4, జులై 2016, సోమవారం

సమస్య - 2078 (ఆతఁడు శంకరుండు...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
“ఆతఁడు శంకరుండు పరమాత్ముఁడు మాధవుఁడై వెలింగెడిన్”
(గరికిపాటి వారు పూరించిన సమస్య)
లేదా...
“అతఁడు శంభుఁడు మాధవుఁడై వెలుంగు”

83 కామెంట్‌లు:

  1. ఆతఁడు శంభుఁడీశ్వరుఁడు నాతఁడు రుద్రుఁడు ఫాలనేత్రుఁడౌ
    నాతఁడు నంది వాహనుఁడు నాతఁడు బాలశశాంకమౌలియౌ
    నాతఁడు నాగభూషణుఁడు నాతఁడు దూర్జటి శూలపాణియౌ
    నాతఁడు శంకరుండు పరమాత్ముఁడుమాధువుఁడై వెలింగెడిన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఉమాధవుని బాగా వెలుంగజేశారు...బాగుంది.

      తొలగించండి
    2. సత్యనారాయణ గారూ,
      పద్యం సాఫీగా సాగింది. పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  2. శీతక రుండుశంకరుని శేముషి యైశిరమున్ స్థిరంబు గా
    పూతలు పూయగా నతడు భూదిని దేహము నందునం తటన్
    ప్రేతవ నంబునన్ దిరుగు బిచ్చము గోరుచు తండ్రిగా భువి
    న్నాతడు శంకరుండు పరమాత్ముఁడు మాధవుఁడై వెలింగెడిన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఆక్కయ్యా,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      ‘శేముషియై’ అన్నదానికి అన్వయం కుదరనట్టుంది.

      తొలగించండి
    2. శీతకరుండు శంకరుని జేరెము దంబుగ పాలభాగమున్
      పూతలు బూయగా నతడు బూదిని దేహము నందునం తటన్
      ప్రేతవ నంబునన్ దిరుగు బిచ్చము గోరుచు తండ్రిగా భువి
      న్నాతడు శంకరుండు పరమాత్ముఁడు మాధవుఁడై వెలింగెడిన్

      తొలగించండి
  3. నామ ములెన్ని యున్నను నాధు డొకడె
    శక్తి యుక్తులు గరపిన భుక్తి యొకటె
    ప్రాణు లన్నిట నాతడు త్రాణ యనగ
    అతడు శంభుఁడు మాధవుఁడై వెలుంగు

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అక్కయ్యా,
      మీ రెండవ పూరణ బాగున్నది.
      మొదటి పాదంలో ‘ములెన్ని’ గణదోషం. ‘నామములు పెక్కు లున్నను నాథు డొకడె’ అనండి.

      తొలగించండి
    2. నామ ములుపెక్కు లున్నను నాధు డొకడె
      శక్తి యుక్తులు గరపిన భుక్తి యొకటె
      ప్రాణు లన్నిట నాతడు త్రాణ యనగ
      అతడు శంభుఁడు మాధవుఁడై వెలుంగు

      తొలగించండి


  4. హరి హరాదుల భేదము అసలు లేదు
    విశ్వమందొకడే పలు విధము లగుచు
    అతఁడు శంభుఁడు మాధవుఁడై, వెలుంగు
    తీర్థ మగు హృదయకుహుర దివ్య జ్యోతి !

    జిలేబి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. జిలేబీ గారూ,
      చక్కని భావంతో పూరణ చెప్పారు.
      ‘భేదము+అసలు’ అన్నపుడు సంధి నిత్యం, యడాగమం రాదు. ‘హరి హరాదుల కంతరం బసలె లేదు’ అందామా? ‘దివ్యజ్యోతి’ అన్నచోట వ్య గురువై గణదోషం. ‘దివ్యకాంతి’ అనండి.

      తొలగించండి
  5. సతిని మేనిలోన సగముగా ధరియించి
    శక్తి బొందె తాను శంకరుండు
    శివుడు హరుడు భవుడు శితికంఠనాముడే
    యతఁడు శంభుఁ డుమాధవుఁడై వెలుంగు

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. శాస్త్రి గారూ,
      పప్పులో కాలేశారు. సమస్య తేటగీతి అయితే మీరు ఆటవెలది వ్రాశారు. మీ పద్యానికి నా సవరణ....
      సతికి మేనిలో సగముగా స్థానమిచ్చి
      శక్తిఁ బొంది రంజిల్లెను శంకరుండు
      శివుఁడు హరుఁడు శ్రీకంఠుఁడు భవుఁ డనంగ
      నతఁడు శంభుఁ డుమాధవుఁడై వెలుంగు.

      తొలగించండి
    2. మాస్టరుగారూ! పొరబాటుకు క్షంతవ్యుడను..మీ చక్కని సవరణకు ధన్యవాదములు.

      తొలగించండి
  6. గురువుగారూ నమస్సులు.... ఉత్పలమాలలో....మాధువుడు....అని టైపాటు.... దయచేసి చూడండి

    రిప్లయితొలగించండి
  7. కోరి నంతనె భక్తుల కోర్కె దీర్చి
    వెతలు బాపుచు నిలలోన సతతముగను
    సౌఖ్య మిచ్చుచువరలెడి స్వామి యెవరు?
    యతడు శంభుడుమాధవుడైవెలుంగు

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. శ్రీనివాస్ చారి గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      ‘..యెవరు+అతడు’ అన్నపుడు యడాగమం రాదు. ‘స్వామి యెవ్వఁ| డతఁడు...’ అనండి.

      తొలగించండి
  8. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఆతత కీర్తి సంభృత దయార్ద్రమనంబున విశ్వరూపుడై
      ప్రీతిగ నీ జగత్ప్రభల ప్రేంఖణమున్ దరి నిల్పి రాగముల్
      స్ఫీతమవన్ మహాద్యుతి విశేషత నింపుచు సాగిపోవగా
      నాతడు శంకరుండు పరమాత్ముడు మాధవుడై వెలింగెడిన్!

      తొలగించండి
    2. శర్మ గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  9. రిప్లయిలు
    1. సహదేవుడు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      ‘ఇంద్రుజిత్తును’ అనండి. రామారావు గారు కీచక పాత్రను కూడ పోషించారా?

      తొలగించండి
    2. గురుదేవులకు ధన్యవాదములు. సవరించిన పూరణ:
      ఇంద్రజిత్తును, రావణుఁడినకులుండు!
      కృష్ణ,భీష్మ, భీమార్జున,కీచకుండు!
      కర్ణుడై నందమూరియొ కదలె! కనఁగ
      నతఁడు శంభుడు,మాధవుడై వెలుంగు!

      రామారావు గారు శ్రీమద్విరాటపర్వం అన్న సినిమాలో కీచక పాత్రను పోషించడం జరిగిందండి.

      తొలగించండి
    3. గురుదేవులకు ధన్యవాదములు. సవరించిన పూరణ:
      ఇంద్రజిత్తును, రావణుఁడినకులుండు!
      కృష్ణ,భీష్మ, భీమార్జున,కీచకుండు!
      కర్ణుడై నందమూరియొ కదలె! కనఁగ
      నతఁడు శంభుడు,మాధవుడై వెలుంగు!

      రామారావు గారు శ్రీమద్విరాటపర్వం అన్న సినిమాలో కీచక పాత్రను పోషించడం జరిగిందండి.

      తొలగించండి
  10. శంక రుండును శివుడును నింక బే ర్లు
    పార్వతీ పతి యార్తుల ప్రాణ దాత
    నీల కంఠుడు భవుడుగా పిలువ బడెడు
    న తడు శంభుడు మాధవుడై వెలుంగు

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సుబ్బారావు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      ‘ఇంక పేర్లు’ అన్నపుడు ద్రుత, సరళాదేశాలు రావు.
      ‘శంభుడు మాధవుడై’ అన్నదానికి ‘శంభు డుమాధవుడై’ అన్నదానికి తేడా ఉంది.

      తొలగించండి
  11. సకలలోకములకు శాంతిని జెకూర్చ
    ధ్యాననిష్ట లోన తనఋ కతన,
    జనని ఉమను తా పరిణమయి నందున
    నతడు శంకరుండుమా ధవుండు

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. తిమ్మాజీ రావు గారూ,
      పూరణ బాగున్నా మీరు సమస్య పాదాన్ని మార్చారు. అలా మార్చరాదు కదా! మీ ఆటవెలదికి నా తేటగీతి రూపాంతరం....
      సకలలోకవాసులకును శాంతి నొసఁగ
      ధ్యాననిష్ఠలో నుండుచు తనరు కతన
      హైమవతిఁ బరిణయ మాడినందువలన
      నతఁడు శంభుఁ డుమాధవుఁడై వెలుంగు.

      తొలగించండి
  12. ధ్యాతగనిష్ట బూని జగమంతయు శాంతి వహింప గోరు,ని
    ర్యాతముజెంద దేహములు ఆత్మల కన్నిట పెన్నిధానమో,
    మాత యుమన్ వివాహమయి మాన్య జగత్పిత గా ప్రతీతుదో
    నాతడు శంకరుండు, పరమాత్ముడుమాధవుడై వెలింగెడిన్!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. తిమ్మాజీ రావు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      ‘ప్రతీతుడౌ’ అని ఉందాలనుకుంటాను.

      తొలగించండి
  13. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
  14. గురువుగారికి నమస్సులు.నాతప్పిదమును మన్నించి పద్యమును సరిజేసినందుకు కృతజ్ఞతలు సవరించినౌత్పలమాలపద్యము
    ధ్యాతగ నిష్ట బూని జగమంతయు శాంతి వహింప గోరు,ని
    ర్యాతముజెంద దేహములు ఆత్మల కన్నిట పెన్నిధానమో,
    మాత యుమన్ వివాహమయి మాన్య జగత్పిత గా ప్రతీతుడౌ
    నాతడు శంకరుండు, పరమాత్ముడు మాధవుడై వెలింగెడిన్!

    రిప్లయితొలగించండి
  15. హరుడనుచు కీర్తనము సేయు నరుని యెడద
    నతడు శంభుడు! మాధవుడై వెలుంగు
    మరియు నొక భక్త పుంగవు మానసమున
    దేవునికి లేవు భేదాలు తేఱి చూడ!

    రిప్లయితొలగించండి
  16. ఆతడు శంకరుండు పరమాత్ముడు మాధవుడై వెలింగిడి న్
    ధాతకుదండ్రియై బరఁగి తల్లియు దండ్రియు మామయున్బళా
    యాతడె నౌ నుగా మనకు నాయత రీతిని రక్షకుండుగ
    న్గా తర మేమియు న్నిడక కాంక్షలు దీర్చును నెల్లవే ళ లన్

    రిప్లయితొలగించండి


  17. గు రు మూ ర్తి ఆ చా రి
    ,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

    ఆతడు మాధవు౦డు పరమాత్ముడు శ౦కరుడై వెలి౦గెడి

    న్నాతడు శ౦కరు౦డు పరమాత్ముడు మాధవుడై
    వెలి౦గెడిన్

    బ్రీతిగ గొల్వవచ్చును హరిన్ -- స్తుతియి౦పగ వచ్చు నా హరున్ ;

    పాతకముల్ హరి౦చి కరుణ౦ గని బ్రోవ గలార
    రిర్వురున్ ;

    చూత మటన్న నిర్వురకు సు౦తయు భేదము లేదు మిత్రమా !

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. గురుమూర్తి గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      ‘బ్రోచెడివార లిర్వురున్’ అంటే ఇంకా బాగుంటుందేమో?

      తొలగించండి
  18. రిప్లయిలు
    1. ఆతత నామ కీర్తన సుమార్చిత పాద సరోజుడుం బరి
      త్రాత దయామయుండు శతధాముడు పూర్వ భవాత్త పుణ్య సం
      జాతము భక్త కోటికి నొసంగును సౌఖ్య నికాయ మందుకే
      యాతఁడు శంకరుండు పరమాత్ముఁడు మాధవుఁడై వెలింగెడిన్

      సర్వ లోకైక పాలకు డుర్వి భర్త
      కృష్ణుడు సహిష్ణుడు మురారి కేశవుండు,
      నెవని నాభిని నుదయించె నింపుగం బు
      డతఁడు శంభుఁడు, మాధవుఁడై వెలుంగు
      [ శంభుఁడు=బ్రహ్మ]

      తొలగించండి
    2. కామేశ్వర రావు గారూ,
      మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. ‘బుడతఁడు’ ప్రయోగం నన్ను అబ్బురపరచింది. అభినందనలు.

      తొలగించండి
    3. పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. ధన్యవాదములు

      తొలగించండి
  19. ఆది మధ్యాంత రహితుండు ఆశ్రితజన
    పోషకుడు వాడు పన్నగ భూషణుండు
    భవభయ హరుడు పార్వతీ ప్రాణ నాథు
    డతడు శంభుడు మా ధవుడై వెలుంగు

    ధవుడు =రాజు=ప్రభువు
    మా ధవుడు= మా యొక్క ప్రభువు

    రిప్లయితొలగించండి

  20. భక్తవత్సలుండాస్వామి భక్త జనుల
    కోర్కె లన్నియు దీర్చును కూర్మి తోడ
    నసురవరులను కరుణించు నాత్మబంధు
    వతడు శంభుండుమా ధవుండై వెలుంగు.

    భక్త జనముల బ్రోచుచు వరము లొసగు
    నతడు శంభుండు:మాధవుడై వెలుంగు
    హరియుపాలకడలి సుతఁ పరిణయంబు
    నాడె :హరిహరులకు జేతు నతులు,నుతులు

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఉమాదేవి గారూ,
      మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
      ‘సుతఁ బరిణయంబు’ అనండి.

      తొలగించండి
  21. భక్తులేరూపమునుగని పలుకరించ
    కానుపించునారూపముఁదానుఁబ్రజకు
    నతడుశంభుడు మాధవుడై వెలుంగు
    కామితమ్ముల నిచ్చును కరముతృప్తి

    రిప్లయితొలగించండి
  22. జాతిని నేకతాటిపయి జాగృతిగొల్పిన జ్ఞాని యెవ్వడున్?
    జ్యోతిగ తత్త్వ జ్ఞానమును సోకిన యాత్మయె జేరునెవ్వనిన్?
    ఖ్యాతిగ గీతబోధనిడ కారణ జన్మము నెత్తెనెవ్వడున్?
    ఆతఁడు శంకరుండు, పరమాత్ముఁడు, మాధవుఁడై వెలింగెడిన్ ॥

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. రఘురామ్ గారూ,
      క్రమాలంకారంలో మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      ‘తత్త్వజ్జానము’ అన్నచోట త్త్వ గురువై గణదోషం. ‘తత్త్వమౌ నెరుక సోకిన..’ అంటే?

      తొలగించండి
  23. బూతిని దాల్చువాడు ఫణి భూషణు డౌ పాల నేత్రుడే
    పాతకముల్ హరించుచు భవాండము నేలెడువాడె ముక్తి కిన్
    హేతుహులైన శ్రీహరి మహేశ్వరు మధ్యన భేదమేది లే
    దాతడు శంకరుండు పరమాత్ముడు మా ధవుడై వెలింగెడిన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. విరించి గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      మొదటి పాదంలో గణదోషం. ‘ఫణిభూషితకంఠుడు ఫాలనేత్రుడే’ అందామా?

      తొలగించండి
    2. హేతువులైన... టైపాటువల్ల హేతుహులైన... అయింది.

      తొలగించండి
  24. చేతనమొంది సంతతము చెడ్డమనస్కులఁజేరనీయకన్
    ఘాతకచర్యలన్ విడిచి కైటభ వైరిని ప్రీతిగ గొల్చుచున్
    నీతిగనుండిదేహముఁబునీతముఁజేసిన వారి చిత్తమం
    దాతడు శంకరుండు పరమాత్ముడు మాధవుడైవెలింగెడిన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అన్నపరెడ్డి వారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      ‘ప్రీతిగ’ అన్నచోట గణభంగం. ‘ప్రీతిఁ గొల్చుచున్’ అంటే సరి!

      తొలగించండి
  25. నీతిని నిల్పబూనుటకు నిత్యము నీమదియందుదూరియున్
    జాతిపురోభివృద్ధి,పరిచర్యగ,దుష్టులసంహరించుచున్
    రోతను మాన్పగా హరిహరుండగ భూతల మంత నిండియు
    న్నాతడు శంకరుండు,పరమాత్ముడు,మాధవుడై వెలింగెడిన్|
    2.హరిహరందున జక్కన్న ఆలయాన
    శిల్ప చాతుర్య మందున చెక్కబడిన
    “అతడు శంబుడుమాధవుడై వెలుంగు
    హరిహరుండుగ దైవమై నలరుచుండె|”







    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. పాశుపతము నొసంగెను ఫల్గుణుడికి

      గరళమును మ్రింగి జగతిని గాచెనితడు

      భూతములనెల్ల గాపాడ భూత నాథు

      డతడు శంభుడు మాధవు డైవెలుంగు.


      విద్వాన్,డాక్టర్,మూలె.రామమునిరెడ్డి.విశ్రాంత తెలుగు పండితులు.ప్రొద్దుటూరు

      తొలగించండి
    2. ఈశ్వరప్ప గారూ,
      మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
      కొన్ని టైప్ దోషాలున్నవి.
      *****
      రామముని రెడ్డి గారూ,
      మీ పూరణ బాగుంది. అభినందనలు.
      ‘ఫల్గుణునకు’ అనండి.

      తొలగించండి
  26. ఉత్పలమాలయందుతేటగీతియందుపూరణ
    శక్తికి భర్తయే అతడుశంబుడు”మాధవుడై వెలుంగు చున్ {అతడుశంభుడు|”మాధవుడై వెలుంగు
    భక్తికి భంగమా?దునుముబాధ్యతలందున దోషమున్న చో {దునుము బాధ్యత లందునదోషమున్న
    యుక్తిగ రక్తిగా మనకుయూహలు బంచును మంచిగూర్చగా {మనకుయూహలు బంచును మంచిగూర్చ
    ముక్తికి భక్తిగా దలచ?మోదము నింపును ధర్మ దాతగా”| {దలచ మోదము నింపునుధర్మ దాత|}

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఈశ్వరప్ప గారూ,
      భళిభళి! గీత గర్భిత ఉత్పలమాలను చక్కగా వ్రాశారు. ప్రత్యేక అభినందనలు.
      ‘మనకు నూహలు’ అనండి.

      తొలగించండి
  27. భూతల నాధుడీశ్వరుడు ముజ్జగ నాశకకారి శంబుడున్
    శీతల శైల వాసుడు సుశీల సుభక్తుల బ్రోచువాడు స్వయం
    భూతుడు దేహమంతటను బూడిద బూసిన వాడె గాంచుమా!
    ఆతఁడు శంకరుండు పరమాత్ము డుమా ధవుఁడై వెలింగెడిన్.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. లక్ష్మినారాయణ గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      ‘ముజ్జగ నాశకకారి’ అనరాదు. ‘భూరి భుజంగ ధరుండు శంభుడున్’ అందామా? ‘బ్రోచువాడు స్వయం’ అన్నచోట గణభంగం. ‘బ్రోచునా స్వయం..’ అనండి.

      తొలగించండి
  28. శీతనగమ్ము జేరి తన చేడియకై తపమాచరించి యా
    నాతికి యర్ధబాగ మిడి నందిని ప్రేముడి నుంచి సాగుచున్
    ప్రేతము లుండు వాటికను వెల్గగ జూచెడి యుబ్బులింగ డౌ
    నాతఁడు శంకరుండు పరమాత్ముఁడు మాధవుఁడై వెలింగెడిన్

    తలను గంగను నిల్పుచు తనువుఁసగము
    సతికి భాగము గానిచ్చి దనరు చుండి
    వరము నసురున కిడి తానె పరుగులిడిన
    నతఁడు శంభుఁడు మాధవుఁడై వెలుంగు

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కృష్ణారావు గారూ,
      మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
      ‘పరుగు లిడిన యతండు’ అనండి.

      తొలగించండి
  29. సందిత బెంగుళూరు
    'సందిత' గారి పూరణ...

    నాటకమ్ముల సెలవులో నటులు వెడల
    రెండునాటకాల్ రాత్రికే యుండుకతన
    నటుడు కొండయ్య నిలిచారు దిటవుగాను!
    అతడు శంభుడు మానవుడు వెలుంగు.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సందిత గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      ‘నిలిచారు’ అనడం వ్యావహారికం. ‘నిలిచెను’ అనండి. ‘దిటవుగాను+అతడు’ అని విసంధిగా వ్రాయరాదు. ‘దిటవుతోడ| నతడు..’ అనండి.

      తొలగించండి
  30. భూతిని దాల్చువాఁడు పరిభూతములేవియు లేనివాఁడు వి
    ఖ్యాత గణాధినాతులు సగర్వితులై వినుతించుచుండ ని
    ర్యాత నభోనదీ ప్రథిత సాంబసదాశివుఁడాదిదేవుఁడ
    య్యాతఁడు శంకరుండు పరమాత్ముఁ డుమాధవుఁడై వెలింగడిన్.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సంపత్ కుమార్ గారూ,
      శబ్ద సౌందర్యంతో మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      ‘గణాధినాథులు’ అన్నచోట టైపాటు. ‘అయ్యాతడు’ అన్న ప్రయోగం లేదు. ‘ఆదిదేవుడౌ|నాతడు...’ అనండి.

      తొలగించండి
  31. బీటుకూరు శేషుకుమార్ గారి పూరణ...

    ఉగ్ర రూపంబు దాల్చినుదగ్ర తేజు
    డగుచు రాతిని జీల్చుకు నవతరించి
    భీకరుండై చెలగి. రేగి "భే" యనంచు
    నతడు శంభుడు మాధవుడై వెలుంగు

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. శేషుకుమార్ గారూ,
      మీ పూరణ బాగుంది.
      ‘దాల్చి యుదగ్ర...’ అనండి. ‘బే’ యనంచు...?

      తొలగించండి
  32. బండకాడి అంజయ్య గౌడ్ గారి పూరణ....

    శీతలనాధు కల్లుడయి శేముషి దీనుల గాచు నెప్పుడున్
    పాతక నాశకుండు శతభాస్కర తేజుడు చంద్రధారియున్
    ప్రీతిగ దేవదానవుల పెన్నిధియై వెలుగొందె, నిక్కము
    న్నాతడు శంకరుండు పరమాత్ము డుమాధవుడై వెలింగెడిన్ !!

    రిప్లయితొలగించండి
  33. శీతల శైలమందు విదుశేఖరుడై దివి వెల్గుచుండు ప్రా
    భాతము లోక బాంధవుడు భాసిల జేయును లోకమంతయున్
    శ్వేతపు ద్వీపమందు నివసించుచు సింధుజ తోడునుండగా
    ఆతఁడు శంకరుండు పరమాత్ముఁడు మాధవుఁడై వెలింగెడిన్

    రిప్లయితొలగించండి
  34. మిత్రులందఱకు నమస్సులు!

    [నవనాథులలో విష్ణ్వంశ గల మీననాథుఁడు, శివాంశ సంభూతుఁడైన గోరక్ష (గోరక్) నాథుని గుణగణములను వర్ణించుట]

    "ఆతఁడు నీలకంఠుఁ డభ వాది సనాథుఁడు శూలపాణియై
    యాతఁడు కారణోద్భవుఁడు నాతఁ డసంగుఁడు శైలధన్వుఁడై
    యాతఁడు త్ర్యంబకుండు యమృతాంశుధరుండు శ్మశానవేశ్ముఁడై

    యాతఁడు శంకరుండు పరమాత్ముఁ డుమాధవుఁడై వెలింగెడిన్!"

    రిప్లయితొలగించండి
  35. చేతను ఢక్క శూలములు శీతకరుండును గంగ నెత్తినన్
    శీతల పర్వతమ్ములను స్వీయ గృహమ్ముగ జేసుకొన్న వా
    డాతడు విశ్వనాథుడుగ నందరి పూజల నందుచున్న వా
    ​డాతఁడు శంకరుండు పరమాత్ముఁ డుమాధవుఁడై వెలింగెడిన్!

    రిప్లయితొలగించండి
  36. మాతను వీడుచున్ యతిగ మారుచు బాల్యము నందునన్ భళా
    గీతకు బ్రహ్మసూత్రముల కింపుగ వ్రాయుచు భాష్యముల్; సదా
    ద్వైతపు భావనన్ వదలి ధర్మము హైందవముద్ధరించగా
    నాతఁడు శంకరుండు పరమాత్ముఁడు మాధవుఁడై వెలింగెడిన్

    రిప్లయితొలగించండి