25, జులై 2016, సోమవారం

సమస్య - 2097

కవిమిత్రులారా, 
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది... 
"పురుషునకుం దాళిబొట్టు భూషణము సతీ"

81 కామెంట్‌లు:

  1. ధరపయి చూడగ శౌర్యము
    పురుషునకుం, దాళిబొట్టు భూషణము సతీ!
    సురుచిరముగ నర్థాంగికి
    వరగుణులై వీని దాల్చ వైభవ మబ్బున్.
    (హ.వేం.స.నా.మూర్తి)

    రిప్లయితొలగించండి
  2. పరగన్ బత్నియె వరమట
    పురుషునకుం దాళిబొట్టు భూషణము సతీ
    భరమై కళ లందించును
    భరతావని వనితల కిట భాగ్యంబగుచున్!

    భరము=అతిశయము

    రిప్లయితొలగించండి
  3. మరుభూమిని వీరత్వము
    పురుషునకుం,దాళిబొట్టు భూషణము సతీ
    తరుణికి వరమట గళమున
    పరపురుషుడు గాంచి నంత భక్తిని మ్రొక్కున్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అక్కయ్యా,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      మరుభూమి (ఎడారి)లో వీరత్వంతో పనేమిటి. `దురమందున వీరత్వము...' అనండి.

      తొలగించండి
  4. అరయగ విద్యయె రవణము
    పురుషునకుం , తాళిబొట్టు భూషణము సతీ
    వరమగు మన్నన దెచ్చును
    ధరియించిన తరుణికదియె ధారుణి లోనన్!!!

    రిప్లయితొలగించండి
  5. వరునిగ వివాహ వేళను
    సురుచిర దరహాస మునను సుందరి మెడలో
    మరి ముడులు వేయ బట్టిన
    పురుషునకుం దాళిబొట్టు భూషణము సతీ.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. హనుమచ్ఛాస్త్రి గారూ,
      తాళికట్టు శుభవేళలో వరుని చేతికి అదే ఆభరణం. బాగుంది. మీ పూరణ. అభినందనలు.

      తొలగించండి
  6. అరెరే! కన్యలె దొరకరె!
    మరినే శుల్కము నొసగెద మన్నను రారే!
    అరయగ గట్టరె సూత్రము
    పురుషునకుం దాళి బొట్టు భూషణము సతీ!
    (పెండ్లికి కన్యలు దొరకక చివరకు కన్యా శుల్కమునిచ్చి
    తాళి కట్టించుకోడానికి కూడా సిద్ధపడ్డాడో ప్రబుద్ధుడు)

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. వెంకటప్పయ్య గారూ,
      హాస్యస్ఫోరకమైన మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  7. వర తిలకము దన నుదుటను
    బురుషునకుం దాళిబొట్టు భూషణము సతీ
    త్వ రతికి సుమంగళికి నా
    దరింప దగును మన భారత సుసంస్కృతినిన్

    రిప్లయితొలగించండి
  8. సరసము పంచెడు సాధ్వియె
    పురుషునకుం దాళి బొట్టు! భూషణము సతీ
    యరమఱికలు లేని మగడు!
    ధరలో నింతికిదె స్వర్గ ధామము సుమ్మీ!

    రిప్లయితొలగించండి
  9. రిప్లయిలు
    1. శంకరాభరణం:

      కవిమిత్రులారా, 

      ఈరోజు పూరించవలసిన సమస్య ఇది... 

      "పురుషునకుం దాళిబొట్టు భూషణము సతీ"


      పొరబాటునైన మేకుకు
      తరువాత దరియించ తాళి తగిలించకుమా!
      గురుతౌనది నువు మెచ్చిన
      పురుషునకుం, దాళిబొట్టు భూషణము సతీ!

      తొలగించండి
    2. సహదేవుడు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  10. నిన్నటి పూరణాన్ని కూడా చూడ గోరుతాను, ధన్యవాదములు.
    అరయంగా ' ఈవు ' ప్రథమ
    పురుషుని బెండ్లాడె! నొక్క పురుషుండౌరా
    తరుణిని గూడి ఫలము దిన,
    ధరణియె నా నేరము తల దాల్చగ వచ్చెన్!
    (ప్రథమ స్త్రీ పురుషులుగా చెప్ప బడే 'ఆదం, ఈవ్ ' ల అంశం ఆధారంగా)
    (ఫలము = భగవానునిచే నిషేధింపబడిన ఫలము)
    వాళ్ళిద్దరికి పెండ్లి జరిగినట్లే యని భావించ వచ్చేమో ననిపించింది.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. శ్రీధర రావు గారూ,
      మీ (నిన్నటి) పూరణ బాగున్నది. అభినందనలు.
      'ధరణియె యా నేరము...' అనండి.

      తొలగించండి
  11. అరయుము మన సుత మొగమున
    దరహాసము నిలువ వరుడు తాళిని కట్టన్
    కరమున మెరయుచు నిత్తరి
    పురుషునకుం దాళిబొట్టు భూషణము సతీ.

    రిప్లయితొలగించండి
  12. హనుమచ్ఛాస్త్రిగారూ నా పూరణ పెట్టాక మీ పూరణను గమనించాను. ఇరువురి భావాలు ఒకేలా ఉన్నాయి చిత్రంగా. మీ పూరణ బాగుంది.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మిస్సన్న గారూ,
      భావం ఒకేలా ఉన్నా ఎవరి శైలి వారిదే. మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  13. స్థిరమగు నౌకిరి,వలయును
    పురుషునకుం, దాళి బొట్టు, భూషణము, సతీ!
    పరిణయమునకు చిహ్నములవి
    తరుణికి పెండ్లైన దనెడి తథ్యము తెలుపన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. తిమ్మాజీ రావు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      మూడవ పాదంలో గణదోషం. 'పరిణయ చిహ్నము లయ్యవి...' అనండి.

      తొలగించండి
    2. గురుదేవులు సూచించిన సవరించినపద్యము
      స్థిరమగు నౌకిరి,వలయును
      పురుషునకుం, దాళి బొట్టు, భూషణము, సతీ!
      పరిణయచిహ్నము లయ్యవి
      తరుణికి పెండ్లైన దనెడి తథ్యము తెలుపన్

      తొలగించండి
  14. వర కవి జంథ్యాల నొకట
    "పురుషునకుందాళిబొట్టు భూషణము సతీ"
    వరమనె చిత్రంబు కొఱకు
    కరమరుదుగ జరుగునిట్లు కల్యాణవిథుల్.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. పొన్నెకంటి వారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      `జంధ్యాల యొకట...' అనండి.

      తొలగించండి
  15. స్థిర విక్రమంబు శోభగు
    పురుషునకుం, దాళిబొట్టు భూషణము, సతీ!
    యరయుమ! వీనిం గావన్
    భరతుని వంశ స్థులనగ భావ్యంబగుగా.

    రిప్లయితొలగించండి
  16. వరకవి....అను పద్యంలో సవరణ...జంథ్యాల యొకట. అని చదువ వలసినదిగా ప్రార్థన.

    రిప్లయితొలగించండి
  17. పురుషుడు గాదని దెలుపక
    తరుణియు రూపంబు దాల్చి తలలోపూలున్
    దురిమిన నపుంసకుడు|”ఆ
    పురుషునకుందాళి బొట్టు భూషణము సతీ.
    2.పరపతి బెంచగ భార్యయె
    పురుషునకుం|”దాళిబొట్టు భూషణము సతీ
    పరువము నిల్పెడి బంధము
    తరుగని మన సంప్రదాయ తత్వంబదియే.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఈశ్వరప్ప గారూ,
      మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
      `నపుంసకుం డా...' అనండి.

      తొలగించండి
  18. పరువును కాపాడగ వా
    పిరి చూపులను పడనీక పెక్కు విధములన్
    గిరి గీసిన రీతిగ పర
    పురుషునకుం దాళిబొట్టు భూషణము సతీ॥

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. రఘురామ్ గారూ,
      మీ పద్యం బాగుంది కాని పూరణ భావం అర్థం కాలేదు. పురుషునకైనా పరపురుషునకైనా తాళిబొట్టు అలంకార మెలా అవుతుంది?

      తొలగించండి
  19. అరయగ జగతిన శౌర్యము
    పురుషునకుం దాళిబొట్టు భూషణము సతీ
    ధరణిన వరమగు నీకును
    భరముగ ధరియించి కీర్తి బడయుము పుత్రీ.

    రిప్లయితొలగించండి
  20. సరిగా గళమున దాల్చుము
    పొరపాటున చేయి జారి పుడమిన పడినన్
    స్థి/తిరముగ నుండదు మనసది
    పురుషునకుం దాళిబొట్టు భూషణము సతీ.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఉమాదేవి గారూ,
      మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
      మొదటి పూరణలో 'జగతిని...ధరణిని...' అనండి.

      తొలగించండి
  21. కారణ మేది యయిన విను
    నారీమణి తీయబోకు నాధుని తాళిన్
    దూరమని చెప్పు నది పర
    పురుషునకున్, దాళిబొట్టు భూషణము సతీ!

    రిప్లయితొలగించండి
  22. తరగని పౌరుష మే గద
    పురుషునకుం దాళిబొట్టు; భూషణము సతీ !
    తరగని సౌభాగ్యమ్మది
    వరముగ సత్పురుషుడామె పతియై వెలుగున్

    నిన్నటి నా చిన్న పద్యంలోని కధాంశము లోని పొరపాటును తెలిపిన శ్రీ
    జిగురు సత్యనారాయణ గారికి ధన్యవాదములు
    హరియే సృష్టించె కథను
    నరునే పెండ్లాడె లక్ష్మణాఖ్యుండని ; య
    త్తరి వధువుగ రక్కసు నిడె ,
    పురుషునిఁ బెండ్లాడె నొక్క పురుషుం డౌరా

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కృష్ణారావు గారూ,
      మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.

      తొలగించండి
  23. బిరుసైన కండలుండిన
    పురుషునకుం, దాళిబొట్టు భూషణము సతీ
    తరుణులకని , జ్ఞానులు తెలి
    పిరి, మరువకు మోయి మగువ పెద్దల మాటన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. విరించి గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'కండ లందము పురుషునకుం...' అంటే బాగుంటుందేమో?

      తొలగించండి
    2. ధన్యవాదాలు గురువు గారూ మీ సూచన శిరోధార్యము

      తొలగించండి
  24. వర రతికేళిం దనరుచు
    పురుషాయిత బంధమందు ముద మందుచు నా
    యురమునౕఁ దగిలెడి వేళన్
    పురుషునకుం దాళిబొట్టు భూషణము సతీ!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. పూజ్యులు శంకరయ్య గారికి వందనములు.
      మీ మృదు మధుర రస భావ నవార్థ కలిత కవనాంబోధి వేలాతిక్రాంత పథగమ నోద్వృత్త సంశ యార్హమని తోచుచున్నది.
      నాసాహసాన్ని మన్నించండి.

      తొలగించండి
    2. కామేశ్వర రావు గారూ,
      సుదీర్ఘ సమాస ప్రారంభ పదాలతో నన్ను మునగ చెట్టెక్కించి, చివరికి వచ్చే సరికి అమాంతం క్రింద పడవేసారు. శృంగారాత్మకంగా వ్రాసి మర్యాదాతిక్రమణ చేస్తున్నానేమో అని సంశయించిన మాట వాస్తవమే. పూరణలో అశ్లీలం గోచరిస్తే క్షంతవ్యుణ్ణి!
      ఎవరు, ఎప్పుడు అనేది గుర్తు లేదు కాని... దాదాపు ఇటువంటి భావంతో గతంలో ఒక అవధానంలో పూరణ చెప్పారు.

      తొలగించండి
    3. గురువుగారూ అద్భుతమైన పూరణ నందించినందులకు చాలా ఆనందంగా వుంది. నమస్సులు.

      తొలగించండి
    4. మిత్రులకు నమస్సులు!

      మర్యాదాతిక్రమణమేమీ జరుగలేదు. సమస్యానుగుణమైన పూరణమే యిది. పూరణ చాలా బాగున్నది.అభినందనలు.

      తొలగించండి
    5. పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. సంస్కృత సమాస భూయిష్ట మైనందువలన నశ్లీలము గోచరించ లేదు లెండి. నేనా వ్యాఖ్యను చాలాసేపు మనస్సులో తర్కించుకున్న తర్వాత నే వ్రాసాను. మీ మనసు నొప్పించి నందులకు క్షంతవ్యున్ని.

      తొలగించండి
    6. పూరణములందిది సర్వసాదారణము. ఇంతకన్నణధికముగ నశ్లీలత గోచరించు సమస్యలు...పూరణములు పెక్కులు గలవు. కాన నిది లెక్కలోనికి రాదని నా యభిమతము.

      తొలగించండి
    7. కామేశ్వర రావు గారూ,
      నేనేమీ నొచ్చుకోలేదు లెండి! ఇటువంటి అభ్యంతరం వస్తుందని ముందే ఊహించాను. ధన్యవాదాలు!

      తొలగించండి
    8. శిష్ట్లా శర్మ గారూ, మధుసూదన్ గారూ,
      ధన్యవాదాలు!

      తొలగించండి
    9. గురువుగారూ సరసమైన శృంగార భావాన్ని పొదిగి అందమైన పూరణ నిచ్చారు.

      తొలగించండి
    10. మాస్టరుగారూ! మనసున శృంగారము "చిత్రము" గా ఒక్కసారి మెరిసింది.

      సింగారపు భావనతో
      పొంగారెను మనసు మాకు పూరణ చదువన్
      భంగిమ తోచిన మదిలో
      బంగారపు ' చిత్రమేదొ ' బాగుగ మెరిసెన్.

      తొలగించండి
    11. మిస్సన్న గారూ, హనుమచ్ఛాస్త్రి గారూ,
      ధన్యవాదాలు.

      తొలగించండి
  25. డా. పిట్టా సత్యనారాయణ గారి పూరణలు...
    1)
    నరునంతటి వారలె పో
    సురుచిర యుత్తరల నటన చొప్పడ మని రా
    వర వధువు భేద మెఱుఁగని
    పురుషునకుం దాళిబొట్టు భూషణము సతీ!
    2)
    సరసతఁ దన మెడఁ గదిసితి
    పరువము నుప్పొంగఁ జేసి బరబర తాళిన్
    వరునకుఁ జుట్టితి నబ్బా
    పురుషునకుం దాళిబొట్టు భూషణము సతీ!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. పిట్టా సత్యనారాయణ గారూ,
      శంకరాభరణం బ్లాగు మీకు స్వాగతం పలుకుతున్నది.
      మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
      మొదటి పూరణలో `సురుచిర+ఉత్తర' అని విసంధిగా వ్రాయరాదు కదా! అక్కడ గుణసంధి.. యడాగమం రాదు.

      తొలగించండి
  26. పరిణయపు నాశఁ రేపుచుఁ
    దరుణుల మోసపుఁ బలుకులఁ దల్లులఁ జేసే
    ఒరవడి నడ్డు నుపాయము
    "పురుషునకుం దాళిబొట్టు భూషణము" సతీ!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. రాజ్‍కుమార్ గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'పరిణయపు టాశ రేపుచు...' అనండి (ఇక్కడ టుగాగమం వస్తుంది, ఆశ తరువాత అరసున్నా అవసరం లేదు). 'చేసే' అనడం వ్యావహారికం.

      తొలగించండి
    2. పరిణయపు టాశఁ రేపుచుఁ
      దరుణుల తల్లులుగ జేయు దాష్టిక మాగన్
      దరుణో పాయ మ్మొకటే
      "పురుషునకుం దాళిబొట్టు భూషణము" సతీ!

      తొలగించండి
    3. సవరించిన మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  27. అరయగ దైర్టము నగయే
    పురుషునకుం, దాళిబొట్టుబూషణముసతీ,
    కరుణా రసహృదయమే
    గురువునకు నగయంచునీవు గుర్తెరుగుసుమీ

    గురువుగారు ఒక నీతిపద్యము మాదిరిగా దీనిని పూరించ ప్రయత్నించినాను
    తప్పొప్పొలు పరిశీలించప్రార్థన

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. శ్రీనివాస్ చారి గారూ,
      మీ పూరణ బాగున్నది.
      'ధైర్యము'.. 'దైర్టము' అని పొరపాటున టైప్ చేసారనుకుంటాను.
      మూడవ, నాల్గవ పాదాలలో గణదోషం. `కరుణారస హృదయమ్మే। గురువునకు నగయని నీవు...' అనండి.

      తొలగించండి
  28. అరయగ నొక నుద్యోగము

    పురుషునకుం; దాళిబొట్టు భూషణము సతీ

    తరుణులకున్; వరమదియే

    పరిణయమున్ చేసుకున్న పడతుల కెల్లన్.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. నాగేశ్వర రావు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'చేసికొనిన...' అనండి.

      తొలగించండి
    2. గురువుగారికి ధన్యవాదములు మీసవరణతో ప్రచురిస్తాను కృతఙ్ఞతలు

      తొలగించండి
  29. పోచిరాజు సోమశంకరము: గారి పూరణ:

    పురుషుని జీవిత మందున
    నరయగ నాతాళి యనగ నద్భుత మిలలోన్
    మరువకుమా నీ వెపుడును
    పురుషునకుం దాళిబొట్టు భూషణము సతీ

    రిప్లయితొలగించండి
  30. పోచిరాజు సోమశంకరము గారూ,
    శంకరాభరణం మీకు స్వాగతం పలుకుతున్నది.
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  31. సరసతఁ దెలియక, తానున్
    విరసతతోఁ బ్రేమ నెపుడు బేహారముగన్
    బరిగణియించెడి యా కా

    పురుషునకుం దాళిబొట్టు "భూషణము" సతీ!

    రిప్లయితొలగించండి
  32. మాయాబజార్ లో ఘటోత్కచుడు , ఉత్తర కుమారుడిచేత తాళి కట్టించుకోబోయే సన్నివేశం చూసి శ్రీకృష్ణుడు రుక్మిణితో చెప్పే సరదా పద్యం


    అరివీరభయంకరుడే
    మరదలివేషంబువేసి మనువాడగ తా
    నరుదెంచె గాంచ మాయల
    పురుషునకుం దాళిబొట్టు భూషణము సతీ

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. చిన్న సవరణతో ...

      అరివీరభయంకరుడే
      మరదలివేషంబువేసి మనువాడగ నా
      కురుసుతుని పూనె నికపై
      పురుషునకుం దాళిబొట్టు భూషణము సతీ

      తొలగించండి
    2. కళ్యాణ్ గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి