17, జులై 2016, ఆదివారం

సమస్య - 2089 (సౌజన్యుండైన నేమి...)

కవిమిత్రులారా, 
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది... 
“సౌజన్యుండైన నేమి సంకట మందున్”
ఈ సమస్యను పంపిన పోచిరాజు కామేశ్వర రావు గారికి ధన్యవాదాలు.

73 కామెంట్‌లు:

  1. రాజస మొప్పగ మనుజుడు
    తేజముతో విరగ బడుచు తేరుల పైనన్
    నైజము తప్పదు నోరిమి
    సౌజన్యుండైన నేమి సంకట మందున్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. రాజేశ్వరిగారు, విరుగబడిన అనండి -అన్వయం మరింత సుభగంగ వస్తుంది. ఆ పాదాన్ని తిరుగుటయగుచో అని ముగించటం బాగుంటుంది. తప్పదు నోరిమి అన్నచోట ఓరిమి అన్నది ఓటమికి బదులు పొరబాటున ప్రయోగించారా? నుగాగమం లేదు. తప్పదోటమి అవుతుంది. మరికొంచెం చిత్రికపట్టండి పద్యాన్ని.

      తొలగించండి


  2. ఆ జనని కరుణ మేరన్
    సౌజన్యుండైన నేమి సంకట మందున్
    వాజస మందున్ మిక్కిలి
    తేజస్సు కలిగి మెలుగుట తేలిక గాదే

    జిలేబి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మొదటిపాదం మేరకు అని ముగించండి. మేరన్ అన్నది ఒప్పదు. చివరిపాదంలో ఒక లఘువు తగ్గింది. కించిన్యూనే న్యూనం‌! అదీ‌ కాక అన్వయం?

      తొలగించండి

    2. ధన్యవాదాలండీ శ్యామలీయం గారు

      మేరకు బాగానే ఉంది

      మూడవ పాదం అప్పుతచ్చు

      వాజము లందున్ మిక్కిలి అని ఉండాలి;

      ఆ జనని కరుణ మేరకు సౌజున్యుల మైనా సంకట పరిస్థితుల్లో , వేగిరపాటు సమయం లో సరియైన సమస్థితి కలిగి ఉండడం తేలికైన విషయము కాదు అన్న అర్థం లో వ్రాయడం జరిగినది


      చీర్స్
      జిలేబి

      తొలగించండి
  3. భోజుండైనను,సురలకు

    రాజైనకూడ,పుడమికి రాష్ట్రపతైనన్;

    నైజంబు నలుగు రొప్పక

    సౌజన్యుండైన ననేమి సంకట మందున్.

    విద్వాన్,డాక్టర్,మూలె.రామముని రెడ్డి, విశ్రాంత తెలుగు పండితులు,ప్రొద్దుటూరు,కడప జిల్లా

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మునిరెడ్డిగారు, రాష్ట్రపతైనన్ అన్నది విచార్యం. రాష్ట్రపతియైనన్ అన్న యడాగమయుక్తరూపమే సాధువు అనుకుంటానండి.అలాగే రాజైనను కూడ అనవలెనేమో యోచించప్రార్థన.

      తొలగించండి
  4. రాజయిన నేమి ప్రతిభ వి
    రాజిల్లిన నేమి మనసు రంజిల్లగన్
    నైజమున నడత దప్పిన
    సౌజన్యుండైన నేమి సంకట మందున్!

    రిప్లయితొలగించండి
  5. మిత్రులందఱకు నమస్సులు!

    సౌజన్యుఁడు మూర్ఖునితో
    నోజను సఖ్యమ్ముఁ జేయ నొకచో నైనన్
    దేజముఁ గోల్పడుఁ; జూడఁగ

    సౌజన్యుండైన నేమి సంకట మందున్!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మిత్రులు మధుసూదన్ గారు, సౌజన్యుడు అన్న పదాన్ని పునరుక్తం చేసారు. ఈ సౌజన్యుడు అన్నది సాధువేనా అని నా అనుమానం. పరిశీలించండి.

      తొలగించండి
    2. మిత్రులు శ్యామలరావు గారికి నమస్సులు!

      సౌజన్యుఁడు
      సౌజన్యుఁడు : శ్రీహరి నిఘంటువు తెలుగు-తెలుగు (రవ్వా శ్రీహరి) 2004
      విణ.
      సౌజన్యము గలవాఁడు.
      "మేఘాభాంగుఁడు కార్యవేది దళితామిత్రుండు యుద్ధక్రియాశాఘాయుక్తుఁడు సత్కృపాకరుఁడు సౌజన్యుండు...." [శత.రా.-2-123]

      అని ప్రయోగము కన్పడుచున్నది.

      ఇకపోతే...
      నేను వ్రాసిన పూరణలో...మూఁడవ పాదంలో "...తేజముఁ గోల్పడున్" అని వాక్యము పూర్తియైనది. తరువాత వచ్చినది మఱొక వాక్యము కావున దోషము లేదని నా అభిప్రాయము.

      తొలగించండి
    3. ఆంధ్రభారతినిఘంటువు సైట్‌లో మీరు చూపిన ప్రయోగాన్ని నేనూ గమనించానండీ. కాని ఆ విధమైన ప్రయోగం అంత సంతృప్తికరంగా అనిపించటం‌ లేదు. ఇటువంటి మారుమూల ప్రయోగాలను మనం ఆధారపడదగ్గ ప్రమాణాలుగా స్వీకరించక పోవటమే ఉచితం అనుకుంటానండి.

      ఇకపోతే పునరుక్తిని గురించి మీరన్నది సబబుగానే తోస్తున్నది. ఐనా, పద్యం‌ మొత్తంపైన వర్తింస్తుందేమో పునరుక్తిపరిహరణం అన్నది ఆలోచనీయం.

      తొలగించండి


    4. మారు మూల వాటిని ప్రయోగం లోకి తెచ్చి వాడతా వుంటే మూల ప్రయోగం అయ్యే ఆస్కారాలు ఉన్నాయి కదండి ?

      సౌజన్య, సౌజన్యం , సౌజన్యారావు ఇవి వాడుకలో ఉన్న పదాలే కదుటండీ ?

      (నిత్య కల్యాణం పచ్చ తోరణం లో గుమ్మడి పేరు సౌజన్యా రావు అనుకుంటా )


      జిలేబి

      తొలగించండి
    5. శౌర్యము : శౌర్యుడు;
      సుందరము : సుందరుడు;
      యుక్తము : యుక్తుడు;
      శాంతము : శాంతుడు;
      విక్రమము : విక్రముడు;
      ఉద్రిక్తము : ఉద్రిక్తుడు;
      సౌజన్యము : సౌజన్యుడు

      తొలగించండి
    6. జిలేబిగారూ, సౌజన్యము అన్నది సుజనశబ్దభవం. సౌజన్యం అన్నపదం వాడుకని ఎవరు ఎప్పుడు ఆక్షేపించారు? నేనా? ఎక్కడ? తెలిసివ్రాయండి దయచేసి. సౌజన్యారావు అన్నది సరైనపదమే కాని కరటకశాస్త్రి,సౌజన్యారావు,అగ్నిహోత్రావధానులు వంటివి కొంచెం ప్రహసనదుర్వాస వస్తున్నాయన్న ఆక్షేపణ ఉంది లెండి కాని ఆచర్చలు వద్దు. అదిసరే, మారుమూల ప్రయోగం అన్న మాటను కావ్యప్రయోగాల్లో తగినంతవినియోగమూ తగినంతగా శిష్టజనవ్యవహారమూ లేని పదం అన్న ఉద్దేశంలో వాడుతాము. మూలపదం అంటే అర్థం వేరు. సంస్కృతంలో వాటిని ధాతువులు అంటాము. ధృ అన్న ధాతువునుండే అనేకపదాలు వచ్చాయి వేర్వేరు సందర్భాలను బట్టి ధర్మము, ధారుణి రెండూ దానినుండే వచ్చాయి. అనేకపదాల ఉత్పత్తికి మూలం ఐన పదాన్ని మూలం అంటాం. మీరు దాన్ని మీ (అ)సహజహాస్యధోణిలోనికి మార్చి సాహిత్యచర్చలను ప్రక్కదారుల్లోని త్రోయాలని చూడకండి. ఇది కేవలం‌ సంప్రదాయకవిత్వవేదిక. దీనిని మీబోంట్లు మరొక రచ్చబండచేసే పక్షంలో ఇక్కడకు నాబోట్ల రాక తప్పనిసరిగా తగ్గవలసి వస్తుంది. మీ అభీష్టం అదే ఐతే సరే. మీ అకటావికటపు పద్యాలను శంకరయ్యగారు ప్రచురించినది కేవలం కవిమిత్రులు ఇక్కడ పరస్పరం అభివృధ్ధిపథంలో కొనసాగేందుకు ఒక అభ్యాస వేదికగా ఉండాలన్న ఆకాంక్షతోనే అని భావిస్తున్నాను. ఈ వేదికను దయచేసి సరిగా వినియోగించుకొన వలసిందిగా విఙ్ఞప్తి చేస్తున్నాను.

      పోచిరాజువారూ, సుందర శబ్దం నుండి తెలుగులో సుందరుడు అన్న పదం రావటంలో ఇబ్బంది ఏముంది? (మీ మిగిలిన ఉదాహరణలూ అటువంటివే) కాని సుందర శబ్దం నుండి సౌందర్య శబ్దం కూడా వస్తున్నది. మీకూ తెలుసును కదా. మరి సౌందర్యుడు అన్న పదం కూడా ఉచితమేనా? ఉచితమే ఐతే అప్పుడు సౌజన్యుడు అన్నదీ ఉచితమే అవుతుందండి. కవిమిత్రులు కృదంతాలు తధ్దితాంతాలూ చక్కగా తెలుసుకొని ఉండటం‌ అవసరం అని భావిస్తున్నాను.

      తొలగించండి

    7. శ్యామలీయం వారు

      సౌజన్యుడు నాకు తెలిసినంతలో సరియైన సాధువైన గ్రాంధిక పదమే ; జంధ్యాల పాపయ్య శాస్త్రి గారి రచనల్లో కూడా చదివినట్టు గుర్తు .

      ఇంతకు ముందు కవులందరు విరివిగా వాడి వుంటేనే వాటిని మనమూ వాడాలి అట్లా కాకుంటే మారుమూల పద ప్రయోగాలను మనం వాడ కూదదు గట్రా ఒక కవి గా రచయిత గా ఎందుకు అనుకోవాలో నా వరకైతే సబబై నది గా అనిపించదు ;

      దిల్ మేరా దిల్ . ఒక శ్రీ శ్రీ రావాలన్నా ఒక గరికిపాటి రావాలన్నా కొత్త పుంతలు ప్రయోగాలు చేయాలి మానవుడు అన్నది నా అభిప్రాయం

      ఇక జిలేబి పద్యాలు అకటావికటపు పద్యాలు అన్న మీ మాట సరియయినది కాదు ; (సరి యయితే దానికి కారణ హేతువు మీరే అవుతారు కాబట్టి :) మీ నించి నేర్చుకున్నదే కదా కాబట్టి సరి కాదు :))


      ఏదో నాకు తెలుసిన తెలుగులో రాసుకుంటున్నా పోనిద్దురూ :)

      బై ది వే ఇవ్వాళ సెలవా ?

      చీర్స్
      జిలేబి

      తొలగించండి
    8. ఈ శంకరాభరణం వేదిక సంప్రదాయకవిత్వవేదిక. ఇది ఎవరికి తెలిసిన తెలుగులో వారు వ్రాసుకుందుకు తప్పకుండా సహకరిస్తున్నదనే నమ్ముతున్నాను. ఐతే ఎవరికి తెలిసిన తెలుగులో ఐనా పొరపాట్లో లోపాలో ఇబ్బందులో ఏవైనా ఉన్నపక్షంలో పరస్పరం చర్చించుకుందుకు కూడా వేదిక అని భావిస్తున్నాను. సంప్రదాయకవిత్వానికి కొన్ని ప్రామాణికమైన విధానాలూ కొన్నికొన్ని ఆరోగ్యకరమైన ఒరవడులూ ఉన్నాయి. వాటిని అనుసరించటమూ ఆపైన మెఱుగులు దిద్దగలిగిన ప్రఙ్ఞాపాటవాలను సాధించగలిగితే తప్పకుండా సాధించగలగటమూ చేయటానికి ఇది కవిమిత్రులకు తప్పకుండా ఒక మంచి అభ్యాసవేదిక అని కూడా అభిప్రాయపడుతున్నాను. మాకు తోచినట్లు వ్రాస్తాం అదే జనవిధానం వగైరా అంటూ యధేఛ్ఛావాదం జరిపేవారితో తగవులు పడే ఆసక్తి లేదు నాకు. క్షమించాలి.

      తొలగించండి


    9. అబ్బా ! శ్యామలీయం వారు ,

      మీరు చెప్పిందానికి ఎవరైనా ఒక ప్రశ్న ఎక్కు పెడితే వెంటనే రెండో మాటా నే బోతా అంటారు ; మీతో వచ్చిన చిక్కే యిది సుమీ

      నేనా ప్రశ్న సంధించ కుంటా ఉంటే మీ నించి‌ అన్ని‌ కొత్త విషయాలు తెలీకుండా పోయేవి

      ఇట్లా అస్త్ర సన్యాసం చేస్తా ననమాకండి ; మీరు‌ దయ చేసి మీ విశ్లేషణ కొనసాగించండి ;

      ప్రశ్నలు మాత్రం వేస్తా తప్పక మీ నించి ఇంకా మేటరు రాబట్టాలనుకుంటె ( దటీజ్ జిలేబి)



      Don't get disheartened ; I know you have great potential ; This I am saying out of my heart ; keep the good work going on ; Never leave what good you are doing come what may ; say who so ever what ever they want to say ; for the dawn is the same but its for each one unique and the perception is one's own and this is the eternal truth ;

      May your good work continue

      Cheers
      Zilebi

      తొలగించండి
  6. రాజైన హరిశ్చంద్రుడు
    సౌజన్యుండైననేమి?సంకటమందున్|
    “రోజూ రాత్రికి చీకటి
    తాజాదనముంచు పగలు|తత్వంబిదియే”| {కష్ట,సుఖాలు,వెలుగుచీకట్లయందుజీవనమేసత్కీర్తియన్నదినుండు|}

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

      తొలగించండి
    2. రోజూ అన్నది వ్యావహారికప్రయోగం. కవిమిత్రులు వ్యావహారికపదాలను యథాతధంగా సమస్యాపూరణాల్లో వాడుకచేస్తూ ఉండటం తరచుగానే కనిపిస్తోంది. సంప్రదాయబధ్ధంగా వ్రాయ దలచుకున్నప్పుడు అటువంటివి వాడదగదండి.

      తొలగించండి
  7. మిత్రులు శంకరయ్యగారు,
    ఈ సమస్య 'సౌజన్యుండైన నేమి సంకట మందున్' అన్నది కొంచెం విచారణీయం.
    సుజనుని యొక్క తత్త్వము సౌజన్యము. అందుచేత సౌజన్యుడు అని వాడకూడదండి. సుజనుడు అన్నదే సరైన వాడుక. ఇది నా అభిప్రాయం. నేనే పొరబడిన పక్షంలో మన్నించాలి.

    రిప్లయితొలగించండి
  8. తేజమ లరగన్ జనులచె
    పూజల నొందుచు, వలదను పోరును యకటా!
    భాజన పూజ్యుడు మనకును
    సౌజన్యుండైననేమి? సంకట మందున్
    (ధర్మరాజు సౌజన్యుడయినా పోరుకు అంగీకరింపక సంకటము దెచ్చుచున్నడన్న భావనతో)

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మొదటిపాదంలో జనులచె అని హ్రస్వాంతం చేయరాదండీ. చేన్ అన్నదే ప్రత్యయం. తేజంబలరగ ప్రజచే అని పాదాన్ని సవరిద్దామా? పోరును యకటా అని యడాగమం చేయలేమండి. పోరగ నకటా అని మారుద్దామా? బాజనపూజ్యుడు అన్నది కూడా విచార్యమే. పూజార్హుండగు మనకున్ అని పాదాన్ని మార్చితే బాగుంటుంది.

      తొలగించండి
    2. శ్రీ శ్యామలీయం వారికి నమస్సులు. నేను శ్రీ పోచిరాజు వారితో ఏకీభవిస్తున్నాను. ఈ వేదిక నేనొక పాఠశాలగా నమ్ముతున్నాను. చాలా బాగుందండి. విషయపరిఙ్ఞానం నేర్చుకొనుట అనంతమైనది.
      మీలాంటి వారల సూచనలు నాలాంటి వారికెపుడూ శిరోధార్యం. ధన్యవాదములు.

      తొలగించండి
  9. గురువు గారికి అభివందనములు , జన్మదిన శుభాకాంక్షలు ! మీకు పార్వతీపరమేశ్వరులు ఆయురారోగ్య సౌభాగ్యములు కలుగజేయాలని ప్రార్థిస్తున్నాను !

    రిప్లయితొలగించండి
  10. గురువుగారూ జన్మదిన శుభాకాంక్షలు....సర్వేశ్వరుడు మీకు ఆయురారోగ్యైశ్వర్యములు ప్రసాదించాలని కోరుకుంటున్నాను

    రిప్లయితొలగించండి
  11. తేజో మూర్తుల రాముడు
    సౌజన్యుo డైన నేమి సంకట మందు
    న్నా జిని రిపులను జంపను
    భాజనుడే యైన యెడల భవ్యుడు నైనన్

    రిప్లయితొలగించండి
  12. రాజుల సేవయు నరకము
    మోజున రాజాశ్రయంబు ముచ్చట బొందన్
    రాజుల్ వ్యగ్రత నందగ
    సౌజన్యుండైన నేమి సంకట మందున్

    రిప్లయితొలగించండి
  13. రాజాజ్ఞాతిక్రమణన్
    భూజనునకు రాజునాజ్ఞ భూరిక్షయమున్
    వే జరుగుట తథ్యంబే
    సౌజన్యుండైన నేమి సంకట మందున్

    రిప్లయితొలగించండి
  14. రాజయినను రంకయినను
    తోజోన్నతు డయిన మిగుల తెగువరి యైనన్
    ధీ జన సద్గుణ సజ్జన
    సౌజన్యుండైన నేమి సంకట మందున్.

    రిప్లయితొలగించండి
  15. గురుదేవులు కంది శంకరయ్య గారికి జన్మదిన శుభాకాంక్షలు

    రిప్లయితొలగించండి
  16. రాజైన రామచంద్రుడు
    భూజాతనడవులకంపఁ బోలున?యని బే
    రీజుల వైచి వగచెఁ దా
    సౌజన్యుండైన నేమి సంకటమందున్!

    రిప్లయితొలగించండి
  17. పూజింంపదగిన సుజనుని
    వ్యాజంంబదియేమి లేక వలదనుకొనుచున్
    రాజీపడి ఖలుని గలువ
    సౌౌజన్యుంండైైన నేమి సంంకటమంందున్ .

    రిప్లయితొలగించండి
  18. చల్లని వెన్నెలను ప్రకాశింపజేసే చంద్రుడు .... అమావాశ్యనాడు ( కష్టకాలములో )

    రాజుగ తారలనేలు వి
    రాజితదీవ్యత్ప్రభావ లక్షణుఁడగు రే
    రాజు తన ప్రభను కోల్పడు
    సౌజన్యుండైన నేమి సంకటమందున్.

    రిప్లయితొలగించండి
  19. యోజించి సత్ఫలితమును
    రాజీపడకుండ విధికి రంజిల్లడు తా
    రాజైనను, ప్రజమెచ్చిన
    సౌజన్యుండైన నేమి సంకటమందున్

    రిప్లయితొలగించండి
  20. వాజసనుని భజియింపక
    సౌజన్యుండైన నేమి? సంకట మందున్
    ఆ జన్మాంతర దుష్కృత
    మీ జన్మను కట్టి కుడుపు టిది తప్పదనన్

    రిప్లయితొలగించండి
  21. తేజమలర పాలించెడు
    రాజైనను బంధు జనుల రంజిల బోవన్,
    రాజీ మార్గము వెతుకగ
    సౌజన్యుండైన నేమి? సంకటమందున్!

    రిప్లయితొలగించండి
  22. గురుదేవులకు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు.

    రిప్లయితొలగించండి
  23. గురువర్యులకు జన్మదిన శుభాకాంక్షలు.

    రిప్లయితొలగించండి
  24. ఈ జగతి లోన దశరథ
    రాజసుతుడు సద్గుణాభి రాముడు ప్రజచే
    పూజింపదగిన యగణిత
    సౌజన్యుండైన నేమి సంకట మందున్

    రాజైనను ధరణి సుకవి
    రాజై నను భోగులును విరాగులకైన
    న్నీ జగతి జనులు పొగడెడు
    సౌజన్యుండైన నేమి సంకట మందున్

    రిప్లయితొలగించండి
  25. గురువు గారైన మాన్యశ్రీ కంది శంకరార్య గురువు గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు.

    రిప్లయితొలగించండి
  26. భూజనులకు ధైర్యంబున
    తేజంబును విజయమొదవు దీప్తియు గల్గున్
    నైజంబిది యది కొరవడ
    సౌజన్యుండైన నేమి సంకట మందున్.
    హ.వేం.స.నా.మూర్తి

    రిప్లయితొలగించండి
  27. తేజస్వి , శాంత మూర్తియు
    రాజసమును జూప నట్టి రాజే యైనన్
    భోజుండును పడె నిడుముల ;
    సౌజన్యుండైన నేమి సంకట మందున్

    రిప్లయితొలగించండి
  28. మిత్రులు శంకరయ్యగారు,

    శంకరాభరణం వేదికలో నాకారణంగా అనవసరచర్చలు రగులుకోవటం అభిలషణీయం కాదు. ఈ‌ శంకరాభరణం బ్లాగు ఒక రచ్చబండగా మారి అభాసుపాలు కాకుండా మీరు జాగ్రత వహించగలరని ఆశిస్తున్నాను. ఇక్కడ నా ఉనికి వలన మీకు కాని ఇతర కవిమిత్రులకు కాని ఇబ్బంది కలగటం ఇష్టం లేదు నాకు. సెలవు దయచేయించండి.

    భవదీయుడు
    తాడిగడప శ్యామలరావు.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. శ్యామల రావు గారు సాహిత్య చర్చ వలన ననేక విషయాలు వెలుగులోకి రాగలవు. ఈ చర్చ వలన ప్రయోజనమును పొందుటయే ధ్యేయమని నేను భావిస్తున్నాను.మీరు మనస్తాపమునకు గురి కాకండి. ఆనందముగా పాల్గొంటారని యాశిస్తున్నాను.

      తొలగించండి
    2. కామేశ్వరరావు గారూ, మీరు అన్యథా భావించకండి. సాహిత్యచర్చల పట్ల మీ ఆసక్తి హర్షణీయం. నా పరిస్థితులు అనుకూలంగా లేవు. చర్చలపేరిట జరిగే రాధ్ధాంతాలకు ఈ బ్లాగు వేదికగా మారకుండా నావంతు ప్రయత్నంగా బాధాకరమైనదే ఐనా శంకరాభరణం బ్లాగుకు దూరంగా ఉండకతప్పదని నిర్ణయించుకున్నాను. ఒకరికి చెప్పగలవాడను కాను. ఈ బ్లాగును ఆరోగ్యకరంగా ఉంచేందుకు శంకరయ్యగారితో పాటుగా మీరు కూడా మీవంతు కృషిని కొనసాగించగలరు. నా సాహిత్యకృషికి ఆధ్యాత్మికసాధనకూ నా వేదిక నాకు ఉన్నది. కొద్దిమంది దానిని కూడా చదువుతున్నారు. అక్కడ నా కృషిని ఓపినంతగా కొనసాగించగలను. ఇతరత్రా నేను కనిపించటం అంత సముచితంగా లేదు ప్రస్తుతపరిస్థితుల్లో. కొన్నాళ్ళ క్రిందటే పరిస్థితులు అవగాహన చేసుకొని విరమించినా మిత్రులు శ్రీశర్మగారి అదేశం మేరకు తిరిగి యధాప్రకారం ఉంటున్నాను. కాని పెద్దలు అనుకున్నదీ నేను ఆశిస్తున్నదీ కాక వేరేగా ఉన్నది పరిస్థితి. ఇక మౌన ముత్తమభాషణమ్‌ అనుకొనక తప్పదు కదా. మీ ఆధరానికి కృతఙ్ఞుడను.

      తొలగించండి
    3. శ్యామలీయంగారికి నమస్సుమాంజలులు. మీరు సెలవనకుండా దయతో మా పద్యరచనకు సహకరించప్రార్థన. మీ సలహాలు మరియు సూచనలు సదా అనుసరణీయమని నమ్ముతున్నవాళ్లలే నేనొకడిని. _/\_

      తొలగించండి
  29. ఆ.వె:కందివారు మనకు కమ్మని గురువులు
    జన్మదినము నేడు జరుగు చుండె
    పద్య విద్య నేర్పు పండితోత్తములకు
    వందనమ్ము లిడగ వడిగ రండు. !
    జన్మదినశుభాకాంక్షలతో

    డా.బల్లురి ఉమాదేవి.

    రిప్లయితొలగించండి
  30. "కం"ఠంలో శ్రీ ని దాచుకొని
    "ది"తిపుత్రులకభయ ప్రదాతయైన
    "శం"కరుల నామధేయంతో అలరారుతూ
    "క"మ్మని సమస్యలను కవి మిత్రులకొసగుతూ
    "ర"మణీయమైన పూరణలతో నలరిస్తూ,అ
    "య్య"వారిలా తప్పొప్పులను సవరిస్తున్న
    శ్రీ కంది శంకరయ్య గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు.
    ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని కోరుతూ నమస్సులతో
    ఉమాదేవి.

    రిప్లయితొలగించండి
  31. శ్రీకందిశంకరయ్యగురువుగారికి వందనములతోజన్మదిన శుభాకాంక్షలు
    జన్మదినములు వందలు జరుపుకొనగ
    ఆయురారోగ్యభాగ్యమ్ములందునటుల
    శంకరాభరణాశీస్సు,శారదాంబ
    నొసగ?నూరేళ్ళువర్ధిల్లు విసుగులేక.

    రిప్లయితొలగించండి
  32. ఆజన్మము జరరుజలన్
    సైజోడైయుండ మగడు చౌకనఁ బడుటన్
    తాఁ జూడలేదు స్త్రీ విర
    సౌ, జన్యుండైన నేమి సంకట మందున్॥

    రిప్లయితొలగించండి
  33. కంది వంశ సుధాంబుది చంద్రులయ్యి
    పద్య రచనల నెన్నియోహృద్య ముగను
    చేయు చున్నట్టి బుదునకు చేతు లెత్తి
    జన్మ దినశుభా కాంక్షలన్ జగతి లోన
    యంద జేసెద గురువర్యయందు కొనుడు

    రిప్లయితొలగించండి
  34. రాజైన రామచంద్రుడు
    రాజీవాక్షిని వెదుకుచు రభసము తో తా
    రోజుల తరబడి తిరిగెను
    సౌజన్యుండైన నేమిసంకటమందున్.

    రిప్లయితొలగించండి
  35. శ్యామలీయం గారికి నమస్కారములు
    మీ వంటి వారి సూచనలతో మాలాంటి వారికి పద్యరచనల పట్ల పూర్తి అవగాహన కలుగుతుందనడంలో ఎలాంటి సందేహమూ లేదు.
    మీ లాంటి వారితోనే తెలుగు పద్యానికి పూర్వవైభవం ప్రాప్తించగలదు . దయచేసి మీరీ బ్లాగులో ఇలాగే కొనసాగాలని మనస్పూర్తిగా విన్నవించుకుంటున్నాను.

    రిప్లయితొలగించండి
  36. కవిమిత్రులకు నమస్కృతులు.
    ఈరోజు ఉదయమంతా మా బావమరది తొమ్మిదవ రోజు కర్మకాండలో గడిచిపోయింది. మధ్యాహ్నం బయలుదేరి బమ్మెరలో జరిగిన కవిసమ్మేళనంలో పాల్గొని, సన్మానం పొంది ఇంతకుముందే ఇల్లు చేరాను.
    ‘సౌజన్యుడు’ శబ్దచర్చ ఎక్కువగానే జరిగినట్టుంది. ప్రయాణపుటలసట, తలనొప్పి కారణంగా ఇప్పుడు చదివి స్పందించలేను. రేపు తీరుబడిగా చూస్తాను.
    ముఖ్యంగా నాకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన మిత్రులందరికీ ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  37. సజ్జనులైన పండితుల పట్ల గౌరవాన్ని ప్రకటించడం మన ధర్మం. వారి ప్రతిభను, హితోక్తులను ఆలంబనగా చేసుకొంటే మన పరిజ్ఞానం మరింత పరిపుష్టి నొందు తుంది. లేకపోతే నష్టం మనకే కాని వారికి కాదు.

    రిప్లయితొలగించండి
  38. శ్యామలీయం గారికి నమస్సులు. మిడిమిడి జ్ఞానం తో కొందరూ, దృఢ నమ్మకంతో కొందరూ తమ అభిప్రాయాలను తెలియజేస్తారు. అంతమాత్రము చేత మీరు బాధపడవద్దు.మీపై కవిమిత్రులందరికీ అపారమైన గౌరవం ఉన్నది. మునుపటిలా వివరంగా మాకు సక్రమ మార్గము నిర్దేశించ ప్రార్థన.

    రిప్లయితొలగించండి

  39. మిస్సన్న గారిది సథ్యనారాయణ గారిది భేషైన మాట

    శ్యామలీయం వారు యథాప్రకారం తమ విశ్లేషణ కొన సాగించాలి ;


    జిలేబి

    రిప్లయితొలగించండి
  40. శ్రీ కంది శంకరయ్య గారికి అరవై ఎనిమిదవ జన్మదిన శుభాకాంక్షలతో...

    చం.
    సకల గుణాన్వితోన్నతుఁడు, చారు సుకీర్తిత ధన్య జీవుఁడున్,
    వికసిత బుద్ధివైభవుఁడు, విజ్ఞుఁడు, శాంతుఁడు, జ్ఞానమూర్తి, స
    త్ప్రకటిత పండితోత్తముఁడు, ప్రజ్ఞ విరాజిలు కావ్యకర్తలం
    దొకరుఁడు కంది శంకర బుధోత్తమ, జన్మదినోత్సవాంజలుల్!

    కం.
    హృద్యములగు పద్యమ్ముల
    నాద్యంత సువేద్యముగ నిరాటంకముగన్
    శ్రీద్యుతి చెన్నలరారన్
    సద్యః ప్రభలొలుక రచన సాగించితయా!

    ఆ.వె.
    ఎంత కాంతిమంత! మెంత వింతగు పుంత!
    సుంతయేని విసువు వంత నిడదు!
    ఇంత భావదీప్తి నెంతు నుతింతును
    సాంతముగను జదివి సంతసింతు!

    సీ.
    బాల్యమ్మునుండియు బాగుగా విద్యలో
    రాణించి యెదిగిన రత్న మీవు;
    శ్రమియించియును విద్య సక్రమమ్ముగ నేర్చి,
    విజ్ఞాన ఖనియైన విజ్ఞుఁ డీవు;
    బోధకవృత్తి సుభూషణమ్మని యెంచి,
    తలఁదాల్చి వెలిఁగిన ధన్యుఁ డీవు;
    విద్యార్థులందఱన్ బిడ్డలుగా నెంచి,
    దయను బ్రేమను జూపు తండ్రి వీవు;
    వృత్తిధర్మముఁ దక్క వేఱొక్క ధర్మమ్ము
    ముందుగాఁ దలఁపని మునివి నీవు;
    వారు వీరను భేదభావ మెఱుంగక
    హితముఁ గల్గించు స్నేహితుఁడ వీవు;
    కోప మింతయు లేక కోమలమ్మగు వాక్కు
    చిఱునవ్వు తళుకొత్తు శ్రేష్ఠుఁ డీవు;
    శంకరాభరణాఖ్య సాహితీ శీర్షికన్
    రస రమ్యముగఁ దీర్చు ప్రాజ్ఞుఁ డీవు;
    గీ.
    మంచి వీవు! సుగుణ గణ మణివి నీవు!
    బంధుఁ డీవు! సుధీజన బంధ మీవు!
    స్నేహ మీవు! సంపూర్ణ సౌశీల్య మీవు!
    కవుల కందఱ కాదర్శ కవివి నీవు!!

    తే.గీ.
    పర ధనమును మృత్పిండమ్ము పగిది నెంచి,
    పర సతీ మణులను దల్లి వలెఁ దలంచి,
    యెపుడు శాంత్యహింసాక్షమాకృపలు, దాన
    ధర్మసద్గుణశౌచసత్యములు గలిగి,
    యొజ్జబంతివై మెలఁగిన యొజ్జవైన
    నీకుఁ బరమాత్ముఁ డెంతయు నీవి తోడ
    నాయురారోగ్యభోగభాగ్యైహికమ్ము
    లీప్సితార్థమ్ము లనిశమ్ము నిచ్చుఁ గాక!

    ***శుభం భూయాత్***

    రిప్లయితొలగించండి
  41. అకలంకశంకరులకు అనుపమ కవితాకాంక్షలు.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. గురుతుల్యులు శ్రీ శంకరయ్యగారికి జన్మదినోత్సవ శుభాకాంక్షలు.
      శ్రీ గుండు మధుసూదన్ గారి శుభాకాంక్షాపద్యరత్నాలు అక్షర సత్యాలు.
      శుభమస్తు.

      తొలగించండి
  42. ‘సౌజన్యుడు’ శబ్దచర్చ, దాని పరిణామాలు నిశితంగా పరిశీలించాను. ప్రస్తుతం శబ్దసాధుత్వం విషయమై ఏమీ చెప్పలేను. కాని శ్యామలీయం గారు మన బ్లాగుకు దూరంగా ఉంటామని ప్రకటించడం బాధాకరం. మిత్రుల కోరికను మన్నించి వారి విశ్లేషణలను, సలహాలను కొనసాగించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
    ఇంతకుముందే ఈ విషయమై అమెరికాలో ఉన్న చింతా రామకృష్ణారావు గారితో కూడా చర్చించాను. వారు కూడా శ్యామలీయం గారి నిర్ణయం పట్ల తమ ఆవేదనను తెలియజేశారు.

    రిప్లయితొలగించండి