15, జులై 2016, శుక్రవారం

సమస్య - 2087 (వాన కురియు నెండు...)

కవిమిత్రులారా, 
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
“వాన కురియు నెండు గడ్డివామున్ వేగన్”
ఈ సమస్యను పంపిన తాడిగడప శ్యామలరావు (శ్యామలీయం) గారికి ధన్యవాదాలు.

శ్యామలీయం గారి పూరణ....
ఆ నల్లమబ్బు జూడుడు
వానకురియు నెండుగడ్డివామున్ వేగన్
లోనికి చేర్పించుడయా
నానాకష్టములు గడ్డి నాని చెడినచో.

52 వ్యాఖ్యలు:

 1. చానా మబ్బులు గ్రమ్మెను
  కానగ యురుములు మెరుపులు కల్లోలమగున్
  నీనా పొలమున తడియును
  వాన కురియు నెండు గడ్డి వామున్ వేగన్

  ప్రత్యుత్తరంతొలగించు
  ప్రత్యుత్తరాలు
  1. అక్కయ్యా,
   కొంత అన్వయలోపం ఉంది. ‘చానా’ అనడం గ్రామ్యం.

   తొలగించు
  2. కానగ యురుములు మెరుపులు
   వాన కురియు నెండు గడ్డి వామున్ వేగన్
   నానిన గ్రాసము పశువుకు
   ఖానము జేయంగ తగని ఖాద్య మటన్నన్


   తొలగించు
 2. మేనున మంటలు పుట్టగ
  భానుడు రోహిణికిఁ జేరి భగభగలాడెన్
  స్యూన శతసహస్ర తతుల
  వాన కురియు నెండు గడ్డివామున్ వేగన్!!

  ప్రత్యుత్తరంతొలగించు
  ప్రత్యుత్తరాలు
  1. సత్యనారాయణ గారూ,
   కిరణాల వానతో బాగుంది మీ పూరణ. అభినందనలు.

   తొలగించు

 3. శుభోదయం


  తానై మురళీ నాదము
  వీనుల విందు యవనారి విరివిగ జేయన్
  "ఊ" నిడు శబ్దతరంగపు
  వాన కురియు నెండు గడ్డివామున్ వేగన్ !

  సావేజిత
  జిలేబి

  ప్రత్యుత్తరంతొలగించు
  ప్రత్యుత్తరాలు
  1. జిలేబీ గారూ,
   మీ పూరణ బాగుంది.
   అయినా మురళీనాదతరంగాల వానకు చెట్లు చిగుర్చాలి కాని, గడ్డివాములు ఎండడం?

   తొలగించు

  2. ప్రళయము లో, అన్నీ అట్లా అవుతాయేమో అని వ్రాసానండి

   ప్రళయాన్ని ప్రణయం గా చదివినా కూడా :) జేకే


   నెనర్లు
   జిలేబి

   తొలగించు

 4. కంది వారు,

  మీరు కనుక్కున్న గని సాహితీ నందనం , చిత్ర కవితా ప్రపంచం ఇప్పుడు మాలిక లో వస్తోంది

  జిలేబి

  ప్రత్యుత్తరంతొలగించు
  ప్రత్యుత్తరాలు
  1. మీరన్నట్లు ఆ రెండు బ్లాగులు చిత్రకవితాఖనులే! సంతోషం!

   తొలగించు
 5. అనల్ల మబ్బునేమగు
  కానగ వామున నదియెది, కడుపున బాధౌ
  నేనేమి తినవలె చెపుమ
  వాన కురియు, నెండు గడ్డి, వామున్ వేగన్.

  ప్రత్యుత్తరంతొలగించు
  ప్రత్యుత్తరాలు
  1. హనుమచ్ఛాస్త్రి గారూ,
   వామును తినిపిస్తూ క్రమాలంకారంలో చక్కని పూరణ నిచ్చారు. అభినందనలు.

   తొలగించు
 6. "పోనీలే" యనకు చెడును
  వాన కురియ, నెండు గడ్డి వామున్ వేగ
  న్నానక పట్టా గప్పుము
  లేనిచొ నది తడియు గాదె రేయిం బవలున్!

  ప్రత్యుత్తరంతొలగించు
  ప్రత్యుత్తరాలు
  1. శర్మ గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   ‘లేనియెడల తడియు గాదె...’ అనండి.

   తొలగించు
  2. నమస్సులు...హ్రస్వమైన...చొ...వ్రాయకూడదనుకుంటాను

   తొలగించు
 7. ఆ నల్ల మబ్బువలనన
  వాన కురియు, నెండు గడ్డి వామును వేగన్
  భానుని కిరణాలు దగుల
  మేనంతయుజెమట పుట్టి మిసమిస లాడున్

  ప్రత్యుత్తరంతొలగించు
  ప్రత్యుత్తరాలు
  1. సుబ్బారావు గారూ,
   విరుపుతో మీ పూరణ బాగున్నది. అభినందనలు.

   తొలగించు
 8. పూనిక నమ్ముము మాటను
  నానిన కసువుకు ఖరీదు నాస్తే నయ్యా!
  కానులు రాలవు మనకిక
  వాన కురియు నెండుగడ్డి వామున్ వేగన్

  ప్రత్యుత్తరంతొలగించు
  ప్రత్యుత్తరాలు
  1. వెంకటప్పయ్య గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   ‘నాస్తి+ఏ’ అన్నపుడు యడాగమం వస్తుంది. ‘నాస్తియె యయ్యా’ అందామా?

   తొలగించు
 9. మానిత వియన్మణి జనిత
  పీన మయూఖజ ఘనోష్ణ వృష్టిన్ ధాత్రిన్
  భానుండు కినిసి తాఁ బరు
  వాన కురియు నెండు గడ్డివామున్ వేగన్

  ప్రత్యుత్తరంతొలగించు
  ప్రత్యుత్తరాలు
  1. కామేశ్వర రావు గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.

   తొలగించు
 10. లోనికి రారా! నాయన!
  వాన కురియు-నెంండుగడ్డి వామున్ వేగన్
  ఆనక కప్పగవచ్చును
  మేనటు తడువంంగ నీకు మిక్కిలి వ్యథయౌౌ.

  కానగ మొయిలును నిప్పుడు
  వానకురియు-నెంండుగడ్డి వామున్ వేగన్
  పూనిక నాఛ్ఛాదనమును
  మానకచేయంండి దాని,మరి చెడదింంకన్ .

  ప్రత్యుత్తరంతొలగించు
  ప్రత్యుత్తరాలు
  1. సూర్యనారాయణ గారూ,
   మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.

   తొలగించు
 11. ఈ వ్యాఖ్యను రచయిత తీసివేశారు.

  ప్రత్యుత్తరంతొలగించు
  ప్రత్యుత్తరాలు
  1. ఈశ్వరప్ప గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   ‘..దెమ్మిక యింటికి’ అనండి.

   తొలగించు
 12. కానరు పిల్లలు జువ్వల
  నానందముతోడ గాల్చు నత్తరి నీటన్
  నానుప మేలగు నెరుసుల
  వాన గురియు నెండుగడ్డి వామున్ వేగన్.

  ప్రత్యుత్తరంతొలగించు
  ప్రత్యుత్తరాలు
  1. మిస్సన్న గారూ,
   ఈమధ్య కొంత ‘గ్యాప్’ ఇచ్చినట్టున్నారు.
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.

   తొలగించు
  2. అవును గురువుగారూ గారూ ధన్యవాదాలండీ.

   తొలగించు
  3. అవును గురువుగారూ గారూ ధన్యవాదాలండీ.

   తొలగించు
 13. ఏనాడో మరుభూమిని
  వాన కురియు,నెండు. గడ్డి., వామున్ వేగ
  న్నేనాటికి మొలకెత్తవు
  రాణగ నలవడున కచము లా బట్టతలన్?

  ప్రత్యుత్తరంతొలగించు
  ప్రత్యుత్తరాలు
  1. తిమ్మాజీ రావు గారూ,
   దృష్టాంతాలంకారంతో మీ పూరణ బాగున్నది. అభినందనలు.

   తొలగించు
 14. ఈనాడెటులైనను జడి
  వాన కురియు! నెండు గడ్డి వామున్ వేగన్,
  ఏ నీరము సోకనటుల
  బోనమనుచు భద్ర పరుప బోవం దగునే!
  (గ్రాసము పశువులకు భోజనము వంటిదని భావించి భద్ర పరుప వలెనని చెప్ప దలిచాను)

  గురువు గారికి నమస్కారములు. నిన్నటి సమస్యకు నేను వ్రాసిన పూరణ కూడా చదువ గోరుతాను.
  ధన్యవాదములు. శ్రీధర రావు.


  అవనీ చక్రము చుట్టినన్, వనిత లందౌన్నత్యమున్ చూపకన్,
  నవమానమ్ములతో చెఱల్గొనుచు నా యాలానమున్వీడ మా
  నవ శక్తిన్నిల చెల్లు కాదనుట కానంగా కఠోరంబె! దా
  నవ నీతమ్మట రావణాసురు సుకన్యాసక్త చెత్తంబిలన్!

  ప్రత్యుత్తరంతొలగించు
  ప్రత్యుత్తరాలు
  1. శ్రీధర రావు గారూ,
   మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.

   తొలగించు
 15. ఆ న క ములు క్రమ్మె చెదలు
  వానకురియు, నెం డు గడ్డివామున్ వేగన్
  చేనుకడ నుండి తప్పక
  మానివ సన మునకు తెమ్ము మాన్య హితుం డా

  ప్రత్యుత్తరంతొలగించు
  ప్రత్యుత్తరాలు
  1. అన్నపరెడ్డి వారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.

   తొలగించు
 16. . జ్ఞాన మొనగూర్చ గలిగియె
  వానగురియు|”నెండుగడ్డి,వామున్ వేగన్
  మానక దెమ్మికయింటికి
  నానినచో? పనికిరావు నాణ్యత దగ్గున్.”

  ప్రత్యుత్తరంతొలగించు
  ప్రత్యుత్తరాలు
  1. ఈశ్వరప్ప గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.

   తొలగించు
 17. భానుని ప్రతాప మణగెను
  వానకురియు,నెండు గడ్డి వామున్ వేగన్
  నానక యుండు నటుల నే
  దైనయుపాయమునుగాంచి దాయుడు గడ్డిన్.

  నిన్నటి పద్యమోసారి చూడండి అన్నయ్యగారూ

  ప్రత్యుత్తరంతొలగించు
 18. ఒక రాక్షస స్త్రీసీతతొ
  అవనిజతో పలికెన్ విను
  'నవనీతము రావణుని మనము స్త్రీలయెడన్
  భువిలో నీవంటి వనిత
  నవలోకించుచు సతతము నభినందించున్.

  ప్రత్యుత్తరంతొలగించు
  ప్రత్యుత్తరాలు
  1. ఉమాదేవి గారూ,
   మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
   మొదటి పూరణలో ‘గడ్డి’ పునరుక్తమయింది. ‘దాయవలె నికన్’ అనండి.

   తొలగించు
 19. గోనెల ధాన్యము దాచుము
  వాన కురియు; నెండు గడ్డివామున్ వేగన్
  లోనికి చేర్చుము పశువుల
  కానంద మగును గద పొడి గడ్డిని తినినన్

  ప్రత్యుత్తరంతొలగించు
  ప్రత్యుత్తరాలు
  1. కృష్ణారావు గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.

   తొలగించు
 20. చేనుకు రమ్మంటివి, కన
  వాన కురియు, నెండు గడ్డివామున్ వేగన్
  మేనుకు నడ్డుగ నుండగ
  కానీయుము ముచ్చటలవి గడుసరి బావా!

  ప్రత్యుత్తరంతొలగించు
  ప్రత్యుత్తరాలు
  1. సహదేవుడు గారూ,
   మీ గడ్డివాము చాటు సరసపు పూరణ బాగున్నది. అభినందనలు.

   తొలగించు
 21. ఈ నీరదముల వలనను
  వాన కురియు , నెండు గడ్డివామున్ వేగన్
  నానియు పోకుండ మొదలె
  నానా జాగ్రత్తలెల్ల నాధా గొనుమా !

  ప్రత్యుత్తరంతొలగించు
  ప్రత్యుత్తరాలు
  1. లక్ష్మినారాయణ గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.

   తొలగించు
 22. గురువుగారూ నిన్నటి పూరణ

  కువలేశుండఖిలాస్త్ర పాటవ కళా కోదండ విద్యాధరుం
  డవలీలన్నరివీర ప్రద్విషుల నీడాడెండు నాచిత్తము
  న్నవనీతమ్మఁట, రావణాసురు సుకన్యాసక్తచిత్తం బిలన్
  భువిజాతాశ్రిత బాష్ప బిందువుల యంభోరాశి నాశంబయెన్

  ప్రత్యుత్తరంతొలగించు
  ప్రత్యుత్తరాలు
  1. ఫణికుమార్ గారూ,
   మీ పూరణ బాగున్నది.
   ‘కువలయేశుండు’ను కువలేశుండు అన్నారు.

   తొలగించు
  2. గురువుగారూ కువలేశుఁడు అంటే విష్ణుమూర్తి ( అంటే రాముడే కదా అని ) అనే అర్థంలో రాశాను.

   తొలగించు
 23. భానుడు భగభగ మనగను
  వానలు మరి లేక జనుల వాడల యందున్
  ధూనన మొప్పగ తాపపు
  వాన కురియు నెండు గడ్డివామున్ వేగన్

  ప్రత్యుత్తరంతొలగించు
  ప్రత్యుత్తరాలు
  1. ఫణికుమార్ గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   ‘ధూనన’...?

   తొలగించు
  2. గురువుగారూ ధూననము అంటే గాలి అనే అర్థంలో రాశాను.

   తొలగించు