31, జులై 2016, ఆదివారం

దత్తపది - 94 (అసి-కసి-నుసి-రసి)

కవిమిత్రులారా,
అసి - కసి - నుసి - రసి
పై పదాలను అన్యార్థంలో ఉపయోగించి
పల్లె పడుచు అందాలను వర్ణిస్తూ
మీకు నచ్చిన ఛందంలో పద్యాన్ని వ్రాయండి.

68 కామెంట్‌లు:

  1. గురువుగారూ నిన్నటి పూరణ

    స్వార్థ పరులైన దుర్జన వంచకులకు,
    పరుల పీడించు దుష్కామ భండులకును
    సకల సంపదలనొసగు సాతి కన్న
    వ్యర్థ మొనరింపఁ దగును సంపదల బుధులు

    సాతి = దానము

    రిప్లయితొలగించండి


  2. వికసిత దరహాసిని సొగ
    సుకు కాణాచి రసికతన సుందరి రమణీ!
    సుకుమార మేను సిగ్గుల
    సిగగొప్పుయసిత జిలేబి జిగిబిగి నడకల్ !

    జిలేబి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. జిలేబీ గారూ,
      మీ పూరణ బాగున్నది.
      'సుకుమార మేను' అని సమాసం చేయరాదు. 'సుకుమారమైన తనువును। సిగ..' అనండి. మూడవవపాదం చివరి (ను) అక్షరం, నాల్గవపాదం మొదటి (సి) అక్షరం కలిసి మనకు కావలసిన 'నుసి' వస్తుంది.

      తొలగించండి
  3. అసిత కలువ నేత్రంబుల వాసికెక్కి
    మంచి కాటుక సిగలోన మల్లెపూల
    తలను సిగ్గిలి వంచియు తారసిల్లు
    భారతావని భాగ్యంబు పల్లె పడచు

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఫణికుమార్ గారూ,
      మీ పూరణ బాగున్నది.
      మొదటిపాదంలో ప్రాసయతి తప్పింది. 'అసిత కలువ' అని సమాసం చేయరాదు. 'అసిత కల్హార నేత్రంబు లందగించ' అందామా?

      తొలగించండి
    2. అసిత కల్హార నేత్రంబు లందగించ
      మంచి కాటుక సిగలోన మల్లెపూల
      తలను సిగ్గిలి వంచియు తారసిల్లు
      భారతావని భాగ్యంబు పల్లె పడచు

      గురువుగారూ సవరణకి ధన్యవాదములు

      తొలగించండి
  4. అసితో త్పలముల కన్నులు
    కసిరెను ప్రియభా షణముల కలహిం పంగా
    నుసిరాలె సౌగం ధికముల
    రసికత్వము విరిసె పుష్ప లావిక ముఖమున్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అక్కయ్యా,
      మీ పూరణ బాగున్నది.
      మూడవపాదంలో గణదోషం. 'నుసి' అన్యార్థంలో ప్రయోగించాలి కదా!

      తొలగించండి
    2. అసితో త్పలముల కన్నులు
      కసిరెను ప్రియభా షణముల కలహిం పంగా
      విసిరెను సిరిమల్లెల సొగసు
      రసికత్వము విరిసె పుష్ప లావిక ముఖమున్

      తొలగించండి
    3. అక్కయ్యా,
      సవరించిన మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  5. అసిత వేణీద్వయమంబుదముల వలె
    ****జఘన గగనముపై చలనమొందె
    వికసిత హసనము విరుల పైరుల రీతి
    ****వదన భువనమందు వఱలుచుండె
    చక్షుద్వయము సిత సరసిజముల వోలె
    ****ముఖ సరోవరమున మురియు చుండె
    చిన్న తెమ్మెరలను సిరివెన్నెలను కూర్చు
    ****కంఠధ్వని కదిలె గానముగను

    శ్రమ పడుటచేత ప్రాణాగ్ని ప్రజ్వలింప
    దేహ కాంతి సతతమును తేజరిల్లు
    పంచ భూతములన్నియు పరవశింప
    ప్రకృతి యంతట తానయ్యె పల్లె పడచు!!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సత్యనారాయణ గారు, చాలా అందమైన పద్యం, దత్తపది పదాలను ఒద్దికగా పొదిగిన వైనం! మీది ఒక ప్రత్యెక బాణీ అండి!

      తొలగించండి
    2. జిగురు వారూ! పల్లెపడుచందచందాలను అందమైన (సీసా)ఛందంలో బిగించారు

      తొలగించండి
    3. జిగురు సత్యనారాయణ గారూ,
      మనోహరమైన వర్ణనతో చక్కని పూరణ చెప్పారు. అభినందనలు.

      తొలగించండి
    4. గురువు గారికి, రఘురాం గారికి, హనుమచ్ఛాస్త్రి గారికి
      ధన్యవాదములు
      పంచభూతోపమానములతో దత్తపది సాధించటానికి ఎక్కవ సమయమె పట్టింది :-(

      తొలగించండి
  6. అసితమై యొప్పు కచభార, మద్భుతముగ
    సితసుమంబుల మాలను సిగకు జుట్టి
    సరసిజంబుల సొబగులు చక్షువులకు
    ప్రాక సిరివోలె గనిపించు పల్లెపడుచు.
    (హ.వేం.స.నా.మూర్తి)

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. హరి వేంకట సత్యనారాయణ మూర్తి గారూ,
      అద్భుతమైన పూరణ. అభినందనలు.

      తొలగించండి
  7. మిత్రులందఱకు నమస్సులు!

    అసిత కేశపాశమ్ములే యందగింప
    మొలక సిగ్గుల మోము సమ్మోహపఱుప
    మేను సిరిఁగొని వంపుసొంపింపుఁగూర్ప
    వలపు లరసి చూడఁగ వెల్గెఁ బల్లెపడుచు!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. గుండు మధుసూదన్ గారూ,
      మీ పూరణ మనోజ్ఞంగా ఉంది. అభినందనలు.

      తొలగించండి
  8. నిన్నటి పద్యానోసారి చూడండి అన్నయ్యగారూ.
    అక్రమముగ నార్జించిన యాస్తి నెల్ల
    వ్యర్థ మొనరింపదగును సంపదలు బుధులు
    సద్వినిమయము చేయంగ సార్థకతయు
    కలుగ మెత్తురు జనములు గారవమున

    రిప్లయితొలగించండి
  9. అసి - కసి - నుసి - రసి


    అసిత వర్ణంపు భాసిత హసిత వదన
    కనుల కాటుక సిగను మొగలిని ముడిచి
    మేను సిగ్గుల కాంతులన్ మెరయుచుండ
    కదలుచున్నది రసికుల కన్ను చెదర.

    రిప్లయితొలగించండి
  10. అసిత కలువను ధరించుచు
    కసికసిగా చూడబోకు కలికీ గడ్డిన్
    నుసిగా చేసెద వేల,స
    రసి చెంతకువచ్చి నాసరసనుండగదే

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఉమాదేవి గారూ,
      బాగుంది మీ పూరణ.
      కాని కసి, నుసి పదాలను అన్యార్థంలో ప్రయోగించాలి కదా!

      తొలగించండి
  11. అసితాజిర విలసితులు వి
    కసితాంభోజ వదన మదగజ సుగమన భా
    ను సితాంశు వీక్షణులు నీ
    ర సిక్త రమణులఁ గనుడు వర కలమ మందున్


    26/12/2015 నాటి పూరణ:(చివరి పదము మారింది.)

    అసి ధారాంశువు లగని వి
    కసితము లాయె కమలములు కనువిందుగ భా
    ను సితామల బింబమును భ్ర
    మసి శశియనగం గలువలు మండలి గనినన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కామేశ్వర రావు గారూ,
      అద్భుతం మీ పూరణ. అభినందనలు.
      అజిరము, కలమము పదాల అర్థం కోసం ఆంధ్రభారతిలో వెదకవలసి వచ్చింది!
      గతంలో ఈ దత్తపదిని (కొద్ది మార్పుతో) ఇచ్చిన విషయం మరచిపోయాను.

      తొలగించండి
    2. పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. ధన్యవాదములు.

      తొలగించండి
  12. పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. ప్రచురణల రెండు మూడు సార్లు రావడానికి మరొక కారణము తెలిసినది. ప్రచురించిన తర్వాత వెనుకకు మరలు (back arrow) గుర్తును నొక్కుట వలన తిరిగి ప్రచురింపబడును.

    రిప్లయితొలగించండి
  13. అసియాడు కన్నులు ముసిముసి నవ్వులు
    ---------------పలకరించని పూల పరిమళాలు
    కసిడి కోతగచూపు కమనీయు టందము
    ----------ముంగిట ముగ్గులా మురిపమొసగు|
    నుసిగొల్పుబంధాలు నుత్సాహమే జూడ?
    ------------పసివాడి బాల్యమై పరుగు బెట్టు
    రసికత గన్పించు రమణీయ కమనీయ
    -----------దృశ్యమై పల్లెలా దీప్తిబంచు
    పల్లెపడుచుల మమతలు వల్లె వేయ
    కవుల కైనను సాధ్యమా కలియుగాన?
    కట్టుబొట్టున దేవతల్ తట్టిలేపు
    పట్టు దప్పిన పైటలా వనిత సొగసు|

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఈశ్వరప్ప గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'కమనీయు టందము'...? 'కమనీయ రూపము' అందామా?

      తొలగించండి
  14. మేను సింగారమును కాంచ గానె మనసు
    పరవసించెను, సరసిజ భవుడు వికసి
    తమతి సృష్టించె నసితాంగి తమకమడర
    గజగమన బాపు బొమ్మయే నిజముగాను

    రిప్లయితొలగించండి
  15. అసితోత్పల నయనమ్ములు
    విసిరెను సిరిచూలి శరము విరహము పెరిగెన్
    సరసిజ నేత్రా తెఱవ వి
    కసితాబ్జానన మరాళ గమనా వినవే

    రిప్లయితొలగించండి
  16. అసిత గాత్రీ నీదు యందాలు వర్ణింప
    . కవిని గాకుంటినే కలువభామ
    వికసితాబ్జాననీ విరహమ్ము తో నుంటి
    . వాక్కులను సిరుల్ పంచునాకు
    సరసిజనేత్రవే విరిబాల నీమీద
    . మనసయ్యె నన్నింక మరువ బోకు
    నీవాలు జడలోన నేమల్లెనై పోదు
    . ముద్దాడ చెంపలన్ ముగురులవన

    సొబగు లీనెడు సుకుమారి సోగ కనులు
    కొంటె చూపులు విసురుచున్ కోమలాంగి
    పలుకు లందున మకరంద మొలుకు చుండ
    పిలిచి మురిపింపవేనన్ను విమల నయన

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. విరించి గారూ,
      సీసపద్యంలో మీ పూరణ ప్రశస్తంగా ఉంది. అభినందనలు.
      'ముగురు లవన'?... ముగురు ముగ్గురుకు రూపాంతరం. ఇక్కడ ముంగురులు కానా? అనే అర్థం రాదు.

      తొలగించండి
    2. గురువు గారికి ధన్యవాదములు ముఁగురులు అంటే ముంగురులనే అర్థం తెలుగునిఘంటువు లో గమనించానండి

      తొలగించండి
    3. అసితోత్పల నయనమ్ములు
      విసిరెను సిరిచూలి శరము విరహము పెరిగెన్
      సరసిజ నేత్రా తెఱవ వి
      కసితాబ్జానన మరాళ గమనా వినవే

      అసిత గాత్రీ నీదు యందాలు వర్ణింప
      . కవిని గాకుంటినే కలువభామ
      వికసితాబ్జాననీ విరహమ్ము తో నుంటి
      . వాక్కులను సిరుల్ పంచునాకు
      సరసిజనేత్రవే విరిబాల నీమీద
      . మనసయ్యె నన్నింక మరువ బోకు
      నీవాలు జడలోన నేమల్లెనై పోదు
      . ముద్దాడ నా చెంప ముగురునయి

      సొబగు లీనెడు సుకుమారి సోగ కనులు
      కొంటె చూపులు విసురుచున్ కోమలాంగి
      పలుకు లందున మకరంద మొలుకు చుండ
      పిలిచి మురిపింపవేనన్ను విమల నయన

      తొలగించండి
  17. అసికమున చుక్కతో నా వికసిత జలజ
    నేత్ర నును సిగ్గు లొలికింప నిజముగ నొక
    నాప్సరసి పల్లె జేరె నన్నటుల నామె
    కట్టు, బొట్టు తీరు మది నాకట్టుకొనెయె!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. శ్రీధర రావు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      అసికము, ఆప్సరసి పదాల ప్రయోగం ప్రశంసనీయం.

      తొలగించండి
  18. అసితము శరీరఛాయ వి
    కసితమగు వదనమును సిక గలిగినదగు రూ
    పసి పల్లెపడుచునుంగని
    రసి కుండగు యువకుడొకడు రంజలి మెచ్చెన్

    నిన్నటి నా పూరణము మొదటి భాగపు అర్ధం
    '' అవినీతిగా సంపాదించిన ధనం వ్యర్థం చెయ్యాలి
    కాని ఉపయోగించ రాదు ''

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కృష్ణారావు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      శరీర+ఛాయ=శరీరచ్ఛాయ (తుగాగమ సంధి) అవుతుంది. 'అసితమ్ము మేని ఛాయ వి...' అందామా? రంజలి..టైపాటు వల్ల 'రంజిలి' అయినట్టుంది.

      తొలగించండి
  19. నీ యసితాస్ర మంబులును నీ కను పాపల సోయగంబులున్
    నీ యధరారుణాబ్జములు నీదొక సిత్రపు నడ్క గాంచియున్
    నీ యమలత్వ వాక్పటిమ నీ మయి వంపును సిగ్గు నిగ్గులున్
    ఈ యను రాగమున్ వెరసి యెక్కడ గానుము బాలికా మణీ !

    రిప్లయితొలగించండి
  20. అసితవర్ణముగలిగినకుసుమయనెడు
    పల్లెపడుచురసికతనవలపుగలిగి
    వికసితవదనమునుసిరులుగలుగ0గ
    దనరెధరణినిశoకరుకరుణవలన

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సుబ్బారావు గారూ,
      మీ పూరణ బాగుంది.
      చివరి రెండు పాదాల్లో యతి తప్పింది.

      తొలగించండి
    2. అసితవర్ణముగలిగినకుసుమయనెడు
      పల్లెపడుచురసికతనవలపుగలిగి
      వికసితవదనమునుసిరులు గలు గంగ
      దనరెధరణినిశoకరుదయను వలన

      తొలగించండి
    3. మూడవ పాదం అలాగే ఉంది. 'సిరులు కలుగంగ' అంటే ప్రాసయతి సరిపోతుంది.

      తొలగించండి
  21. వసనము దాచని పరువము
    కసిమసగెను.సిగను పూలు,కరకంకణముల్,
    అసిమి కటిని,కాల్కడియపు
    రసితము విననగును గ్రామ రమణుల నడలన్.

    రిప్లయితొలగించండి
  22. అసిత కేశబంధంబంత యందగింప
    సరసిజంబులె నేత్రాల సాక్షులనగ
    వికసిత వదన కాంతులు వీధులెల్ల
    పరగను సిగ విరులజొన్పె పల్లెపిల్ల.

    రిప్లయితొలగించండి
  23. మేనరసిజూడ పైపైనిమెరుగులేమి
    వికసితస్తన భారంబు వేణి పెంపు
    పీన కటియునుసిగపూలుపిరుదులసిరు
    లసిత కనుదోయిపడచుల కమర పల్లె dr.p.s atyanarayana

    రిప్లయితొలగించండి

  24. గు రు మూ ర్తి ఆ చా రి
    ,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

    మధ్యాక్కర :--

    అసిత కచభర పయోధ రా౦తర స్థ ముఖే౦దుబి౦బ

    మసమాన హాసచ౦ద్రికల న౦ది౦చు | సరస రసికత

    నుసిగొల్పు , మిసలాడు వయసు |
    హొయలొలుక సిడిముడి యిటు

    ల సలుప న్యాయ మౌనే ? సరస జేర
    వేల లతా౦గి !

    { పయోధరా౦తరస్థ = మేఘము మధ్యన గల . సిడిముడి = కోపము . }

    రిప్లయితొలగించండి
  25. అసితపు సిగలో మల్లెలు
    కసిరెడు నేత్రముల నవ్వు గజగమనమ్మున్
    రసికుల గందోయి మెరయ
    పసగల నునుసిగ్గు నలరు పడుచున్ గనరే!!!

    రిప్లయితొలగించండి
  26. శైలజ గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. శైలజ గారు కళ్ళు మెరసే రసికుల యెదుట పల్లెపడచు సిగ్గుతో నలరుచున్నదనడము భావ్యము కాదేమోనని, చిన్న సవరణ మీ పూరణకు: అప్రస్తుతమని తలచక పరిశీలించండి.
      "గజగమనన్నా / రసి త్రుటి కందోయి మెరయ"

      తొలగించండి
  27. అసికమున చుక్కఁ బెట్టి , వి
    కసిత శశివదనము నేలు గౌముది నవ్వై
    రసికతఁ జిందెడు బిగి మే
    ను సిగ్గొలుక! పల్లెపడచు నొక్కులుదీఱున్

    రిప్లయితొలగించండి
  28. మేనరసిచూడ పైపైని మెరుగు లేమి
    వకసితస్తనభారము వేణి పెంపు
    పీనకటియును సిగపూలు పిరుదులసిరు
    లసిత కనుదోయి పల్లెల కమరు పల్లె p.satyanarayana

    రిప్లయితొలగించండి
  29. లసిత కనుదోయి పడుచులకమరు పల్లె అని సవరించాను

    రిప్లయితొలగించండి