13, జులై 2016, బుధవారం

సమస్య - 2085 (పట్టాలే లేక రైలు...)

కవిమిత్రులారా, 
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
“పట్టాలే లేక రైలు పరుగిడసాగెన్”
(భువనగిరి అవధానంలో డా. ఐ. కిషన్ రావు గారు పూరించిన సమస్య)
డా. ఇందారపు కిషన్ రావు గారి పూరణ....

జిట్టెడు లేఁడు, ముఖమ్మున
గట్టిగ మీసమ్ము లేదు గాని తరుణులన్
బట్టి తిరుగాడు పాపడు
పట్టాలే లేక రైలు పరుగిడసాగెన్.

91 కామెంట్‌లు:

  1. పట్టిన పట్టును విడువక
    భట్టారుని పరిణయ మాడ పార్వతి కోరన్
    గట్టుల రాయడు ముదమున
    పట్టాలే లేక రైలు పరుగిడ సాగెన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అక్కయ్యా,
      పార్వతీకళ్యాణానికీ రైలుకు సంబంధం ఏమిటో బోధపడలేదు.
      రెండవపాదంలో గణదోషం. ‘భట్టారుని బెండ్లియాడ పార్వతి కోరన్’ అనండి.
      ‘గట్టుల రాయని మనమున’ అంటే కొంత అన్వయం కుదురుతుంది.
      ముని అనే అర్థంలో భట్టారుడు అన్న పదం అంత ప్రస్తిద్ధం కాదుకూడా.

      తొలగించండి
  2. రిప్లయిలు
    1. డా. ఇందారపు కిషన్ రావు గారు అప్పుడప్పుడు దూరదర్శన్ వారి సమస్యా పూరణం లో కనిపించేవారండీ. ఓ పుష్కరం క్రితం వారీ సమస్యను దూరదర్శన్ లో ఇచ్చిన గుర్తు.
      కాగా , రెండు/మూడేళ్ల క్రితం తి.తి.దే వారి అవధానం కార్యక్రమాన్ని నిర్వహించి అటు ఘనపాటీలతోటీ , ఇటు వర్ధమాన /బాల అవధానులతోటీ ధారావాహికగా మంచి మంచి అవధానాలను అందించారు.
      వారికి భవదీయుడి నమోవాకములు తెలియజేయగలరు.

      తొలగించండి
    2. రామకృష్ణ గారూ,
      ధన్యవాదాలు. తప్పక తెలియజేస్తాను.

      తొలగించండి
  3. పరుగెత్తే రైలును చాలా దూరం నుంఛి చూస్తే పట్టాలు కనబడవు అన్న ఊహతో
    పిట్టవలె భుజమెక్కియె
    పెట్టిన చిరుతిండి తినుచు వ్రేల్ దవ్వున చూ
    పెట్టి బుడుగు తండ్రి కనెను { తండ్రికి + అనెను}
    పట్టాలే లేక రైలు పరుగిడసాగెన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ‘ఊకదంపుడు’ గారూ,
      మీ పూరణ బాగున్నది.
      మొదటిపాదంలో గణదోషం. ‘పిట్టవలె భుజమ్మెక్కియె/ భుజము నెక్కియె’ అనండి.

      తొలగించండి

  4. బెట్టులు జేసెను మోడీ
    గట్టిగ మారును రయిళ్ళ గమనము మేలౌ
    చట్టన జపాను సాయము
    పట్టాలే లేక రైలు పరుగిడ సాగెన్

    జిలేబి

    రిప్లయితొలగించండి
  5. పట్టున శాస్త్రములు జదివి
    పట్టిన యోచనల బహుళ వనరుల బలిమిన్
    బుట్టిన ఫలమౌచు యినుప
    పట్టాలే లేక రైలు పరుగిడ సాగెన్!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. శర్మ గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
    2. బహుళ వనరుల? నప్పదనుకుంటాను.సంస్కృతపదానికి తెలుగుపదం పరం‌కారాదు కదా.
      ఫలమౌచు యినుప ? ఫలమౌచు నినుప. యడాగమం కాదు నుగాగమం రావాలి

      తొలగించండి
    3. ధన్యవాదములు... సవరిస్తాను

      తొలగించండి
    4. సవరణతో....
      పట్టున శాస్త్రములు జదివి
      పట్టిన యోచనల గూడు వనరుల బలిమిన్
      బుట్టిన ఫలమౌచు నినుప
      పట్టాలే లేక రైలు పరుగిడ సాగెన్!

      తొలగించండి
    5. శ్యామల రావు గారూ,
      నేను గమనించలేదు. ధన్యవాదాలు.

      తొలగించండి
    6. సవరణతో....
      పట్టున శాస్త్రములు జదివి
      పట్టిన యోచనల గూడు వనరుల బలిమిన్
      బుట్టిన ఫలమౌచు నినుప
      పట్టాలే లేక రైలు పరుగిడ సాగెన్!

      తొలగించండి
  6. గురువు గారికి కవిమిత్రులకు నమస్కారములు

    పిట్టల దొరలా వాగెడు
    చుట్టపు వాడొకడి మాట చోద్యమె సుమ్మీ
    పిట్టలె గుట్టల మేసెను
    పట్టాలేలేక రైలు పరుగిడసాగెన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. దొరలా? దొరవలె అనండి.
      అదటుంచి అన్వయం?

      తొలగించండి

    2. విరించి గారూ,
      మీ పూరణ బాగున్నది.
      ‘దొరలా’ అనడం వ్యావహారికం. ‘దొరవలె’ అనండి. అలాగే ‘చుట్టపువా డాడుమాట’ అంటే బాగుంటుందేమో?

      తొలగించండి
  7. చిట్టి బుడుగు సంబరమున
    బుట్ట నడుగున గల రైలు బొమ్మను చూడన్1
    గట్టిగ నరచుచు చెప్పెను
    పట్టాలే లేక రైలు పరుగిడ సాగెన్!

    రిప్లయితొలగించండి
  8. పుట్టిన రీతిని వీడుచు
    మట్టెలు కాలికి వరుడును మెట్టక మునుపే
    జట్టుగ తిరుగిడ జంటగ
    పట్టాలే లేక రైలు పరుగిడసాగెన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మెట్టెలు కాలికి వరుడును మెట్టక మునుపే

      తొలగించండి
    2. మెట్టుట అన్న క్రియాపదం ఇక్కడ అన్వయం‌కాదు మీరనుకున్నట్లు. సాధారణార్థం‌కాక అత్తవారింటికి వచ్చు అన్న అర్థం ప్రచురం. కాని కాలికి తొడగు అని కనిపించదు.

      తొలగించండి
    3. ఫణికుమార్ గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      శ్యామలీయం గారి సూచనను గమనించండి.

      తొలగించండి
    4. పుట్టిన రీతిని వీడుచు
      కట్టుగ తాళిని వరుడును కట్టక మునుపే
      జట్టుగ తిరుగిడ జంటగ
      పట్టాలే లేక రైలు పరుగిడసాగెన్

      గురువుగారూ ససవరించాను

      తొలగించండి
  9. బెట్టేల పట్టువిడువుము
    చిట్టీ,తెచ్చితినిరైలు చిత్రపు బొమ్మన్
    నట్టున్త్రిప్పుచు కీ నిడ
    పట్టాలేలేకరైలు పరుగులు తీసెన్

    రిప్లయితొలగించండి
  10. అందరూ ప్రాసాక్షరం గురువైతే లఘువు వ్రాసారు తప్పుకాదా?

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ప్రాసాక్షరానికి ఆ నియమం లేదు. ప్రాస పూర్వాక్షరానికి మాత్రమే ఆ నియమము.

      తొలగించండి
    2. శ్రీరామ్ గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      కందంలో ప్రాసపూర్వాక్షరం మొదటిపాదంలో గురువుంటే అన్ని పాదాల్లోను గురువుండాలి. లఘువుంటే అన్ని పాదాల్లోను లఘువుండాలి. ప్రాసక్షరం లఘువుగాను, గురువుగాను ఉండవచ్చు. ఉదా...
      1) ఇందు గలఁ డందు లేఁడను
      సందేహము వలదు చక్రి...
      2) వీడా నా కొక కొడుకని
      గాడిద యేడ్చెం గదన్న ఘనసంపన్నా!
      3) ఆ మందిడి యతఁ డరిగిన
      భూమీసురుఁ డరిగెఁ దుహిన భూధర శృంగ
      శ్యామల కోమల కానన
      హేమాఢ్య దరీ ఝరీ నిరీక్షాపేక్షన్.

      తొలగించండి
  11. చిట్టియె మానస వీపును
    పట్టుక ఛుక్ ఛుక్కు మనుచు పాడుచు దిరుగన్
    గట్టిగ తాతయ పొగడెను
    "పట్టాలే లేక రైలు పరుగిడసాగెన్."

    రిప్లయితొలగించండి
  12. కొట్టేసిన మందు దిగక
    గుట్టే చెప్పక విధులకు గునగున రాగా
    అట్టే ట్రైనును నడపగ
    పట్టాలే లేక రైలు పరుగిడసాగెన్

    రిప్లయితొలగించండి
  13. ఎట్టా యేమని యంటిరి ?
    పట్టాలే లేక రైలు పరుగిడ సాగెన్
    కట్టా యే మీ ఘోరము
    లిట్టుగయును గలదె సామి ! యి ధ్ధర లోనన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఘోరము లిట్టులనుం గలవె సామి అనండి. ఇట్టుగ అంత బాగాలేదు. పద్యం‌బాగుంది.

      తొలగించండి
    2. సుబ్బారావు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      శ్యామలీయం గారి సూచనను గమనించండి.

      తొలగించండి

  14. గు రు మూ ర్తి ఆ చా రి
    ,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

    కిట్టను బుడతడు దారము

    గట్టుచు బొమ్మలను లాగగానె : -- సలిలపున్

    మట్టము లేక పడవ , యిక

    పట్టాలే లేక రైలు పరిగిడ సాగెన్ ! ! !


    కిట్టను = కిట్టు + అను ;
    సలిలపున్ మట్టము = నీటి మట్టము

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. పడవకూ రైలుకూ‌ ఎలా ముడివేసారు పద్యంలో?

      తొలగించండి
    2. గురుమూర్తి ఆచారి గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      *****
      శ్యామలీయం గారూ,
      నీళ్ళు లేక పడవబొమ్మ, పట్టాలు లేక రైలుబొమ్మ పరుగిడినాయని భావం.

      తొలగించండి
  15. పుట్టల తోనిండిన నొక
    నట్టడవిన కొండచిలువ నాదరి కొచ్చెన్
    కట్టెదుటగాంచ గుండెన
    పట్టాలే లేక రైలు పరుగిడ సాగెన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. చక్కగా ఉంది. నట్టడవిని అంటే చాలు. అలాగే గుండెను అనండి గుండెనకు బదులుగా.

      తొలగించండి
    2. విరించి గారూ,
      బాగుంది మీ పూరణ.
      శ్యామలీయం గారి సూచనను గమనించండి. అలాగే ‘వచ్చెన్’ అనడానికి బదులు ‘ఒచ్చెన్’ అన్నారు. ‘నాదరి జేరెన్’ అనండి.

      తొలగించండి
  16. ముట్టవు పొత్తము నక్కట
    యుట్టిగఁ దిరిగెదవు పట్టి యూరేలు మతిం
    గట్టా పేరాసేరా
    పట్టాలే లేక రైలు పరుగిడసాగెన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. బాగుంది. పేరాసేరా అన్నది పేరాసయేరా అవ్వాలి.కట్టా నిరాశయేరా(యేనా) అందామా? కొంచెం అన్వయసుభగత లోపించినట్లుంది కూడా.

      తొలగించండి
    2. శ్యామల రావు గారు ధన్యవాదములు. సవరించిన పూరణ:

      ముట్టవు పొత్తము నక్కట
      యుట్టిగఁ దిరిగెదవు పట్టి యూరేలు మతిం
      గట్టా పేరాససుమీ
      పట్టాలే లేక రైలు పరుగిడసాగెన్

      తొలగించండి
    3. కామేశ్వర రావు గారూ,
      సవరించిన మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  17. రిప్లయిలు
    1. బెట్టంటిని మనవారు క్రి
      కెట్టున గెలిచెదరటంచు, క్రీజున నొకరే
      జట్టున మిగులఁగ! గుండెల
      పట్టాలే లేక రైలు పరుగిడసాగెన్!

      తొలగించండి
    2. జనసాధారణమైన అనుభవం చెప్పారు. బాగుంది పద్యం.

      తొలగించండి
    3. సహదేవుడు గారూ,
      మీ పూరణ బాగుంది. అభినందనలు.

      తొలగించండి
  18. పట్టాభి రాము గృహమున
    చుట్టాల నడుమ రణమును చూచుచునుండన్
    బిట్టుగ గుండియ పొరలో
    పట్టాలే లేక రైలు పరుగిడ సాగెన్.

    రిప్లయితొలగించండి
  19. ఎట్టుల తిరుగం గలదే
    పట్టాలే లేక రైలు, పరుగిడ సాగెన్
    పట్టణ మందున పల్లెలు
    గుట్టల ప్రాంతాన కార్లు కోకొల్లలుగా

    నట్టింటను నేనుండగ
    ముట్టడి జేసిరి పలువురు మ్రుచ్చులు రేయిన్
    పట్టెను చెమటలు గుండెన
    పట్టాలే లేకరైలు పరుగిడ సాగెన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సాగెన్ ..... కార్లు.... : వచనభంగదోషం గమనించండి.
      రెండవపద్యం బాగుంది. (గుండెను అనండి)

      తొలగించండి
    2. సాగెన్ ..... కార్లు.... : వచనభంగదోషం ఏమీ‌ లేదండీ. నేనే పొరబడ్డాను. పట్టణ మందున పల్లెలు అన్నచోట పట్టణముల పల్లెలలో అనండి. రెండూ ఒక వచనంలోనికి రావటానికి. కాని అప్పుడు రైళ్ళు అనవలసి వస్తుంది న్యాయానికి. అందుచేత పట్టణమున పల్లెననన్ అంటే సరిపోతుంది చక్కగా.

      తొలగించండి
    3. విరించి గారూ,
      మీ తాజా రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
      *****
      శ్యామలీయం గారూ,
      ‘పట్టణమున పల్లియలో’ అంటే ఇంకా బాగుంటుందేమో?

      తొలగించండి
  20. కట్టిన బట్టలనె గొలుసు
    కట్టుగ పట్టుగొనుచు తిరుగాడు బుడుతలే
    పెట్టెలుగ మారె వాకిటఁ
    బట్టాలే లేక రైలు పరుగిడసాగెన్॥

    రిప్లయితొలగించండి
  21. పట్టా బొందెడి యూహన
    పొట్టిగ గనిపించు వాడు పుల్లారావే
    మెట్టున నిదురించగ?కల
    పట్టాలే లేక రైలు పరుగిడ సాగెన్ {పట్టా=డిగ్రీ}

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. పద్యం బాగానే ఉంది సమర్థింపులు అంతగా నప్పినట్లుగా అనిపించటం లేదు కాని. పూరణలో ఇబ్బంది కాదులెండి.

      తొలగించండి
    2. ఈశ్వరప్ప గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      ‘...యూహను’ అనండి.

      తొలగించండి
  22. పట్టగు బౌధ్ధారామము
    చెట్టాపట్టాలు వేసి చైనీయులచే
    కట్టింప రాజధానిని
    పట్టాలే లేక రైలు పరుగిడసాగెన్॥

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కార్యకారణసంబంధం తెలియటం‌లేదు! పద్యం మాత్రం సలక్షణం.

      తొలగించండి
    2. తిమ్మాజీ రావు గారూ,
      శ్యామలీయం గారు చెప్పినట్లు సమస్యాపరిష్కారం తృప్తికరంగా లేనట్టుంది.

      తొలగించండి
  23. ''సప్తగిరి '' దూరదర్శన్ వారు తే 22/04/2007 దీ కై యిచ్చిన ఈ సమస్యకు
    ప్రసారమైన నాటి నా పూరణ

    గట్టిగ జడలను బట్టుచు
    పట్టు పరికిణీల తొడ బాలలు రైలై
    చుట్టూ గిరగిర తిరుగగ
    పట్టాలే లేక రైలు పరుగిడసాగెన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సుకవి మిత్రులు భాగవతుల కృష్ణారావు గారూ...నమస్సులు! కాకతాళీయంగా మీ పూరణమూ...నా పూరణమూ...రెండూ ఒకే అంశాన్ని ఆధారంగా గొని పూరింపబడ్డాయి. మీ పూరణము నాకన్న బాగుగ ననిపించుచున్నది. శుభాభినందనలు!

      తొలగించండి
    2. కృష్ణారావు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  24. . కట్టడితోపనియేమని
    పట్టాలే లేక రైలు పరుగిడ సాగెన్|
    చిట్టియు మరదిప్పగనే
    దిట్టంగా నేలపైన తిరిగెను రైలై|
    3. పొట్టిగ నుండినపిల్లలు
    చట్టా పట్టాలయందు చరియించుచు నో
    పట్టాన గలసియాడన్
    పట్టాలే లేక రైలు పరుగిడ సాగెన్



    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. దిట్టంగా నేలపైన బదులు దిట్టంబుగ నేలపైన అనండి. పద్యం‌ బాగుంది.
      చట్టాపట్టాలు కాదు చెట్టాపట్టా లనా లనుకుంటాను. చట్టా పట్టాలయందు బదులు చెట్టా పట్టాల గట్టి అంటే మరింత బాగుండవచ్చును. ఓ అనటం‌ గ్రామ్యం కాబట్టి సంప్రదాయకవిత్వంలో ఇబ్బండి. పద్యం‌కొంచెం మార్చండి.

      తొలగించండి
    2. ఈశ్వరప్ప గారూ,
      మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
      శ్యామలీయం గారి సూచనను గమనించండి.

      తొలగించండి
  25. కట్టగ తాళిని ప్రియుడే
    గుట్టుగ మిత్రులనుజేరి కోవెలలోనన్
    చిట్టెమ్మ మనసునందున
    పట్టా లేలేక రైలు పరుగిడ సాగెన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కొంచెం అన్వయం లోపం. తాళిని చూపారు కాని కట్టించలేదే! గుట్టుగ బదులు కట్టగ అనండి. పద్యం‌బాగుంది.

      తొలగించండి
    2. శ్యామలీయంగారికి నమస్సులు. మొదటిపాదంలోనే "కట్టగ తాళిని" అనివ్రాశాను. గమనించండి.

      తొలగించండి
    3. అన్నపరెడ్డి వారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  26. కవిమిత్రులు మన్నించాలి. మరణించిన మా బావమరది ఐదవరొజు కార్యక్రమాలకోసం ఉదయం వెళ్ళి ఇంతకు ముందే తిరిగి వచ్చాను. అందువల్ల మీ పూరణలను వెంటవెంటనే సమీక్షించలేకపోయాను.

    రిప్లయితొలగించండి
  27. మిత్రులందఱకు నమస్సులు!

    దిట్టపుఁ ద్రాళ్ళనుఁ బట్టియు
    గట్టిగ ముడివేసి రైలుగాఁ జేసి యటన్
    బొట్టెండ్రాడుచునుండన్

    బట్టాలే లేక రైలు పరుగిడసాఁగెన్!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మధుసూదన్ గారూ,
      మీ పూరణ శ్యామలీయం గారన్నట్టు నిజంగా ప్రశస్తంగా ఉంది. అభినందనలు.
      కృష్ణారావు గారి పూరణను ప్రశంసించి మీ సంస్కారాన్ని చాటుకున్నారు. సంతోషం!

      తొలగించండి
  28. కొట్టున దెచ్చితి గనుమిట
    పట్టాలే లేక రైలు పరుగిడసాగెన్
    గుట్టుగ నీకే నొసగెద
    మట్టసముగ నాడుకొనుము మారామిడకన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఉమాదేవి గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      చివరి రెండు పాదాలను మొదటికి తెస్తే అన్వయం ఇంకా బాగుంటుందనిపిస్తున్నది.

      తొలగించండి
  29. పట్టణమున నుండు బుడుత
    మిట్టూరికి వచ్చి జూచి మెరిసెడి జెర్రిన్
    చట్టున పలికెన్నిట్టుల:👇
    పట్టాలే లేక రైలు పరుగిడసాగెన్!

    రిప్లయితొలగించండి