9, జులై 2016, శనివారం

దత్తపది - 92 (రారా-సారా-తేరా-పోరా)

కవిమిత్రులారా,
రారా - సారా - తేరా - పోరా
పై పదాలను అన్యార్థంలో ఉపయోగించి భారతార్థంలో
మీకు నచ్చిన ఛందంలో పద్యాన్ని వ్రాయండి.

35 కామెంట్‌లు:

  1. రాయబారం లో కృష్ణుడు దుర్యోధనునితో....

    సంధికి రా! రాకుండిన
    బంధము త్రెగునిక ననికిని పద మనసారా
    బంధము పోతే రాదిక
    సంధియెపో! రాచబాట సౌఖ్యం బందన్!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు

    1. స్వల్ప సవరణతో
      రాయబారం లో కృష్ణుడు దుర్యోధనునితో....

      సంధికి రా! రాకుండిన
      బంధము త్రెగునింక ననికిి పద మనసారా
      బంధము పోతే రాదిక
      సంధియెపో! రాచబాట సౌఖ్యం బందన్!

      తొలగించండి
  2. రారా జునివన మునగల
    సారాంశము నెరుగ కుండ సౌగంధికమున్
    తేరా దాయని భీముని
    పోరా యనిపాం చాలి పొలుపున కోరెన్
    ------------------------------------

    కొన్ని సందర్భాలలో ఎవరినైన " ర " కొట్టవచ్చని .ఒక కవి ఉవాచ

    రిప్లయితొలగించండి
  3. రిప్లయిలు
    1. వినుము రారాజ! నామాట రణము వలదు
      పోరున మనసారాటమె పొందునింక
      నరుని తేరాజిన నిలువ జ్వరము రాదె?
      తగునె పోరాడ? చాలదె సగము నీకు?

      తొలగించండి
  4. రా! రమ్మని కృష్ణుడు, మన
    సారా వినుమనఁగ గీత, సత్యము గన నిం
    తేరా! యని దెలిసి యనిని
    పోరాటముఁ జేసి జయము పొందెను నరుడున్

    రిప్లయితొలగించండి


  5. కోరి వచ్చిన ఊర్వశి అర్జునుల సంవాదం ! ఊర్వశి శాప ఘట్టం



    రారా రాజకుమారా !
    కోరితి మనసార నిన్ను కోరిక మీరన్
    పోరాని పోకడలు నల
    తే ! రాజేంద్రు చెలివీవు తెంపరి తల్లీ !

    జిలేబి

    రిప్లయితొలగించండి
  6. మిత్రులందఱకు నమస్సులు!


    రారాజున్ వధియింపఁ బెందొడలు విర్వంగాను భీముండు నా
    పోరాటమ్మునుఁ జేయఁ బిల్వ, మడువున్ బోఁజొచ్చు దౌర్గత్య మిం
    తేరా, దుష్టుల కృత్యముల్ వెస నసత్తీరమ్ములన్ జేర్చి, ని
    స్సారాబ్ధిం దగఁ గూలఁ జేయును సుమా, సంతోషమున్ మ్రింగియున్!!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కవి పుంగవులు మధుసూదన్ గారు నమస్సులు. చక్కటి పూరణ.
      “నిస్సారాబ్ధి” యని ప్రయోగించి నేనిదివరలో నొక పూరణలో ప్రయోగించిన “నిష్కరుణాసాగరుడు” సమాసమునకు బలము చేకూర్చారు. ధన్యవాదములు.

      తొలగించండి
    2. వరుణాదిత్య సమప్రభుండు నిజ సద్భ్రా తృశ్రియాఘ్నుండిలన్
      తరుణోద్రేక విమోహ కామ భర చిత్తక్షోభ తప్తాంగుడున్
      మరణామానుష సంఘ బాహ్య వర దుర్మత్తుండు దుష్టుండు ని
      ష్కరుణా సాగరు డన్న నొప్పు దశ దుష్కంఠుండు చిత్రంబుగన్

      తొలగించండి
  7. రారా! రమ్మిట! తెలుపుము
    పోరాడెదవా? తగదిది పోకిరి పలుకుల్!
    తేరా! నీకుల మేదియొ!
    సారా తాగిన మదమున సాహసి యౌనా?
    (భీష్ముడు, ద్రోణుడు కుమారాస్త్రవిద్యా ప్రదర్శనలో కర్ణుని అడిగిన సందర్భంలో)

    రిప్లయితొలగించండి
  8. రారాజు భూమి నీయమి
    సారాంశము జెప్పుచుంటి సవినయ మున్గా న్
    పోరాట పటిమ తోడన
    తేరా మఱి రాజ్య మిపుడు తెగువత తోడన్

    రిప్లయితొలగించండి
  9. రిప్లయిలు
    1. రారాజుని నేనని కం
      సారాతిని నింద సేసి యభయమ్ముగ దూ
      తేరాపరాఙ్ముఖివియై
      పోరాటపుఁ గామి వైతి పోగాలమునన్
      [దూత+ఇరా+పరాఙ్ముఖివి; ఇర = మాట, ఆ కారాంత స్త్రీలింగము.]

      తొలగించండి
  10. సారథ్యము నే జేయగ
    తేరాగదు,ఫల్గునుండు త్రెంచును సేనల్
    పోరాటములో, విక్రమ
    సారా!రారాజ! వినుము సంధియె హితమౌ

    రిప్లయితొలగించండి
  11. పోరాముల్ కొనితెచ్చుకోకుమికపై పోరాటముంగోరుచున్
    రారాజా!విన ధర్మరాజు పలుకుల్ రాజ్యంబు శ్రేయంబు. చిం
    తే రాదెప్పుడధర్మ కర్మ విడినన్ ధీమంతులైయున్న, ధ్వం
    సారావంబది మేలుగూర్చు తెఱగా?సంధించి మేలందుమా!

    రిప్లయితొలగించండి
  12. రారాజా ! ధర్మజు తో
    పోరాడగ దగదు వినుము , పొంతన మిల పో
    తే రాదిక; పిలువుము మన
    సారా తన భాగమొసగి జయ మొందుమయా !

    రిప్లయితొలగించండి
  13. శ్రీకృష్ణ రాయభారమునకౌరవ సభయందుకృష్ణపలుకులు
    సారాంశ మిదియె దెలిపెద
    పోరాటము వలదు మీరుపొందిక చేతన్
    రారా?యుద్దముదప్పదు
    తేరా నొప్పించ?మీకుదిగులే రాజా.

    రిప్లయితొలగించండి
  14. పోరాటము వలదని మన
    సారా ధర్మజుడు కోరి సంధికి పంపెన్
    రారాజా! వినుమిల పో
    తేరానిది ప్రాణ మనుచు తెలిపెనతండే

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. పోరాటము వలదని మన
      సారా ధర్మజుడు కోరి సంధికి పంపెన్ 
      రారాజా! వినుమిల పో 
      తే రానిది ప్రాణ మనుచు తెలిపెనతండే

      తొలగించండి
  15. తంగిరాల తిరుపతి శర్మ నెల్లూరు

    ధర్మరాజు నకులునితో పలికిన పలుకులు
    రారాజెపుడైనను మన
    సారా మనపైన ప్రేమ సారించినవిం
    తేరా నకులా ఇకపై
    పోరాటం బనుచు ధర్ము పుత్రుం డనియెన్
    (ధర్ముని పుత్రుడు = ధర్మరాజు)

    రిప్లయితొలగించండి
  16. కురువరా! రాయబారమ్ము కోరి త్రోసి
    వైచి, బేరసారాలకు స్వస్తి యనుచు
    నిటుల వదరితే రాజుల కే తెఱంగు
    సంధి బొసగు? పోరాటమ్మె జరుగ గలదు!

    రిప్లయితొలగించండి
  17. కురువరా! రాయబారమ్ము కోరి త్రోసి
    వైచి, బేరసారాలకు స్వస్తి యనుచు
    నిటుల వదరితే రాజుల కే తెఱంగు
    సంధి బొసగు? పోరాటమ్మె జరుగ గలదు!

    రిప్లయితొలగించండి
  18. శల్యుడు సుయోధనునితో
    రారాజు తోడ ననె మన
    సారా గ్రోలితి నిపుడిక సంతోషముతో
    పోరాటమునకు సిద్ధము
    తేరా రథంబు నిచటకు తీర్చెద కోర్కెన్.

    2.సుభద్ర అర్జునునితో
    రారా యనుచును నిను మన
    సారగ కోరుచు వలచితి సంబర మొదవన్
    తేరా వలపుల సరమో
    వీరా తేకున్న నిన్ను విడువను పోరా

    రిప్లయితొలగించండి
  19. కర్ణుడు తల్లి కుంతిని కలిసిన సందర్భాన కుంతీ కర్ణునితో మాట్లాడుతున్నట్టు...

    రా! రాధేయుడ! నిన్నుజూడ మనసే రంజిల్ల నేతెంచితిన్,
    పోరాటమ్మును స్వాగతించు తరుణం, బొందంగ నీ దానమున్!
    క్రూరత్వమ్మున నాడు వీడె నిను, నాఘోరంబుకున్ నిష్కృతే
    రా! రా, పాండవ పెద్దగాను, మనసారా "అమ్మ" పిల్వంగ రా||

    రిప్లయితొలగించండి

  20. రారాజు వచ్చుచుండెను
    తేరావైపునకు నిపుడు త్రిప్పుము కృష్ణా!
    పోరాట పటిమ నామన
    సారా చూపింతు సవ్యసాచిని నేనే!



    రిప్లయితొలగించండి
  21. కవిమిత్రులు మన్నించాలి...
    ఈరోజు ఉదయం మా బావమరది చనిపోయాడు. మా ఆవిడను అక్కడ దింపి ‘ఇప్పుడే వస్తా’నని అబద్ధం చెప్పి (నిజం చెప్తే “మా తమ్ముడి కంటే మీకు అవధానం ఎక్కువా?” అంటుంది కనుక) అవధాన కార్యక్రమానికి వెళ్ళాను. అవధానం అద్భుతంగా జరిగింది. అది ఐపోగానే బావమరది శవ్యాత్రకు అందుకున్నాను. ఇప్పుడే ఇల్లు చేరాను. అలసిపోయి ఉన్నాను. మన్నించండి.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. వారి ఆత్మకు శాంతి కలుగుగాక.
      మాస్టరుగారూ! మీ సాహితీ యజ్ఞాభిలాష, తపనలను వర్ణించ మాటలు రావటం లేదు.

      తొలగించండి
  22. రారా భీమా! నిను మన
    సారా హత్తుకొన కోర్కె జనియించె మదిన్
    పోరాటములోఘునుడవు
    తేరా నీకౌగిలింత తీర్చతపమ్మున్

    రిప్లయితొలగించండి
  23. Dr.Pitta Satyanarayana
    గుణముల నెంచబోకనిక గోప్యముగాభవబాధ బాపగా
    తృణమొదళమ్మొగొంచు నొక దివ్య పరేశు నహంబు నచ్చటం
    పణముగ బెట్టి భక్తిమెయిప్రార్ధనలం సరిజేయ జీవికం
    రణమననేలశాంతిగని రాజిలవచ్చును శంకరా హరా

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సత్యనారాయణ గారూ,
      ఇది దత్తపది పూరణ కోసం వ్రాసిన పద్యం కానట్టుంది.
      పద్యం బాగుంది. ప్రార్థనలన్+సరిజేయ, జీవికన్+రణమన.. అన్నప్పుడు ద్రుతం అనుస్వారంగా మారదు.

      తొలగించండి