26, జులై 2016, మంగళవారం

సమస్య - 2098 (ప్రజలు ప్రతిరోధకులు...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...

''ప్రజలు ప్రతిరోధకులు మన ప్రగతి కెపుడు''
లేదా...
"ప్రజలు నిరోధకు లఁట మన ప్రగతికి నెపుడున్"

68 కామెంట్‌లు:


  1. నిజమా ఈ మాట కవీ ?
    ప్రజలు నిరోధకులు దేశ ప్రగతికెపుండున్ ?
    సుజనులటుల పలుక తగదు
    సజనుల నెన్నుకొనవలెను చక్కగ మేలౌ !

    జిలేబి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. జిలేబీ గారూ,
      మీ పూరణ బాగుంది.
      'ప్రగతికి నెపుడున్' అనండి. 'సజ్జనులు' సాధువు... `సజనులు'..?

      తొలగించండి
  2. గురువు గారు
    తేట గీతికి ఒక లఘువు తగ్గింది. కంద పాదము కావాలంటే "దేశ ప్రగతికి నెపుడున్" అనాలి.
    అది కాక "దేశ ప్రగతి" సంస్కృత సమాసమగుట చేత, "శ" గురువై తేట గీతికి , కందమునకు గణ భంగమవుతుందనిపిస్తుంది

    రిప్లయితొలగించండి
  3. ప్రజలట నిరోధకులు దేశ ప్రగతి కెపుడు
    అని ఉంటే సరీపోతుందేమో

    రిప్లయితొలగించండి
  4. సుంకమడిగిన నష్టంబు చూపుచుండి
    ఎన్నికలలోన ఓటును వేయకుండి
    ప్రభుత నిందించి కర్తవ్యపరత మఱచు
    ప్రజలు ప్రతిరోధకులు దేశ ప్రగతి కెపుడు

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ప్రజలు ప్రతిరోధకులు మన ప్రగతి కెపుడు

      తొలగించండి
    2. ఫణికుమార్ గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      మీ సూచన ననుసరించి సవరించాను. ధన్యవాదాలు.

      తొలగించండి
  5. కవిమిత్రులు మన్నించాలి...
    రాత్రి నిద్రాసక్తుణ్ణై గణదోషాన్ని గమనించకుండా సమస్యను షెడ్యూల్ చేశాను. నేను తేటగీతి పాదంగానే ఇచ్చాను. మిత్రులు కందపాదంగా కూడా గ్రహించారు. అందువల్ల రెండు విధాలుగా సమస్యను సవరించాను.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. 'దేశప్రగతి' అన్నపుడు 'శ' పాక్షికంగా గురువు అవుతుందని కొందరు లాక్షిణికుల మతం. దానిని మిత్రులు కొందరు పాటిస్తున్నారు కూడా. అభ్యంతరం చెప్పను కాని నేను మాత్రం గురువుగానే పరిగణిస్తాను. అందువల్ల ఆ పదాన్ని కూడా సవరించాను.

      తొలగించండి
  6. మిత్రులందఱకు నమస్సులు!

    పన్నుఁ గట్టక, నల్ల వ్యాపారులునయి,
    దేశవిద్రోహకారులై, లేశమైన
    మానవత్వమ్ము లేని వెంబరలునైన
    ప్రజలు ప్రతిరోధకులు మన ప్రగతి కెపుడు!

    రిప్లయితొలగించండి
  7. మోడి మేలును తలపెట్ట మోద మంది
    భరత జనులెల్ల సాగరె భావి నరసి
    మతము కులమని కూసెడి మౌడ్య జనులు
    ప్రజలు ప్రతిరోధకులు మన ప్రగతి కెపుడు!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. వెంకటఫ్పయ్య గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'జనులు.. ప్రజలు' అని పునరుక్తమయింది కదా! 'మౌఢ్యులైన। ప్రజలు...' అంటే ఎలా ఉంటుంది?

      తొలగించండి
    2. మూఢులైన ప్రజలు అనటం ఉచితంగా ఉంతుందండి.

      తొలగించండి
    3. 'మూఢులైన' అంటే యతి తప్పుతుంది. 'మతము కులమని కూయుచు పతితులైన | ప్రజలు...' అంటే ఎలా ఉంటుంది?

      తొలగించండి
  8. స్వార్థపరులౌచు సర్వత్ర సంచరించు
    చుండి నిధులన్నియును మ్రింగుచుండువార
    లన్యు లేమైన నాకేమి టని తలంచు
    ప్రజలు ప్రతిరోధకులు మన ప్రగతి కెపుడు.
    (హ.వేం.స.నా.మూర్తి)

    రిప్లయితొలగించండి
  9. ప్రజలు ప్రతిరోధకులుమన ప్రగతికెపుడ
    నుటయ కేవలమనృతం బనగదగును
    దుష్ట దర్నీతి వర్తన ధర్యులైన
    స్వార్థపూరిత నేతలే శకునులకట!




    ర్నీ

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. పొన్నెకంటి సూర్య నారాయణ రావు గారూ,
      మీ పూరణ బాగున్నది.
      రెండవ పాదంలో గణదోషం, యతిదోషం. 'ప్రగతి కెపు డ|టంచు బలుకుట యనృతమే యనగ దగును' అంటే ఎలా ఉంటుంది? 'ధుర్యులైన'...' ధర్యులైన' అని టైపయింది.

      తొలగించండి
    2. శంకరయ్యగారికి నమస్సులు. మీ సూచన గమనించానండి.కృతజ్ఞతలు.

      తొలగించండి
  10. హత్య లవినీతి కృత్యంబు లనుదినంబు
    మత విరోధంబు లతివల మానహాను
    లధిక మౌచుండ కిమ్మన నట్టులుండు
    ప్రజలు ప్రతిరోధకులు మన ప్రగతి కెపుడు.
    (హ.వేం.స.నా.మూర్తి)

    రిప్లయితొలగించండి
  11. కులమత విభేదములు మీఱ కుటిల తంత్ర
    ములను నెఱపి యుక్తాయుక్తములు నెఱి దల
    చకను దమలోన తాము రోసి కలహించు
    ప్రజలు ప్రతిరోధకులు మన ప్రగతి కెపుడు


    సుజనతఁ జూపని వైద్యులు
    ధ్వజవర్ధన సేయ లేని వాహిని గరిమన్
    నిజము నుడువ సోమరులౌ
    ప్రజలు నిరోధకు లఁట మన ప్రగతికి నెపుడున్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కామేశ్వరరావు గారూ,
      మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.

      తొలగించండి
  12. రుజవలె భరతావనిని పేరుకొనె లంచ
    గొండితనము! విదేశి నిగ్గులకు లొంగి
    దేశభక్తి కరవయిన దేభ్యులట్టి
    ప్రజలు ప్రతిరోధకులు మన ప్రగతికెపుడు॥

    ఏ పదం వేసినా 3వ పాదం ఆఖరి అక్షరం గురువే పడుతుంది (తరువాతి ప్ర వల్ల)! మరి దీనికి పరిష్కారం ఏమిటి?

    రిప్లయితొలగించండి
  13. రుజవలె భరతావనిని పేరుకొనె లంచ
    గొండితనము! విదేశి నిగ్గులకు లొంగి
    దేశభక్తి కరవయిన దేభ్యులట్టి
    ప్రజలు ప్రతిరోధకులు మన ప్రగతికెపుడు॥

    ఏ పదం వేసినా 3వ పాదం ఆఖరి అక్షరం గురువే పడుతుంది (తరువాతి ప్ర వల్ల)! మరి దీనికి పరిష్కారం ఏమిటి?

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ప్రజ అన్నది సంస్కృతపదం. దానికి పూర్వపదంగా మరొక సంస్కృతపదం ఉండి దానితో ఈ ప్రజ అనేది సమసించితే అప్పుడు మీరన్నది నిజం. ఆ పూర్వపదంలో చివరి అక్షరం గురువు కావలసి ఉంటుంది. కాని ఈ విధంగా పరపదం రేఫంతో కూడి ఉన్నప్పుడు పూర్వపదాంతంలో ఉన్న అక్షరం గురువుగా మారటం ఐఛ్ఛికం. దీనికి సంబంధించిన నియమాలను ఈ శంకరాభరణంలోనే లోగడ శంకరయ్యగారు వ్రాసినట్లు గుర్తు. కొంచెం గాలించండి.

      పూర్వపదం తెలుగుమాటగా ఉండిన పక్షంలో పరపదం సంస్కృతపదంగా సమాసం ఏర్పడదు. కాబట్టి ఆ తెలుగు పదం చివరి అక్షరం గురువుగా మారదు.

      ఉదాహరణ 'నేడు ప్రజలకు పండువే నిక్కముగను' అన్నది శుభ్రంగా తేటగీతిపాదం. నేడు + ప్రజ అంటూ సమాసం ఏర్పడదు. కాబట్టి ఇక్కడ డు అన్నది గురువుగా మారదు.

      మండల మేలె నొక్క ద్విజమాత్రుడు ఛాత్రులు మంత్రులైరనన్ అని ఒక సమస్యను మా మేనమామ జగన్నాథరావుగారు తమ విద్యార్థి దశలో ఒక అష్టావధానంలో పూరించారు. అది నాకు ఇస్తే నేను తికమక పడ్డాను. అప్పటికి నేనింకా స్కూలు పిల్లవాడినే. అప్పుడు మా మామయ్యగారు ఒక్క + ద్విజ అని వ్యాకరణకార్యం లేదూ సమాసం లేదూ కాబట్టి క్క అన్నది లఘువుగానే ఉంటుందీ అని విడమరచారు.

      తొలగించండి
    2. రఘురామ్ గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      శ్యామలీయం గారి వివరణతో మీ సందేహం తీరింది కదా!

      తొలగించండి
    3. శ్యామల రావు గారూ,
      చక్కని వివరణ ఇచ్చారు. ధన్యవాదాలు.

      తొలగించండి
    4. శ్యామలీయం గారు, ఎంతో ఓర్పుగా వివరణ ఇచ్చారు, ధన్యాలండి!! ఇన్నాళ్ళూ నేను నా చెవికి వినిపించే తీరుని బట్టి, అంటే చదువుతున్నప్పుడు ఈ సంయుక్తాక్షర ప్రభావం ముందక్షరం మీద పడుతోందా లేదా అన్నది వినికిడి ద్వారా నిర్ణయించేవాడిని. వెనకాల ఈ థియరీ తెలియదు. Thank you so much!!

      తొలగించండి
  14. ప్రజలుప్రతిరోధకులుమనప్రగతికెపుడు
    కాదుకాదార్య!యెప్పుడుకాదుకాదు
    దేశప్రగతికివారలుదెగువజూపి
    పాటుపడుదురునిరతముభవితకొరకు

    రిప్లయితొలగించండి
  15. ప్రజలనగనుమనమేగద
    ప్రజలునిరోధకులటమనప్రగతికినెపుడు
    న్నిజముగనటులుగజేతుమ?
    విజయాా!యదినీవజెప్పువివరణతోడన్

    రిప్లయితొలగించండి
  16. ఓటు కోరుచు ప్రీతిగ మాటలాడు
    నాయకుని రూపమెరుగక నమ్ముచుంద్రు
    ప్రజలు! ప్రతిరోధకులు మన ప్రగతి కెపుడు
    నీతి మాలిన నేతలె! నిజము సుమ్ము!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. శ్రీధర రావు గారూ,
      విరుపుతో మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  17. ఊరువాడల కభివృద్ధ్హి కోరు వారు
    ప్రజలు ప్రతిరోధకులు మన ప్రగతి కెపుడు
    సొమ్ములకు మందిపై పెత్తనమ్ములకును
    గద్దె పైకెక్కు నేతలు గ్రద్దలవలె.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. శ్యామల రావు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      ప్రజలు తరువాత కామా పెడితే బాగుండేది.

      తొలగించండి
  18. ఇద్దరు అవినీతి రాజకీయనాయకుల నడుమ సంభాషణ:

    పంచ వర్షములు భరించు, కొంచమైన
    నెదురు తిరగక యోటరులదను జూసి
    యెన్నికలవేళనోటుతో నెదురు తిరుగు
    ప్రజలు ప్రతిరోధకులు మన ప్రగతి కెపుడు!!

    యెన్నికలవేళన్ + ఓటుతో >>యెన్నికలవేళనోటుతో

    రిప్లయితొలగించండి
  19. జాతిసంపదై వెలగరే జనులు, ధర్మ
    వర్తులై చరించు దేశ భక్తులైన
    ప్రజలు, ప్రతిరోధకులు మన ప్రగతి కెపుడు
    తీవ్ర వాదులు నిజమిదే తెలుసుకొనుడు

    కుజనులు స్వార్థమ్మున తా
    ము జనుల వంచించుచు ధనమున్ పొందెడు వా
    రు జగతికి చీడ యౌ నా
    ప్రజలు నిరోధకులట మన ప్రగతికి నెపుడున్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. విరించి గారూ,
      మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
      మొదటి పూరణ రెండవ పాదంలో గణదోషం. 'చరించెడి' అంటే సరి!

      తొలగించండి
  20. సుజనతను మరచు వారలు
    కుజనత్వము జూపువారు కువలయమందున్
    నిజమును సమాధి జేసెడు
    ప్రజలు నిరోధకులట మన ప్రగతికి నెపుడున్!!!

    రిప్లయితొలగించండి
  21. నిజమును పల్కక , కుటిలత
    భజనలుచేయుచు సతతము పాపా త్ములకున్
    త్యజించి మంచి బ్రతికెడు
    ప్రజలు ని రోధకులట ప్రగతికి నెపుడున్

    రిప్లయితొలగించండి
  22. ఓట్లు వేసెడిసమయాన నోట్లు గోరు
    ప్రజలు ప్రతిరోధకులు|మనప్రగతి కెపుడు
    ఆశ నత్యాసగామార్చునాశనంబు
    మానవాళియు గోరుట మాయయగును|
    2.ఋజువులు గల కథలెన్నొ
    నిజమని గుర్తించ లేక నీతిని విడి” తా
    భజనలు జేసే స్వార్థ
    ప్రజలునిరోధకులట|మనప్రగతికి నెపుడున్”.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఈశ్వరప్ప గారూ,
      మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
      భజనలు జేసెడి... అనండి.

      తొలగించండి
  23. మంచి పనులను చేసినన్ మదిని రోసి
    కూర్మి తోడను చెప్పినన్ కొంకు మాట
    లాడుచున్ సుకార్యములకు నడ్డు చెప్పు
    ప్రజలు ప్రతిరోధకులు మన ప్రగతి కెపుడు

    నిజమిది నమ్ముము మదిలో
    ప్రజలు నిరోధకులట మన ప్రగతికి నెపుడున్
    సుజనులవోలెనటించుచు
    కుజనత్వము జూపు ఘనులు కొల్లలు గనుమా!

    రిప్లయితొలగించండి
  24. జాతి,కుల,మత భేదమల్ చావకుండ
    నిప్పు రగిలించి యైక్యతా నిలువకుండ
    జేసి యధికారమును బొందు చెనటి,స్వార్థ
    ప్రజలు ప్రతిరోధకులు మన ప్రగతి కెపుడు.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. లక్ష్మినారాయణ గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      `...యైక్యత నిలువకుండ' అనండి.

      తొలగించండి
  25. సమ్మె, బందులు, ధర్మాల సమయ మందు

    నదియు ప్రజల యాస్తియను తలంపు లేక

    ప్రభుత యాస్తిని నాశన పరచు చున్న

    ప్రజలు ప్రతిరోధకులు మన ప్రగతి కెపుడు.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. నాగేశ్వర రావు గారూ,
      మీ పూరణ బాగున్నది.
      `ధర్నాల'... `ధర్మాల' అని టైపయింది. రెండవపాదంలో యతి తప్పింది. `అదియు ప్రజల యాస్తియనుచు మది దలపక' అనండి.

      తొలగించండి
    2. ధన్యవాదాలు శంకరయ్య గారూ !
      మీరు సవరించినది బాగున్నది.

      తొలగించండి
  26. ఐహికమ్ముల విడనాడి దైవ చింత ,
    ముక్తి మార్గము పైన నాసక్తి జూపి
    నరులు సురలుగ మసలగ, నసురుల నెడి
    ప్రజలు ప్రతిరోధకులు మన ప్రగతి కెపుడు

    విజయ పతాకము లెగురగ
    సుజనులు జేయుదురఖండ శోధన ; ధూర్తుల్
    కుజనులు, నవరోధ మిడెడు
    ప్రజలు, నిరోధకు లఁట మన ప్రగతికి నెపుడున్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కృష్ణారావు గారూ,
      మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
      మొదటి పూరణ మొదటి పాదంలో యతి తప్పింది. సవరించండి. 'ఐహికమ్ముల విడిచి బ్రహ్మమ్ము దలచి..' అందామా?

      తొలగించండి
  27. ప్రభుత చేపట్టు పనులెల్ల బాగుకనుచు
    వైరి పక్షా న జేరుచు వంతపాడు
    ప్రజలు ప్రతిరోధకులు మన ప్రగతి కెపుడు
    ననుచు పాలకవర్గపు మనసు తలచు.

    రిప్లయితొలగించండి
  28. విజయుడైన నేత కడకు వేగ జేరి
    స్వార్ధ భావము ఘనధన స్వామ్య మతము
    కోరి రాజకీయ విషంబు నూరి పోయు
    ప్రజలు ప్రతిరోధకులు మన ప్రగతి కెపుడు

    రిప్లయితొలగించండి
  29. భుజకీర్తులు పీకెదరే
    గజగజ లాడించి ఓటు కాంగ్రెసుకిడిరే
    గుజరాతును జూడుము షా!
    ప్రజలు నిరోధకు లఁట మన ప్రగతికి నెపుడున్!

    రిప్లయితొలగించండి