3, జులై 2016, ఆదివారం

సమస్య - 2077 (రక్తం బంచును నిర్మలోదకముల...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
“రక్తం బంచును నిర్మలోదకములన్ ద్రావంగ భీతిల్లెఁ దాన్”
(ఒకానొక అవధానంలో గరికిపాటి వారు పూరించిన సమస్య ఇది)
లేదా...
“రక్త మని నిర్మలాంబువుల్ ద్రాగ వెఱచు”

78 కామెంట్‌లు:

  1. మిత్రు నింటను మర్యాద మెరయు నెరుపు
    గ్లాసు నిండుగ నీటిని వాసి గాను
    కారు చీకటి ముసరగ కాన రాక
    రక్త మనినిర్మ లాంబువుల్ ద్రాగ వెఱచు


    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అక్కయ్యా,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      ‘నెరుపు’...?

      తొలగించండి
    2. రాజేశ్వరి గారూ...శంకరయ్య గారూ...నమస్సులు!
      > మెరయు నెరుపు...మెరయు(న్/ను) + ఎరుపు...కావచ్చు!
      దీనిని... మెరయన్ + ఎరుపు...మెరయ, నెరుపు ...అనిన బాగుండును.
      రెండవ పాదాన్ని... గ్లాసు నిండ నిడిరి నీరు వాసిగాను...అనండి.

      తొలగించండి
  2. యుక్తాయుక్తము వీడి క్రూర మనుజుల్ హూంకార ఘీంకార సం
    సక్తంబై యొక బక్క బంటుని విశేషంబైన ఖడ్గంబునన్
    ముక్తాయింపగ, దానిఁజూచి బెదిరెన్ పూబోడి, యాపిమ్మటన్
    రక్తం బంచును నిర్మలోదకములన్ ద్రావంగ భీతిల్లెఁ దాన్!!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సత్యనారాయణ గారూ,
      రక్తపాతాన్ని చూచిన కన్నులతో భ్రాంతి చెందినట్లు చెప్పిన మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  3. రక్తమని నిర్మలాంబువుల్ ద్రాగ వెఱచు
    నేమొ కాదు కాదది రక్త మేమి గాదు
    ఎరుపు రంగును గలిపిన నీరె, రుచిని
    గొలుపు నేటి కాలపు మేటి "కూలు డ్రింకు"!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. శర్మ గారూ,
      ‘కూల్‍డ్రింకు’ను గురించిన మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  4. అతిథి గాను వచ్చిన యల్లునాదరించి
    ప్రేమతోడ పలకరించె మామ యపుడు
    సరస మాడుచు చిన్నదౌ మరద లిచ్చె
    రక్త మని నిర్మలాంబువుల్ , ద్రాగ వరచె
    నతడు నిజమని తలచెనా యర్భకుండు

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. విరించి గారూ,
      మరదలి సరసంతో మీ పూరణ మనోరంజకంగా ఉంది. అభినందనలు.
      చివరిపాదంలో ‘అతడు... ఆ అర్భకుడు’ అన్నచోట పునరుక్తి. ‘అతడు నిజమని తలచి వద్దనుచుఁ బలికె’ అందామా?

      తొలగించండి
  5. ముక్తింగోరుచు తీర్ధ యాత్రలకనన్ మోదంబు నన్ బోవగా
    యుక్తాయుక్తము లెంచకుండ మునుగన్ యోగంబు నన్ దేల గా
    శక్తిన్వీ డగనీ రసించి తుదకున్ శాంతంబు గానీర మున్
    రక్తంబం చును నిర్మలోదకములన్ ద్రావంగ భీతిల్లె దాన్
    -------------------------------------------
    హమ్మయ్య కిట్టించాను ఎన్నితప్పులుంటాయో ? గురువులకు శ్రమ

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అక్కయ్యా,
      కొన్ని తీర్థాలలో నీటి కాలుష్యంవల్ల నీరు రక్తంగానే కనిపిస్తుంది. వాటిలో మునిగితే పుణ్యమేమో కాని, రోగాలు రావడం ఖాయం. ఆ విషయాన్నే మీరు ప్రస్తావించారనుకుంటాను. పూరణ బాగున్నది. అభినందనలు.
      ‘తీర్థయాత్రలకునై’ అనండి.

      తొలగించండి


  6. యేది జూచిన భయపడు నేది విన్న
    భీతి జెందును పనులన్న బెరుకు బెరుకు
    యేమి వింత జిలేబియో యెరుగ నమ్మ ,
    రక్త మని నిర్మలాంబువుల్ ద్రాగ వెఱచు !

    సావేజిత
    జిలేబి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. జిలెబీ గారూ,
      ఒకరకమైన ఫోబియా గురించి ప్రస్తావించారనుకుంటాను. పూరణ బాగున్నది. అభినందనలు.
      యడాగమంతో పద్యాన్ని ప్రారంభించడం దోషం. ‘ఏది చూచిన’ అనండి.

      తొలగించండి
  7. [7/3, 07:45] Arasha: భయము గొలిపెడి సినిమాను ప్రియము జూసి
    భీతి జెందిన పసివాడు భీరుడయ్యె
    మనుషులను గని దయ్యములనుచు తలచు
    “రక్త మని నిర్మలాంబువుల్ ద్రాగ వెఱచు”
    [7/3, 07:45] Arasha: అమరవాది రాజశేఖర శర్మ

    రిప్లయితొలగించండి
  8. అమరవాది రాజశేఖర శర్మ గారూ,
    మీ పూరణను బ్లాగులో నేరుగా ప్రకటించినందుకు సంతోషం!
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  9. కారులారీీలు ఢీకొన కాంచినతడు
    సొమ్మసిల్లెను దారిన దిమ్మదిరిగి
    భ యమునిండగ గుండెన భ్రాంతినొంది
    రక్తమనినిర్మలాంబువుల్ దాగవెఱచు

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. శ్రీరామ్ గారూ,
      వాహనప్రమాదాన్ని చూచినవాని స్థితిని గురించిన మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      ‘కాంచిన+అతడు’ అన్నపుడు యడాగమం వస్తుంది. ‘కాంచి యతడు/ కాంచి యొకడు’ అనండి. ‘గుండెను భ్రాంతినొంది’ అనండి.

      తొలగించండి
  10. దయ్య మొకటి రక్తంబును ద్రావగనెను
    సీరియలునందు చిన్నారి శ్వేత యపుడు
    జలము ద్రావంగ బూనగ కలవరమున
    రక్తమని నిర్మలాంబువుల్ ద్రాగ వెరచు
    తంగిరాల తిరుపతయ్య నెల్లూరు

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. తంగిరాల తిరుపతయ్య గారూ,
      శంకరాభరణం బ్లాగు మీకు స్వాగతం పలుకుతున్నది.
      దయ్యాల సీరియల్ చిన్నారులమీద చూపే ప్రభావాన్ని గురించిన మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  11. నిన్నటి పూరణ:

    కుండలముగ నువ్ దిరుగుచుఁ
    బండగ దినములఁ దిరుమల వాసుని శిరమున్
    బెండగిల నీని గొడుగా!
    యుండగ నీదండదండ నోర్తుము నెండన్!

    నేటి పూరణ:

    ఓ విజ్ఞాని ....

    నిర్మలమ్మైన రక్షిత నీరమనుచు
    కలుపుచు రసాయనమ్ముల, జలము నమ్మి,
    లాగు కష్టార్జిత ధనమ్ము ప్రజలఁ బీల్చు
    రక్త మని 'నిర్మ"లాంబువుల్ ద్రాగ వెఱచు!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సహదేవుడు గారూ,
      మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
      మొదటి పూరణలో ‘నువ్’ అనడం దోషమే. ‘కుండలముగ నువ్వు దిరుగ’ అందామా?
      రెండవ పూరణలో ‘నిర్మల’ అని నామవాచకంగా తీసుకుంటే ‘నిర్మల యంబువులు’ అనవలసి ఉంటుంది.

      తొలగించండి
    2. గురుదేవులకు ధన్యవాదములు.సవరించిన పూరణలను పరిశీలించ మనవి.

      కుండలముగ నువ్వు దిరుగఁ
      బండగ దినములఁ దిరుమల వాసుని శిరమున్
      బెండగిల నీని గొడుగా!
      యుండగ నీదండదండ నోర్తుము నెండన్!

      ఓ విజ్ఞాని ....

      స్వచ్ఛమైనట్టి రక్షిత పానమనుచు
      కలుపుచు రసాయనమ్ముల, జలము నమ్మి,
      లాగు కష్టార్జిత ధనమ్ము ప్రజల దైన
      రక్త మని 'నిర్మ'లాంబువుల్ ద్రాగ వెఱచు!


      తొలగించండి
  12. రక్తం ద్రావెడి క్రూర మార్గపరుడై రాకాసి యుద్ధంబున
    న్రక్తం బుంగని క్షోభ చెంది కుమిలే నశ్శోక భూపాలుడే
    రక్తం బంచును నిర్మలోదకములన్ ద్రావంగ భీతిల్లెఁ దాన్
    యుక్తం బంచును బౌద్ధ బోధనములన్ యోచించి పాటించెగా

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మంచి అంశాన్ని ఎన్నుకున్నారు పూరణకు. బాగుంది.
      ‘రక్తం’ అన్నది వ్యావహారికం. ‘రక్తంబున్ గొను..’ అనండి. ‘కుమిలే నశ్శోక’ అన్నచోట దోషమే. కుమిలేన్ +ఆ +శోక అని మీ విభాగం. కుమిలేన్ అనడం గ్రామ్యం. నేను సవరణను సూచించడానికి వీలులేకుండా ఉంది.

      తొలగించండి
    2. రక్తంబున్ గొను క్రూర మార్గపరుడై రాకాసి యుద్ధంబున
      న్రక్తం బుంగని క్షోభ చెంది కలతన్నశ్శోక భూపాలుడే
      రక్తం బంచును నిర్మలోదకములన్ ద్రావంగ భీతిల్లెఁ దాన్
      యుక్తం బంచును బౌద్ధ బోధనములన్ యోచించి పాటించెగా

      గురువుగార, మీ సూచనలకు ధన్యవాదములు. సవరించే ప్రయత్నం చేశాను.

      తొలగించండి
    3. సవరించిన పూరణ బాగుంది. కాని ‘అశోకుడు’ ఆ+శోకుడు=అశ్శోకుడు ఎలా అయ్యాడు? అశోకుడు అనే పేరు కాకుండ శోకించే భూపాలుడు అనే అర్థంలో ప్రయోగించారా?

      తొలగించండి
    4. అవును గురువుగారూ, శోకించే భూపాలుడు అనే ఉద్దేశ్యంతోనే వ్రాశాను.

      తొలగించండి
  13. పీడకలలోన రాక్షసి దాడి చేయ
    వెడగు దినము మరియు రాత్రి వెంబడించ
    బిడ్డ కరవరించుచుఁదాను వికల మదిని
    రక్తమని నిర్మలాంబువుల్ ద్రాగవెఱచు

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అన్నపరెడ్డి వారూ,
      మీ పూరణ బాగుంది. అభినందనలు.
      ‘వికలమతిని’ అనండి.

      తొలగించండి
  14. వ్యక్తం బెల్లరకున్ వినిశ్చయము విభ్రాంతుండు మర్త్యుండిలన్
    శుక్తం బింపుగ నారగింప పరితోషుండంత నిత్యం బధో
    భక్తంబున్ వెసఁ ద్రాగ తామ్ర సమమౌ వర్ణంపు ద్రవ్యంబునున్
    రక్తం బంచును నిర్మలోదకములం ద్రావంగ భీతిల్లెఁ దాన్

    [శుక్తము=మాంసము; అధోభక్తము=భోజనము చేసిన పిమ్మట త్రావు నీరు,మందు మొ. ; ద్రవ్యము=మందు]

    నిత్య సందేహి మనలేడు సత్య మిదియ
    యెంచి పీడ కలలు నిదురించ వెఱచు
    గరళమని యెంచి యశనము కతుక వెఱచు
    రక్త మని నిర్మలాంబువుల్ ద్రాగ వెఱచు

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. "నిర్మలోదకములం" లో "క" మర్చిపోయారు.

      తొలగించండి
    2. కామేశ్వర రావు గారూ,
      మీ రెండు పూరణలు అత్యద్భుతంగా ఉన్నవి. అభినందనలు.
      ముఖ్యంగా నిత్యశంకితుణ్ణి గురించిన రెండవపూరణ సమస్యాపూరణగా కాకుండా ఒక నీతి పద్యంగా భాసిస్తోంది.
      టైపాటును సవరించాను. ధన్యవాదాలు.

      తొలగించండి
    3. పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. ఆహ్లాదకరమైన మీ ప్రశంసకు ధన్యవాదములు.

      తొలగించండి
  15. ప్రోక్తంబేగద పూర్వకాలమున దాముర్విన్ జనాలెల్లరున్
    రక్తిన్నేగిసరోవరమ్మునకునీల్లన్ నిత్యమున్ దెచ్చుటన్
    రిక్తంలేకను గ్రమ్ముటెర్రగలువల్వీక్షించి బుడ్తొక్కడున్
    రక్తంబంచని నిర్మలోదకములన్ ద్రావంగభీతిల్లె దాన్
    ఐతగోని వేంకటేశ్వర్లు

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. వెంకటేశ్వర్లు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      ‘రిక్తం’ అని వ్యావహారికాన్ని ప్రయోగించారు.

      తొలగించండి
  16. మిత్రులందఱకు నమస్సులు!

    [రక్తవర్ణ ప్రేమికుఁడగు నొకానొక దాత, బాటసారుల పిపాసను పోగొట్టుటకై మార్గమం దక్కడక్కడ రక్తవర్ణపాత్రలందు నిర్మలోదకముల నుంచఁగా, నొకానొక బాటసారి పిపాసార్థియై, యా నిర్మలోదకములను రక్తమని భ్రమించి, త్రాగకుండఁ జనెనని చమత్కారము]

    రక్తోద్వర్ణ విశిష్ట లిప్తయుత పాత్రన్ గల్గు నీరమ్మొగిన్
    రక్తమ్మట్టులు గానుపింప నపుడున్ బ్రాధ్వన్య తృట్కాముఁ డా
    సక్తుండై యటనున్న పాత్రఁ గనుచున్, సత్సంశయాత్మోత్కతన్

    రక్తం బంచును నిర్మలోదకములన్ ద్రావంగ భీతిల్లెఁ దాన్!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మధుసూదన్ గారు "ప్రాధ్వన్య" పదమెంత యాలోచించిన బోధపడుటలేదు. "ప్రాధు+అన్య" అనుకుంటే "ప్రాధు" పద రూపమున్నదా? ("ప్రాధ్వం" కలదు). దయజేసి వివరించ గలరా. లేక యది "ప్రాధాన్య" మనా?

      తొలగించండి
    2. సుకవులు కామేశ్వర రావు గారూ...నమస్సులు! ప్ర+అధ్వన్య...సవర్ణదీర్ఘసంధి చేశాను. ప్రసిద్ధమైన అధ్వన్యుఁడు...బాటసారి...అని అర్థము. తృట్కాముఁడు...దప్పిఁగొన్నవాఁడు.

      తొలగించండి
    3. అధ్వన్యుఁడనఁగా అధ్వని= అధ్వమునందు య = యాతి = సంచరించువాఁడు అని అర్థము వచ్చుననుకొందును. అనఁగాఁ దెరువరి యనియే యర్థము వచ్చును గదా!

      తొలగించండి
    4. చాలా బాగుందండి. మీ వివరణకు మిక్కిలి ధన్యవాదములు.

      తొలగించండి
    5. గుండు మధుసూదన్ గారూ,
      ధారాళమైన పదగుంఫనంతో మీ పద్యం శోభిస్తున్నది. చక్కని పూరణ. అభినందనలు.

      తొలగించండి
  17. రక్తమని నిర్మలాంబువుల్ ద్రాగ వెఱచు
    నోయి సాంబుడ !నీటిలో వేయకెపుడు
    నెఱుపు రంగును గూడిన దేదియు నిక
    మంచి నీటిని నుంచుము మంచి గానె

    రిప్లయితొలగించండి
  18. యుక్తంబేగద బావతో సరసముల్ యోచించి మాట్లాడగా
    రక్తంబంచును నిర్మ లోదకములన్ ద్రావంగ భీతిల్లెదాన్
    రక్తిన్ గూర్చెడి హాస్యమున్ నడుపగా?రాజిల్లుటానంద మా
    సక్తేనాయువు పెంచిబంచుగదవిశ్వాసంబె విజ్ఞాన మౌ|

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఈశ్వరప్ప గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      ‘ఆసక్తి+ఏ+ఆయువు=ఆసక్తియే యాయువు’ అవుతుంది.ఆసక్తి న్నాయువు పెంచి... అందామా?

      తొలగించండి
  19. సోడియమ్మను ధాతువు చూడ బోవ
    దేహమున సమస్థాయికి దిగువ నుండ,
    నామె కొలచి త్రావును నీరు! యవధికి నతి
    రక్తమని నిర్మలాంబువుల్ ద్రాగ వెఱచు!
    (' సోడియం " శరీరంలో వుండాల్సిన దానికంటే తక్కువగా వున్న వారు తీసుకునే చికిత్సతో పాటు నీరు బాగా తగ్గించి తాగాల్సి వుంటుంది ఉ.దా. రోజుకు ఒక లీటరుకు మించకూడదు).

    రిప్లయితొలగించండి
  20. నిమ్మ నుప్పును గలిపిన నీటియందు
    సంగ తెరిగియుషోడా పసందుబోయ?
    రంగు గల్గిన గ్లాసున పొంగురాగ?
    రక్తమని నిర్మలాంబువుల్ ద్రాగ వెఱచు|

    రిప్లయితొలగించండి
  21. రక్తంబంచు ను నిర్మలోదకములన్ ద్రా వంగ భీతిల్లె దాన్
    ముక్తాఫా ! యికనెన్నడున్ గలుపకే రక్తంపు రంగున్ సుమీ
    రక్తమ్మిట్టుల గానిపించ నెవరున్ ధ్రా గంగ నో పుండునే
    యుక్తా యుక్త మెఱుంగుచున్ మసలుమా యుక్తిన్ సదా యీభు విన్

    రిప్లయితొలగించండి
  22. ఒక రాజు శత్రుసంహారము జేసి రక్తసిక్తమైన తన చేతులలోని నీరు కూడ ఎఱ్ఱగా మారినపుడు కలిగిన భావన........

    యుక్తాయుక్త వివేచనా రహితుఁడై యుగ్ర ప్రభావంబునన్
    శక్తిన్ గల్గి ప్రచండ తీవ్రతముఁడై శత్రుశ్శిరచ్చేదనా
    సక్తుండై వివిధారి సైన్యతతులన్ సంహారమున్ జేసి కైఁ
    రక్తం బంచును నిర్మలోదకములన్ ద్రావంగ భీతిల్లెఁ దాన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సంపత్ కుమార్ శాస్త్రి గారూ,
      బహుకాల దర్శనం. సంతోషం!
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      ‘కై’ తరువాత అరసున్నా అవసరం లేదు.

      తొలగించండి
  23. 'శక్తి' కై నివేదించిన శాక మిళిత
    భోజనమ్ము భుజింపగ భోక్త కిడుచు
    యెర్రనగు కాచ పాత్రలో నీయ ద్రవము
    రక్తమని నిర్మలాంబుబుల్ ద్రాగ వెరచు


    రిప్లయితొలగించండి
  24. గురుమూర్తి ఆచారి గారి పూరణ....

    { గ్రామ దేవత యెదుట దున్నపోతు తలలను నరికి జరిపే జాతరను " దేవర " అ౦దురు }

    “రక్త౦బే మన తల్లి కిష్ట” మనుచున్ గ్రామస్తు లెల్లన్ మహా
    యుక్త౦బౌ నటువ౦టి ‘దేవర’ను తా మున్మాదులై మూర్ఖపున్
    భక్తిన్ జేసి, లులాయ మస్తకములన్ ఖ౦డి౦చు చు౦డన్ మనో
    ద్రిక్తవ్యాధివిపీడిత౦ బయిన నీరేజాక్షి వీక్షి౦చి ఛీ
    రక్త౦బ౦చును నిర్మలోదకములన్ ద్రావ౦గ భీతిల్లెఁ దాన్.

    మన తల్లి = మన గ్రామదేవత;
    మహాయుక్త౦బు = మహా + అయుక్తము ;
    దేవర = దున్నపోతుల తలలను నరికి గ్రామదేవతకు చేయు నొక జాతర;
    లులాయ మస్తకములన్ = దున్నపోతు తలకాయలను

    రిప్లయితొలగించండి
  25. వర్షధారలు కురియంగ వసుధ లోన
    వరద నీటినెత్రాగంగ వాడుచుండ
    జలము రంగును గోల్పోవ జాలిగ గని
    రక్తమని ని ర్మలాంబువుల్ ద్రాగ వెరచు


    రక్తమని ని ర్మలాంబువుల్ ద్రాగ వెరచు
    చుండె బాలుడట గనుము సొమ్మ సిల్లి
    కాదు కాదు వర్షపునీరు కమ్మ నివని
    తెలియ బరచి ద్రావించుము తేట నీరు

    రిప్లయితొలగించండి
  26. ముక్తిన్ బొందగ ముత్యమాంబ గుడిలో మోక్షార్థియై నిల్వగా
    రక్తిన్ జూపుచు రక్తవర్ణమగు నీరమ్మున్ ప్రసాదముగా
    భక్తిన్ దర్శనమొందు వానికిడగన్ పర్వెత్తె సందిగ్ధుడై
    రక్తం బంచును నిర్మలోదములన్ ద్రావంగ భీతిల్లెఁ దాన్

    అపరిచిత విప్రుడే తెంచ నతిధి గాగ
    మండుటెండను '' రూఆఫ్ జ '' మంచి దగును
    చేతి కందీయ నాతడ చేతనుడయి
    రక్త మని నిర్మలాంబువుల్ ద్రాగ వెఱచు

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కృష్ణారావు గారూ,
      మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.

      తొలగించండి
  27. విందు లోపల నొక్కడు మందు గొట్టి
    కిక్కు తలకెక్క నేవేవొ లెక్క లేని
    మాట లాడుచు మురియుచు మసలు చుండ
    రక్త మని నిర్మలాంబుల్ ద్రగ వెఱచు

    మసలు చండ దగ్గర మందు మాయ అంటె బాగుంటుందా చెప్పగలరని మనవి

    రిప్లయితొలగించండి
  28. నిన్నటినుండి మళ్ళీ అస్వస్థత... జలుబు, దగ్గు, ఒంటినొప్పులు, జ్వరం... (వాతావరణం మారినప్పుడల్లా నాకిది మామూలే! అంటే వేసవి వెళ్ళి వానాకాలం వచ్చే సంధికాలంలో... ఇలాగే మిగతా కాలాలు...) హాస్పిటల్ వెళ్ళి వచ్చేసరికి ఆలస్యమైంది. ఇంటికి చేరుకునేసరికి కరెంటు లేదు. ఇంతకు ముందే వచ్చింది. మిత్రుల పూరణలను సమీక్షించే ఓపిక లేదు. వీలైతే రేపు చేస్తాను. మన్నించండి.

    రిప్లయితొలగించండి
  29. మీ ఆరోగ్యం జాగ్రత్త.విశ్రాంతి తీసుకోండి అన్నయ్యగారూ

    రిప్లయితొలగించండి
  30. మీ ఆరోగ్యం జాగ్రత్త.విశ్రాంతి తీసుకోండి అన్నయ్యగారూ

    రిప్లయితొలగించండి
  31. జంతు జాలంబు నడవిని సంచరింప

    సరసు (జేరంగ దాహమై జలము కొఱకు

    అస్తమించగ భాస్కరు దరుణమయ్యె

    రక్తమని నిర్మలామ్బువుల్ ద్రాగ వెరచు.

    విద్వాన్,డాక్టర్,మూలె.రామమునిరెడ్డి.విశ్రాంత తెలుగు పండితులు.ప్రొద్దుటూరు.కడప జిల్లా

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. రామముని రెడ్డి గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      ‘భాస్కరు డరుణమయ్యె’ అన్నచోట టైపాటు.

      తొలగించండి
  32. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. షేక్ స్పియర్ వారి లేడీ మాక్బెత్ అంతర్మధనాన్ని చిత్రిస్తూ

      భుక్తిన్నిచ్చిన రాజునే బలిగొనెన్ భోగార్ధియై గాని న
      వ్యక్తంబైన నిజంబు దాచ తనదౌ వ్యక్తిత్వమే బాధయై
      రక్తింగూర్చవు రాణి కిన్ స్థితిగతుల్ రక్తాభిషిక్తాంఘ్రియై
      రక్తం బంచును నిర్మలోదకములన్ ద్రావంగ భీతిల్లెఁ దాన్

      తొలగించండి
    2. కళ్యాణ్ గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      ‘భోగార్తియై కాని య|వ్యక్తంబైన...’ అనండి.

      తొలగించండి
  33. ​​రక్తింబొందగ ప్రేయసీ ప్రియులు విశ్రాంతమ్మునాశించి యా
    సక్తిన్నిర్వురు వెళ్ళుచుండ నొక రాస్తావెంట వాహ్యాళికై
    యుక్తాయుక్తము లెంచకుండ ప్రియడన్నొక్కండు చెండాడగా
    రక్తం బంచును నిర్మలోదకములన్ ద్రావంగ భీతిల్లెఁ దాన్!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. శంకరయ్య గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      ‘రాస్తా’ అని అన్యదేశ్యాన్ని వాడారు. ‘ప్రియుడి న్నొక్కండు’ అని ఉందాలనుకుంటాను.

      తొలగించండి
  34. ​​రక్తింబొందగ ప్రేయసీ ప్రియులు విశ్రాంతమ్మునాశించి యా
    సక్తిన్నిర్వురు దారివెంట కడువిశ్వాసమ్ముతో సాగగా
    యుక్తాయుక్తము లెంచకుండ ప్రియడిన్నొక్కండు చెండాడగా
    రక్తం బంచును నిర్మలోదకములన్ ద్రావంగ భీతిల్లెఁ దాన్!

    రిప్లయితొలగించండి
  35. ఒక నక్సల్వాది మూర్ఖుడు:

    యుక్తాయుక్తము లేక మావొలవియౌ యుల్లమ్ము రంజించెడిన్
    వక్తల్ మాటలు వీడకుండ వినగా వ్యామోహమున్ వొందుచున్
    భుక్తిన్ గోరెడు పేదవాండ్ర బలిలో పొంగంగ చేకొన్నదౌ
    రక్తం బంచును నిర్మలోదకములన్ ద్రావంగ భీతిల్లెఁ దాన్

    రిప్లయితొలగించండి