శర్మ గారికి, కామేశ్వర రావు గారికి, హనుమచ్ఛాస్త్రి గారికి, ధన్యవాదములు.
గురువుగారు, ధన్యవాదములు. రగణ దండకములో చివర రగణము తరువాత గురువుతో ముగించాలని నియమము చదివాను. "నమస్తే నమః" అంటే ఆ నియమ భంగమవుతుందని అనలేదు. అది తగణ దండకముకు సరిపోతుంది అనుకుంట.
అక్కయ్య నేరుగా బ్లాగులో పోస్ట్ చేశారు. అయితే పొరపాటున ‘Enter' కీ చాలాసార్లు నిక్కడం వల్ల చాలా స్థలాన్ని ఆక్రమించింది. అందువల్ల నేను ఆ పద్యాన్ని కాపీ చేసి పేస్ట్ చేసి, అక్కయ్య గారి పద్యాన్ని తొలగించాను.
కామేశ్వర రావు గారూ, మీ రిచ్చిన ఉదాహరణలు సబబుగానే ఉన్నాయి. కాని ఎందుకో ‘తల తనిశమ్ము’ సాధువు కాదని అనిపిస్తున్నది. ‘చూతు+అనిశమ్ము, చేతు+అనిశమ్ము, వలతు+అనిశమ్ము’ మొదలైన చోట్ల చూతనిశమ్ము, చేతనిశమ్ము, వలతనిశమ్ము.. అని రూపాలు రావని అనిపిస్తున్నది. వ్యాకరణ గ్రంథాన్ని సంప్రదించి సమాధానం చెప్తాను.
రగణ దండకము
రిప్లయితొలగించండిఛత్రమా! వాన కాలమ్మునన్ నీవు మాకుండగా బండగౌ, లేనిచో దండగౌ!నీవు చేఁబెండరమ్మై మమున్ కావవే! యెండ కాలమ్మునన్ నీవు లేనట్టిచో మాడు మాడంగ తాపమ్మునోర్వంగ కష్టంబుకాదే! తలన్ దాల్చరే నిన్ను గర్విష్ఠులైనన్ ముదంబొందగన్! తొల్లి నీ వస్త్రమున్ చూడగా నల్లనౌ! నేడు నీ రూపు రేఖల్ విలాసంబులై సంచరించంగ మోదంబునౌ! అంబవై నీవు కావంగ నిన్నంబరిల్లందుమే! ఛత్రమా! మిత్రమా!తంత్రమా! మంత్రమా! బ్రోవ రావే!!
సత్యనారాయణ గారూ నమస్కారములు. మీ దండకమద్భుతం
తొలగించండిసత్యనారాయణ గారూ,
తొలగించండిమనస్సుకు ఆహ్లాదాన్ని కలిగించే దండకం అందించారు. అభినందనలు.
‘బ్రోవ్ర రావే సమస్తే నమస్తే నమః’ అంటే నిండుదనం వచ్చేది కదా!
సత్యనారాయణ గారు! యతిప్రాసల ప్రయాసల నతిక్రమించి రగణ జతల గారవించి సుతి మెత్తగ ప్రతి పదము సుగతి నిడి మతులకు రతి గూర్చి యతి విలాస ధృతి గొడుగును నుతియించి శంకరాభరణమునఁ బతితము గావించిన మీకు నభినందనలు.
తొలగించండిజిగురు వారూ! గొడుగునకు చక్కగా గొడుగు పట్టారు.
తొలగించండిశర్మ గారికి, కామేశ్వర రావు గారికి, హనుమచ్ఛాస్త్రి గారికి,
తొలగించండిధన్యవాదములు.
గురువుగారు,
ధన్యవాదములు. రగణ దండకములో చివర రగణము తరువాత గురువుతో ముగించాలని నియమము చదివాను. "నమస్తే నమః" అంటే ఆ నియమ భంగమవుతుందని అనలేదు. అది తగణ దండకముకు సరిపోతుంది అనుకుంట.
కుండ పోతగ వానలు కురిసె నోయి
రిప్లయితొలగించండిబండ రాళ్లన శబ్దము బడబడ యనె
బెండలూరు దండలనమ్మ బెంగళూరు
బోవ గొడుగు బట్టె జిలేబి బొమ్మలమ్మి :)
జిలేబి గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది (ఒట్టు.. నిజంగానే బాగుంది!). అభినందనలు.
నేటి దత్తపది
రిప్లయితొలగించండికుండ- దండ- బండ- బెండ
( గొడుగును వర్ణించుట)
మా తనువులెండవేడికి మాడకుండ
నండదండగ నీవుండి నలరు చుండ
బండలు పగులువేడిమి పారిపోయి
బెండగిలిపోవు ఛత్రపు చెట్టు నీడ
శ్రీరామ్ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
‘నీవుండి యలరుచుండ’ అనండి. నాల్గవపాదంలో యతి తప్పింది. ‘బెండగిలిపోవు ఛత్రపు టండ యుండ’ అందామా?
కోర వర్షాలలో నాన కుండ జేసి
రిప్లయితొలగించండిఅండగా నుండు దానవు దండ మిడుదు
మెండు రంగుల నినుజూడ బండ గవును
యెండలన్ తోడు గోరెద బెండగిల్ల!
బెండగిల్లు=ప్రయాణమగు
శర్మ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
సవరణతో
రిప్లయితొలగించండిమాతనువులెండవేడికి మాడకుండ
నండదండగ నీవుండి యలరుచుండ
బండలు పగులు వేడిమి పారిపోయి
బెండగిలిపోవు ఛత్రపు బెట్టుచూసి
మీ సవరణ బాగుంది. అభినందనలు.
తొలగించండివాన బడకుండ గాపాడు వస్తు వగుచు
రిప్లయితొలగించండినండదండ లు గానుండు నంబరంబు
బండ హృదయులు సహితము బెండ లేమి
దీని చేబూని బోదురు వాన లోన
సుబ్బారావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
‘అంబరంబు’నకు అన్వయం?
రాజోలి బండ ప్రాజెక్తు వద్ద సమ్మెచేయబోవు కర్షకులకు నేత సహాయంచేశాడు.
రిప్లయితొలగించండిబెండగిల్లగ రాజోలి బండకడకు
వర్షమందు తడువ కుండ కర్షకులకు
నండదండనివ్వ తలచినట్టి నేత
యిచ్చె చత్రముల్ వారికి నిమ్ముగాను
అన్నపరెడ్డి వారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
వానకాలమందు బండచాకిరిజేసి
రిప్లయితొలగించండితడియకుండమనల దరిని జేర్చు
మండుటెండలందు బెండగిల్లుజనుల
దండ నుండు గొప్ప దాత గొడుగు!!!
దండ= ప్రక్క,ఆధారము
కుండల భాసిత ముఖ! వే
తొలగించండిదండ సురక్షా వినోద! తల తనిశమ్ముం
బండరి నాథా! చిత్తం
బెండ నఘచయ ఘన వహ్ని నేనొరు నెఱుఁగన్
శైలజ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
*****
కామేశ్వర రావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
‘తల తనిశమ్మున్’..? తలతు + అనిశమ్మున్ = తలతు ననిశమ్మున్ అవుతుంది కదా! ‘తలతు నిరతముం| బండరి...’ అంటే ఎలా ఉంటుంది?
రాజేశ్వరి నేదునూరి గారి పూరణ.....
రిప్లయితొలగించండిమండు టెండన ఛత్రమై మాడ కుండ
అండ దండగ నిలచెడి నాప్త హితుడు
పంట బండగ నీవుమా వెంట నున్న
బింక మందున నినువీడ బెండ గిల్లు
బెండ గిల్లు = బాధ పడు
అక్కయ్యా,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
She is not posting directly.
తొలగించండిఅక్కయ్య నేరుగా బ్లాగులో పోస్ట్ చేశారు. అయితే పొరపాటున ‘Enter' కీ చాలాసార్లు నిక్కడం వల్ల చాలా స్థలాన్ని ఆక్రమించింది. అందువల్ల నేను ఆ పద్యాన్ని కాపీ చేసి పేస్ట్ చేసి, అక్కయ్య గారి పద్యాన్ని తొలగించాను.
తొలగించండిఎండలో ముఖ పేశలం బెండకుండ
రిప్లయితొలగించండికురియు వానలో తలదాచుకొనగ, వలయు
బండగుని కైన, కోదండపాణి కైన
'గొడుగు' చిహ్నము పట్టము కొరకు కూడ
తిమ్మాజీ రావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. అవునండి నుగాగమ సంధి మర్చిపోయాను. మీ సవరణ కు ధన్యవాదములు. సవరించిన పూరణ:
రిప్లయితొలగించండికుండల భాసిత ముఖ! వే
దండ సురక్షా వినోద! తలతు నిరతముం
బండరి నాథా! చిత్తం
బెండ నఘచయ ఘన వహ్ని నేనొరు నెఱుఁగన్
వాన బడకుండ గాపాడు వస్తు వగుచు
రిప్లయితొలగించండినండదండ లు గానుండి యా త పత్ర
మనగ నొప్పును బుడమిని నార్య !మరియు
బండ హృదయులు సహితము బెండ లేమి
దీని చేబూని బోదురు వాన లోన
సుబ్బారావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
‘బెండ లేమి".....?
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిఈశ్వరప్ప గారూ,
తొలగించండిమీ పూరణలు బాగున్నవి. అభినందనలు.
సీసపద్యం మూడవపాదం ఉత్తరార్ధంలో గణదోషం. ‘ప్రాకృతి’ని ప్రాకృత’ అనాలి అనుకుంటాను.
ఎండ కవనీ తలంబెండ నేమి మనకు
రిప్లయితొలగించండిజలధరంబండ తనకుండ నిలకు జేరు
వర్షమన్నను భయమేల వసుధజనుల
కండదండగ గొడుగున్న హర్షమేను
విరించి గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
ఒక్క చుకైన నీరింక దక్క కుండ
రిప్లయితొలగించండిబండ బలిగెడి రీతిగా నెండ గొట్ట
బెండ తోటను కాపాడ దండ మిడుచు
ఛత్ర మట్లుగ భాసిల్ల జగతి లోన
రక్ష గోరితి కోదండ రామ నేను
శ్రీనివాస్ చారి గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
అగ్ని కుండము బోలిన యాతపమ్ము
రిప్లయితొలగించండినుండి, వాన జల్లుల నుండి యండ దండ
లిడెడు గొడుగు యుండగ కార్య మెటుల నేని
బండగును! బెండగు తలపు లుండ బోవు!
శ్రీధర రావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
కొన్ని మార్పులతో మరియొక పద్యం
రిప్లయితొలగించండిసూర్య తాపము తలపైని సోక కుండ
నరయగా వర్షమును దాట యండ దండ
లిడెడు గొడుగు యుండగ కార్య మెటుల యేని
బండగును! బెండగు తలపు లుండ బోవు!
శ్రీధర రావు గారూ,
తొలగించండిమీ పూరణలో ‘తలపైన, దాట నండదండ’ అనండి. ‘గొదుగు+ఉండగ=గొడు గుండగ’ ఇక్కడ యడాగమం రాదు. ‘గొడుగు లుండగ’ అందామా?
బండలు పగులగొట్టెడి యెండ నుండి,
రిప్లయితొలగించండివర్షముననుతడువకుండ పల్లె ప్రజకు
యండదండల సతమిడుచుండు సుమ్మ
బెండగొడ్డుకు సైతము ప్రియము గొడుగు
బెండగొడ్డుః సోమరిపోతు
అన్నపరెడ్డి వారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
‘ప్రజకు| నండదండగ...’ అనండి.
పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. చిన్న సందేహమండి. “తలతు” తద్ధర్మార్థమే కాని “తలతు + అనిశమ్ము” లో అనిశమునకు తలతు విశేషణము కాదు గద నుగామమునకు! తలతును లో దృతము లోపింపగా తలతనిశమని గూడ సంధి చెయ్య వచ్చునేమో? తెలుప గోర్తాను.
రిప్లయితొలగించండివచ్చుచున్ + ఉండెను = వచ్చుచుండెను, వచ్చుచునుండెను
నన్ను + అడిగె = నన్నడగె, నన్నునడిగె వలె.
కామేశ్వర రావు గారూ,
తొలగించండిమీ రిచ్చిన ఉదాహరణలు సబబుగానే ఉన్నాయి. కాని ఎందుకో ‘తల తనిశమ్ము’ సాధువు కాదని అనిపిస్తున్నది. ‘చూతు+అనిశమ్ము, చేతు+అనిశమ్ము, వలతు+అనిశమ్ము’ మొదలైన చోట్ల చూతనిశమ్ము, చేతనిశమ్ము, వలతనిశమ్ము.. అని రూపాలు రావని అనిపిస్తున్నది. వ్యాకరణ గ్రంథాన్ని సంప్రదించి సమాధానం చెప్తాను.
శ్రీగురువర్యులగు శంకరయ్యగారికివందనములతోసవరించినపూరణ
రిప్లయితొలగించండి2 సీ; పచ్చని చెట్లన్ని నచ్చిన గొడుగులై| అండయే లేకుండ నుండగలమ?
వానలు రప్పించి పంటలు బండించ?దండమిడుదు మీకు మెండుగాను
ఎండలు మెండైన కండను రక్షించి బండబారక బ్రతుక లండజేర్చు|
బెండగు వేడిమి నిండుగ చెట్లున్న ?ఆహ్లాద మందించునవని కెపుడు
ఉన్న వారికి గొడుగుండ?నుంచు మేలు
లేనివారికి ప్రాకృత లీలగాను
చెట్ల ఛత్రాలుభువియందు జేర్చ?మేలు
వాన లెండకురక్షయౌ వసుధయందు|
అండ మాకుండ? నెండలుద్దండ మైన?
రిప్లయితొలగించండిబండబారిన బెండలానుండిపోవు|
దండమందును చత్రమా తడిసి పోక
వానబెండైన భయమునుపారదోలు|
తడవకుండ జేయు తద్ధర్మ మన్నట్లు
అండదండ గాను నుండు గొడుగు
బండబారు లెండ,వానలు గురిసినా|
బెండగిల్ల కున్న?బెదురులావు {బెండగిల్లు=బలహీనపడు}
ఈశ్వరప్ప గారూ,
తొలగించండిమీ రెండు పూరణలు బాగున్నది. అభినందనలు.
‘బెండలా నుండిపోవు’...?
‘కురిసినా’ అన్నదాన్ని ‘కురిసినన్’ అనండి.
కుండపోతగ వర్షమ్ము కురియు తరిని /నపుడు
రిప్లయితొలగించండిమండు వేసవి సమయాన మంచి తోడు
బండ దారిసాగునపుడు భయము నుడుపు
బెండగిల్లెడి వేళల విడకు ఛత్రి/గొడుగు
ఉమాదేవి గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
రిప్లయితొలగించండిగు రు మూ ర్తి ఆ చా రి
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
ఎ౦డకున్ బె౦డగిలవు - రక్షి౦చు గొడుగు |
వాన పడకు౦డ నిన్ను - కాపాడు గొడుగు |
" బ౦డ బాకిదారుడు " కనపడ డల ఋణ
దాతకు , మొగము గొడుగులో దాచుకొనగ |
గొ౦టు మాటలు నీ ద౦డ కూయు వాని ,
గొడుగు వాడి యైన కొనతో పొడువ వచ్చు |
{ బ౦డ బాకి = మొ౦డి బాకి ;
నీ ద౦డ = నీ సమీపమున }
ఆచారి గారూ,
తొలగించండిగొడుగువల్ల ప్రయోజనాలను చక్కగా వివరిస్తూ మంచి పూరణ చెప్పారు. అభినందనలు.
రిప్లయితొలగించండిసూర్యనారాయణుని వేడిసోకకుండ
మండుటెండల నడవంగ దండ నుండు
బండ లమ్మువేళల తల పైననుండు
బెండగిల్లనీక సతమునండ నుండు.
ఉమాదేవి గారూ,
తొలగించండిమీ రెండవ పూరణ కూడ బాగున్నది. అభినందనలు.
తెరిపి లేకుండ వర్షము కురుయు చుండె
రిప్లయితొలగించండినాకు కలదండగ గొడగు నానకుండ
బండ రామునికే లేదు నిండ తడిసె
వాన సమయంబెండునా వస్త్రములును.
లక్ష్మినారాయణ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
చివరి పాదంలో గణదోషం. ‘వానల సమయం బెండునా..’ అనండి.
అంజయ్య గౌడ్ గారి పూరణ...
రిప్లయితొలగించండిసీస.
ఎత్తి పట్టితె చాలు ఎండతగల కుండ
కాపాడెదవు మమ్ము ఘనముగాను
పూదండ వలె నిన్ను భుజమున తగిలించు
కొనియు నూరేగరే కొంతమంది
అలనాడు జమదగ్ని నాగ్రహ జ్వాలలో
నవతరించితి వీవు నద్భుతముగ
బండలు నైనను పరగ నీ చాయలో
శీతలమౌనులే శీఘ్రముగను
వామనుని పుణ్యకరములో వరలునిన్ను
బెండ గిల్లగ సంకలో పెట్టు కొనియు
రెండు కాలములలో నీవు నండయుండ
సుఖముచెందేరు నరులిల సొంపుగాను !!
అంజయ్య గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
రిప్లయితొలగించండిదండము గొడుగేశా మా
కుండగ నీయండ వాన యుండగనెండల్
బెండై పోవును, మాకున్
బండుగ నాడౌను చేత పట్టెద నిన్నే!
హనుమచ్ఛాస్త్రి గారు,
తొలగించండి"గొడుగేశా" పద ప్రయోగాన్ని పరిశీలించాలి.
గొడుగు + ఈశ = గొడుగీశ (అనాలనుకుంట)
శాస్త్రి గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
గొడుగీశా/ గొడుగేశా... రెండూ దోషాలే. ‘దండమ్ము గొడుగు దేవర| యుండగ మా కండ వాన యుండగ నెండల్’ అందామా?
జీ యస్ యన్ గారూ ! ధన్యవాదములు...చిన్న మార్పు చేస్తున్నాను.
తొలగించండిదండం 'బంబ్రిల్లా' మా
కుండగ నీయండ వాన యుండగనెండల్
' బెండై ' పోవును, మాకున్
బండుగ నాడౌను చేత పట్టెద నిన్నే!
మాస్టరుగారూ ! ధన్యవాదములు..ఆ ఉద్దేశ్యం తోనే చిన్న మార్పు చేశాను..( అన్య భాషా పదంతో )
తొలగించండిహంసా ! విడుమా నీ మీ
రిప్లయితొలగించండిమాంసను, సలుపగ పరీక్ష మాంసము, పండ్లన్
హింసను పెట్టక నిడ, విడి
మాంసము, దిన విప్రవరుఁడు మాన్యుం డగురా!
శాస్త్రి గారూ,
తొలగించండిబాగుంది నిన్నటి సమస్యకు మీ పూరణ. అభినందనలు.
గొడుగు లేకుండ వర్షాన తడువ కుండ
రిప్లయితొలగించండిదండ నాథుల కైనను దప్పదు కద!
బండ శిల్పాల కెందుకీ కొండ గొడుగు
బెండ యాకుల గొడుగున నెండ పడున?
విద్వాన్,డాక్టర్,మూలె.రామమునిరెడ్డి విశ్రాంత తెలుగు పండితులు ప్రొద్దుటూరు.కడప జిల్లా
రామముని రెడ్డి గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
లేకుండ నీవు గడువదు
రిప్లయితొలగించండిదాకొన నీ క్రిందన కయిదండయి నీవుం
డన్ కోరినఁ బెండల వడ
గైకొని తినినంత బండుగన్ వర్షములోన్||
రిప్లయితొలగించండికుండలముగ నువ్ దిరుగుచుఁ
బండగ దినములఁ దిరుమల వాసుని శిరమున్
బెండగిల నీని గొడుగా!
యుండగ నీదండదండ నోర్తుము నెండన్!