పద్మావతీ శ్రీనివాసము (ద్విపద కావ్యము)
రచన : పోచిరాజు కామేశ్వర రావు
చతుర్థాశ్వాసము (41-60)
అగణిత గుణశీలి నష్టాదశ కలి
యుగమున వరియింతు నువిదను బ్రీతి 41
అమర పూజల నంది యబ్జజ లోక
మమరి యుండును నారి యంత వరకును
42
తదనంతరము భూమి తనయగ పుట్ట
ముదముగ నా వరము సిరి వరమును
43
ఆకాశ రాజున కాసతి యిపుడు
రాకుమారి ధరణి రంజిల్ల దొరికె 44
నారాయణ పురమున నళిన రాశి
నారాయణీ నిభ నళిన దళాక్షి 45
చెలికత్తియల గూడి చిరునవ్వు తోడ
నలినాక్షి యంత వనమున తిరుగుచు 46
మృగముల వేటాడ మెలగెడి నాకు
నగపడె కోయుచు నలివేణి విరుల 47
వర్ష శతమ్ముల వర్ణింప దరమ
హర్ష మెసగ కలహంస గమనను 48
పద్మాభ పద్మజ పద్మ దళాక్షి
పద్మాభయప్రద పద్మాక్ష వరద 49
మేన నసువుల కల్మి పొసగు నపుడ
తాను రమా సహితము నన్నుఁ జేర 50
వకుళ తెల్పుము వియత్పతి పుర మేగి
సుకుమారిఁ గని నాకు సుందరి తగునె
51
అనవిని వకుళ మోహాపన్నుఁ గాంచి
చనియెద చెప్పుడి సతియున్న దారి 52
వేగమ నేగుదు విశ్వేశ జూడ
నా గజయానఁ గల్హార నయనను 53
అంత జెప్ప దొడంగె నరవింద నేత్రు
డింతికి ప్రియమార నింపైన దారి 54
అతివ యీ శ్రీనృసింహ కుహర మార్గ
ము తరించి భూధరము మనోజ్ఞము దిగి 55
సంయ మీంద్రుం డగస్త్య సదాశ్రమమ్ము
సంయానఁ గని కుంభ సంభ వార్చితము
56
లింగ మగస్త్యేశు లీలా మయుం ద
రంగ భాసిత సువర్ణ ముఖరీ తటిని 57
పూజించి కడుభక్తి
పూఁబోఁడి సనుము
భాజనీయము శుక వనము సుందరము 58
అన్నదీ తట పధ మనుసరించి చన
కన్నుల కింపగు కమలాకరమ్ము 59
రుచిరమ్ము పద్మసరోవర మందు
శుచిగ తానము జేసి శుక మహాత్ముండు 60
వేంక టేశునకారయ వేగముగను
రిప్లయితొలగించండివచ్చె గళ్యాణ ఘడియలు వకుళ వలన
చదువ నాహ్లాదము గలిగె సార మదియ
వేంక టేశుని బూజింతు విరుల తోడ
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండికళ్యాణఘడియలింకా మూడాశ్వాసముల దూరములో ఉన్నాయన్నయ్య.
రిప్లయితొలగించండి