17, జులై 2016, ఆదివారం

పద్మావతీ శ్రీనివాసము - 4

పద్మావతీ శ్రీనివాసము (ద్విపదకావ్యము)
రచన : పోచిరాజు కామేశ్వర రావు

ప్రధమాశ్వాసము (61-72)

భాగవ తోత్తమ పావన గాథ
లీ గతి వింతలు హితకర ములును                    61

దరహాస వదనుడై తాపసిఁ జేరి
హరి శాంతుజేసి ప్రేమాతిశయమున                   62

పలికెను భవదీయ పదము నాదయిన
పలుసంపు రొమ్మునఁ బడి కందె నేమొ                 63

శాంతింపు మయ్య విశ్రాంతి నిచ్చోట
సుంత యేమరచితిఁ జూడ నే నిన్ను                    64

మధుసూద నాస్య సుమధుర భాషల న
వధరించి ముద మొందె భట్టారకుండు                 65

అగ్నిముఖుని గర్వ మణచ నెంచి హరి
భగ్న పాదాక్షుగ వానిఁ జేసె నిక                        66

ముక్తాతిశయ ఘన ముదితాంతరంగ
భక్త శిఖామణి పద్మాక్షుఁ గొలిచె                        67

భక్తవత్సల లోకపాల పరాత్మ
ముక్తిప్రదాయకా మోహనరూప                        68

ఆది మధ్యాంతము లరయంగ లేము
నీదు లీలలు మేము నేరంగ లేము                      69

పరిపరి విధముల ప్రార్ధించి విప్రు
డరిగె నామంత్రణ మంది ముదముగ                  70

యజ్ఞవాటికకేగియమివరులగని
యజ్ఞాధిపుడువిష్ణువనితెల్పెనంత                       71

శ్రీనివాసామర సేవిత దేవ
మాననీయ నవ కమలదళ నయన                   72

ఇది విబుధజన వినత కౌశిక సగోత్రోద్భవ పోచిరాజాన్వయ సత్యసుందరీపేర్రాజదంపతీ సుత
వేంకట రామ లక్ష్మీ సతీ సేవిత కామేశ్వర రావు నామధేయ ప్రణీతంబైన

పద్మావతీ శ్రీనివాసమున ప్రధమాశ్వాసము

6 వ్యాఖ్యలు:

 1. యజ్ఞవాటికకేగియమివరులగని
  యజ్ఞాధిపుడువిష్ణువనితెల్పెనంత

  పోచిరాజుగారూ! మీ ద్విపద కావ్యము బాగుందండీ....అభినందనలు.

  ప్రత్యుత్తరంతొలగించు
 2. శాస్త్రి గారు వందనములు. ధన్యవాదములు.

  ప్రత్యుత్తరంతొలగించు
 3. కంది శంకరయ్య గారికి వందనం
  జన్మదినము నేడు జయముగలగ
  వంద యేళ్లు మీరు వర్ధిల్లవలెనండి
  జ్యోతి నవ్య కృష్ణ జూఁడు మఖిల

  ప్రత్యుత్తరంతొలగించు
 4. కంది శంకరయ్య గారికి వందనం
  జన్మదినము నేడు జయముగలగ
  వంద యేళ్లు మీరు వర్ధిల్లవలెనండి
  జ్యోతి నవ్య కృష్ణ జూఁడు మఖిల

  ప్రత్యుత్తరంతొలగించు
 5. ప్రధమాశ్వాసమును చక్కగా ముగించిన కామేశ్వర రావుగారికి ధన్యవాదములు.

  ప్రత్యుత్తరంతొలగించు