22, జులై 2016, శుక్రవారం

సమస్య - 2094 (వానరు లెల్ల నొక్కటయి...)

కవిమిత్రులారా, 
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది... 
వానరు లెల్ల నొక్కటయి వర్ధిలు కాలము వచ్చు టెన్నడో?
(ఆకాశవాణి వారి సమస్య)
లేదా...
వానరు లొక్కటిగఁ జేరి వర్ధిలు టెపుడో?

86 కామెంట్‌లు:

  1. వాని మతమ్ము వేఱు, మరి వాని కులమ్మును వేఱు, ప్రాంతమున్
    వానిది వేఱు, వర్ణమును వానికి వేఱది, వేఱు భాషయున్,
    జ్ఞానము తోడఁ జూడ నరజాతికి నొక్కటె తల్లివేరు, దే
    వా! నరులెల్ల నొక్కటయి వర్ధిలు కాలము వచ్చు టెన్నడో?

    రిప్లయితొలగించండి
  2. శుభోదయం
    అర్జునిని ఆవేదన పార్థసారథి తో

    హా! నారాయణ ! నొక్కరి
    మానముల మరియొకరు అవమానము గనుచున్
    దానవులగు చుంటిమి! బా
    వా, నరు లొక్కటిగఁ జేరి వర్ధిలు టెపుడో !

    సావేజిత
    జిలేబి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. జిలేబీ గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'నారాయణ + ఒక్కరి' అన్నప్పుడు యడాగమం వస్తుంది. 'ఒకరు + అవమానము' అన్నప్పుడు సంధి నిత్యం.
      'హా నారాయణ యొక్కరి
      మానమ్ముల మరి యొక రవమానము గనుచున్' అనండి.

      తొలగించండి
  3. ఈనర జాతికిన్ భవుడు నేవర మిచ్చెనొ వింతయే గదా
    దానవ వంశమే యనగ దారుణ కృత్యము లందునన్ గనన్
    కానల కేగినన్ జనులు కాంక్షను వీడక కౌతుకం బునీ
    వా!నరు లెల్ల నొక్కటయి వర్ధిలు కాలము వచ్చు టెన్నడో



    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అక్కయ్య గారూ చక్కని భావంతో పూరణ చేశారండీ

      తొలగించండి
    2. ప్రాణము లేని పోచ లిభ రాజము నైనను పట్టి కట్టవే
      పేనగ, పాము నైనను పిపీలికముల్ కడదేర్చ జాలవే
      వానరు కోటు లేకమయి వార్నిధి దాటరె రామ! బుద్ధి నీ
      వా? నరులెల్ల నొక్కటయి వర్థిలు కాలము వచ్చు టెన్నడో.

      తొలగించండి
    3. అక్కయ్యా,
      భావం కొంత గందరగోళంగా ఉన్నా పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
    4. మిస్సన్న గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
    5. ధన్య వాదములు మిస్సన్నగారికి,గురువు గారికి

      తొలగించండి
  4. నేనను స్వార్థమును విడిచి
    ధీనుల బాధలను గాంచి తిరిపెము నిడుచున్
    ధ్యానముఁజేయుచు మహదే
    వా! నరులొక్కటిగజేరి వర్థిలు టెపుడో !

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అన్నపరెడ్డి వారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      మహాదేవుని మహదేవు డనరాదు. 'శివ దేవా' అనండి.

      తొలగించండి
    2. గురువర్యులకు నమస్సులు. రవ్వా శ్రీహరి గారి నిఘంటువులో మహదేవుడు అంటే శివుడు అనిఉన్నది. అందుకే వాడాను. నాకాపీలో శివ దేవా అనిమార్చుకున్నాను. సవరణకు ధన్యవాదములు.

      తొలగించండి
  5. జ్ఞానము గలిగిన మనుజులు
    దానము ధర్మములు లేక దైత్యుల వోలెన్
    నీనా బేధము మరచి దే
    వా,నరు లొక్కటిగఁ జేరి వర్ధిలు టెపుడో ?

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అక్కయ్యా,
      మీ రెండవ పూరణ బాగున్నది. అభినందనలు.
      మూడవ పాదంలో గణదోషం. 'నీ నా యనసాగిరి దే' అందామా?

      తొలగించండి
  6. దీనుల గావరెవ్వరు ప్ర
    దీప్తమవన్ దరి జేరనివ్వ రీ
    వైన మెరుంగలేర? శుభ
    వాక్కుల బిల్వగ లేరు రమ్మనిన్
    గానగ లేరు వారలు సు
    ఖంబుల నొందగ జూడుమీశ! రా
    వా! నరులెల్ల నొక్కటయి
    వర్థిలు కాలము వచ్చు టెన్నడో!

    రిప్లయితొలగించండి
  7. ఈ సమస్య 29-8-91 నాటి ఆకాశవాణిలో ఇచ్చినది....అప్పటి నా పూరణ.

    ఈనరులందెయెందులకొ యిన్నికులమ్ములు భేదభావముల్
    కానగలేము సృష్టిని మృగమ్ములలో పశుపక్షులందునన్
    మానవ కల్పితమ్ములివి మానగలేరొకొ?ఓ మహేశ! దే
    వా! నరులెల్ల నొక్కటయి వర్ధిలు కాలము వచ్చుటెన్నడో?



    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. హనుమచ్ఛాస్త్రి గారూ,
      పదిహేనేళ్ళ క్రితం మీరు చేసిన ఈ పూరణ చాలా బాగున్నది. అభినందనలు.
      అప్పటి పద్యాన్ని ఇంకా గుర్తుంచుకొనడం (లేదా) వ్రాసి జాగ్రత్త చేయడం ప్రశంసనీయం.

      తొలగించండి
  8. కోనల కొండల దరిమెను
    మానిని జేకొని బదుకున మరణమె జూపెన్;
    కానగ వాలియు గూలెను
    వానరు లొక్కటి గఁజేరి వర్ధిలు టెపుడో?
    (వాలి సుగ్రీవుని బాధించి మరణము నందిన విధము)

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. వెంకటప్పయ్య గారూ,
      వైవిధ్యమైన మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  9. మాననివా రకృత్యముల, మాన్యతకై పరుగెత్త్తువార లె
    వ్వానికి జంకకుండగను స్వార్థమె చూచుచు నన్యమేమియున్
    గాననివారు మానవులు, కర్మము లెంచనివార లాదిలో
    వానరు, లెల్ల నొక్కటయి వర్ధిలు కాలము వచ్చు టెన్నడో?
    (హ.వేం.స.నా.మూర్తి)

    రిప్లయితొలగించండి
  10. మానాభిమానమునువిడి
    పానాసక్తులగుచుండి బాధలనిడుచున్
    దానవులవగన్ ప్రజదే
    వా,నరులొక్కటిగ జేరి వర్దిలు టెపుడో.

    దీనులబాధల విను దే
    వా,నాశంబగుచునుండె వావివరుసలున్
    దానవతను మాన్పగ లే
    వా!నరులొక్కటిగ జేరి వర్ధిలుటెపుడో.

    రిప్లయితొలగించండి
  11. కాననమట్లు వృక్షముల గ్రామములందున పెంచగన్; సురా

    పానము మాన్పి పేదలను బాధల నుంచి విముక్తి చేయగన్;

    పూని నిరక్షరాస్యతను పూర్తిగ నీ భువి పార ద్రోల; దే

    వా! నరులెల్ల రొక్కటయి వర్ధిలు కాలము వచ్చుటెన్నడో?

    ( ఈ పూరణము ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి
    17-7-2016 న సమస్యా పూరణము కార్యక్రమంలో ప్రసారమైనది.)

    రిప్లయితొలగించండి
  12. వానర సేనతో పరుని పంచన జిక్కిన నాలినేలుట,
    న్నానక కానలన్ బనుప నగ్నిపునీతను, నిందజేయుటన్
    మానక దైవదూషణల మ్రాన్పడఁ జేయుట నాటినుండె! దే
    వా! నరులెల్ల నొక్కటయి వర్ధిలు లు కాలము వచ్చుటెన్నడో?

    రిప్లయితొలగించండి

  13. గు రు మూ ర్తి ఆ చా రి
    ,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

    { వాలి , సుగ్రీవు లిరువురు నా కై తలపడుచు
    కపివర్గమ౦దు ఇక్యత లేకు౦డ చేస్తున్నారు .వానరు లొకటగు కాలము వచ్చు టెన్నడో యని తార బాధ పడినది }


    మానిని యైన తార తన మానస మ౦దున
    . నిట్లు చి౦తిలెన్ :--

    " సూనరు లో యన౦గ పొడ చూపుచు
    . సోదరు లివ్విధాన నా

    కై నెనరూని పోరెద ; రికన్ కపి వర్గము
    . భిన్నమయ్యె ! నీ

    వానరు లెల్ల నొక్కటిగ వర్ధిలు కాలము
    . వచ్చు టెన్నడో ! "


    { పొడచూపు = కనపడు , తోచు }

    రిప్లయితొలగించండి
  14. దానవ శూరు రావణుడు దాచెనశోకవనమ్ము నందు నా
    జానకి జేర కట్టెనట సాగరమందున రామసేతువే
    వానరులెల్ల నొక్కటయి, వర్ధిలు కాలము వచ్చుటెన్నడో
    మానవ శాంతికై? వెలసె మానుష రూపున రామభద్రుడై॥

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. రఘురామ్ గారూ,
      మీ పూరణ బాగున్నది.
      ‘శూరు’అంటే ద్వితీయా (శూరుని), షష్ఠీ (శూరుని యొక్క) విభక్తులు వర్తిస్తాయి. ప్రథమార్థం రాదు. ‘దానవరాజు రావణుడు’ అనండి. చివరి పాదంలో కర్తృపదం లేదు. ఎవరు రాముడై వెలిసారు?

      తొలగించండి
    2. సవరించాను గురువుగారు, కాని ఇంకా నాకు తృప్తిగా లేదు.

      దానవరాజు రావణుడు దాచెనశోకవనమ్ము నందు నా
      జానకి జేర కట్టెనట సాగరమందున రామసేతువే
      వానరులెల్ల నొక్కటయి, వర్ధిలు కాలము వచ్చుటెన్నడో?
      మానవుడై రమాపతియె మంచిగ మమ్ముల నేలునప్పుడే||

      తొలగించండి
  15. మానవ మేధకు స్వార్ధము
    పూనగనే కుల మతములు పోరొనరింపన్
    ' నీ' 'నా ' భేదము విడి, దే
    వా! నరులొక్కటిగ జేరి వర్ధిలు టెపుడో!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. చిన్న సవరణలతొ మరొక పద్యం

      మానవ మేధకు స్వార్ధము
      పూనగ, యంతరము లెన్నొ పొడ చూపెనిటన్
      నీ' 'నా ' భేదము విడి, దే
      వా! నరులొక్కటిగ జేరి వర్ధిలు టెపుడో!

      తొలగించండి
    2. శ్రీధర రావు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      ‘పూనగ నంతరము...’ అనండి.

      తొలగించండి
  16. కాననమట్లు వృక్షముల గ్రామములందున పెంచగన్; సురా

    పానము మాన్పి పేదలను బాధల నుంచి విముక్తి చేయగన్;

    పూని నిరక్షరాస్యతను పూర్తిగ నీ భువి పార ద్రోల; దే

    వా! నరులెల్ల రొక్కటయి వర్ధిలు కాలము వచ్చుటెన్నడో?

    ( ఈ పూరణము ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి
    17-7-2016 న సమస్యా పూరణము కార్యక్రమంలో ప్రసారమైనది.)

    రిప్లయితొలగించండి
  17. జ్ఞానముశూన్యము కాగా
    మానవులకు వానరులకు మతులొక్కటెయౌ
    దీనత ప్రార్థింతున్ దే
    వా!నరులొక్కటిగజేరి వర్థిలుబటెపుడో?!

    రిప్లయితొలగించండి
  18. కానరు దుష్ట చిత్తులయి గౌరవ దృష్టి మతేతరస్థితున్
    మానము ప్రాణమన్న చిఱుమన్నన లేక వధింప నేర్తురే
    దానవ భావమున్ విడిచి దౌష్ట్యపు టిక్కలి కాలమందు దే
    వా! నరు లెల్ల నొక్కటయి వర్ధిలు కాలము వచ్చు టెన్నడో


    పూనిన యైక్యత సాగుచు
    వే నశియింపగ, విభులను వేడి నరులికన్,
    మేనలయు వృత్తి యరులును
    వానరు లొక్కటిగఁ జేరి వర్ధిలు టెపుడో

    [వాను+అరులు=వానరులు; వాను =(కుండలు) చేయు; అరులు = పన్నులు]

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కామేశ్వర రావు గారూ,
      మీ మొదటి పూరణ చాలా బాగున్నది. అభినందనలు.
      క్షమించాలి!.. మీ రెండవ పూరణ అర్థం కాలేదు.

      తొలగించండి
    2. పూజ్యులు శంకరయ్య గారికి వందనములు.
      కుండలుచేయు పనిమీదవేయు పన్నులు(వాను+అరులు), శరీర శ్రమ తో గూడిన యితర వృత్తి పన్నులు వేగముగ తీయమని యధికారులను ప్రజలంతా కోరి ఐకమత్యముగా నెప్పుడు వర్థిల్లుతారా! యని నా భావన సరిగా ప్రదర్శించలేక పోయానేమో?

      తొలగించండి
  19. దానముజేయలేడు,పర దారనుదల్లిగ జూడలేడు,సం
    ధానముజేసి సజ్జనుల ధార్మిక కార్యము సల్పలేడు,స
    మ్మానము జేయలేడు ఘన మానవశ్రేష్టుడు స్వార్థమబ్బి.దే
    వా!నరులెల్లరొక్కటయి వర్థిలు కాలము వచ్చుటెన్నడో

    రిప్లయితొలగించండి
  20. (నా రెండవ పూరణము.)

    కానగ సఖ్యతయె కఱవు

    పూనికతో మంచిపనులు పూర్తిగ చేయన్

    మానవుల మధ్యనో దే

    వా! నరులొక్కటిగ జేరి వర్ధిలు టెపుడో?

    రిప్లయితొలగించండి
  21. తానును భార్య బిడ్డలని తల్చక సంఘముఁ గూర్చి యెప్పుడున్
    గానుగ యెద్దుజీవితముఁగాంచుచునుందురు స్వార్థబుద్ధితో
    మానవులందరిన్ సతము మన్ననఁజేయుచు, నిన్నుగొల్చి దే
    వా! నరులెల్లనొక్కటయి వర్థిలు కాలము వచ్చుటెన్నదో!

    రిప్లయితొలగించండి
  22. ఘోరము జర్గుచుండె కుల గోడల కూలగ ద్రోయు మానవు
    ల్లేరిల ద్వేష భావ ఝరులే కని పించుచు నుండె నంతటన్
    దూరము కాదు ప్రస్తుతము దుర్జన సంస్కృతి యాగదింక దే
    వా! నరు లెల్ల నొక్కటయి వర్ధిలు కాలము వచ్చు టెన్నడో!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ప్రాస లో పొరబడి నట్లున్నారు గమనించండి

      తొలగించండి
    2. ప్రాసానుకూలముగ మీ పద్యమునకు నా సవరణ:

      కోనము లందు నింక కుల గోడల కూలగ ద్రోయు మానవుల్
      లేని పురమ్ము ద్వేష ఝరులే కని పించుచు నుండె నంతటన్
      తూనిక పోయె ప్రస్తుతము దుర్జన సంస్కృతి యాగదింక దే
      వా! నరు లెల్ల నొక్కటయి వర్ధిలు కాలము వచ్చు టెన్నడో!

      తొలగించండి
    3. లక్ష్మినారాయణ గారూ,
      పోచిరాజు వారు సవరించిన మీ పూరణ బాగున్నది.
      ‘కుల గోడలు’ దుష్టసమాసం కదా! ‘కుల కుడ్యము కూలగ ద్రోయు...’ అనండి.

      తొలగించండి
    4. పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. ప్రాస భేదము నొక్కదానినే చూచాను. అవునండి "కులగోడలు" గమనించ లేదు. "కోనము లందునీ కులపు గోడలు" అనిన సరిపోవుననుకుంటాను.

      తొలగించండి
  23. ఈనరు లెల్లకాలమునునేదొనెపంబునపోరుచేయుచున్
    జ్హానములేకదుష్టులుగచంపుచు చచ్చుచుయుగ్రవాదులై
    దానవ రీతియై మసలధారుణి యెంతనుతల్లడిల్లె దే
    వా, నరులెల్లనొక్కటయివర్థిలుకాలము వచ్చుటెన్నడో

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. శ్రీనివాసాచార్యులు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      ‘చచ్చుచు నుగ్రవాదులై’ అనండి.

      తొలగించండి
  24. నీ నా భేదము లన్నియు
    పూనికతో పారద్రోలి పొందిక తోడన్
    మానవతను మరువక దే
    వా! నరులొక్కటిగ జేరి వర్థిలు టెపుడో!!!

    రిప్లయితొలగించండి
  25. మానవ జన్మమెత్తి నవమానకరంబుగ స్వార్ధ బుద్ధులన్
    ఈ నగరస్థులౌ మనుజులెల్లరి భాషయు, ప్రాంతమున్, కులం
    బైనను కోరుచుంద్రు!! పర భావనలెన్నడు బోవునయ్య దే
    వా? నరులెల్ల నొక్కటయి వర్ధిలు కాలము వచ్చుటెన్నడో?
    (పర భావనలు = భాష చేత అతడు నాకు పరుడు, కులము చేత ఇతడు నాకు పరుడు, ప్రాంతము చేత ఆమె నాకు పార్యిది ఇలాంటి భావనలు )

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. శ్రీధర రావు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      ‘జన్మమెత్తి యవమానకరంబుగ...’ అనండి.

      తొలగించండి
  26. దానవ చేష్టలందు గలదర్పము చేతనుమానవత్వమే
    మానియు|నాశ దోషముల మాయనుగూడియు లాభసాటిగా
    జ్ఞాన విహీనతన్ బ్రతుక జన్మకు సార్థక మౌన?దే
    వా నరులెల్లనొక్కటయి వర్ధిలు కాలము వచ్చు టెన్నడో?
    2.జ్ఞానము బంచెడి గురువి
    జ్ఞానిగ నమ్ముటయుజూడ?జన జాగృతిన
    జ్ఞానము మాన్పగరా దే
    వా|నరులొక్కటిగ జేరి వర్ధిలుటెపుడో?

    రిప్లయితొలగించండి
  27. కానల నివసించెడి,యా
    వానరులొక్కటిగ జేరి వర్ధిలు టెపుడో?
    నీనాథుడు వారి నెరవు
    జానకి!నిను గాచు?నని దశానను డనియెన్

    రిప్లయితొలగించండి
  28. కానల లోన నున్న పలు గాకులు కూటికి యెట్లు పోయినన్
    ప్రాణము పావుచున్న తమ వారికి తోడుగ నుండు నొక్కచో
    మానవు లైక్యతన్ బరఁగు మార్గము నో విధి ! నీవు జూడ లే
    వా ? నరు లెల్ల నొక్కటయి వర్ధిలు కాలము వచ్చు టెన్నడో?

    వానర సంతతియే గద
    యీ నర వంశంబయె క్షితి నింగిత మబ్బన్
    కానుచు జ్ఞానము భువి వ
    హ్వా ! నరు లొక్కటిగఁ జేరి వర్ధిలు టెపుడో?

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కృష్ణారావు గారూ,
      మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
      ‘కూటికి నెట్లు..’ అనండి.

      తొలగించండి
  29. దానవ మానసోన్నతులు ధర్మము వీడియు హింసకృత్యముల్
    మానక చేయు చుండిరిల మార్గము దప్పిచరించు
    చుండ్రి దు
    ర్మానవ హీన చేష్టలును మానగ సిద్ధము లేరువారు దే
    వా!వరు లెల్ల నొక్కటయి వర్ధిలు కాలము వచ్చు టెన్నడో.

    రిప్లయితొలగించండి
  30. కాలేశ్వర రావు గారు మీ సూచనకు ధన్యవాదాలు
    వేరే పద్యము వ్రాశాను

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. లక్ష్మీనారాయణ గారు బాగుందండి మీ పద్యము. సమస్యా పాదములో "వానరు" నకు బదులు "వావరు" పడింది.
      "మానగ సిద్ధముగ లేరు" అనాలికదా. "మానగ సిద్ధము లేర"నిన సమంజసము గా లేదనుకుంటాను. పరిశీలించండి. "మానతలంపును లేని వారు" అన్న గణ భంగమవదు.

      తొలగించండి
  31. మానవ జన్మ యొక్క పరమార్థము చూపగ రాముడొచ్చెయా
    వానర జాతికే యిలను వన్నెయు గల్గెను రామసంగమున్
    మానవ జాతిఁ దానిలను మగ్గుచు నుండగనీర్ష్యలోననీ
    వానరు లెల్ల నొక్కటయి వర్ధిలు కాలము వచ్చు టెన్నడో

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఫణి కుమార్ గారు,
      "వచ్చె" అనవలె, "ఒచ్చె" అనటము వ్యవహారీకము

      తొలగించండి
    2. ఫణికుమార్ గారూ,
      మీ పూరణ బాగున్నది.
      జిగురు వారు చెప్పినట్లు ‘పరమార్థము రాముడు చూప వచ్చె నా| వానర...’ అనండి.

      తొలగించండి
    3. సత్యనారాయణ గారూ మీ సూచనకి ధన్యవాదములు.

      గురువుగారూ మీ సవరణకి ధన్యవాదములు.

      తొలగించండి
  32. పోచిరాజు కామేశ్వర రావు గారికి ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  33. ​హీనము మీదు జాతి​ ​యని హీనము మీదు మతమ్మటంచు నీ
    ​​మానవులెల్ల పోరుచును మారణహోమము చేయుచుండి రీ
    దానవ వృత్తి మానుకొని స్థైర్యముగామను​ చుండ నోరి దే
    వా! నరులెల్ల నొక్కటయి వర్ధిలు కాలము వచ్చుటెన్నడో? ​

    రిప్లయితొలగించండి
  34. ​​హీనము మీదు జాతి​ ​యని హీనము మీదు మతమ్మటంచు నీ
    ​​మానవులెల్ల పోరుచును మారణహోమము చేయుచుండి రీ
    దానవ వృత్తి మానుకొని స్థైర్యముగామను​ చుండ నోయి దే
    వా! నరులెల్ల నొక్కటయి వర్ధిలు కాలము వచ్చుటెన్నడో? ​

    రిప్లయితొలగించండి
  35. మానరు భేదభావముల మాటకు పోరగ ఁజూతు రందరున్
    కాని మతమ్ము వాడనుచు కత్తిన గొంతును కోయు చుండిరే!
    హీన గుణమ్ము లీగతిన హెచ్చక లోకము వీడి పో
    వా? నరులెల్ల నొక్కటయి వర్ధిలు కాలము వచ్చు టెన్నడో!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మడిపల్లి రాజ్ కుమార్ గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  36. సోనియ రాహులున్ మమత జోడుగ చందురులిద్దరున్ సదా
    కోనల వేచియుండుచును కొండలు మ్రింగెడి యాదవాదులున్
    దీనుల బ్రోచెదమ్మనుచు తిండియు పెట్టని రాజకీయులౌ
    వానరు లెల్ల నొక్కటయి వర్ధిలు కాలము వచ్చు టెన్నడో?

    రిప్లయితొలగించండి