22, జులై 2016, శుక్రవారం

పద్మావతీ శ్రీనివాసము - 8

పద్మావతీ శ్రీనివాసము (ద్విపదకావ్యము)
రచన : పోచిరాజు కామేశ్వర రావు

ద్వితీయాశ్వాసము (61-72)

నారాయణాద్రి యన ఘన క్రీడాద్రి
పారంగ తాశ్రిత పరమ ధామంబు                     61

శేష శయన వశ సేవిత జనము
శేష రూపము గిరిశ్రేష్ఠ తమంబు                       62

స్కందమున నునిచి సంతస మొప్ప
డెందమునం దక్కిటి కడ కేతెంచె                       63

విహగేశ్వరుండు పవిత్రాద్రి నాదు
విహితమ్మున నునిచె వినయమ్ము తోడ                64

హరి వరాహుడు గిరి నధిరోహి యయి య
పరదిశ కానన స్వామి పుష్కరణి                       65

దక్షిణ భాగస్థిత తటి మధ్య మహ
దక్షయ భూరి సౌధ మమల సితము                   66

రత్న ఖచిత గోపుర మయంబు నభ్ర
రత్నకోటి సదృశ రశ్మి రాజితము                      67

శ్రీమణి మండప శ్రేష్ఠ సంయుతము
నా మహా హర్మ్యము నందు నిత్యంబు                  68

శ్రీభూ సతుల గూడి శేషాద్రిని సక
లాభీష్టములు దీర్తు నఖిల భక్తులకు                     69

ఆర్తి జనుల కెల్ల నానందము నొన
గూర్తును గోచరా గోచర ముగను.                     70

మంజుల ధవళ రోమసము గాచ ధర
రంజిల్లె శ్వేత వరాహ కల్పమని                        71

సప్తగిరి నివాస సన్నుత దేవ           
తప్త కాంచన భూషిత విరాజమాన                     72

ఇది విబుధజన వినత కౌశిక సగోత్రోద్భవ పోచిరాజాన్వయ సత్యసుందరీపేర్రాజదంపతీ సుత
వేంకట రామ లక్ష్మీ సతీ సేవిత కామేశ్వర రావు నామధేయ ప్రణీతంబైన

పద్మావతీ శ్రీనివాసమున ద్వితీయాశ్వాసము

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి