్
    ఋజువెక్కడ?మాటలు యే
    సుజనుడు నూహించ లేడు శోధనజేయన్.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఈశ్వరప్ప గారూ,
      మీ రెండవ పూరణ బాగున్నది.
      ‘నమ్మకు మెప్పుడు.... మాటల నే సుజనుడు...’ అనండి.

      తొలగించండి
  15. సుజనాళి కాదు, నేతల
    భజన సమూహమని యెఱిగి బన్నము పడగన్!
    విజయము చేసిన కవి ది
    గ్గజమునకు ఖరమ్ము పుట్టి గంతులు వేసెన్!

    రిప్లయితొలగించండి
  16. యజములఁజరచుచు సతతము
    ప్రజల రుధిర పలలములను పలహారముగా
    రజనిఁజరించు యసుర ది
    గ్గజమునకు ఖరమ్ముపుట్టి గంతులు వేసెన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అన్నపరెడ్డి వారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      పద్యప్రారంభంలో అజములా? యజములా?

      తొలగించండి
  17. మిత్రులందఱకు నమస్సులు!

    [పరమశ్రోత్రియుఁడగు యజ్ఞదత్తునకు గుణనిధి జన్మించుట, గజమునకు ఖరము జన్మించుటయే గదా]

    ద్విజవంశాఖ్యకలశసిం
    ధుజముఖఘనయజ్ఞదీక్షితోద్గుణనిధియే
    బజగెడి గుణనిధిఁ గనెఁ! గన,

    గజమునకు ఖరమ్ము పుట్టి గంతులు వేసెన్!!

    రిప్లయితొలగించండి
  18. అజుడమృతమునకు బదులుగ
    నిజమగు కాదంబరిగొని నిరవధికముగా
    సృజియించగ కలియుగమున
    గజమునకు ఖరమ్ము పుట్టి గంతులు వేసెన్

    రిప్లయితొలగించండి
  19. గురుమూర్తి ఆచారి గారి పూరణలు...

    శీతా౦శున్ గని కామవా౦ఛ గొని నీ శీలమ్ము కోల్పోవుచున్
    ఖ్యాతు౦డైన యతిన్ బృహస్పతిని ఖేదా౦బోనిధిన్ ద్రోసి యీ
    రీతిన్ నీతి విహీన వైఖరిc బ్రవర్తి౦పన్ హిత౦బౌనె? యో
    సీ! తారా! ముని కోగు జేయ దగునే? చి౦తి౦ప నిల్లాలివై.

    రె౦డవ పూరణము

    పాతివ్రత్యము బూది గల్పుచు పతిన్ వాచస్పతిన్ వీడ నీ
    చేత౦ బేగతి నొప్పె ? పుత్రసముడౌ శీతా౦శుని౦ గా౦చి యే
    రీతిన్ గూడితివో ! కళ౦కితమయెన్ స్త్రీజాతి నీ చేత ని
    స్సీ! తారా! ముని కోగు జేయ దగునే చి౦తి౦ప నిల్లాలివై.

    రిప్లయితొలగించండి
  20. గు రు మూ ర్తి ఆ చా రి గారి పూరణ....

    ( ఒక చాకలి " కట్టిన " గాడిదను మడుగు జలములో చక్కగా స్నానము చేయి౦చెను . అ౦త నది , గ జ ము దూరమునకు నడువగా ఈనినది. అపుడు గాడిద పిల్ల పుట్టి గ౦తులు వేసెను )

    రజకుడు " కట్టిన " ఖరమును
    మజనము చేయి౦చె నొక్క మడుగు జలమునన్ |
    మజరే ! యది నడువగ నొక
    గజమునకు , ఖరమ్ము పుట్టి గ౦తులు వేసెన్

    { మజనము = స్నానము ; మజరే = అరెరే !
    అది నడువగ నొక గజమునకు = ఆ గాడిద ఒక గజము దూరమునకు నడువగా ;
    ఖరమ్ము పుట్టి = గాడిదపిల్లపుట్టి }

    రిప్లయితొలగించండి
  21. కుజనులు మెచ్చగ పలికెను:👇
    "గజగజ లాడింతు నిన్ను కనుమా మోడీ!"
    నిజమిది వినుడీ కాంగ్రెసు
    గజమునకు ఖరమ్ము పుట్టి గంతులు వేసెన్

    రిప్లయితొలగించండి