-: కాకతీయ పద్య కవితా వేదిక, వరంగల్లు :-
మేము ఏర్పాటుచేసిన అష్టావధాన కార్యక్రమంలోని కొన్ని విశేషాలు...
అష్టావధాని:- శ్రీ గౌరీభట్ల మెట్టురామశర్మ గారు
సంచాలకులు:- శ్రీ గన్నమరాజు గిరిజా మనోహర బాబు గారు
ముఖ్యాతిథి:- శ్రీ చిక్కా రామదాసు గారు
విశిష్టాతిథి:- శ్రీ టి. శ్రీరంగస్వామి గారు
పద్యానికి వాద్యం:- శ్రీ మఠం శంకర్‍జీ గారు
స్థలం:- శ్రీరాజరాజనరేంద్రాంధ్రభాషానిలయం, హన్మకొండ, వరంగల్లు
తేది:- 09-07-2016 శనివారం సాయంత్రం గం.05-00 లకు
పృచ్ఛకులలో ముందుగా...
1) నిషిద్ధాక్షరి: శ్రీ ఆరుట్ల భాష్యాచార్యులు గారు
[సర్వాంగ సుందరమైన అష్టావధానంలో మీవలె అందంగా ఉండే కందం చెప్పండి]
(కుండలీకరణంలో ఉన్నవి పృచ్ఛకులు నిషేధించిన అక్షరాలు)
శ్రీ(మ) స(ర)ంధ్యా(క) రూ(ప)ఢిన్(క) ధీ
భాస(స)మ్మై (స)యా(స)త్మ(లో)లీ(న)ఢ వా(స)ణీ(మ) సు(ర)గ(త)మా
(వ)ధ్యాసా(స)వా(స)ల(స)మ్మై నేఁ
డీ సభ నా రూపు వోలె నింపును నింపెన్!
[శ్రీ సంధ్యారూఢిన్ ధీ
భాసమ్మై యాత్మలీఢ వాణీ సుగమా
భ్యాసావాలమ్మై నేఁ
డీ సభ నా రూపు వోలె నింపును నింపెన్!]
2) దత్తపది:- శ్రీ కంది శంకరయ్య గారు
[ వంద - వేయి - లక్ష - కోటి పదాలను ... అన్యార్థంలో ఉపయోగిస్తూ, భారతార్థంలో...నచ్చిన ఛందస్సులో చెప్పండి ]
‘వంద’న చందనమ్ము లివె బంధువువంచు సమర్పణమ్ముగా
నైందవ కీర్తి మాధవ మహాకరుణోద్యత ‘వే యి’డంగ నేన్
ముందఱ వాలవేని రస మోహన రూప స‘లక్ష’ణమ్ముగా
నందకిశోర ద్రౌపదిని నన్ను సుదర్శన ‘కోటిఁ’ గావవే!
3) సమస్యాపూరణం:- శ్రీ జీడికంటి శ్రీనివాస మూర్తి గారు
సమస్య:- అవధాన మ్మొక ప్రజ్ఞయే యనిన నా కాశ్చర్యమే మిత్రమా
వివిధాలంకృత హృద్య పద్యమయమై విజ్ఞాన సంవేద్యమౌ
కవితా మాధురిఁ గన్న స్వర్గ కవియే కౌతుక్యముం బొంద, నా
దివిజుల్ కావ్య రసమ్ముఁ గాంచ, సుధయే ధిక్కారమున్ సేయదో?
యవధాన మ్మొక ప్రజ్ఞయే యనిన నా కాశ్చర్యమే మిత్రమా!
4) వర్ణన:- శ్రీ గుండు మధుసూదన్ గారు
[కాకతీయ పద్య కవితా వేదికపై పండితకవులు, నవ్యకవులు, భావకవులు, అభ్యుదయకవులు పద్యకవిత్వమును జెప్పుచుండగా గనిన సరస్వతీమాత మోదమందుటను మీ కిష్టమైన ఛందస్సులో చెప్పండి]
"నాదు హంసలా పదముల నల్లినారు;
నాదు వైణిక స్వరముల నాద మూని,
చిలుక పలుకుల వల్కుచుఁ గళలఁ గలిగి,
కాకతీయ వేద్యంతర కవులు నెల్ల
నలరినా" రని భారతి హాయి నందె!
5) ఆశువు:- శ్రీ ఎన్.వీ.ఎన్. చారి గారు
i) శాకంబరి రూపంలో ఉన్న భద్రకాళి అమ్మవారిపై ఒక పద్యం చెప్పండి...
లోకమ్ముల కన్నింటికి
శాకమ్ముల నిచ్చునట్టి సర్వేశ్వరి! యా
నాకానందము నిచ్చెడి
లోకేశ్వరి! నిన్నుఁ గొల్తు లోకము లోనన్!
ii) సెల్లుఫోన్ గురించి ఒక పద్యం చెప్పండి...
సెల్లూ నిన్నుఁ ధరించి హస్తమున నేఁ జింతించితిన్ నీవు నా
బిల్లుం బెంచి, గుభిల్లుమం చనఁగ నన్ వేదించకే, బాంచనే;
కల్లోలంబునుఁ గల్గఁగాఁ జెవికిఁ బల్ కాల్ చేసి[కాల్చేసి] కూల్ చేయకే[కూల్చేయకే]
హెల్లుం జూపకె నన్నుఁ బ్రోవు మిఁక నో యేర్‍టెల్లు నోక్యాననా!!
వీరేగాక...
6) పురాణపఠనం:- శ్రీ కుందావజ్ఝల కృష్ణమూర్తి గారు
7) అంత్యాక్షరి:- శ్రీ ఆడెపు చంద్రమౌళి గారు
8) అప్రస్తుత ప్రశంస:- శ్రీ సముద్రాల శ్రీనివాసాచార్య గారు
...సమర్థవంతంగా నిర్వహించారు.
***********
వరంగల్ లోని సుప్రసిద్ధ అష్టావధాని శ్రీ ఇందారపు కిషన్ రావు గారు అవధాని గారిని ఆశీర్వదిస్తూ చెప్పిన శ్లోకము మఱియు పద్యము...
శ్లోకం:
శ్రీగౌరిభట్ల మెట్రామ శర్మణో వాక్స్వరూపిణఃI
అష్టావధాన మాకాశే ప్రాకాశత విధూపమమ్II
తేటగీతి:
రమణ శ్రీ గౌరిభట్ల మెట్రామశర్మ
సలిపె నవధానమును నేఁడు సంతసముగ!
పట్టి పొగడుఁడు వేల చప్పట్లు గొట్టి!
పట్టి కొల్వుఁడు పట్టు దుప్పట్లు గప్పి!!
***********
ఈ విధంగా మేము నిర్వహించిన అష్టావధాన కార్యక్రమం దిగ్విజయంగా పూర్తయింది. వర్షం వచ్చినా కూడా లెక్క చేయక పద్యాభిమానులు, కవులు, పెద్దలు విచ్చేయడం ఆనందదాయకం. అలాగే హుస్నాబాద్ నుండి ప్రముఖ పద్య కవి శ్రీ దాస్యం లక్ష్మయ్య గారు రావడం విశేషం. మరో విశేషమేమనగా...సుకవయిత్రి శ్రీమతి మల్లెల విజయలక్ష్మి గారు...అవధానిగారికి, పృచ్ఛకులకు, సభానిర్వాహకులకు, అతిథులకు చక్కని లేఖినుల నిచ్చి సత్కరించడం. వారికి నా కృతజ్ఞతలు. అలాగే... భాషానిలయం వేదిక నిచ్చి ఆదరించిన శ్రీ కుందావజ్ఝల కృష్ణమూర్తి గారికి, కార్యక్రమ విజయానికి సహకరించిన కాకతీయ పద్య కవితా వేదిక సభ్యులకు అందరికీ పేరు పేరునా కృతజ్ఞతలతో...
సుకవి జన విధేయుఁడు
మధురకవి
గుండు మధుసూదన్
(కవిమిత్రులు గుండు మధుసూదన్ గారికి ధన్యవాదాలు.... కంది శంకరయ్య)

గురువులకు నమస్కారములు
రిప్లయితొలగించండిఅవధాన వివరములను తెలియ జేసినందులకు ధన్య వాదములు
చక్కని పూరణలు చేసిన అవధాని గారికి అడిగిన పృచ్చకులకు అభినందనలు.
రిప్లయితొలగించండిఅవధాన సారాన్ని మాకు అందించిన మధుసూదన్ గారికి ధన్యవాదములు.
ధన్యవాదాలండీ హనుమచ్ఛాస్త్రి గారూ!
తొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిఆనందదాయకము నాసక్తి జనకములైన యవధాన విశేషములను తెలిపి సంతోషపరచిన మధురకవి మధుసూదన్ గారికి మరియు పూజనీయులు గురువు గారికి ధన్యవాదములు.
రిప్లయితొలగించండిధన్యవాదాలండీ కామేశ్వరరావు గారూ!
తొలగించండిధన్యవాదములంండి. మేము కూడ అవధానములో పాల్గొనిన అనుభూతి కలిగింంది. ప్రచురింంచినంందులకు కృృతజ్ఞతలు.
రిప్లయితొలగించండిధన్యవాదాలండీ!
తొలగించండిధన్యవాదాలండీ!
తొలగించండిమంచి సమాచారమందించారు.ధన్యవాదాలండి.
రిప్లయితొలగించండిధన్యవాదాలండీ!
తొలగించండిధన్యవాదాలండీ!
తొలగించండి