30, జులై 2016, శనివారం

సమస్య - 2102 (వ్యర్థ మొనరింపఁ దగును...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...

వ్యర్థ మొనరింపఁ దగును సంపదల బుధులు.

88 కామెంట్‌లు:

 1. స్వార్థ జనులకు సంపద వ్యయము సేయ
  వ్యర్థము గుడికి వ్యర్థము బడికి వ్యర్థ
  మే యగును దాన ధర్మము లీ తెఱగున
  వ్యర్థ మొనరింపఁ దగును సంపదల బుధులు!!

  రిప్లయితొలగించు
  రిప్లయిలు
  1. జిగురు వారూ,
   పూరణ బాగుంది. కాని భావం కొంత సందిగ్ధార్థంలో ఉందనిపించింది. వివరిస్తారా?

   తొలగించు
  2. గురువు గారు,
   స్వార్థపరుల దృష్టిలో గుడికి, బడికి, దాన ధర్మములకు ఖర్చు చెయ్యడము వ్యర్థము. స్వార్థపరుల దృష్టిలో ఏది వ్యర్థమో, అటువంటి వ్యర్థమైన పనులు చెయ్యడము బుధులకు తగినది. అనగా బుధులకు గుడికి, బడికి, దాన ధర్మములకు ఖర్చు చెయ్యడము తగినది అని భావము.

   తొలగించు
  3. ఇప్పటికి మీ పూరణలోని (విరోధాభాస) భావం అవగతమయింది. ధన్యవాదాలు.

   తొలగించు
 2. స్వార్ధ భావము జూపక బండితులు స
  మర్ధ జీవనమందలి మంచి చెడుల
  కర్ధము తెలిపె జనులకు, కాల మంత
  వ్యర్థ మొనరింపఁ దగును సంపదల బుధులు.

  రిప్లయితొలగించు
  రిప్లయిలు
  1. మల్లేశ్వర రావు గారూ,
   పూరణ బాగుంది. భావాన్ని కాస్త వివరిస్తారా?

   తొలగించు
  2. నేను సంపదల బుధులు అనగా మన పురాణాలను తెలిపే /మంచి భోదించే పండితులుగా తీసుకున్నానండి. వారి పాండిత్యమును తెలుపుటకై అమూల్యమైన సమయాన్ని వృధా చేస్తున్నా తగును అని అనుకొంటిని. అన్వయము సరిపోయిందో లేదో మీరే చూడాలి.

   తొలగించు
  3. మీ భావం ఉదాత్తంగా ఉంది. కాని అన్వయలోపం వల్ల సుగమంగా లేదు.

   తొలగించు
  4. లోపం మీది కాదు. సమస్యే అటువంటిది. అది విరుపుతో కాని క్రమాలంకార పద్ధతిలో కాని పూరించడానికి అవకాశం ఉంది. చివరిపాదంగా పూరించిన అందరి పూరణలు అన్వయలోపంతోనో, సంక్లిష్ట భావంతోనో ఉన్నాయి.

   తొలగించు
  5. మీ వ్యాఖ్యలకు పరిశీలనకు దన్యుడ్ని.

   తొలగించు

 3. మోక్ష ప్రాప్తిని కోరుచు దీక్ష బూని
  తపము జేయుచు తరియించ తనరు మదిని
  నిహము నందలి సుఖముల నహము వీడి
  వ్యర్ధ మొనరింపఁ దగును సంపదల బుధులు

  రిప్లయితొలగించు
 4. నారికేళపు నీరుగానాను ధనము
  పోవునప్పుడు చెప్పునేభూరిమహిమ
  ఇప్పుడిక్కడేకృపజూపిఈవి బెంచ
  .......................Dr.Pitta Satyanarayana

  రిప్లయితొలగించు
  రిప్లయిలు
  1. పిట్టా వారూ,
   బాగుంది మీ పూరణ. భావాన్ని వివరిస్తారా?

   తొలగించు
  2. ఆర్యా
   ఆంగ్లంలో కాలేజినుండి ఫంపాను.చేరలేదు.
   అర్థపురాక పోకలుఓ మిస్టరీ.అనర్థానకిదారితీసే దికావునవ్యర్థం చేయాలి.మోక్షం కావాలంటే దేవుడు మొదట ధనం లేకుండ చేస్తానంటాడు.ఆపనిని ఇపుడేచేయాలని సందేశం.త్యాగాన్ని పెంచాలి.వ్యర్థాన్ని మైనస్గాతీసుకున్నానుdr.p.satyanarayana te

   తొలగించు
  3. ఆర్యా
   ఆంగ్లంలో కాలేజినుండి ఫంపాను.చేరలేదు.
   అర్థపురాక పోకలుఓ మిస్టరీ.అనర్థానకిదారితీసే దికావునవ్యర్థం చేయాలి.మోక్షం కావాలంటే దేవుడు మొదట ధనం లేకుండ చేస్తానంటాడు.ఆపనిని ఇపుడేచేయాలని సందేశం.త్యాగాన్ని పెంచాలి.వ్యర్థాన్ని మైనస్గాతీసుకున్నానుdr.p.satyanarayana te

   తొలగించు
 5. నిరత సుఖముల కోసమై పరుగు లిడుట
  వ్యర్థ, మొనరింప దగును సంపదల బుధులు
  మెతుకు దొరకక నిత్యమీ క్షితిని దిరుగు
  దీనజనముల సేవను మానకుండ.
  (హ.వేం.స.నా.మూర్తి)

  రిప్లయితొలగించు
  రిప్లయిలు
  1. సత్యనారాయణ మూర్తి గారూ,
   మీ పూరణ అర్థవంతమై బాగున్నది. అభినందనలు.

   తొలగించు


 6. వ్యర్థమొనరింప దగును సంపదల బుధులు
  అర్థముల పరమావధి యందు మదిని
  సలుపక సమయ మంతయు సమర మనగ
  ధనము మూలము మన జగత్తంత యుండ !

  జిలేబి

  రిప్లయితొలగించు
  రిప్లయిలు
  1. జిలేబీ గారూ,
   పద్యం బాగుంది. కాని పూరణలోని భావం అవగాహన కాలేదు.

   తొలగించు
 7. ధర్మ పథమును విడకుండ ధనము నెల్ల
  దీనజనుల శ్రేయమ్ముకై దానమిడుచు
  పాత్ర తనెఱంగి పాటిగా వసుధ యందు
  వ్యర్థమొనరింప దగును సంపదల బుధులు

  దైవచింతన లేకుండ దానమిడక
  ధనము భోగములను గోరి ధరణి దగదు
  వ్యర్థ మొనరింప, దగును సంపదల బుధులు
  దీన జనుల శ్రేయముగోరి దానమిడగ

  రిప్లయితొలగించు
  రిప్లయిలు
  1. విరించి గారూ,
   మీ రెండవ పూరణ అన్ని విధాల బాగున్నది.
   మొదటి పూరణలో దానం వ్యర్థమెలా అవుతుంది?

   తొలగించు
  2. గురువు గారికి ధన్పవాదములు .......దానము చేసినపుడు దాతకది.వ్యయమై అతని స్వప్రయోజనాలకు అవసరపడక వ్యర్థమై పోతుందనే భావనతో వ్రాసానండి

   తొలగించు
  3. కాని మీరు చెప్పిన భావం పద్యంలో ద్యోతకం కాలేదు.

   తొలగించు
 8. నల్ల ధనమునార్జించెడు నరుల బట్టి
  యట్టి సొమ్ముపై వారల హక్కు లన్ని
  వ్యర్థమొనరింప దగును! సంపదుల బుధులు
  తీర్చి దిద్దుచు వెలిగింత్రు దేశ ప్రగతి!

  రిప్లయితొలగించు
 9. ఈరోజు నాకేమయింది? కొందరు మిత్రుల పూరణలు రెండు మూడు సార్లు చదివినా అవగాహన కావడం లేదు. పూరణలలో ఏదో లోపం ఉన్నట్టు భావన. ఆ లోపమేమిటో తెలియడం లేదు.
  పుణ్యకార్యాలు చేయడం సంపదలను వ్యర్థం చేయడం కాదు కదా!

  రిప్లయితొలగించు
  రిప్లయిలు
  1. అది మీ లోపం కాదు గురువు గారూ. సమస్య లోని క్లిష్టత అర్థవంతమైన పూరణ చేయడానికి అడ్డుపడుతోంది.

   తొలగించు
  2. ముఖ్యంగా సమస్యను పద్యం చివరి పాదంలో ఉంచి పూరించాలంటే.

   తొలగించు

  3. కంది వారు

   ఆ పాదం లో "దగును" మరీ దగా చేసెస్తోందండీ :)

   ఎట్లా వేసినా ఆ "దగును" దగ్గరికి వచ్చేసరికి అర్థం అటకెక్కేస్తోంది :)

   జిలేబి

   తొలగించు
  4. నేనుకూడా (విరుపు లేకుండా సమస్యను చివరిపాదంగా ఉంచి) పూరిద్దామని ప్రయత్నించి విఫలమయ్యాను!

   తొలగించు
 10. రాబడులెరుగ లేనట్టి రంగములకు
  నిధుల సమకూర్చి మళ్లించి నేతలెల్ల
  వ్యర్థమొనరింపఁ, దగును సంపదల బుధులు
  సఫలమందెడి సలహాలు తెలిపినంత

  రిప్లయితొలగించు
 11. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

  రిప్లయితొలగించు
  రిప్లయిలు
  1. మనసు నందున నిలుపని మాట లవియ
   వ్యర్థ మొనరింప దగును సంపదల బుధులు,
   బాధ్యత నెరింగి నందర బాగు జేయ
   ప్రగతి గాంచగ వలెనిక సుగతి పథము!
   (వ్యర్థము,+ఒనరింప)

   తొలగించు
  2. శిశ్ట్లా వారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.

   తొలగించు
 12. కఠిన హృదయుల మెప్పించు గార్య మరయ
  వ్యర్ధ,మొనరింప దగును సంపదల బుధులు
  నర్హులకు మాత్రమే చెందు నటుల నెపుడు
  సార్ధ కంబగు నయ్యది సఫల మగును

  రిప్లయితొలగించు
 13. క్లిష్టమౌ సమస్యను దెచ్చి శ్రేష్ఠమైన
  పూరణను జేయమనిన మాబోంట్ల కగునె
  ఖర్చు వ్యర్థము కాదంద్రు కాని యెట్లు
  వ్యర్థమొనరింప దగును సంపదల బుధులు?

  రిప్లయితొలగించు
  రిప్లయిలు
  1. మిస్సన్న గారూ,
   ఇచ్చునప్పుడు తోచలే దిది కఠిన మ
   టంచు, మిత్రుల పూరణా లరసినపుడు
   బోధపడినది, మీకింత బాధ లేక
   సాధ్యపడె పూరణమ్ము మిస్సన్న గారు!

   తొలగించు
  2. గురువుగారూ,ఈ సమస్య గతంలోనూ యిచ్చిన గుర్తు.

   తొలగించు
  3. మీ వ్యాఖ్యను చూసి నేను బ్లాగులో వెదికాను. దొరకలేదు.

   తొలగించు
  4. వేంకట సుబ్బ సహదేవుడు గారు 20/4/2016 నాటి సమస్య: "వ్యర్థ మొనరింపఁ దగును సంపదల నెల్ల"

   సర్వ భూతార్తియై సాగుచు నప
   రిమితముగ గాక వ్యయమొనరింపగం, గృ
   పారసము మది ప్రసరింపఁ, బాప ఫలము
   వ్యర్థ మొనరింపఁ దగును సంపదల నెల్ల

   తొలగించు
 14. సర్వ సంగ పరిత్యాగు లుర్వి సర్వ
  భూత హిత రతాత్ములు నవధూత వరులు
  దీన జన పోషణార్థమ, దానఁ గాక
  వ్యర్థ , మొనరింపఁ దగును సంపదల బుధులు.

  రిప్లయితొలగించు
  రిప్లయిలు
  1. దుష్టజనసేవ, రక్షణ దుఃఖితులకు,
   గర్వహీనత, యమర లోక విలసితులు
   క్రమమునఁగుదురీ క్రింది చక్కని పదములు
   వ్యర్థ, మొనరింపఁ దగును, సంపదల, బుధులు.

   తొలగించు
  2. కామేశ్వర రావు గారూ,
   మీ మొదటి పూరణ కొద్దిగా తికమక పెట్టినా రెండు మూడు సార్లు చదివాక బోధపడింది (అని అనుకుంటున్నాను)!
   ఇక క్రమాలంకారంలో మీ రెండవ పూరణ ఉత్తమంగా ఉంది.
   మీకు అభినందనలు.

   తొలగించు
  3. పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. ధన్యవాదములు.
   ఈ పదవిభజన భావమును ప్రస్ఫుటము చేయునని భావించు చున్నాను.
   సర్వ సంగ పరిత్యాగు లుర్వి సర్వభూత హిత రతాత్ములు నవధూత వరులు బుధులు
   దీన జన పోషణార్థమ సంపదల (నొ) ఒనరింపఁ దగును. దానఁ గాక వ్యర్థము

   తొలగించు
  4. నేను అర్థం చేసుకున్నదీ అదేనండీ!

   తొలగించు
  5. పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. ధన్యవాదములు.

   తొలగించు
 15. గు రు మూ ర్తి ఆ చా రి
  ,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

  ఇట్టె బయటికి౦ జని కాలు పెట్టగానె
  బెల్లముపయి నీగలు వ్రాలు విధము గాను
  చుట్టుముట్టుచు మనలను పట్టుకొ౦ద్రు
  వివిధవేషము ల౦దున బిచ్చగా౦డ్రు
  ………………………………………
  దొ౦గభక్తులు ర౦గుల దుస్తు లూని
  య౦గనలు కూనలను వైచి కొ౦గు ల౦దు

  :::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::


  యాచకుల కవురా తెల్వి హద్దు మీరె !

  యట్టి వారికి చేయు సహాయ మెల్ల

  వ్యర్థ | మొనరి౦ప దగును స౦పదల బుధులు

  దానధర్మక్రియలను , పాత్రత నెరి౦గి

  ( బుధులు తమ స౦పదలచే దానదర్మక్రియలను ఒనరి౦ప దగును )
  ి

  రిప్లయితొలగించు
 16. ధర్మపథమును వీడిన ధనికు డెవడు
  బాధపడడు భోగాలకై భాగ్యమంత
  వ్యర్థ మొనరింప, దగును సంపదల బుధులు
  భావితరముల వారికై పదిలపరచ

  రిప్లయితొలగించు
 17. నాది యనలేని బడుగు లనాదులున్న?
  వృద్దు లాశ్రమములుబెంచు వృద్ధి మాన్ప
  వలదు వలదని వారించు తలపులున్న
  వ్యర్థమొనరింప దగును సంపదల బుధులు.
  2.వెట్టిచాకిరి,పోకిరి కట్టుబాట్లు
  వ్యర్థ మొనరింప దగును”సంపదల బుధులు
  సర్వమానవ శ్రేయస్సు సాగునట్లు
  నేటి సంస్కృతి నిలుపంగ చాటవలయు.
  3కలిమి కంటెను చదువుల కాంక్ష లేని
  మూడ తత్వంబు మాన్పక మూగ గున్న?
  వ్యర్థ మొనరింప దగును|సంపదల బుధులు
  కష్ట జీవికి సాయంబు పుష్టి గాద?

  రిప్లయితొలగించు
  రిప్లయిలు
  1. ఈశ్వరప్ప గారూ,
   మొదటి పూరణ కొంత అన్వయలోపం ఉన్నట్టనిపించినా మిగిలిన రెండు బాగున్నవి. అభినందనలు.

   తొలగించు
 18. అహముతో గర్వించి సహవాసులను జేరి
  ……………..పరుషమౌ వాక్యాలు పలుకుచుండి
  సంఘవిద్రోహులై సంచరించెడివారి
  ……………..యత్నంబులను గాంచి యనుదినంబు
  సన్మార్గగములైన సజ్జనావళి యేమి
  ……………..చేయుట యుక్తమీ క్షితిని జెపుడు?,
  దారిద్ర్యబాధతో తాళలే కున్నట్టి
  ……………..వారల కెవ్వాని బంచవలయు?
  సద్వివేకంబు చూపుచు సర్వ విషయ
  సార మందించు చుండెడి వారి నేమి
  యనగ జెల్లును భువిలోన? నందురేని
  వ్యర్థ మొనరింపదగును, సంపదల, బుధులు.
  (హ.వేం.స.నా.మూర్తి)

  రిప్లయితొలగించు
  రిప్లయిలు
  1. భక్తి, విశ్వాసముల్, శ్రద్ద ప్రబల జేసి,
   దుర్జనుల దుర్గుణమ్ములు తొలగుటకును
   వ్యర్ధ మొనరింపదగును సంపదల, బుధులు,
   పరమహంసలు తెలిపిన వాకులివియె

   తొలగించు
  2. హరి వేంకట సత్యనారాయణ మూర్తి గారూ,
   సీసపద్యంలో సుదీర్ఘంగా క్రమాలంకారంలో మీరు చెప్పిన పూరణ ప్రశస్తంగా ఉంది. అభినందనలు.

   తొలగించు
  3. హ.వేం.స.నా.మూర్తి గారు చక్కటి పూరణ. అభినందనలు. వారల కేమిల బంచవలయు? అనిన "సంపదల" కన్వయము మరింత బాగుండునేమో? పరిశీలించండి.

   తొలగించు
  4. ఆర్యా!
   ఉభయులకు ధన్యవాదములు.
   మొదట "వారల కేమిల" అను విధముగానే అనుకొని "సంపదల"ని బహువచనమగుటచే "వానిని" బాగుండునేమో అని వ్రాయుట జరిగినది. సవరణాత్మక సూచనకు ధన్యవాదములు.

   తొలగించు
  5. సీసపద్యము చాలా బాగున్నదండి.

   తొలగించు
 19. స్వార్థ పూరిత జీవన సరణినెపుడు
  వ్యర్థమొనరింపదగును,సంపదల బుధులు
  సాంఘికోన్నతి నిరతంబు సలుపుచుండి
  సార్థకముజేయ పరమాత్మ సంతసించు.

  రిప్లయితొలగించు
 20. మూర్ఖులమనసు రంజింప బూనుకొనుటె
  వ్యర్థ,మొనరింపదగును సంపదల బుధులు
  దైవ కార్యాల నొనరించి,ధర్మ బద్ధ
  జీవనాత్ముల వృద్ధికి జేయికలిపి.

  రిప్లయితొలగించు
  రిప్లయిలు
  1. పొన్నెకంటి వారూ,
   మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.

   తొలగించు
 21. పదుగురెదుటను చేసిన ప్రతిన నెరిగి
  మాట నిలబెట్టుకొనునట్టి మతముతోడ
  వ్యర్థమొనరింపఁదగును సంపదల, బుధులు
  వ్యవహరింతురు సంతత మట్టి పగిది

  రిప్లయితొలగించు
 22. విద్య, వినయంబొసంగెడి వేల్పు గురువు
  గాయకుడు బంచును వినోద గాయన రస
  మరయఁ సాహిత్య సౌరభ మడరుచును క
  వ్యర్థ మొనరింపఁ దగును సంపదల బుధులు||

  రిప్లయితొలగించు
  రిప్లయిలు
  1. రఘురామ్ గారూ,
   పూరణ ఉత్తరార్ధం అర్థం కాలేదు. 'క వ్యర్థము'..?

   తొలగించు
  2. పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. కవి+అర్థము కవుల ప్రయోజనమున కని వారి భావమనుకుంటాను.

   తొలగించు
  3. కవ్యర్థము అంటే క గురువై గణదోషం.

   తొలగించు
  4. పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. అవునండి అదే ఆయన భావమైతే గణదోషమే.

   తొలగించు
  5. అయ్యో నిజమే గురువుగారూ, కామేశ్వర రావుగారు, సంధి అధ్బుతంగా పడింది కదా అని అనుకుంటూ, చివరి గురువు అస్సలు గమనించలేదు. నాదే తప్పు. సరిదిద్దాలంటే నేను నా సమస్య పూరించే తీరు మార్చాలి. ఇది లెక్కలోకి తీసుకోవద్దు, క్షమించండి.

   తొలగించు
  6. ఇక్కడ నాల్గవ పాదం లో అర్థం అన్నది డబ్బు, సంపద అని తీసుకున్నాను. ఎవరి సేవ వారు వారి విద్య/కళ ద్వారా సమాజానికి ఇస్తారు అని నా భావన.

   తొలగించు
 23. అర్థ సముపార్జనము జేయ ననుచితముగ
  వ్యర్థ మొనరింపఁ దగును; సంపదల బుధులు
  సతత మానంద సంద్రాన సాగురీతి
  సర్వజీవుల కందించి సంతసింత్రు

  రిప్లయితొలగించు
  రిప్లయిలు
  1. కృష్ణారావు గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   ప్రథమార్థంలో భావం పూర్తిగా ఆవిష్కరించినట్లు లేదు.

   తొలగించు
 24. తాను గూడబెట్టు ధనము తనది గాదు
  తాను దానము జేసెడు ధనమె తనకు
  మోక్ష ప్రాప్తిని గల్గించు సాక్షి గాన
  దీనజనులను గావగ దివ్యముగను
  వ్యర్ధమొనరింపఁ దగును సంపదల బుధులు!!!

  రిప్లయితొలగించు
  రిప్లయిలు
  1. శైలజ గారూ,
   పూరణ బాగున్నది. కాని దీనజనులకు ఇచ్చేది వ్యర్థ మెలా అవుతుంది?

   తొలగించు
 25. మిత్రులందఱకు నమస్సులు!

  లౌకికపు సంపదల బుధు లాదరింపఁ
  బరమునకుఁ బోవు దారియే వ్యర్థమగున
  టంచుఁ దలఁచి, తా మెప్పుడుఁ దఱచి తఱచి

  వ్యర్థ మొనరింపఁ దగును సంపదల బుధులు!

  రిప్లయితొలగించు
  రిప్లయిలు
  1. మధుసూదన్ గారూ,
   లౌకిక సంపదలను వ్యర్థం చేయవచ్చునంటారు. బాగుంది మీ పూరణ. అభినందనలు.

   తొలగించు
  2. పరము కొఱకు నిహ సంబంధమైన సంపదలఁ ద్యజించుట సహజమే గదా శంకరయ్యగారూ! ధన్యవాదములు!

   తొలగించు

 26. అక్రమముగ నార్జించిన యఅస్తి నెల్ల
  వ్యర్థ మొనరింపదగును సంపదలు బుధులు
  సద్వినిమయము చేయంగ సార్థకతయు
  కలుగు మెత్తురు జనములు కడవరకిల

  రిప్లయితొలగించు
 27. నిన్నటి నాపూరణను గురుదేవులు సమీక్షించ లేదు
  సమీక్షించ ప్రార్ధన

  భక్తి, విశ్వాసముల్, శ్రద్ద ప్రబల జేసి,
  దుర్జనుల దుర్గుణమ్ములు తొలగుటకును
  వ్యర్ధ మొనరింపదగును సంపదల, బుధులు,
  పరమహంసలు తెలిపిన వాకులివియె

  రిప్లయితొలగించు


 28. G P Sastry (gps1943@yahoo.com)సెప్టెంబర్ 22, 2018 4:15 PM

  కొంత బీడి నస్యములకు నింత దాచి
  కొంత పేకలు సినిమాల కింత దోచి
  యిల్లరికపు టత్తయ్యవి నింపు గాను
  వ్యర్థ మొనరింపఁ దగును సంపదల నెల్ల :)

  రిప్లయితొలగించు
  రిప్లయిలు

  1. అద్భుతః

   కోట వారి గతంలో ఇది వరదలు దొక్కటం ఖాయం. వారిని అడిగి చూడండి పాడమని


   జిలేబి

   తొలగించు