28, జులై 2016, గురువారం

పద్యరచన - 1227

కవిమిత్రులారా,

పై చిత్రాన్ని పరిశీలించి తగిన పద్యాన్ని వ్రాయండి.

66 కామెంట్‌లు:



  1. ఏరు వాక పోరు నెంత గుండ్రాయైన
    కరుగు మీదు నున్న గయగు నట్లు
    కావ్య మధురిమ గన గట్టిపట్టుగజేయు
    పోరు వలన శాంతిఁ బొందగలము

    జిలేబి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. జిలేబీ గారూ,
      మీ పద్యం (పూరణ?) బాగుంది. అభినందనలు.
      'నున్నగ నగునట్లు..' అనాలి.

      తొలగించండి

    2. కందివారు

      ఈ చిత్రాన్ని చూసాక ఆ సమస్య పూరణ కి సమాధానం వచ్చిందండి :) సో , రెండింటికి ఒకే పద్యం :)

      సవరణకి నెనర్లు

      జిలేబి

      తొలగించండి
  2. జలజల గలగలల నడుమ
    సెలయేరును పాఱు తీరు చిత్రముఁ జూడన్
    మలయము వీచగ నడవిని
    మెలపును మదికల్గుచుండు మిక్కుటమిలలో

    రిప్లయితొలగించండి
  3. అదిగో! వర్ష సమాగమం బిలను దా నందిం చెనే సోయగం
    బిదిగో సాగెను నేడిటన్ జలమదే యింపై ఝరీ సాంద్రమై
    మది నింపెన్ కమనీయ రాగములు సామ్యం బందు కాలమ్మునం
    దిదిగో! జూడుము నర్తనమ్మిడెను నేడీ వర్ష రాశీ కృతుల్!

    రిప్లయితొలగించండి
  4. కన్నుల విందును జేయుచు
    వన్నెల చిందుల నుజూపు వంపుల వాగున్
    మిన్నుల నంటెడు సొగసును
    నెన్నగ తరమేరి కైన నేరుపు గలదే ?

    రిప్లయితొలగించండి
  5. కొండలందు బుట్టి, కోనలం దాటుచు
    పరుగు పెట్టుచుండె త్వరితగతిని
    హర్ష మందజేతు నవనివారలకంచు
    ఝరుల సొగసు నంద రరయ దగును.
    (హ.వేం.స.నా.మూర్తి)

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సత్యనారాయణ మూర్తి గారూ,
      మీ పద్యం సుందరంగా ఉంది. అభినందనలు.

      తొలగించండి
  6. మిత్రులందఱకు నమస్సులు!

    వరుణోత్సర్గ విశిష్ట జీవనములున్ వర్షమ్మునై భూమిపైఁ
    గురియం జేయఁగఁ గోర, సంతసమునన్, గోర్కెల్ పిసాళింపఁగన్,
    వరుణుండే కురిపించె వర్షము! నదుల్ పర్వెన్ సుపర్వమ్ముగాఁ
    దరలెన్ వాగులు వంకలున్ గలిసి సంతాపమ్ము చల్లారఁగన్!!

    రిప్లయితొలగించండి
  7. కౌను సోయగంపు కనువిందు లొకచోట
    శ్రోణి తలముఁబోలు సొంపులొకట
    జలజలమని పాఱు సెలయేఱు పోకడ
    కన్నె పిల్ల నడక కాను పించు

    రిప్లయితొలగించండి
  8. శిలలను దడుపుచు సాగుచు
    గలగల మని పొంగిపొరలు గమనము తోడన్
    జలపాతపు సొగసు గనగ
    పులకించని వారు గలరె పుడమీ స్థలిలో!!!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. శైలజ గారూ,
      మీ పద్యం బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
    2. శైలజ గారు "పుడమిస్థలి" సాధువనుకుంటాను. దీర్ఘముతో సమసించతగదు. పుడమిచూలి, పుడమిరేడు యిత్యాదులు సాధువులు. పుడమిస్థలి లో "మి" లఘువు గనుక తదనుగుణముగా సవరించ గలరు.

      తొలగించండి
    3. శైలజ గారూ,
      'పుడమిన్ గనగన్' అనండి.

      తొలగించండి
  9. ఉరకలు పరుగుల మీదన
    తరగల పారేను నీరు దాటగ రాలన్
    జరుగని కోరదు! బండల
    నొరిగి యొదిగి సాగు యీ మనుషులకు నేర్పన్॥

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. రఘురామ్ గారూ,
      మీ పద్యం బాగున్నది. అభినందనలు.
      'మీదను/మీదనె' అనండి. 'పారేను' అని వ్యావహారికాన్ని ప్రయోగించారు.

      తొలగించండి
  10. ఊర్జిత నగ షండ భరిత
    నిర్జన వన నిర్విరామ నిర్ఝర ధారా
    గర్జన నిస్వన ఘనసం
    తర్జిత మృగ విహగ హీన తరళ సరసియే

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కామేశ్వర రావు గారూ,
      ఏకసమాసంగా అద్భుతమైన వర్ణనతో చక్కని పద్యాన్ని చెప్పి హృదయానందాన్ని కలిగించారు. అభినందనలు, ధన్యవాదాలు!

      తొలగించండి
    2. పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. ధన్యవాదములు.

      తొలగించండి
    3. ఎంత బాగుందో , అల్లసాని వారిని గుర్తుకుతెచ్చారు , నమస్సులు

      తొలగించండి
    4. కళ్యాణ్ గారు నమస్కారములు. నా పద్యాన్ని సమీక్షించి శ్లాఘించిన మీ యౌదార్యమునకు ధన్యవాదములండి.

      తొలగించండి
  11. జలజల రవముల దోడను
    నలరించెను గొండ లచట హాహా యనగ
    న్గలయా నిజమా యది నా
    తలపించెను పటము జూడ దండ్రీ కంటే ?

    రిప్లయితొలగించండి
  12. విరహిణియై వేచె ననుచు
    ధరణిని తా జేరదలచి తమకము తోడన్
    వరుణుడు చినుకై రాలుచు
    వరదై పాఱగ తడిసిన వసుధయె మురిసెన్

    కడలి యను ప్రియుని జేరగ
    వడివడిగా వాక కదిలె వరదై పాఱన్
    పుడమియె పులకించి మురిసె
    టడసిన తనమేనుగాంచి ధన్యమటంచున్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. విరించి గారూ,
      మీ రెండు పద్యాలు బాగున్నవి. అభినందనలు.

      తొలగించండి
    2. విరించి గారు "టడసిన" అన్నారు ముద్రణ ప్రమాద పతితమా? "తడిసిన" అనా మీ భావన?

      తొలగించండి
  13. మేఘాలు నుఱుమగ?మేటియు మెఱుపుకు
    ----------------దుమికెను భువిపైనదుడుకు వాన|
    చిలకరించు చినుకు పలుకరించకె చెట్ల
    ----------స్నాన పానాదుల సర్ది బంచు|
    వానలు వంకలై వాగులు బింకాన
    -----------చెరువులు,నదులుగాచేరినిలువ
    కొండ కోనలుదాటి నిండుమనసు చేత
    ------అండగాభువి నెంచు కండవోలె
    చూడ ముచ్చట గొల్పుచు నీడనొసగు
    చెట్ల సంరక్ష ణార్థమై చేరుచున్న
    నీరమేలేక జీవుల నీరసంబు
    మాన్ప నెంచగ వర్షాల మలపు లౌర|

    రిప్లయితొలగించండి
  14. కొండల దాటుచు రైతుకు
    పండుగ చేయగ బిరబిర పరుగులిడెడు నీ
    యండయె చాలును, బ్రతుకులు
    పండును, సంతసమగు నిల ప్రజలెల్లరికిన్!

    రిప్లయితొలగించండి
  15. జల జల రాలు చిన్కులును జాలుగ మారి నగంబు నుండియున్
    గలగల పారు చుండె వడిగా, ధరణీ తల మెల్ల హరిత్తు శోభచే
    మిల మిల వెల్గు చుండ, గని మిక్కిలి హార్షము తొడ కర్షకుల్,
    కలకల నవ్వి నారు జల కాంతిని గాంచి, సమస్త మానవుల్

    రిప్లయితొలగించండి
  16. గలగలమని పారెడు యా
    సెలయేటిని గాంచుచున్న జివ్వున లాగున్
    జలముననిడగా పదములు
    కలుగునువింతయనుభూతి కన్నుల యెదుటన్

    రిప్లయితొలగించండి
  17. కలుగ నుత్కంఠ+నురుకుచు కాన కోన
    సుడులు దిరుగుచు ప్రవహించు సోకు వాక
    కరుగ యౌవనోత్సాహమ్ము ఝరిని జేరి
    నిగువు నడలను జలధి కవుగిలి నొందు

    రిప్లయితొలగించండి
  18. కొండలలోన బుట్టి పలుకోనల సందుననుండి పారుచున్
    మెండుగ సద్దు చేయుచును మెచ్చెడురీతిని వంపుసొంపులన్
    దండిగ జూపుచున్ క్షితికి తన్మయతన్ గలిగించుచుండి నీ
    వండగ నుందు వీప్రజల కద్భుతరీతి ఝరీ! ప్రశస్తవై.

    స్వాదు జలంబునింపుకొని చక్కని తీరుగ నాట్యమాడుచున్,
    మోదముతో స్వహస్తములు ముందుకు జాచి విహంగపంక్తులన్
    నీదరి జేర బిల్చుచు, వినిర్మల భావము తోడ ప్రాణులన్
    భేదము లేక జూచెదవు విజ్ఞవు నీవు ఝరీ! మహీస్థలిన్.

    నీగతి గల్గు ప్రాంతమున నిర్ఝరిణీ! సతతంబు సఖ్యముల్
    రాగమయాఢ్యజీవనము రమ్యసువర్తన మబ్బుచుండు నీ
    యాగమనంబు కర్షకుల కందగ జేయును సస్యసంపదన్
    స్వాగత మంది యీ భువిని చల్లగ జేయుట నీకు యుక్తమౌ.

    నీరే జగదాధారము,
    నీరే ప్రాణంబు నిల్పు నిత్యౌషధమై,
    నీరే రక్షక మాపగ!
    నీరంబందించునట్టి నీవందు నతుల్.
    (హ.వేం.స.నా.మూర్తి)

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సుకవులు హ.వేం.స.నా.మూర్తి గారు నమస్సులు. మీవాక్ప్రవాహముతో నదీనీరముల ప్రాశస్త్యాన్ని మనోహరముగా వర్ణించారు. అభినందనలు. మీరన్యధా భావించకపోతే నాదొక చిన్న సూచన. "రాగమయాఢ్య" లో మయము, ఆఢ్యము పునరుక్తి యనిపించుచున్నది. "రాగసుధాఢ్య" అనిన నెట్లుండును?

      తొలగించండి
    2. శ్రీయుతులు కామేశ్వరరావుగారికి నమస్కారములు,
      ఆర్యా!
      మీ అభినందనలకు, సూచనకు ధన్యవాదములు. "రాగసుధాఢ్య"యన్నచో మరింత బాగుండును. కృతజ్ఞతాభివాదములు.

      తొలగించండి
    3. సత్యనారాయణ మూర్తి గారూ,
      మళ్ళీ ఇన్నాళ్ళకు మీ ఖండకవితా మాధుర్యాన్ని చవి చూసే అదృష్టం దక్కింది. మనోహరమైన పద్యాలు! అభినందనలు.
      కామేశ్వర రావు గారి సూచనను గమనించండి.

      తొలగించండి
    4. ఆర్యా!
      ధన్యవాదములు, నమస్కారం.

      తొలగించండి
  19. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
  20. .ధరణీ స్నానము జేయగా వలయు ప్రత్యామ్నాయమార్గంబుగా
    కురిసెన్ వానలువంకలై నురికి సుంకున్ మాన్పెజిజ్ఞాశచే
    కరువున్ మాన్పెడి కల్పనా హృదయ సంకల్పానమేఘంబులే
    పరుగున్ వెళ్ళుచు గాలియే జిలుక నింపాదందువర్షంబగున్.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఈశ్వరప్ప గారూ,
      కొంత అన్వయలోపం ఉన్నట్టున్నా మీ పద్యం బాగున్నది. అభినందనలు.
      'వంకలై యురికి..' అనండి. 'జిజ్ఞాస'..టైపాటు!

      తొలగించండి
  21. నది తల్లిగ పారుచు ను
    న్నదిగనుడిక యొదిగియొదిగి నగమును దిగుచున్
    మదిచల్లగ మనకవ నె
    మ్మది నెమ్మదిగా జలసుధ మనకందించన్.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. గోలి వారూ,
      మీ పద్యం బాగున్నది.
      కాగా అనే అర్థంలో `అవ' ప్రయోగం సాధువు కాదు.

      తొలగించండి
    2. మాస్టరుగారూ! ధన్యవాదములు.మీ సూచనమేరకు చిన్న సవరణ చేశాను.


      నది తల్లిగ పారుచు ను
      న్నదిగనుడిక యొదిగియొదిగి నగమును దిగుచున్
      మదిచల్లబడునటుల నె
      మ్మది నెమ్మదిగా జలసుధ మనకందించన్.

      తొలగించండి
  22. శ్రీగురుభ్యోనమః

    కురిసిన వర్షధార లవి క్రొత్త వసంతపు శోభ గూర్చగా
    హరితములాయె వన్యములు హ్రాదిని మేదిని హాయి నొందగా
    మురియుచు పారె వారి పరిపూర్ణములై సెలయేరు లన్నియున్
    పరిమళ పుష్పముల్ విరిసె పండుగ కాదొకొ మానవాళికిన్

    గురువుగారికి నమస్కారములు.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. శ్రీపతి శాస్త్రి గారూ,
      బహుకాల దర్శనం... సంతోషం!
      మీ పద్యం మనోహరంగా ఉంది. అభినందనలు.

      తొలగించండి
  23. నింగి నుండి జారి నీలకంఠుని శిరో
    బంధమందుఁ జిక్కు భావమేమొ?
    గరుకు రాళ్లఁ దాక గురుతుగాఁ దోచెనో?
    ప్రణవనాద మొలికి పారె గంగ!

    రిప్లయితొలగించండి
  24. జలోపదేశం

    నన్ను గాపాడు కొనుమోయి నిన్ను గాతు;

    ఆనకట్టలు కట్టంగ నభ్యుదయము;

    జలము లేకున్న జాతికి ఫలము సున్న

    జలమె జాతికి తరుగని కలిమి బలిమి.

    విద్వాన్, డాక్టర్,మూలే.రామమునిరెడ్డి,విశ్రాంత తెలుగు పండితులు.ప్రొద్దుటూరు.కడప జిల్లా.7396564549.

    రిప్లయితొలగించండి
  25. శిలలన్ తరువుల వెఱవని
    గలగల రవ భరిత సరసి గమనపు చెల్వం
    బిల కన్నుల తగిలి వెలిసె
    తలపుల నడకలు కుదరగ తగు కందంబై

    రిప్లయితొలగించండి
  26. చక్కగ గెంతుచు పారుచు
    నొక్కటి శబ్దమ్ము లేని యో సెలయేరా !
    మిక్కిలి ముదమ్ము తోడను
    గ్రక్కున నీ నీట దిగగ కాలున్ జారున్!

    రిప్లయితొలగించండి