పద్మావతీ శ్రీనివాసము (ద్విపదకావ్యము)
రచన : పోచిరాజు కామేశ్వర
రావు
ద్వితీయాశ్వాసము (41-60)
శ్వేత వరాహమ్ము వేంచేసి నట్టి
భూతల స్వర్గంబు పుణ్య తటమ్ము 41
శైల రాజముఁ గని చక్రాయుధుండు
కాల గతస్మృతిఁ గాంచె మనమున 42
శ్వేత యజ్ఞ వరాహ వేష ధారి యయి
పాతాలమున వధింపగ హిరణ్యాక్షు 43
మోద మొందె విధాత ముల్లోకములును
భూదేవి నిల్పిన భోగి భోగమున 44
పూర్వ విధంబున పుడమి నమర్చి
సర్వ జలధులను సప్త లోకముల 45
విభజించి చక్కగ వేడితి పద్మ
సంభవు సృజియింప జగతి నింపుగను 46
లోక కళ్యాణ విలోలుడ వాస
సౌకర్య దివ్యదేశము భువి నెంచి 47
క్రీడాద్రి వైకుంఠ గిరిరాజుఁ బక్కి
రేడు గరుత్మంతు లీలఁ దెమ్మంటి 48
పరిజన సహిత విష్వక్సేన ముఖ ఖ
చర సురముని గణ సంయుత ముగను 49
నాదు మాట విని వినతి నందనుండు
మోదాతి సంభ్రమముల నుద్గ మించె 50
దేవ గంధర్వ విధి సహితా దిత్య
దేవదేవాదు లేతెంచి రచటకు 51
స్తుతియించి యచ్యుతు దుర్బల నరుల
కతి భయంకర రూప మయ్య యిద్దాని 52
విడనాడి సుందర వేషము దాల్చి
పుడమి జనులఁ బ్రోవుము మురారి యనిరి 53
మాననీయుల మాట మన్నించి పల్కి
తేను కల్పాంతము నిందుందు ననుచు 54
గోమతీ నది కంతకు దిశ నరువది
యామడ లాంతర మందున బరగి 55
పూర్వాబ్ధి పశ్చిమమున నైదు యోజ
నోర్వి స్థలమ్మున నుత్తిష్ఠు డైతి 56
అంత విక్షేప పక్షానిల ఘోష
మంతక ఘన నినా దాకృతి దాల్చ 57
నానా మృగ వ్యాళ నానా విహంగ
నానా లతా ద్రుమ నద నదీ నగము 58
బహు నిర్ఝరాకీర్ణ భాసిత సురుచి
ర హృదయా హ్లాదకర నగ రాజమ్ము 59
యోజన త్రయమును యోజన త్రిదశ
భాజన విస్తార వసుధా ధరంబు 60
నీదు శైలపు వర్ణన నిజము గాను
రిప్లయితొలగించండిగండ్ల యెదుటన నున్నట్లు కానిపించె
వర్ణనా శక్తి నీయది భళిర యద్భు
తంబ, వ్రాయయ టులుగను దరమె నాకు ?
ధన్యవాదములన్నయ్య
రిప్లయితొలగించండి