11, జులై 2016, సోమవారం

సమస్య - 2083 (అక్రమ సంతానులును...)

కవిమిత్రులారా, 
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది... 
అక్రమ సంతానులును మహాత్ములు గారే?
(ఈ సమస్యను పంపించిన పోచిరాజు కామేశ్వర రావు గారికి ధన్యవాదాలు)

51 కామెంట్‌లు:


  1. విక్రమ మార్గము బోవన్
    అక్రమ సంతానులును మహాత్ములు గారే?
    సక్రమ అక్రమ మాటల
    చక్రముల పడుట జిలేబి చట్టని విడుమా !

    జిలేబి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. జిలేబీ గారు,
      మీ పూరణ బాగున్నది.
      సక్రమ అక్రమ అని విసంధిగా వ్రాయరాదు కదా! అలాగే అక్రమ మాటల అని సమాసం చేయరాదు. ‘అక్రమ సక్రమ వాక్కుల’ అనండి.

      తొలగించండి
  2. వక్రత హెచ్చిన చంద్రుం
    డాక్రమణము జేసె తార నన్యాయముగన్
    విక్రముడై పుట్టె బుధుం
    డక్రమ సంతానులును మహాత్ములు గారే?

    రిప్లయితొలగించండి
  3. వక్రత బుద్ధిని కుంతియె
    సక్రమ ముగనుండ లేక సవితృని గొలిచెన్
    విక్రముడు కర్ణుని వరమిడె
    అక్రమ సంతానులును మహాత్ములు గారే ?

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అక్కయ్యా,
      మీ పూరణ బాగున్నది.
      మూడవపాదంలో గణదోషం. ‘విక్రముడు కర్ణుఁ బొందెను’ అనండి.

      తొలగించండి
  4. అక్రమమో యతిక్రమమో
    వక్రత లేకను మనీషి వలె మసలుచు తా
    సక్రమ పథమున సాగగ
    నక్రమ సంతానులు మహాత్ములు గారే?!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. శర్మ గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      నిన్న భూసారపు నర్సయ్య గారు ఫోన్ చేసి “శిష్ట్లా శర్మ గారి పూరణలు చాలా బాగుంటున్నవి” అని ప్రశంసించారు.

      తొలగించండి
  5. విక్రమ వంతులు నగునెడ
    న క్రమ సంతానులును మహాత్ములు గారే ?
    య క్రమ సక్రమ మనుచును
    వక్రముగా మాటలాడ వనజా !తగునే !

    రిప్లయితొలగించండి
  6. సక్రమమౌ రీతి నడత
    వక్రమ్ములు లేని బుద్ధి, వచనములబ్బన్
    విక్రమ క్రియాధిక బలప
    రాక్రమ సంతానులును మహాత్ములు గారే?

    రిప్లయితొలగించండి
  7. నేటి సమస్యాపూరణం

    వక్రత విధి జన్మించిన
    అక్రమ సంతానులును మహాత్ములు గారే
    సక్రమభావన మార్గప
    రిక్రమమునయెద వసించు రీతిన యెపుడున్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. శ్రీరామ్ గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      ‘రీతిని నెపుడున్’ అనండి.

      తొలగించండి
  8. గురువు గారికి నమస్కారములు. వృత్త పద్యములను కూడా వ్రాయవలెనను యభిలాష,కవి మిత్రులు శ్రీ అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి వారి మరియు మీ ప్రోత్సాహము మరియు మార్గ దర్శకాలతో ప్రథమ ప్రయత్నంగా నిన్నటి దత్త పదిని స్పృశించడమైనది. చదివి తగు విధంగా సూచనలు తెలుప గలరు.
    ధన్యవాదములతో, మాచవోలు శ్రీధర రావు

    రిప్లయితొలగించండి
  9. వందన మందుమీ పరమ పావన! బంధ విముక్తి చేసి యా
    నందము కూర్పవే! యిట రణంబున యుల్లము నిల్ప లేక యీ
    చందము లక్షణాలుడుగ చాపము నెత్తగ లేక పోతి, నో
    సుందర రూప! నీ పలుకరింతలె చూపును కోటి మార్గముల్!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. శ్రీధర రావు గారూ,
      మీ దత్తపది పూరణ బాగున్నది. వృత్తరచన సాఫీగా కొనసాగింది. వ్రాస్తూ ఉండండి.
      వందన మందుమో పరమపావన... రణంబున నుల్లము’ అనండి.
      ‘కోటి’ అన్యార్థంలో ప్రయోగించలేదు.

      తొలగించండి
    2. గురువు గారికి నమస్కారములు. మీ సూచనల మేరకు సవరించిన పూరణ ఇక్కడ వుంచాను. ' కోటి ' కూడా వేరే అర్ధంలోకి మార్చాను. చూడ గోరుతాను. ధన్యవాదములు.
      వందన మందుమో పరమ పావన! బంధ విముక్తి చేసి యా
      నందము కూర్పవే! యిట రణంబున నుల్లము నిల్ప లేక యీ
      చందము లక్షణాలుడుగ చాపము నెత్తగ లేక పోతి, నో
      సుందర రూప! నీ పలుకరింతలె కూరిమి భక్త కోటికిన్!!

      తొలగించండి
    3. సవరించిన పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  10. ఏక్రమమునఁ బుట్టె కృపుడు?
    విక్రముడు వితథుని జన్మ విదితము గాదే?
    సక్రమమే వ్యాస భవము?
    నక్రమ సంతానులును మహాత్ములు గారే?

    చక్రి పదాంబుజ రత ని
    ర్వక్రప్రహ్లాద సహిత పాలిత ధరణీ
    చక్ర వినుత దైత్య విదూ
    రాక్రమ సంతానులును మహాత్ములు గారే?
    [ విదూరాక్రమ = అక్రమాన్ని దూరము చేసిన వారు]

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కామేశ్వర రావు గారూ,
      మీ రెండు పూరణలు మనోహరంగా ఉన్నవి. అభినందనలు.

      తొలగించండి
    2. పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. ధన్యవాదములు.

      తొలగించండి
  11. .శ్రీకంది శంకరయ్యగురువుగారికివందనములతోనిన్నటి దత్తపది
    వందనంబు జేతు కృష్ణ వంశ వృద్ధిగోరియే
    సంధి జేయ లక్ష ణంబు సద్గుణాల బంధమై
    కంది పోవు వంశ మెల్లకాచి కోటిజేయుమా
    సంధి వేయి నోళ్ళుమెచ్చు|సాగజేయు తండ్రివై. {శ్రీకృష్ణరాయభారానసభలోద్రుతరాష్ట్రునుకుతెలిపినవిషయము} కోటి=పెంపు
    11.7.16.సక్రమ మార్గము నడచిన
    అక్రమ సంతానములును మాహాత్ములు గారే?
    విక్రయ మందిన వజ్రము
    సక్రమమా?రాళ్ళ యందు సాగిన దేగా|



    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఈశ్వరప్ప గారూ,
      మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
      దత్తపతిలో ‘వేయి’ స్వార్థంలో ప్రయోగించారు.

      తొలగించండి
  12. పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. ధన్యవాదములు. నిన్నటి పూరణలో కువలయాపీడమనే యేనుగును కృష్ణుడు సంహరించాడు గదా! అందుకని విష్ణు పరము గానే వ్రాసాను.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఆ ఆలోచన వచ్చింది కాని, గజావనుడని విష్ణువు ప్రసిద్ధుడు కదా అని అలా వ్యాఖ్యానించాను. మీ వివరణ సంతృప్తికరం.

      తొలగించండి
  13. గు రు మూ ర్తి ఆ చా రి
    ,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

    వక్రమతి జాతి c జెరిచెడు

    సక్రమ స౦తాన మేల ? సతము సదుప కా

    రక్రియ లొనర్చు చు౦డెడు

    నక్రమ స౦తానులును మహాత్ములు గారఏ ?

    రిప్లయితొలగించండి

  14. వక్రతలంపున కుంతియు
    సక్రమ మార్గమ్ము దప్పి చంద్రుని తో తా
    రా, క్రీడించి గనినసుతు
    లక్రమ సంతానులు ను మహాత్ములు గారే

    వక్రపుటాలోచనతో
    సక్రమ ము యె గాదనెఱగి చంద్రుని తో తా
    రేక్రీడించి గనె బుధుని
    అక్రమ సంతా ను లుమ మహాత్ములు గారే

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. విరించి గారూ,
      మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
      మొదటి పూరణలో ‘తారా’ అని దీర్ఘాంతం చేశారు.
      రెండవ పూరణలో ‘అని+ఎఱిగి=అని యెఱిగి’ అని యడాగమం వస్తుంది.

      తొలగించండి
    2. వక్రతలంపున కుంతియు
      సక్రమ మార్గమ్ము దప్పి చంద్రుని తో తా
      రే క్రీడించి గనినసుతు
      లక్రమ
      సంతానులు ను మహాత్ములు గారే

      వక్రపుటాలోచనతో 
      సక్రమ ము యె గా ని విధము జంద్రుని తో తా
      రేక్రీడించి గనె బుధుని
      అక్రమ సంతా ను లుమ మహాత్ములు గారే

      తొలగించండి
  15. మిత్రులందఱకు నమస్సులు!

    చక్రికి శివునకుఁ బుట్టిన
    యక్రమ సంతానమె యిల నయ్యప్పయెయై
    సక్రమ వరముల నిడడే?

    యక్రమ సంతానులును మహాత్ములు గారే?

    రిప్లయితొలగించండి
  16. వక్రీకరింప తగదని
    విక్రమమగు శాస్త్రములిట విఙ్ఞానమిడన్1
    సక్రమ జన్యువు లుండిన
    అక్రమ సంతానులును మహాత్ములు గారే!

    రిప్లయితొలగించండి
  17. తొలి కృష్ణద్వైపాయను
    డల జనన మ్మందె భువిని నక్రమ సంతా
    నులును మహాత్ములు గారే
    తెలియ పరాశరుడు దాశ తెరవను పట్టన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. తిమ్మాజీ రావు గారూ,
      సమస్యపాదాన్ని పద్యంలో ఇమిడ్చిన మీ ఛందోనైపుణ్యానికి నమస్సులు. పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  18. సక్రమముగ పెండ్లియాడి నను కొందరికి
    సక్రమ సంతాన యోగము లేక పోవుట వలనన్
    కృత్రిమ పధ్ధతిలో సంతాన సాఫల్యము
    విక్రమ తరిన్పొందిన వారి బిడ్డలు ఎందరో మహానుభావు
    లైరి తరచి చూడగా కావున సక్రమముకాని
    అక్రమ సంతానులును మహాత్ములు గారే

    రిప్లయితొలగించండి
  19. వేశ్యసుతుడు వసిష్టుడు విప్రుడయ్యె
    తపముచే సంస్కృతియె యెందు ధర్మమగును
    జాలరికి వ్యాసుడును బరాశరుడు మాలె
    తకు సుతులై ద్విజులైరి లెక్కకిది మించె
    అక్రమ సంతానులును మహాత్ములు గారే

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. vadduir... గారూ, (మీ పేరు తెలియదు)
      శంకరాభరణం బ్లాగు మీకు స్వాగతం పలుకుతున్నది.
      మీ రెండు పూరణలలో మొదటిది ఛందోబద్ధంగా లేదు.
      ఇక రెండవ పూరణ ఛందోబద్ధంగా ఉన్నా సమస్య కందపాదమైతే మీరు తేటగీతి వ్రాశారు.
      తేటగీతిలోను నాలుగవపాదంలో గణదోషం. ‘తకు సుతులు ద్విజులైరి లెక్కకిది మించె’ అంటే సరి!

      తొలగించండి
  20. ఏ క్రమమునజనియించిర
    వక్ర పరాక్రము లునైన బాండుదనయులున్
    విక్రమము జూపి రిగదా
    అక్రమ సంతానులును మహాత్ములు గారే.

    రిప్లయితొలగించండి
  21. డా.బల్లూరి ఉమాదేవి.జులై 09, 2016 4:32 [PM]
    శల్యుడు సుయోధనునితో
    రారాజు తోడ ననె మన
    సారా గ్రోలితి నిపుడిక సంతోషముతో
    పోరాటమునకు సిద్ధము
    తేరా రథంబు నిచటకు తీర్చెద కోర్కెన్.

    2.సుభద్ర అర్జునునితో
    రారా యనుచును నిను మన
    సారగ కోరుచు వలచితి సంబర మొదవన్
    తేరా వలపుల సరమో
    వీరా తేకున్న నిన్ను విడువను పోరా

    ఓసారి ఈపద్యాలను చూడండి అన్నయ్యగారూ.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఉమాదేవి గారూ,
      మీ రెండు పూరణలు బాగున్నవి.
      మొదటిపూరణ నాల్గవపాదంలో గణదోషం. సరిగణంగా (రథంబు) జగణం వేశారు. ‘తేరా యరదము నిచటకు...’ అనండి.
      రెండవపూరణలో దత్తపదం ‘సారా’ను ‘సార’ అన్నారు.

      తొలగించండి
  22. రారాభీమా! నిను మన
    సారాహత్తుకొన కోర్కె జనియించె మదిన్
    పోరాటములోఘునుడవు
    తేరానీకౌగిలింత తీర్చతపమ్మున్

    రిప్లయితొలగించండి
  23. విక్రములౌబుధుల జనువు
    సక్రమమని చెప్పుచుండె శాస్త్రములెల్లన్
    వక్రముగా తలచవలవ
    దక్రమ సంతానులును మహాత్ములు గారే.

    రిప్లయితొలగించండి