ఆక్కయ్యా, పద్యాల వరకు రెండూ లక్షణంగా ఉన్నాయి. కాని సమస్యకు పరిష్కారం చూపినట్లు లేదు. మొదటి పద్యంలో ‘...జదువుచుంద్రు..’ అనండి. రెండవపద్యంలోని ‘సారంగంధము’ అంత ప్రసిద్ధమైనది కాదు. పర్యాయపద నిఘంటువు తప్ప (అది కూడా ప్రశ్నార్థకంతో) మరేదీ దానిని ప్రస్తావించలేదు.
శ్రీ పోచిరాజు కామేశ్వరరావుగారికి వందనములు. మీ సూచనలు సర్వదా ఆమోదయోగ్యములే. హీనపరాక్రముండు అనే వ్రాయాలనుకొన్నాను. ఔరా అన్న పూర్వ శబ్దముతో ద్వంద్వార్థము వచ్చునేమోయని ( ఔరా + అహీన = ఔరాహీన ) ఆ పదప్రయోగము చేయకుంటిని.
ఈశ్వరప్ప గారూ, మీ రెండు పూరణలు బాగున్నవి. ‘ఔరా కంసు పరాక్రమ మెఱుఁగఁగా నాశ్చర్యమౌ...’ అంటే బాగుంటుందేమో? ‘..దెలిసియే+ఆశ్చర్యమౌ’ అన్నపుడు నుగాగమం రాదు, యడాగమం వస్తుంది.
వీరత్వమ్మున రాజమౌళి తన ప్రావీణ్యముంజూపుచున్ క్రూరత్వమ్మున శత్రువున్ వరుసగా గ్రుమ్మించె నా యీగచేన్ ధీరత్వమ్మున దోమ తుమ్మెగదరా దిగ్దంతులల్లాడగా ఏరక్తంబున నెంత శక్తి గలదో యెవ్వారలూహించురా?
కోరెను తాతను బాలుడు వేరొక కథ చెప్పుమంచు వింతగురీతిన్ సూరయ చతురత జెప్పెను ధీరతనొక దోమ తుమ్మె దిక్కరులడరన్.
శ్రీధర రావు గారూ, మీ పూరణ(లు) బాగున్నది(వి). అభినందనలు. మూడవ పాదంలోని ‘ఆతడు’ రెండు పద్యాల్లోను అన్వయించడం లేదు. ‘ఆ రవముతోడ మేల్కొని’ అని మొదటి పద్యంలో, ‘ఆ రవముతోడ మ్రాన్పడి’ అని రెండవ పద్యంలో సవరిస్తే ఎలా ఉంటుంది?
బొడ్డువారు, సింహము అంటూ ముఖ్యుడు అంటున్నారు. పొరపాటు. దంతిసంతతి అని పొందిరి అంటున్నారు. జంతువులను మహతీవాచకంలోనే చెప్పటం సంప్రదాయం కదా. పూరణకై మీరు చేసిన కల్పన బాగుంది.
ప్రశస్తమైన పద్యం చెప్పారు. అయ్యా ఒక దోమ వంటి సైంధవుడి మోత దిగ్గజాల్లాంటి పాండవులనే కాలప్రభావం వలన అడ్డటం జరిగి వారు అల్లాడారన్నది ప్రస్తావించటం చక్కగా ఉంది. ఇక్కడ తపఃఫలోదయంలో ఒక వైచిత్రి ఉంది. వీడి తపస్సు పండి వీడు పాండవమహాగజాలను నిలువరించేపాటి వాడయ్యాడు. అక్కడ శమంతపంచకంలో వీడి తండ్రి వృధ్ధక్షత్రుడికీ తపఃఫలోదయకాలమే అవుతోందప్పుడు - ఆతడి కొడుకు చావుతో అతని చావునూ ముడి పెడుతూ. ఆహాఁ చక్కగా సాభిప్రాయపదప్రయోగయుతమై సమ్యగ్విధానంబునన్ శోభిల్లుం గద మీదు పూరణ మహో జోహారయా సత్కవీ!
సంతోషం మధుసూదన్ గారూ. కొంచెంగా నా అభిప్రాయాన్ని విశదీకరించవలసి ఉంది. సైంధవుడి తపస్సుకు ఆ నాడు ఫలోదయం. వాడికి యుధ్దరంగంలో ప్రమత్తతవలన చావు అని తెలిసి అతితెలివిగా తన తపస్సును ధారపోసి ఆచావును అడ్డేలా ఒక శాపప్రయత్నం చేసాడే, ఆ సైందవుడి తండ్రి వృధ్దక్షత్రుడు, ఆయన మరలా తపస్సు చేస్తూనే ఉన్నాడు శమంతపంచకంలో. ఆ మహానుభావుడి శాపానికీ ఫలితం ఉదయిస్తున్నది, ఆయన తపస్సుకు కూడా దానితోనే ఫలితం ఉదయిస్తున్నది అన్నది మీ పద్యంద్వారా చక్కగా సూచితం అవుతున్నది.
అన్నపురెడ్డి వారూ, 'పీచమడచటం' అన్నది కేవలం దుష్టశిక్షణను సూచించటానికే వాడాలండీ. మీరు వాడిన విధానం వలన పాండవులు దుష్టులన్న భావన రావటం వలన ఔచిత్యభంగం కలుగుతున్నది! నిఘంటుపదాలను వాడేటప్పుడు కాని, పర్యాయపదాలను వాడేటప్పుడు కాని ఆ పదాలకు కల అర్థచ్ఛాయలను గురించి బాగా అలోచించి మరీ ప్రయోగించాలి. లేకపోతే అపార్థాలూ అపచారాలూ దొర్లుతాయండి.
భాగవతులవారూ, వృత్తం అంగీకారయోగ్యంగానే ఉంది. బాగుంది. కాని, మీ కందంలో చిన్నికృష్ణుని దోమ అన్నారే - ఔచిత్యభంగం. అపచారం. అలా వ్రాయకూడదు. ఈ విషయమై ఇప్పుడే మరొక వ్యాఖ్య కూడా వేరొకరికి వ్రాసాను దానిని గమనించండి.
మధుసూదన్ గారూ, ఈపూరణలో కొన్ని ఇబ్బందు లున్నాయండీ. కుశలవుల్ అన్నప్పుడు దోమ అనటం వలన వచనదోషం వస్తున్నది. కుశలవులకు దోమ(ల)తో సామ్యం చెప్పటం వలన ఔచిత్యదోషం వస్తున్నది. ఒక ప్రక్కన వీరాగ్రణుల్ ఘనుల్ అని మెచ్చుకుంటున్న వారినే దోమ(ల)తో సామ్యం చెప్పటం వలన స్వవచోవిఘాతం కలుగుతున్నది. మహాశూరతన్ అని చెప్పిన పిదప అవ్వారినే వీరాగ్రణుల్ అని సంబోధించటం ఇంచుమించుగా పునరుక్తి దోషాన్ని ఆపాదిస్తున్నది. ఇలా బహుధా ఈపద్యం ఇబ్బందికరంగా ఉంది. అందుచేత ఈపద్యాన్ని ప్రక్కన పెట్టేయటమే మంచిదేమో యోచించండి.
ధన్యవాదాలండీ శ్యామలరావు గారూ! మొదట దీనిని నేను ఏకవచనంలోనే చెప్పి, తదుపరి ఆ దోమ ఎవరు...లవకుమారుడా...కుశకుమారుడా...అనే సంశయంతో...శంకరయ్యగారిని సంప్రదించగా...అశ్వమును బంధించినది యిరువురు గదా యన్నారు. నేను ఇద్దరిని కర్తలుగా చేసి, వచనాన్ని సవరించాను. కాని, మీరన్నట్టే వచన సమర్థన విషయంలో దోషం సంభవించింది...గమనించలేదు. వచన సమర్థన సరియైనట్లైతే మిగతా దోషాలు పరిహరింపబడతాయి. కాని, నాకిప్పుడోపిక లేక అలాగే వదలుతున్నాను. మరెప్పుడైనా సరిచేస్తాను. స్వస్తి.
వారమున కొక్కదినమున
రిప్లయితొలగించండిభారతమును జదువునంట పండితు లచటన్
తోరణము గట్టి నంతనె
ధీరత నొకదోమ తుమ్మె దిక్కరు లడలన్
సారంగంధము పూయుచున్ జదువుచున్ చాంపేయ సౌగంధముల్
రిప్లయితొలగించండినీరాజం బులనీయగన్ మురియుచున్ నీనామ మేపాడు చున్
వేరేదైవము లేదటంచు ఘనమున్ పేరాశ తోదొంగ లై
ధీరత్వమ్మున దోమతుమ్మె గదరా దిగ్ధంతు లల్లాడఁ గన్
ఆక్కయ్యా,
తొలగించండిపద్యాల వరకు రెండూ లక్షణంగా ఉన్నాయి. కాని సమస్యకు పరిష్కారం చూపినట్లు లేదు.
మొదటి పద్యంలో ‘...జదువుచుంద్రు..’ అనండి.
రెండవపద్యంలోని ‘సారంగంధము’ అంత ప్రసిద్ధమైనది కాదు. పర్యాయపద నిఘంటువు తప్ప (అది కూడా ప్రశ్నార్థకంతో) మరేదీ దానిని ప్రస్తావించలేదు.
రిప్లయితొలగించండిజోరుగ కురిసెను వర్షము
దోరగ వచ్చెను చకచక దోమలు గూడన్
సారపు జిలేబి జోడుగ
ధీరత నొక దోమ తుమ్మె దిక్కరు లడలన్
శుభోదయం
జిలేబి
జిలేబీ గారూ,
తొలగించండివర్షాకాలంలో దోమలు సహజమే. కాని దోమ తుమ్మడం, ఏనుగులు బెదరడం ఎలా? సమస్యకు పరిష్కారం ఏది?
తొలగించండితుమ్మితే ఊడి పోయే ముక్కుగల జిలేబి చెంతనుండగా
దోమకి తుమ్మురాక మరేం చేస్తుందండీ బాబు :)
సారపు జిలేబి జోడుగైతే తుమ్ము రాక పోతుందా :)
జిలేబి
వీరాగ్రేసరులందరిన్ గనుచు దా వీరత్వమ్మునే జూపుచున్
రిప్లయితొలగించండిపోరాటమ్మును జేయు బాలుని నరున్ పుత్రుండనే గాంచగా
యారాటమ్మున పోరు గెల్వగను క్షుద్రాలోచనల్ జేయగన్
ధీరత్వమ్మున దోమ తుమ్మెగదరాదిగ్దంతులల్లాడగన్
విరించి గారూ,
తొలగించండిచక్కని ఐతిహ్యంతో మంచి పూరణ చెప్పారు. అభినందనలు.
‘బాలుని నరున్ పుత్రుండనే’ అన్నదాన్ని ‘బాలు నర సత్పుత్రుం గనుంగొంచు తా| మారాటమ్మున...’ అనండి.
ప్రారబ్ధంబులఁ ద్రోసిపుచ్చఁ తగునే ప్రఖ్యాతులౌ పాండవుల్
రిప్లయితొలగించండివీరావేశము జూపినన్ మిగుల నవ్వేళన్ భళీ సైంధవుం
డౌరా లేమిపరాక్రముండు కనగానవ్వారి వారించెనే
ధీరత్వమ్మున దోమ తుమ్మె గదరా దిగ్దంతు లల్లాడఁగన్
సంపత్ కుమార్ గారు "హీనపరాక్రముండు" అనిన బాగుంటుందేమో?
తొలగించండిఅట్లే "ద్రోసిపుచ్చఁ నగునే" యనిన మరింత యర్థవంతముగా నుండును గదా.
తొలగించండిశ్రీ పోచిరాజు కామేశ్వరరావుగారికి వందనములు.
తొలగించండిమీ సూచనలు సర్వదా ఆమోదయోగ్యములే. హీనపరాక్రముండు అనే వ్రాయాలనుకొన్నాను. ఔరా అన్న పూర్వ శబ్దముతో ద్వంద్వార్థము వచ్చునేమోయని ( ఔరా + అహీన = ఔరాహీన ) ఆ పదప్రయోగము చేయకుంటిని.
ఔరా + అహీన - ఔరాహీన, ఔరా యహీన అవుతుందనుకుంటాను.
సందేహ నివృత్తి చేయవలసినదిగా ప్రార్థన.
సంపత్ కుమార్ శాస్త్రి గారు నమస్సులు. ఔరా లో ఆ కారానికి సంధిలేదు కాబట్టి “అహీన” శబ్దము పరమయిన యడాగమతో “ , ఔరా యహీన “ అవుతుంది.
తొలగించండికాకపోయిన ఔరా హీనపరాక్రము డని విడిగా వ్రాసిన హీన యనే యర్థము వచ్చును. పరవాలేదు.
“కాదు హీన పరాక్రముడు” “కాదహీనపరాక్రముడు” యీ రెంటి భేదము స్పష్టమే గదా!
శ్రీ పోచిరాజు కామేశ్వరరావుగారికి వందనములు.
తొలగించండిసందేహ నివృత్తి చేసినందులకు నమ:పూర్వక ధన్యవాదములు.
మీ సూచనలతో సవరించిన పద్యము.
ప్రారబ్ధంబులఁ ద్రోసిపుచ్చఁ నగునేప్రఖ్యాతులౌ పాండవుల్
వీరావేశము జూపినన్ మిగుల నవ్వేళన్ భళీ సైంధవుం
డౌరా హీనపరాక్రముండు కనగానవ్వారి వారించెనే
ధీరత్వమ్మున దోమ తుమ్మె గదరా దిగ్దంతు లల్లాడఁగన్
సంపత్ కుమార్ శాస్త్రి గారూ,
తొలగించండిమంచి ఐతుహ్యంతో మీ పూరణ బాగున్నది.
పోచిరాజు వారి సూచనలను గౌరవించినందుకు సంతోషం!
*****
కామేశ్వర రావు గారూ,
ధన్యవాదాలు.
పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. ధన్యవాదములు
తొలగించండిమీరుచు దోమల పాఠము
రిప్లయితొలగించండినారోజున గురువు చెప్పె నాబడిలోనన్
ఆరాత్రి చంటి కలలో
ధీరత నొక దోమ తుమ్మె దిక్కరు లడలన్.
శాస్త్రి గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
పూరించిరి శంఖమ్ములు
రిప్లయితొలగించండిధీరత.నొక దోమ తుమ్మె.దిక్కరు లడలన్
భారత ధర్మాహవమున
సారథ్యము జేసె పార్థ సారథి హరియే
తిమ్మాజీ రావు గారూ,
తొలగించండివిరుపుతో మీ పూరణ బాగున్నది. అభినందనలు.
కాని యుద్ధంలో ‘ఒక దోమ తుమ్మె’... ఎందుకు?
గురుదేవులకువందనములు తుమ్ము అపశకునము కదా.దోమ తుమ్మితే ఇంకా అపశకునమని నాభావన
తొలగించండిసమస్యలో కొంత యతిశయోక్తిని కూర్చితే దానిని బ్రహ్మాండమంత జేసి చేసిన పూరణ:
రిప్లయితొలగించండికారాగారము నందు నుంతురని సంగ్రామప్రదీప్తార్తియై
వీరావేశము మానసమ్మునఁ బొరిం బేట్రేగఁ గోపమ్మునన్
పారావారపరీతభూవలయముం బంధించి, స్వప్నంబునన్,
ధీరత్వమ్మున దోమ తుమ్మె గదరా దిగ్దంతు లల్లాడఁగన్
ఈ రీతి వినగ నోపునె
వీరత నొక యీగ దగ్గె విన్నిలఁ గూలన్
పారగ భూతము లన్నియు
ధీరత నొక దోమ తుమ్మె దిక్కరు లడలన్
కామేశ్వర రావు గారూ,
తొలగించండిమీ రెండు విధాల పూరణలు బాగున్నవి. అభినందనలు.
ఆర్యుల సమస్య యియ్యది
రిప్లయితొలగించండిధీరత నొక దోమ తుమ్మె దిక్కరు లడరన్
పూరణ గురించి యిచ్చిరి
వీరా !పూరించి పంపు వేగమె యిపుడున్
సుబ్బారావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది.
మొదటిపాదంలో ప్రాస తప్పింది. ‘ఆరయ సమస్య...’ అనండి.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిఈశ్వరప్ప గారూ,
తొలగించండిమీ రెండు పూరణలు బాగున్నవి.
‘ఔరా కంసు పరాక్రమ మెఱుఁగఁగా నాశ్చర్యమౌ...’ అంటే బాగుంటుందేమో? ‘..దెలిసియే+ఆశ్చర్యమౌ’ అన్నపుడు నుగాగమం రాదు, యడాగమం వస్తుంది.
పేరు ప్రఖ్యాతుల్గొన
రిప్లయితొలగించండివారల 'ఈగ' సినిమా, నుపాయమున మరో
భారీ నమూన నల్లగ
ధీరత నొక 'దోమ' తుమ్మె దిక్కరు లడలన్!
సహదేవుడు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది.
మొదటి పాదంలో గణదోషం. ‘పేరును ప్రఖ్యాతుల్గొన’ అనండి.
గురుదేవులకు ధన్యవాదములు. పేరుప్రఖ్యాతులన్నపుడు రు గురువవుతుందనుకున్నాను. అందువలన అలా వ్రాశానండి.పరిశీలించ ప్రార్థన.
తొలగించండిపేరు తెలుగు పదం, ప్రఖ్యాతి సంస్కృత పదం. తెలుగు పదం చివరి అక్షరం తర్వాత సంయుక్తాక్షమున్నా అది దీర్ఘం కాదు.
తొలగించండిగురుదేవులకు ధన్యవాదములు.సవరించిన పూరణ:
తొలగించండిపేరును ప్రఖ్యాతుల్గొన
వారల 'ఈగ' సినిమా, నుపాయమున మరో
భారీ నమూన నల్లగ
ధీరత నొక 'దోమ' తుమ్మె దిక్కరు లడలన్!
పేరు౦ గాంచిన వైరివీరులను తా వేర్వేరుగా జూపుచున్
రిప్లయితొలగించండిరారాజత్తరి కుంభసంభవుని వక్రంబొప్ప భాషించుచో
ధీరత్వమ్మున దోమ తుమ్మె గదరా. దిగ్దంతు లల్లాడఁగన్.
పూరించెన్ ముఖరమ్ము భీష్ముడు సకామున్ జేయ దుర్యోధనునిన్
తిమ్మాజీ రావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
దూరగ సింగపు ముక్కున
రిప్లయితొలగించండిధీరతగల దోమ, తుమ్మె దిక్కరు లడలన్
భీరువు లై జంతువులే
పారెను వనమధ్యమునకు భయకంపితులై
మొదటి పాదమందు చిన్న సవరణ
తొలగించండిచేరగ సింగపు ముక్కున
ధీరతగల దోమ!
భేషుగ్గా యుంది మీ పద్యం. అభినందనలు.
తొలగించండివిరించి గారూ,
తొలగించండిమీ పూరణ చాలా బాగుంది. అభినందనలు.
వీరత్వమ్మును జూప యుద్ధమున గంభీరమ్ముగా పోరి యా
రిప్లయితొలగించండిపోరాటమ్మున వీరస్వర్గమును దా బొందెన్నతండప్పుడున్
వేరౌ జన్మము దోమగా బడసి యా వీరత్వమున్ జాటుచున్
ధీరత్వమ్మున దోమ తుమ్మె గదరా దిగ్దంతు లల్లాడఁగన్!
శంకరయ్య గారూ,
తొలగించండిపూరణ సమర్థంగా ఉన్నట్టు లేదు. వీరు వీరస్వర్గమలంకరించి మళ్ళీ దోమగా పుట్టాడే అనుకోండి. కాని అది తుమ్మితే దిగ్గజాలు కంపించడం ఎంతవరకు సబబు?
గు రు మూ ర్తి ఆ చా రి
రిప్లయితొలగించండి,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
హూరాహోరిగ బాల బాలికలు క్రీడోత్సాహ
. ముప్పొ౦గగా
పోరన్ సాగిరి జ౦తు వేషములలో | పోరాడు
. నావేళలో ,
ధీరత్వమ్మున దోమ తుమ్మెను గదా దిగ్ద౦తు
. లల్లాడగా |
కీరా లెల్లయు దాని మీదపడి త్రొక్కెన్
. పారు న౦దాకయున్
{ కీరాలు = చిలుకలు ;
పారున౦దాకయున్ = పారిపోయేవరకును }
గురుమూర్తి గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
వీరత్వమ్మున రాజమౌళి తన ప్రావీణ్యముంజూపుచున్
రిప్లయితొలగించండిక్రూరత్వమ్మున శత్రువున్ వరుసగా గ్రుమ్మించె నా యీగచేన్
ధీరత్వమ్మున దోమ తుమ్మెగదరా దిగ్దంతులల్లాడగా
ఏరక్తంబున నెంత శక్తి గలదో యెవ్వారలూహించురా?
కోరెను తాతను బాలుడు
వేరొక కథ చెప్పుమంచు వింతగురీతిన్
సూరయ చతురత జెప్పెను
ధీరతనొక దోమ తుమ్మె దిక్కరులడరన్.
పొన్నెకంటి వారూ,
తొలగించండిమీ రెండు పూరణలు వైవిధ్యంగా ఉండి అలరించాయి. అభినందనలు.
మొదటిపాదం చివర గణదోషం. ‘ప్రావీణ్యమ్మునుం జూపుచున్’ అనండి.
పొరబాటును గమనింంచాను. కృృతజ్ఞతలు.
రిప్లయితొలగించండిచేరెను చోరుని నాసిక
రిప్లయితొలగించండిధీరత నొక దోమ! తుమ్మె దిక్కరులడరన్!
నారవము తోడ నాతడు!
వారలు దొంగను కనుగొని బంధించి రటన్!
నాల్గవ పాదం మార్పుతో మరొక పద్యం.
చేరెను చోరుని నాసిక
ధీరత నొక దోమ! తుమ్మె దిక్కరులడరన్!
నారవము తోడ నాతడు!
దారి దొరకనట్టి దొంగ దండన నందెన్!
శ్రీధర రావు గారూ,
తొలగించండిమీ పూరణ(లు) బాగున్నది(వి). అభినందనలు.
మూడవ పాదంలోని ‘ఆతడు’ రెండు పద్యాల్లోను అన్వయించడం లేదు. ‘ఆ రవముతోడ మేల్కొని’ అని మొదటి పద్యంలో, ‘ఆ రవముతోడ మ్రాన్పడి’ అని రెండవ పద్యంలో సవరిస్తే ఎలా ఉంటుంది?
మరొక ప్రయత్నం ...
రిప్లయితొలగించండిక్రూరత్వమ్మున సింహ మీ యడవి ముఖ్యుండయ్యె! నయ్యయ్యొ యా
కారమ్మున్ గల దంతిసంతతియు సత్కారమ్ములన్ బొంది రె
వ్వారున్ నన్నును గౌరవింపరని తా భావించి స్వప్నంబునన్
ధీరత్వమ్మున దోమ తుమ్మె గదరా దిగ్దంతు లల్లాడఁగన్!
శంకరయ్య గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
బొడ్డువారు, సింహము అంటూ ముఖ్యుడు అంటున్నారు. పొరపాటు. దంతిసంతతి అని పొందిరి అంటున్నారు. జంతువులను మహతీవాచకంలోనే చెప్పటం సంప్రదాయం కదా. పూరణకై మీరు చేసిన కల్పన బాగుంది.
తొలగించండికవి శ్రేష్ఠులు శ్యామలీయం గారికి నమస్సులు, పొరపాట్లు జరిగాయి వాటిని సవరించే ప్రయత్నం చేస్తాను. ధన్యవాములు.
తొలగించండిమిత్రులందఱకు నమస్సులు!
రిప్లయితొలగించండితోరమ్మౌఁటఁ జలించిరయ్య యపుడున్, దుర్యోధనప్రీ త్యధ
ర్మారబ్ధాజినిఁ, బన్న ద్రోణుఁడటఁ బద్మవ్యూహమున్, సైంధవ
ప్రారబ్ధార్థ తపఃఫలోదయ బలం బడ్డంగ, నా పాండవుల్!
ధీరత్వమ్మున దోమ తుమ్మెఁ గదరా, దిగ్దంతు లల్లాడఁగా!!
ప్రశస్తమైన పద్యం చెప్పారు. అయ్యా ఒక దోమ వంటి సైంధవుడి మోత దిగ్గజాల్లాంటి పాండవులనే కాలప్రభావం వలన అడ్డటం జరిగి వారు అల్లాడారన్నది ప్రస్తావించటం చక్కగా ఉంది. ఇక్కడ తపఃఫలోదయంలో ఒక వైచిత్రి ఉంది. వీడి తపస్సు పండి వీడు పాండవమహాగజాలను నిలువరించేపాటి వాడయ్యాడు. అక్కడ శమంతపంచకంలో వీడి తండ్రి వృధ్ధక్షత్రుడికీ తపఃఫలోదయకాలమే అవుతోందప్పుడు - ఆతడి కొడుకు చావుతో అతని చావునూ ముడి పెడుతూ. ఆహాఁ చక్కగా సాభిప్రాయపదప్రయోగయుతమై సమ్యగ్విధానంబునన్ శోభిల్లుం గద మీదు పూరణ మహో జోహారయా సత్కవీ!
తొలగించండిమధుసూదన్ గారూ,
తొలగించండిమీ పూరణ అద్భుతంగా ఉంది. అభినందనలు.
సుకవి మిత్రులు శ్యామలరావు గారూ...నమస్సులు! మీ అభిమానపూర్వక అభినందనలకు...సందర్భోచిత విశ్లేషణకు....సహస్రానేక ధన్యవాదములు!
తొలగించండిసంతోషం మధుసూదన్ గారూ.
తొలగించండికొంచెంగా నా అభిప్రాయాన్ని విశదీకరించవలసి ఉంది. సైంధవుడి తపస్సుకు ఆ నాడు ఫలోదయం. వాడికి యుధ్దరంగంలో ప్రమత్తతవలన చావు అని తెలిసి అతితెలివిగా తన తపస్సును ధారపోసి ఆచావును అడ్డేలా ఒక శాపప్రయత్నం చేసాడే, ఆ సైందవుడి తండ్రి వృధ్దక్షత్రుడు, ఆయన మరలా తపస్సు చేస్తూనే ఉన్నాడు శమంతపంచకంలో. ఆ మహానుభావుడి శాపానికీ ఫలితం ఉదయిస్తున్నది, ఆయన తపస్సుకు కూడా దానితోనే ఫలితం ఉదయిస్తున్నది అన్నది మీ పద్యంద్వారా చక్కగా సూచితం అవుతున్నది.
వీ రులగు పాండు తనుజుల
రిప్లయితొలగించండిబీ రుండగు సైం ధవుండు పీచమడం చెన్
భైరవు వరముల ద న్నగు
ధీరత నొ క దోమ తుమ్మె దిక్కరుల డలన్
అన్నపరెడ్డి వారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
అన్నపురెడ్డి వారూ, 'పీచమడచటం' అన్నది కేవలం దుష్టశిక్షణను సూచించటానికే వాడాలండీ. మీరు వాడిన విధానం వలన పాండవులు దుష్టులన్న భావన రావటం వలన ఔచిత్యభంగం కలుగుతున్నది! నిఘంటుపదాలను వాడేటప్పుడు కాని, పర్యాయపదాలను వాడేటప్పుడు కాని ఆ పదాలకు కల అర్థచ్ఛాయలను గురించి బాగా అలోచించి మరీ ప్రయోగించాలి. లేకపోతే అపార్థాలూ అపచారాలూ దొర్లుతాయండి.
తొలగించండిశ్యామలీయంగారి సూచనకు ధన్యవాదములు. మార్చిన పద్యం గమనించండి.
తొలగించండివీరులగు పాండు తనుజుల
వారించెను సైంధవుండు బవరమునందున్
భైరవు వరముల ద న్నగు
ధీరత నొ క దోమ తుమ్మె దిక్కరుల డలన్
గురువుగారికి వందనాలతో సవరణ పూరణ
రిప్లయితొలగించండి. ఔరాకంస పరాక్రమంబెఱుగగా నాశ్చర్యమౌ జూడగా
రారా కృష్ణుడ దోమవే నలిపెదన్ రమ్మన్న ?నారాత్రికే
ధీరత్వమ్మున దోమ తుమ్మె గదరా దిగ్ధంతు లల్లాడగన్
శూరత్వంబునుజూపకే కలన విస్పోటంబు గావింతువా?
2.పౌరాణిక సినిమాలలొ
ధీరత నొకదోమ తుమ్మె దిక్కరు లడగన్|
ఔరా|విఠలాచార్యా
ప్రేరణ గలిగించుకథలు ప్రీతి నొసంగన్|
పోరన్ గూలిరి వీరు లెందరొ కదా భూతాత్మునిం జేరఁగన్
రిప్లయితొలగించండిదూరన్ గల్గిన వ్యూహ మందు , నితనిన్ తూర్పారగా బట్టమే
చేరన్ జాల డటన్న నర్భకు డొగిన్ చెండాడెగా మమ్ములన్
ధీరత్వమ్మున దోమ తుమ్మె గదరా దిగ్దంతు లల్లాడఁగన్
వీరుని బలిష్ట యోధుని
మేరు గిరిని బోలియున్న మేటరి నొకచో
శూరుడు చిని కృష్ణు డడచె
ధీరత నొక దోమ తుమ్మె దిక్కరు లడలన్
భాగవతులవారూ,
తొలగించండివృత్తం అంగీకారయోగ్యంగానే ఉంది. బాగుంది.
కాని, మీ కందంలో చిన్నికృష్ణుని దోమ అన్నారే - ఔచిత్యభంగం. అపచారం. అలా వ్రాయకూడదు. ఈ విషయమై ఇప్పుడే మరొక వ్యాఖ్య కూడా వేరొకరికి వ్రాసాను దానిని గమనించండి.
కృష్ణారావు గారూ,
రిప్లయితొలగించండిమీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
నా రెండవ పూరణము:
రిప్లయితొలగించండినోరారంగను "వీరమాత సుతుల న్నోర్వంగ లే" రంచు, నా
ధారాటమ్మును బందిఁగొన్న ఘను, లా దండన్ మహాశూరతన్
వీరానీకము నడ్డి రా కుశలవుల్ వీరాగ్రణుల్! చూడఁగన్,
ధీరత్వమ్మున దోమ, తుమ్మెఁ గదరా, దిగ్దంతు లల్లాడఁగన్!!
మధుసూదన్ గారూ, ఈపూరణలో కొన్ని ఇబ్బందు లున్నాయండీ. కుశలవుల్ అన్నప్పుడు దోమ అనటం వలన వచనదోషం వస్తున్నది. కుశలవులకు దోమ(ల)తో సామ్యం చెప్పటం వలన ఔచిత్యదోషం వస్తున్నది. ఒక ప్రక్కన వీరాగ్రణుల్ ఘనుల్ అని మెచ్చుకుంటున్న వారినే దోమ(ల)తో సామ్యం చెప్పటం వలన స్వవచోవిఘాతం కలుగుతున్నది. మహాశూరతన్ అని చెప్పిన పిదప అవ్వారినే వీరాగ్రణుల్ అని సంబోధించటం ఇంచుమించుగా పునరుక్తి దోషాన్ని ఆపాదిస్తున్నది. ఇలా బహుధా ఈపద్యం ఇబ్బందికరంగా ఉంది. అందుచేత ఈపద్యాన్ని ప్రక్కన పెట్టేయటమే మంచిదేమో యోచించండి.
తొలగించండిధన్యవాదాలండీ శ్యామలరావు గారూ! మొదట దీనిని నేను ఏకవచనంలోనే చెప్పి, తదుపరి ఆ దోమ ఎవరు...లవకుమారుడా...కుశకుమారుడా...అనే సంశయంతో...శంకరయ్యగారిని సంప్రదించగా...అశ్వమును బంధించినది యిరువురు గదా యన్నారు. నేను ఇద్దరిని కర్తలుగా చేసి, వచనాన్ని సవరించాను. కాని, మీరన్నట్టే వచన సమర్థన విషయంలో దోషం సంభవించింది...గమనించలేదు. వచన సమర్థన సరియైనట్లైతే మిగతా దోషాలు పరిహరింపబడతాయి. కాని, నాకిప్పుడోపిక లేక అలాగే వదలుతున్నాను. మరెప్పుడైనా సరిచేస్తాను. స్వస్తి.
తొలగించండిఔరా! పాండవులా విరాటు సభలో నయ్యో! మహా దైన్యతన్
రిప్లయితొలగించండిఓ రాజా! మము బ్రోవుమా! యన భయమ్మో? గర్వమో? యెట్లనన్..
సారంగమ్ముల శ్రేణి దోమ చిరునాస్యమ్మందు జొర్రంగనే!
ధీరత్వమ్మున దోమ తుమ్మె గదరా! దిగ్దంతు లల్లాడగన్!!
రాకుమారుల వారూ
తొలగించండిదౌన్యతన్ । ఓ రాజా అన్న విసంధి ప్రయోగం పొరపాటు. దైన్యత నోరాజా అని ఐపోతుందండి. తెలుగులో రేఫకు ద్విత్వం వచ్చిన సందర్భాల్లో శకటరేఫనే ద్విత్వంతో వాడాలండి 'ఱ్ఱ' అని. దోమ అన్నపదం పునరుక్తం కావటం గమనించండి -అదీ దోషమేను.
ఔరా! పాండవులా విరాటు సభలో నయ్యో! మహా దైన్యులై
తొలగించండిఓ రాజా! మము బ్రోవుమా! యన భయమ్మో? గర్వమో? యెట్లనన్..
సారంగమ్ముల శ్రేణియే మశకపాస్యమ్మందు జొఱ్ఱంగనే!
ధీరత్వమ్మున దోమ తుమ్మె గదరా! దిగ్దంతు లల్లాడగన్!!
దీనులై
తొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
తొలగించండినమస్కారం శ్యామలీయం గారు. ధన్యవాదాలు.
రిప్లయితొలగించండిచోరుని నాసిక యందున
రిప్లయితొలగించండిచోరుని వలె నొక్క దోమ సులువుగ దూరెన్
చోరునకు కితకతలిడగ
ధీరత నొకదోమ తుమ్మె దిక్కరు లడలన్
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిక్రూరత్వమ్మున సింహ మీ యడవికిన్ గొప్పయ్యె! నయ్యయ్యొ యా
రిప్లయితొలగించండికారమ్మున్ గల దంతిసంతతియు సత్కారమ్ములన్ బొందె నె
వ్వారున్ నన్నును గౌరవింపరని తా భావించి స్వప్నంబునన్
ధీరత్వమ్మున దోమ తుమ్మె గదరా దిగ్దంతు లల్లాడఁగన్!
సవరణతో...
తొలగించండివీరత్వమ్ముగలట్టి పాండవులపై భీమమ్ముఁజూపించుచున్
రిప్లయితొలగించండిపోరాటమ్మున సైంధవుండు చెలగెన్ ముక్కంటి యాశీస్సులన్
ధీరత్వమ్మున దోమ తుమ్మె గదరా దిగ్దంతులల్లాడగన్
గౌరీశుండిడగా వరమ్ము భువిలో కానట్టి చైవుండునా!
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిఊరున్ వాడను లేని తాత ముదము న్నుద్దండుడై పోరుచున్
రిప్లయితొలగించండిశూరత్వమ్మున నుప్పు నాతడహహా శూలమ్ముగా కూర్చగా
వీరాగ్రేసరు లైన తెల్ల దొరలే భీతిల్లి కంపించిరే!👇
ధీరత్వమ్మున దోమ తుమ్మె గదరా దిగ్దంతు లల్లాడఁగన్!