12, జులై 2016, మంగళవారం

సమస్య - 2084 (జబ్బలు దాఁ జఱచి...)

కవిమిత్రులారా, 
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది... 
జబ్బలు దాఁ జఱచి యబ్బి జబ్బుల నుబ్బెన్.
(ఈ సమస్యను పంపించిన పోచిరాజు కామేశ్వర రావు గారికి ధన్యవాదాలు)

57 కామెంట్‌లు:

  1. రిప్లయిలు
    1. డబ్బులు హెచ్చుగ చేరగ
      యిబ్బడి ముబ్బడి మదమున నింగితమణిగెన్
      దబ్బున నబ్బెను గబ్బులు
      జబ్బలు దాఁ జఱచి యబ్బి జబ్బుల నుబ్బెన్!!

      తొలగించండి
    2. సత్యనారాయణ గారూ,
      మీ పూరణ బాగున్నది.
      ‘చేరగ నిబ్బడి... మణగెన్’ అనండి.

      తొలగించండి
  2. ఉబ్బుచు తబ్బిబ్బగు చును
    డబ్బులలో మునిగి తేలి డంభము లందున్
    గుబ్బలు విరుచుకు దిరిగిన
    జబ్బలు దాఁ జఱచి యబ్బి జబ్బుల నుబ్బెన్

    రిప్లయితొలగించండి


  3. శుభోదయం

    బలసంవర్ధిని జిలేబి జావా ప్రకటనల చూసి బాగా గొనిన అబ్బడు అస్పతాలు జేరెన్ :)



    అబ్బును మీకున్ మెండుగ
    జబ్బల బలముల్ జిలేబి జావను గొనుమా !
    అబ్బడు గొనెబో దండిగ,
    జబ్బలు దాఁ జఱచి యబ్బి జబ్బుల నుబ్బెన్ :)

    జిలేబి

    రిప్లయితొలగించండి
  4. సుబ్బీ! నీ నుననున్నని
    జబ్బలఁ దాకంగ లేని జన్మెందుకనన్!
    డబ్బులతో రా! రమ్మన!!
    జబ్బలుఁ దాఁ జఱచి యబ్బి జబ్బుల నుబ్బెన్!!!

    రిప్లయితొలగించండి
  5. అబ్బురపరిచే రీతిన్
    పబ్బము గడిపెన్ వెరవక పడుపుది తోడున్
    ఉబ్బరమబ్బిన నడతన్
    జబ్బలు దాఁ జఱచి యబ్బి జబ్బుల నుబ్బెన్||

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. రఘురామ్ గారూ,
      మీ పూరణ బాగున్నది.
      ‘పరిచే’ అనడం వ్యావహారికం. ‘పరచెడు’ అనండి.

      తొలగించండి
  6. మిత్రులందఱకు నమస్సులు!

    "అబ్బబ్బొ యెన్ని డబ్బులు
    మబ్బులఁ దాఁకంగఁ బెరిఁగె మాయింట నహా
    యబ్బెం ఘాస" మ్మని తిని

    జబ్బలఁ దాఁ జఱచి యబ్బి జబ్బుల నుబ్బెన్!

    రిప్లయితొలగించండి
  7. దబ్బున నెత్తగుదు ననుచు
    డబ్బులు,మోకాళ్లు పోయి డంగై మంచం
    బబ్బెను సుబ్బారావుకు!
    జబ్బలఁ దాఁ జఱచి యబ్బి జబ్బుల నుబ్బెన్!

    రిప్లయితొలగించండి
  8. అబ్బులు దూసుకు బోయెను
    జబ్బలు దా జఱచి, యబ్బి జబ్బుల ను బ్బె న్
    గబ్బున రోగము ముదరగ
    న బ్బుర ముగ నుండె నొడలు నాయతరీతిన్

    రిప్లయితొలగించండి
  9. అబ్బబ్బా వానిని గను
    జబ్బలు దా జఱచి యబ్బి జబ్బుల నుబ్బెన్
    అబ్బుర మేమీ గాదిది
    రబ్బా యిటువంటి వార లటులే యుండున్!

    రిప్లయితొలగించండి
  10. మబ్బులు కురియగ మలినపు
    దిబ్బలపై పడుచు నుబ్బు తీరున పొడమెన్
    గుబ్బల ఝర్ఝర గూడిన
    జబ్బలుఁ దాఁ జఱచి యబ్బి జబ్బుల నుబ్బెన్!!!


    రిప్లయితొలగించండి
  11. ఇబ్బడి ముబ్బడి డబ్బుల
    దబ్బున నిబ్బరము నబ్బఁ దబ్బిబ్బగుచుం
    బ్రబ్బిన పబ్బము గబ్బవ
    జబ్బలు దాఁ జఱచి యబ్బి జబ్బుల నుబ్బెన్.

    [పబ్బము = ఉత్సవము]


    అబ్బాయి యేగి పట్నము
    మబ్బులు గ్రమ్మి కురిసిన గమక వర్షమునం
    డబ్బురముగ నాడి తడువ
    జబ్బలు దాఁ జఱచి యబ్బి జబ్బుల నుబ్బెన్.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కామేశ్వర రావు గారూ,
      మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
      మొదటి పూరణలోని వృత్త్యనుపాస కర్ణపేయంగా ఉంది.
      ‘వర్షమునం దబ్బురముగ’ అన్నదానికి డబ్బురముగ అని టైపాటా? లేక విశేషార్థం ఏమైనా ఉన్నదా?

      తొలగించండి
    2. పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. ధన్యవాదములు. పొరపాటున “ద” కు బదులు “డ” పడింది. క్షమించండి.

      అబ్బాయి యేగి పట్నము
      మబ్బులు గ్రమ్మి కురిసిన గమక వర్షమునం
      దబ్బురముగ నాడి తడువ
      జబ్బలు దాఁ జఱచి యబ్బి జబ్బుల నుబ్బెన్.

      తొలగించండి
  12. అబ్బురబరచెడి రోగము
    నిబ్బరమెంచకను వైద్య నియమములం
    దబ్బా|డబ్బుకు తండ్రియు,
    జబ్బలుదాజఱచి యబ్బి జబ్భుల నుబ్బెన్|

    రిప్లయితొలగించండి
  13. అబ్బబ్బ పబ్బమని దలచి
    సుబ్బడు గుబ్బెతలజేరి సుఖములబొంందన్
    సుబ్బియదేమని యడుగగ
    జబ్బలదాజరచి యబ్బి నుబ్బెనుజబ్బున్ .

    ప్రబ్బిన సంంతోషంంబున
    సుబ్బడువాడెన్ విశేషశోధనతోడన్
    సబ్బును క్రొత్తది సొగసని
    జబ్బల దాజరచి యబ్బి నుబ్బెను జబ్బున్ .

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సూర్యనారాయణ గారూ,
      మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
      మొదటిపూరణ మొదటిపాదంలో గణదోషం. ‘అబ్బబ్బ పబ్బ మనుచును’ అనండి.

      తొలగించండి
    2. సూర్యనారాయణ గారు నమస్సులు. మీరు దత్త సమస్యా పాదమును మార్చి వ్రాసారు. మార్చిన పాదములో యతి భంగము కూడా యయినది. గమనించండి.

      తొలగించండి
    3. కామేశ్వర రావు గారూ,
      నేను గమనించలేదు. ధన్యవాదాలు.

      తొలగించండి
  14. శంంకరయ్య గారికి.. "దబ్బున" అను పదంం గ్రాంంథికమేనా? సంందేహంం తీర్చగలరు.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. దబ్బున - దేశ్యము, క్రియావిశేషణము = శీఘ్రముగా... అని శబ్దరత్నాకరం చెప్తున్నది. ఉదాహరణగా ఇచ్చిన వాక్యం వ్యావహారికమే. పూర్వకవి ప్రయోగాలు దొరకలేదు. (చూడండి.. బ్లాగులో కుడివైపున ఉన్న ‘ఆంధ్రభారతి నిఘంటుశోధన’.

      తొలగించండి
    2. సంందేహము తీర్చినంందులకు కృృతజ్ఞతలు శంంకరయ్యగారు.

      తొలగించండి
    3. దబ్బున = శీఘ్రముగ
      కం. గుబ్బలి ద్రిమ్మరి సింగమ, దబ్బఱ రక్కసుఁడు నన్గొదవ వల్కుటయున్, దబ్బున వింటివి గద యిది, గొబ్బున నీ వరిగి దొరకు గుఱుతుగఁ జెపుమా. అచ్చ.రా.సుం.87.
      కం. గొబ్బున లేచి బుజంబులు, దబ్బునఁ జఱచుకొని .... నీలా.3.62.

      తొలగించండి
  15. అబ్బబ్బ పబ్బమని దలచి
    సుబ్బడు గుబ్బెతలజేరి సుఖములబొంందన్
    సుబ్బియదేమని యడుగగ
    జబ్బలదాజరచి యబ్బి నుబ్బెనుజబ్బున్ .

    ప్రబ్బిన సంంతోషంంబున
    సుబ్బడువాడెన్ విశేషశోధనతోడన్
    సబ్బును క్రొత్తది సొగసని
    జబ్బల దాజరచి యబ్బి నుబ్బెను జబ్బున్ .

    రిప్లయితొలగించండి
  16. డబ్బుడాబునమదముతొ
    సుబ్బడు తాగుడు మొదలిడిసుఖమనుకోగా
    ఉబ్బులకామెర్లుతగిలి
    జబ్బలదాడజఱచియబ్బిజబ్బుల నుబ్బెన్

    నేటి సమస్యాపూరణం

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. శ్రీరామ్ గారూ,
      మీ పూరణ బాగున్నది.
      మొదటిపాదంలో గణదోషం (డబ్బుడా - రగణం వచ్చింది). ‘డబ్బుల డాబున ముదమున’ అనండి. తో ప్రత్యయాన్ని హ్రస్వంగా ప్రయోగించరాదు. ‘అనుకోగా’ అనడం వ్యావహారికం. ‘అనుకొనగా’ అనండి.

      తొలగించండి
  17. ఇబ్బడి ముబ్బడి డబ్బులె
    క్లబ్బులు మరి పబ్బు వెబ్బులను గబ్బులతో
    నబ్బాయిలబ్బురపరచ
    జబ్బలు దాఁ జఱచి యబ్బి జబ్బుల నుబ్బెన్.

    2.
    అబ్బో! యేమా ఘుమఘుమ
    లిబ్బడి ముబ్బడి మసాల లేసిన వంటల్
    గబ్బైననింపనుచు దిన
    జబ్బలు దాఁ జఱచి యబ్బి జబ్బుల నుబ్బెన్.

    3.
    నిబ్బద్ది యన్నది మరచి
    తబ్బుబ్బై పోయినేడు దాబా లందున్
    డబ్బుల తగలేసి తినగ
    జబ్బలు దాఁ జఱచి యబ్బి జబ్బుల నుబ్బెన్.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు


    1. విరించి వారి రెండో పద్యం ధమాకా !


      చీర్స్
      జిలేబి

      తొలగించండి
    2. విరించి గారూ,
      మీ పూరణలు బాగున్నవి. అభినందనలు.

      తొలగించండి
    3. గురువు గారికి జిలేబి గారికి ధన్యవాదములు

      తొలగించండి
  18. అబ్బుర మొందగ ధీరుడు
    సుబ్బయ్యకు కుస్తి యాట శుభమొనరింపన్!
    పబ్బముగా భావించుచు
    జబ్బలు దాజఱచి యబ్బి జబ్బుల నుబ్బెన్!

    రిప్లయితొలగించండి
  19. డబ్బులు చేరగ చెంతను
    మబ్బులు కమ్మినయటువలె మనుజుల కన్నుల్
    దబ్బున మూసుకు పోయెను
    జబ్బులు దా జరచి యబ్బి జబ్బుల నుబ్బెన్.

    రిప్లయితొలగించండి
  20. గౌౌరవనీయులు కామేశ్వర రావు గారికి నమశ్శతములు..పదములు వ్యత్యస్తములైై యతిభంంగమైైనది.పొరబాటునకు క్షంంతవ్యుడను.సూచనకు కృృతజ్ఞుడను.

    రిప్లయితొలగించండి
  21. డబ్బులు వర్తకమునగొని
    తబ్బిబ్బై మనసునందు, తరుణుల చెంతన్
    పబ్బమునుగడుపుకొనుచును
    జబ్బలు దాఁజఱచి యబ్బి జబ్బుల నుబ్బెన్

    రిప్లయితొలగించండి
  22. బెబ్బులి వలె దా దిరుగుచు
    నుబ్బిన జబ్బలను జూపి యువతుల బట్టన్
    దెబ్బలకు గబ్బిలమ్మయె
    జబ్బలు దాఁ జఱచి యబ్బి జబ్బుల నుబ్బెన్.

    రిప్లయితొలగించండి
  23. మబ్బులు గ్రమ్మగ మనసుకు
    సుబ్బరముగ దిరిగె నంట సుదతుల వెంటన్
    దిబ్బయె సంసా రమ్మిటు
    జబ్బలు దాఁ జఱచి యబ్బి జబ్బుల నుబ్బెన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అక్కయ్యా,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      ‘సుబ్బరము’ సాధుప్రయోగం కానట్టుంది!

      తొలగించండి
  24. అబ్బులు డబ్బుల కొరకై
    సబ్బుల వర్తకము గొనుచు సబ్బిడి నుండన్
    డబ్బులు ముబ్బడి కురవగ
    జబ్బలు దాఁ జఱచి యబ్బి జబ్బుల నుబ్బెన్

    రిప్లయితొలగించండి
  25. ఉబ్బెను డబ్బులు దొరకగ
    నిబ్బరముగ రోడ్ల పైన నిలచియు వేడ్కన్
    దబ్బున తినియున్ గొప్పగ
    జబ్బలు దాఁ జఱచి యబ్బి జబ్బుల నుబ్బెన్.

    రిప్లయితొలగించండి