ఆరగు దుర్గుణంబులవి యందరిలోన వసించుచుండు నా ధార మొకింత కల్గినను ధర్మము దప్పును కీడు జేయుచున్ దూరము చేసికోవలెను దుష్కరమైనను లోని శత్రు సం హారము కోసమై ప్రజలహర్నిశముల్ కృషి జేయగా తగున్
దారుణమైన పద్దతుల ధాత్రితలమ్మున దుర్మధాంధులై మారణకాండలన్ సలిపి మానవ జాతికి గీడు జేయ నా కౄరుల పాల నుగ్ర నరకేశరులై దునుమాడి శత్రు సం హారము కోసమై ప్రజలహర్నిశముల్ కృషి జేయగా తగున్
జిలేబీ గారూ, మీ పూరణ బాగున్నది. 'కావ్యరస' మన్నది సాధువు. 'కావ్యారస' మంటే కావ్యంలోని రసహీనత అనే వ్యతిరేకార్థం వస్తున్నది. అలాగే 'సుమహారము' సాధువు. సుమ+ఆహారము అని చూస్తే కొంతవరకు సమర్థించవచ్చు. ఆహారము అంటే గ్రహించటం అనే అర్థంకూడా ఉంది. కవితారమాసుమాలను గ్రహించడం కోసం అనే అర్థం చెప్పుకోవచ్చు.
ఊరక డబ్బు వచ్చునని యూహలతో పని చేయకున్నచో
రిప్లయితొలగించండిభారము కాదె జీవనము పాడుతలంపది వీడియెల్లరున్
దారుణమైన నేరముల తప్పుల చేయక బుద్ధిగల్గి యా
హారముకోసమై ప్రజ లహర్నిశముల్ కృషి చేయఁగాఁ దగున్
చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
ఆరునె జీవికిన్ వెత? నహమ్మునిహమ్మున తీరిపోవునే?
రిప్లయితొలగించండిసారమెఱుంగ గల్గుదురె? సత్యము నేర్వ తలంపు గల్గునే?
దూరము కాక దేహమునఁ దూఱిన కర్కశ శత్రుషట్క సం
హారముకోసమై ప్రజ లహర్నిశముల్ కృషి చేయఁగాఁ దగున్!!
అద్భుతం సార్.
తొలగించండిజిగురు వారూ,
తొలగించండిమిస్సన్న గారన్నట్లు మీ పూరణ అద్భుతంగా ఉంది. అభినందనలు.
'వెత యహమ్ము/ వెత లహమ్ము' అనండి. అక్కడ ద్రుతంతో కాని, నుగాగమంతో కాని అవసరం లేదు.
గురువుగారికి, మిస్సన్న గారికి ధన్యవాదములు
తొలగించండిఆరునె జీవికిన్ వెత? లహమ్మునిహమ్మున తీరిపోవునే?
సారమెఱుంగ గల్గుదురె? సత్యము నేర్వ తలంపు గల్గునే?
దూరము కాక దేహమునఁ దూఱిన కర్కశ శత్రుషట్క సం
హారముకోసమై ప్రజ లహర్నిశముల్ కృషి చేయఁగాఁ దగున్!!
శ్రీగురుభ్యోనమః
రిప్లయితొలగించండిఆరగు దుర్గుణంబులవి యందరిలోన వసించుచుండు నా
ధార మొకింత కల్గినను ధర్మము దప్పును కీడు జేయుచున్
దూరము చేసికోవలెను దుష్కరమైనను లోని శత్రు సం
హారము కోసమై ప్రజలహర్నిశముల్ కృషి జేయగా తగున్
దారుణమైన పద్దతుల ధాత్రితలమ్మున దుర్మధాంధులై
మారణకాండలన్ సలిపి మానవ జాతికి గీడు జేయ నా
కౄరుల పాల నుగ్ర నరకేశరులై దునుమాడి శత్రు సం
హారము కోసమై ప్రజలహర్నిశముల్ కృషి జేయగా తగున్
శ్రీపతి శాస్త్రి గారూ,
తొలగించండిమీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.
'దూరము చేయగావలెను...'; 'క్రూరుల.. నరకేసరులై..' అనండి.
భారమె యైననేమి బహు ప్రాపక మందున సాహసం బునన్
రిప్లయితొలగించండితారకు డంటిర క్కసుల ధాత్రిని దారుణ ఘోరకృత్యముల్
వీరులు గాదలంచి మది వేడుక నొందుచు దుష్టదై త్యసం
హారము కోసమై ప్రజ లహర్నిశముల్ కృషి చేయఁగాఁ దగున్
అక్కయ్యా,
తొలగించండికొంత అన్వయలోపం ఉన్నా మీ పూరణ బాగున్నది. అభినందనలు.
'తారకు వంటి..' అనండి.
తారకు వంటి రక్కసుల ధాత్రిని దారుణ ఘోర కృత్యముల్
తొలగించండిభారమె యైననేమి బహు ప్రాపక మందున సాహసం బునన్
వీరులు గాదలంచి మది వేడుక నొందుచు దుష్టదైత్య సం
హారము కోసమై ప్రజ లహర్నిశముల్ కృషి చేయఁగాఁ దగున్
అక్కయ్యా,
తొలగించండిసవరించిన మీ పూరణ బాగున్నది. అభినందనలు.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండి
తొలగించండిసారము సౌమ్యమై వెలయు సాగర ఘోష మనో వికాస కా
వ్యా రస సౌష్టవంబు కవి వాక్కుల మూలము నేర్వగా మదిన్
భారము వీడు మానసము బాగుగనన్ కవితారమా సుమా
హారముకోసమై ప్రజ లహర్నిశముల్ కృషి చేయఁగాఁ దగున్
జిలేబీ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది.
'కావ్యరస' మన్నది సాధువు. 'కావ్యారస' మంటే కావ్యంలోని రసహీనత అనే వ్యతిరేకార్థం వస్తున్నది. అలాగే 'సుమహారము' సాధువు. సుమ+ఆహారము అని చూస్తే కొంతవరకు సమర్థించవచ్చు. ఆహారము అంటే గ్రహించటం అనే అర్థంకూడా ఉంది. కవితారమాసుమాలను గ్రహించడం కోసం అనే అర్థం చెప్పుకోవచ్చు.
వారును వీరటంచు పలువాదము లాడక, సత్స్వభావులై
రిప్లయితొలగించండికోరిక మీర నందరికి కూరిమి బంచుచు ధర్మనిష్ఠ ని
ద్ధారుణి సంచరించవలె, తన్మయతన్ సమభావనాసమా
హారము కోసమై ప్రజ లహర్నిశమున్ కృషి చేయగా దగున్.
(హ.వేం.స.నా.మూర్తి)
సత్యనారాయణ మూర్తి గారూ,
తొలగించండి'సమభావనాసమాహారము' అంటూ చక్కని పూరణ చెప్పారు. అభినందనలు.
రిప్లయితొలగించండిపారము నీ వెయంచు పెను
భారము దించుము దేవయంచు సా
ధారణ సూత్రమున్ వదలి
దైన్యత నొంది శ్రమించకన్నిటన్
పోరెడు వారలందరిక
బూనిక సాగవలెన్ దరిద్ర సం
హారముకోసమై ప్రజల
హర్నిశముల్ కృషిజేయగా దగున్!
శిష్ట్లా వారూ,
తొలగించండిమంచి పూరణ చెప్పారు. అభినందనలు.
నీరునకై జలాశయము నేర్పడ భూమిని సేకరించుచు
రిప్లయితొలగించండిన్నారితి గొన్నవారి పరిహారము నీయక జాగుచేయగన్
దారికిరానివారు తమదారికి రాగను దీక్షతో వ్యతీ
హారముకోసమై ప్రజ లహర్నిశముల్ కృషి చేయఁగాఁ దగున్
(వ్యతీహారము = మార్పు)
సహదేవుడు గారూ,
తొలగించండివైవిధ్యమైన మీ పూరణ బాగున్నది. అభినందనలు.
గురుదేవులకు ధన్యవాదములు.
తొలగించండిబీరము బోకనెప్పుడును వీడక ధర్మము నెల్ల వేళ లా
రిప్లయితొలగించండిహారము కోసమై ప్రజలహర్నిశము ల్ కృషి చేయగా దగు
న్వా రలు దారుగా నగును భారత మాతకు ముద్దు బిడ్డలే
వీరలు వారుగా దలచి వేరుగ జూడకు మెప్పుడు న్మదిన్
సుబ్బారావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
'...బోక యెప్పుడును' అనండి. మూడవ పాదంలో 'వారలు దారుగా నగును' అర్థం కాలేదు.
శంకరయ్య గారికి నమస్కారములతో ......వారికి వారే అను అర్ధములో వ్రాసాను . తప్పు అయిన క్షంత వ్యుడను
తొలగించండి1966 లో ఆకాశవాణి విజయవాడ వారు ఇచ్చిన సమస్యకు నేను పంపిన పూరణము.
రిప్లయితొలగించండిపౌరులు సాయుధుండగు జవాను కుటుంబ సహాయమే సదా
కోరుచు పుత్తడిన్, ధనము గ్రుమ్మర జేయగ లక్షలాదిగా
భారము తీరి పోయెనిక బాధ్యత లేదని యెంచకుండ నా
హారము కోసమై ప్రజలహర్నిశముల్ కృషి చేయగా తగున్.
నాగేశ్వర రావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
'...గ్రుమ్మరజేయు..' అనడమే సందిగ్ధంగా ఉంది.
గు రు మూ ర్తి ఆ చా రి
రిప్లయితొలగించండి,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
ఊరక వీధుల౦ దిరుగు చు౦ డిటు , రోగ్యపు
. తి౦డి మెక్కి కా
ఫీ రస మెప్డు ద్రాగుచు తపి౦చక , నాపయి
. వైద్యశాల లో
జేరక నీ గృహ౦బున భుజి౦పుము |
. తత్సమీకృతా
హారము కోసమై ప్రజ లహర్నిశముల్ కృషి
. చేయగా దగున్
{ రోగ్యపు తి౦డి = రోగకారిణి యగు తి౦డి ;
సమీకృతాహారము ,= పోషకాహారము ;
కృషి చేయు = ప్రయత్న౦చు }
గురుమూర్తి ఆచారి గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
`రోగ్య(ము)పు' అన్న పదం లేనట్టుంది. 'రోగపు' అనవచ్చు కదా! మూడవపాదంలో గణదోషం. సవరించండి.
పార మెరు౦గ నట్టి భవవారిధి దుర్భరమై తరింప సం
రిప్లయితొలగించండిసారమనన్ బరంగు విషచక్రములో బడి దారపుత్రులన్
తీరని బంధముల్ మమత త్రెంచు కొనంగను వీలు లేక నా
హారము కోసమై ప్రజ లహర్నిశమున్ కృషి చేయగా దగున్.
తిమ్మాజీ రావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
వారము కొక్కరీతినిల పారణజేయుచుకోటివిద్యలన్
రిప్లయితొలగించండిసారము సేకరించికడుచక్కటి పాటవ మొప్పునట్లుగా
కోరుచు నన్నొవిదంబులకూరిమి మీరగ నేర్చుకొన్న యా
హారముకోసమైప్రజలహర్నిశమున్ కృషిచేయగాదగున్
కోటివిద్యలుకూటికొరకె అన్నసామెతతో రాసాను తప్పొప్పులుపరిశీలించప్రార్తన
శ్రీనివాసాచార్య గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది.
'వారముకు' అనరాదు. 'వారమునకు' అనడం సాధువు. 'వారము నొక్కరీతి..' అందామా? మూడవపాదంలో గణదోషం. 'కోరుచు నెన్నొ రీతులను కూరిమి...' అనండి.
గురువుగారికిధన్యవాదములు
రిప్లయితొలగించండిదార సుతాది పోషణకుఁ దాల్మి ధనార్జన సమ్మతమ్మిలన్
రిప్లయితొలగించండిదూరము గాక ధర్మగతి దుష్టులఁ జేరక వీడి తన్వహం
కారము లోభ మోహ మద కామ రుషాదిగ దుర్గుణౌఘ సం
హారము కోసమై ప్రజ లహర్నిశముల్ కృషి చేయఁగాఁ దగున్
కామేశ్వర రావు గారూ,
తొలగించండిఅఘ సంహారాన్ని కోరిన మీ పూరణ ఉత్తమంగా ఉంది. అభినందనలు.
పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. ధన్యవాదములు.
తొలగించండిపూజ్యులు శంకరయ్య గారికి వందనములు. దుర్గుణౌఘమని నాభావము. దుర్గుణాఘమని యనుకున్నారా? .
తొలగించండిదుర్గుణౌఘమనే చదువుకున్నాను. ఎందుకో అఘం స్ఫురించింది. ఆలోచించకుండా వ్యాఖ్యానించాను. మన్నించండి.
తొలగించండిపూజ్యులు శంకరయ్య గారికి వందనములు. అయ్యో అంత మాటనకండి. ఊరికనే యడిగాను . దుర్గుణములన్ని యఘకారకములే కదా.
తొలగించండిగు రు మూ ర్తి ఆ చా రి
రిప్లయితొలగించండి,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
( బస్సులో వెళుతూ టైపు చేశాను . మూడవ పాదములో ఒక భగణము ను మరచి పోయాను .
మీరన్నట్లుగనే రోగ్యపు ను రోగపు అన్నాను }
ఊరక వీధుల౦ దిరుగు చు౦ డిటు , రోగపు
తి౦డి మెక్కి కా
ఫీ రస మెప్డు ద్రాగుచు తపి౦చక , నాపయి
వైద్యశాల లో
జేరక నీ గృహ౦బున భుజి౦పుము | చక్కగ
తత్సమీకృతా
హారము కోసమై ప్రజ లహర్నిశముల్ కృషి
చేయగా దగున్
{ రోగ్యపు తి౦డి = రోగకారిణి యగు తి౦డి ;
సమీకృతాహారము ,= పోషకాహారము ;
కృషి చేయు = ప్రయత్న౦చు }
్
గురుమూర్తి గారూ,
తొలగించండిసవరించిన మీ పూరణ బాగున్నది. అభినందనలు.
భారతభూమియందమిత పావనమై చెలువొందుధర్మమున్
రిప్లయితొలగించండిఘోరతరంబుగాగ జెడగొట్టుచునుండిరి మ్లేచ్ఛులక్కటా
వారినివేరుజేసి కరవాలము సాక్షిగ శాంతిగోరి-సం
హారము కోసమై ప్రజలహర్నిశముల్ కృషిచేయగాదగున్.
పొన్నెకంటి వారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
సరదాగా...
రిప్లయితొలగించండినేరరు నేటి కాలమున నిత్యము విత్తమునందు యావతో
మీరక వేళ తిండి దిన మేలని మాడ్చుచు నుంద్రు పొట్టలన్
కారక మౌను వ్యాధులకు గాన కనీసము మంచిదౌ ఉపా
హారము కోసమై ప్రజ లహర్నిశముల్ కృషి జేయగా దగున్.
సరదాగా... అన్నారు కనుక సరిపోయింది. లేకుంటే ఉపాహారం కోసం అహర్నిశలు కృషి చేయాలా? బాగుంది మీ పూరణ. అభినందనలు.
తొలగించండిమీనుంచి ఆ అభ్యంతరం వస్తుందని ఊహించే సరదాగా ని రక్షణగా పెట్టుకున్నాను గురువుగారూ. ధన్యవాదాలు.
తొలగించండిధారుణి యందు ప్రాణులకు తప్పవు జీవన కాలమందునన్
రిప్లయితొలగించండితీరని కడ్పుమంటకయి తిప్పలు, కష్టము లెన్నికల్గినన్
భారముగా తలంచకను బాధల నన్ని సహించుకుంటు నా
హారముకోసమై ప్రజ లహర్నిశముల్ కృషి చేయఁగాఁ దగున్
లక్ష్మినారాయణ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
సహించుకుంటు... అనడం సాధువు కాదు.
సహించుచుండి అంటే సరిపోతుందేమో.
తొలగించండితూరుపు దెల్లవారగనె దుప్పటి సర్దుకు దౌడు దీయుచున్
రిప్లయితొలగించండిసారము లేని జీవనము చక్కటి దారిని సాగిపోవ సం
సారపు బండినెట్టుటకు శక్తిని గూర్చెడు నింధనమ్ము నా
హారము కోసమై ప్రజలహర్నిసముల్ కృషిజేయగా దగున్!!!
శైలజ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిశ్రీ కంది శంకరయ్య గురువరులకు నమస్కారములు
రిప్లయితొలగించండిసహించుచున్నా అంటె సరిపోతుంది కదా
నేరపుమార్గమందు పయనించుచు దేశమునందునెల్లెడన్
రిప్లయితొలగించండిమారణ కాండతోడ నమానుష చర్యలఁజేయుచున్, కసిన్
దూరుచు పెద్దలన్ తిరుగు ధూర్తకసాయిలఁబూని నిత్య సం
హారము కోసమై ప్రజల హర్నిశముల్ కృషి చేయఁగాఁదగున్
అన్నపరెడ్డి వారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది.
రెండవపాదంలో గణదోషం. 'మారణకాండ తోడుగ నమానుష..' అనండి. 'ధూర్త కసాయి' అనడం దుష్టసమాసం. 'ధూర్త కిరాతుల బోలి...' అందామా?
క్రూరము గాదె! ఇత్తెఱగు రోగములంగొని తెచ్చి పెట్టగా
రిప్లయితొలగించండిక్షీరము, నీరమున్, ఫలము, గింజల చేర్చిన కల్మషంబుతో
జేరగ వచ్చు నీ విపణి చేష్టలు! శీఘ్రమె స్వచ్ఛమైన యా
హారము కోసమై ప్రజలహర్నిశముల్ కృషి చేయగా దగున్!
శ్రీధర రావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
హారముకంటె మంచి మణిహారముగోరెడి మానసంబె ఆ
రిప్లయితొలగించండిహారముకంటె ముఖ్యమువిహార మటంచును నెంచబోదు|బే
హారము వంటిజీవ పరిహారముగోరుచు మానవత్వమా
హారము కోసమై ప్రజ లహర్నిశముల్ కృషి చేయగా దగున్.
2.దారపు సూది గ్రుచ్చ?పరితాపముజూపక పూలగుచ్చముల్
కోరగ కోర్కె దీర్చుటకు కొంటెగ కొప్పున జేరు రీతిగా
దారియు లేని మానవు లధర్మము ధర్మము నందుజీవనా
హారము కోసమై ప్రజ లహర్నిశముల్ కృషి చేయగా దగున్.
ఈశ్వరప్ప గారూ,
తొలగించండిమీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
దారుణ కాండ సల్పుచును దానవుడై పరహింస జేయుచున్
రిప్లయితొలగించండిపోరులవేల సంపదల వొంద, దురాశను వీడుమంటి, యా
హారముకోసమై ప్రజ లహర్నిశముల్ కృషి చేయఁగాఁ దగున్
గోరిక లున్ననేమి సమ కూరిన చాలదె యన్నవస్త్రముల్
విరించి గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
భారమయ్యెన్ గదా బతుకు బాధలు తీర్చెడి వారలన్ గనన్
రిప్లయితొలగించండినేరమి యేమి చేతురిల నెమ్మది యెట్టుల నబ్బునో కదా
యారునే వేదనల్ యవని యందున,కావున బుద్ధికల్గి యా
హారము కోసమై ప్రజలహర్నిశముల్ కృషి చేయగా దగున్.
ఉమాదేవి గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది.
'భార మయెన్ గదా బ్రతుకు...యారునె వేదనల్ పుడమియందున...' అనండి.
కోరిన కోర్కె దీరుటకు కుత్తుక కోసెడి కూళ వర్గమున్,
రిప్లయితొలగించండిజేరి, విశుద్ధ మానవుల సేమము గోరిన వారిఁ దున్ముతు
న్నూరకె సాధు వర్తనుల నొవ్వగ జేసెడి దుష్టశక్తి సం
హారముకోసమై ప్రజ లహర్నిశముల్ కృషి చేయఁగాఁ దగున్
కృష్ణారావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
'వారిఁ దున్ముచు। న్నూరకె..' అనండి.
ఘోరమువవేదబోధనలు గోప్యమునౌతమ జన్మకర్మలే
తొలగించండిపార దరిదురులైరిపరపాటినటన్నవిగాన వారలేభారము నీడ్వగానగునపార విరాళము గోరకుండయా..
హ dr.pittasatyanarayana
ఘోరమువవేదబోధనలు గోప్యమునౌతమ జన్మకర్మలే
తొలగించండిపార దరిదురులైరిపరపాటినటన్నవిగాన వారలేభారము నీడ్వగానగునపార విరాళము గోరకుండయా..
హ dr.pittasatyanarayana
పిట్టా సత్యనారాయణ గారూ,
తొలగించండికొన్ని టైపు దోషాలను సవరించి మీ పద్యాన్ని ప్రకటిస్తున్నాను...
ఘోరము వేదబోధనలు గోప్యమునౌ తమ జన్మకర్మలే
పార దరిద్రు లైరి పరిపాటి నటన్నవి గాన వారలే
భారము నీడ్వగా నగు నపార విరాళము గోరకుండ యా
హారము కోసమై జను లహర్నిశమున్ కృషి చేయగా దగున్.
****************
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
నమస్కారం
తొలగించండిధన్యవాదాలు.
తొలగించండివారము వర్జ్యమున్ గనక పండుగ పర్వము లెంచకుండనే
రిప్లయితొలగించండికోరిక కోరగా సతికి కోరిన వెంటనె నివ్వగోరుచున్
భారములౌ నగల్ మెడకు బంగరు మెండుగ పట్టు నడ్డికిన్
హారముకోసమై ప్రజ లహర్నిశముల్ కృషి చేయఁగాఁ దగున్!