కవిమిత్రులకు నమస్కృతులు. నేను మళ్ళీ హైదరాబాదులోని ఒక వృద్ధాశ్రమంలో చేరాను. నిన్న సాయంత్రం ఇంటినుండి బయలుదేరి ఇక్కడికి చేరుకొని అన్నీ అనుకూలంగా సమకూర్చుకొనడంలో రోజంతా గడచిపోయింది. అందువల్ల నిన్న సాయంత్రం నుండి మీ పూరణలపై స్పందించలేకపోయాను. బాగా అలసిపోయి ఉన్నందున పద్యాలను సునిశితంగా పరిశీలించలేకపోతున్నాను. మన్నించండి. ***** రాజేశ్వరి అక్కయ్యా, మీ పూరణ బాగున్నది. అభినందనలు. ***** కెంబాయి తిమ్మాజీ రావు గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు. ***** నాగరాజు రవీందర్ గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు. ***** శైలజ గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు. ***** రెండుచింతల రామకృష్ణ మూర్తి గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు. ***** గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు. ***** అశ్వత్థ నారాయణ మూర్తి గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు. మొదటిపాదంలో గణదోషం. ‘ఇందుకళాధరుని విడిచి’ అనండి. ***** గుండు మధుసూదన్ గారూ, మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు. ***** బొడ్డు శంకరయ్య గారూ, మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు. రసాయనమును రసాయణము అన్నారు. ***** అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు. ***** కె. ఈశ్వరప్ప గారూ, మీ మూడు పూరణలు (మధ్యాక్కరతో సహా) బాగున్నవి. అభినందనలు. ‘అర్పిత నెయ్యీ’ అని సమాసం చేయరాదు. అక్కడ ‘అర్పిత ఘృతమున్’ అనండి. ***** పిరాట్ల ప్రసాద్ గారూ, ధన్యవాదాలు. కాని గుండా వారి ‘విందువ? దుష్ట గ్రహముల’ అన్న పాదంలో గణదోషం లేదు. ‘దుష్టగ్రహముల’ అన్నప్పుడు గ్ర వల్ల ష్ట గురువౌతున్నది. రేఫసంయుక్తాక్షరానికి ముందున్న అక్షరాన్ని సౌలభ్యాన్ని బట్టి గురువుగాను, లఘువుగాను స్వీకరించే సౌలభ్యం ఉంది. దీని గురించి మన బ్లాగులో గతంలో పెద్ద చర్చే జరిగింది. ***** పోచిరాజు సుబ్బారావు గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు. ***** గండూరి లక్ష్మినారాయణ గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు.
మమధుసూదన్ గారూ చాలా చాలా కృతజ్ఞతలు. అదే ఈ వేదిక ప్రత్యేకత. గురువు గారే అని కాకుండా మీలాంటి విజ్ఞులు ఈ ప్రస్థానం లో మాతోపాటు ఉంటూనే మావంటి వారికి మీ జ్ఞానాన్ని పంచుతుంటారు . మీరు నా ఉదాహరణ కు సమాధానం ఇవ్వలేదు. 'కవులిల గ్రీష్మ' లో లిల తో పూర్తియై తదుపరి పదము సంయుక్తాక్షరం తో మొదలవుతుంది కదా, ల గురువు కావచ్చునా?
మూర్తిగారు, కవులిల గ్రీష్మ తాపము ఈ పాదములో ఇల తో పదము పూర్తయింది. గ్రీష్మముతో సంస్కృతపదము మొదలయింది. ఈ రెండూ వేర్వేరు పదాలే తప్ప సమాసం కాదు. కాబట్టి గ్రీ వల్ల ల గురువు కాదు. గ్రీ గురువు కావడం వల్ల గణదోషం వచ్చింది. మీరూ గణదోషం తొలగించి సరి చేశారు.
కొరుప్రోలు రాధాకృష్ణ రావు గారూ, ఆలస్యంగా స్పందిస్తున్నందుకు మన్నించండి. వృద్ధాశ్రమంలో నేనింకా సర్దుకోలేదు. శబ్దాలంకారంతో మీ పూరణ వినసొంపుగా ఉంది. అభినందనలు. ***** అశ్వత్థ నారాయణ మూర్తి గారూ, ‘కవి లిల గ్రీష్మ’లో నిజానికి ఇల శబ్దం తత్సమమే. కాని అది సమాసాంతర్గతం కాదు. అలా కావాలంటే ‘ఇల’ శబ్దం ఆకారాంత స్త్రీలింగశబ్దం. కాబట్టి ‘ఇలాతలము’ వంటి సమాస మేర్పడుతుంది. మీ ఉదాహరణంలో అది ఈలోకంలో అనే అర్థంలో ద్రుతం లోపిందిన ‘ఇలన్’ కనుక దాని తరువాత ఉన్న సంయుక్తాక్షరం వల్ల అది గురువు కాదు. ఈ విషయమై స్పదించి, వివరణ ఇచ్చిన గుండు మధుసూదన్ గారికి, లక్ష్మీదేవి గారికి ధన్యవాదాలు. ***** కె. ఈశ్వరప్ప గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొందర పడిశుభ మనుకొని
రిప్లయితొలగించండిఅందఱకును గీడు గల్గు యాగముఁ జేయన్
కొందరు రక్కసి మూకలు
చిందర వందరలు జేసి చిత్రము జూడన్
రిప్లయితొలగించండిముందువెనుక లెరుగనిచో
అందరకును గీడు గల్గు యాగము జేయన్
అందరు విజ్ఞాన ఋషులు,
సుందర జగమందు జనులు శుభములు గనరే
బందులు హర్తాళ్ జరుగగ
రిప్లయితొలగించండినందరకును కీడుగల్గు, యాగము జేయన్
గందరగోళములు దొలగి
గంధవతికి మేలుకలుగు గణనీయముగన్!!!
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండివిశ్వామిత్రుడు దశరధునితో పలికిన సందర్భము;
రిప్లయితొలగించండికుందగ జేసెడు యసురుల
కందరకును గీడుగల్గు యాగము జేయన్
తొందరపడి నీ శిశువుల
ముందరనా వెంట పంపు మోయీ రాజా!
గందరగోళముఁ దీర్చును
రిప్లయితొలగించండిచిందర వందరలుఁ దొలగు జీవితమందున్
విందువ? దుష్ట గ్రహముల
కందరకును గీడుఁ గల్గు యాగముఁ జేయన్!
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిఇందు కళాధరు విడిచి
రిప్లయితొలగించండియందరకును గీడుఁ గల్గు యాగముఁ జేయన్
బొందిరి భీకర శిక్షల
నందరు దక్షాఘమంత నంతము జెందెన్
మిత్రులు శ్రీ కంది శంకరయ్యగారికి, సుకవి మిత్ర బృందమునకు నమస్సుమాంజలులతో...
రిప్లయితొలగించండి(ఆస్తీకమునీంద్రుండు జనమేజయుని సర్పయాగముం జేయుమని ప్రోత్సహించు సందర్భము)
కొందల మందక కౌరవ!
ముందుగ నీ సర్పయాగమున్ మొదలిడుమా!
మ్రందఁగఁ జేసెడి విషధరు
లందఱకును గీడుఁ గల్గు యాగముఁ జేయన్!!
మధుసూధన్ గారూ అదే విషయం తో పద్యీకరిద్దామనుకున్నా!
రిప్లయితొలగించండిమీరు విడుదల చేసేశారు. చాలా బాగుంది, ధన్యవాదాలు.
వందల చెట్లను నరుకుచు
రిప్లయితొలగించండిహుందాగా కలప దెచ్చి హోమపు కుండం
బందున వేసిన మనుజుల
కందఱకును గీడుఁ గల్గు యాగము జేయన్!
మందులు రసాయణములను
రిప్లయితొలగించండిచిందించుచు క్రతువుపేర చిరుమబ్బులతో
బొందిన వర్షముతో మన
కందఱకును గీడుఁ గల్గు యాగముఁ జేయన్!
చందాలఁబొంది యిష్టికి
రిప్లయితొలగించండివిందులకై ఖర్చుచేసి విచ్చలవిడిగా
మందులతోడ్పాటుఁగొనిన
యందరకును కీడుగల్గు యాగముఁజేయన్
ఇష్టిః యాగము
కొందరు యాగము జేయగ?
రిప్లయితొలగించండిఅందుంచెడి సరుకు లన్ని,అర్పిత నెయ్యీ
గంధము కల్తీ మయమా?
అందఱకును గీడు గల్గు యాగము జేయన్|
2.సంధిగ్దమునన్ జరుపుచు
కొందరి ఆలోచనలిడు కోర్కెల మేరన్
నిందల యందున-ఫలితము
అందఱకును గీడు గల్గు యాగము జేయన్
గుండా వెంకట సుబ్బ సహదెవుడు గారు మీ పద్యం లొ మూదవపాదం లొ చివర గణం తప్పినది సరిచెయగలరు .
రిప్లయితొలగించండిమందుల గల్తీ గలిపిన
రిప్లయితొలగించండినం దఱ కును గీడు గల్గు యాగము జేయన్
వందనములు నే జేతుబ
సందుగ నాసోమయాజి శర్మకు నెపుడున్
ధన్యవాదములు MURTHY YSANగారూ!
రిప్లయితొలగించండిమీ పూరణమును బాగుగ నున్నది. అభినందనలు.
అందున యాగ ఫలంబు లందించక,శివుని యాజ్ఞ
రిప్లయితొలగించండిపొందక,దక్షుని పొగరు పూర్తిగ నిండెను గనుక?
అందుకే ఆ వీర భద్రు డణచగ|నాశనమందు
అందఱకును గీడు గల్గు యాగముజేయన్?విలువలు|
-------------------మధ్యాక్కర---------------------
నా రెండవ పూరణము:
రిప్లయితొలగించండి(అపత్నీకుఁడై శ్రీరాముఁ డశ్వమేధయాగము నారంభించునని తెలిసినంతనే జను లిట్లనుకొనిన సందర్భము)
"ఎందుల కీ విధి దశరథ
నందనుఁడు నజాని యయ్యు నడపును జన్నం?
బిందునఁ బొందెద రశుభము;
లందఱకును గీడు గల్గు, యాగముఁ జేయన్!!"
అందర కత్యవసరమౌ
రిప్లయితొలగించండికందమ్ముల గుంపు లిచ్చు కరణన్ వానన్
తొందరపడి చెరచిన వా
రందఱకును గీడు గల్గు , యాగముఁ జేయన్.
కవిమిత్రులకు నమస్కృతులు.
రిప్లయితొలగించండినేను మళ్ళీ హైదరాబాదులోని ఒక వృద్ధాశ్రమంలో చేరాను. నిన్న సాయంత్రం ఇంటినుండి బయలుదేరి ఇక్కడికి చేరుకొని అన్నీ అనుకూలంగా సమకూర్చుకొనడంలో రోజంతా గడచిపోయింది. అందువల్ల నిన్న సాయంత్రం నుండి మీ పూరణలపై స్పందించలేకపోయాను. బాగా అలసిపోయి ఉన్నందున పద్యాలను సునిశితంగా పరిశీలించలేకపోతున్నాను. మన్నించండి.
*****
రాజేశ్వరి అక్కయ్యా,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
*****
కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
*****
నాగరాజు రవీందర్ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
*****
శైలజ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
*****
రెండుచింతల రామకృష్ణ మూర్తి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
*****
గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
*****
అశ్వత్థ నారాయణ మూర్తి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
మొదటిపాదంలో గణదోషం. ‘ఇందుకళాధరుని విడిచి’ అనండి.
*****
గుండు మధుసూదన్ గారూ,
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
*****
బొడ్డు శంకరయ్య గారూ,
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
రసాయనమును రసాయణము అన్నారు.
*****
అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
*****
కె. ఈశ్వరప్ప గారూ,
మీ మూడు పూరణలు (మధ్యాక్కరతో సహా) బాగున్నవి. అభినందనలు.
‘అర్పిత నెయ్యీ’ అని సమాసం చేయరాదు. అక్కడ ‘అర్పిత ఘృతమున్’ అనండి.
*****
పిరాట్ల ప్రసాద్ గారూ,
ధన్యవాదాలు. కాని గుండా వారి ‘విందువ? దుష్ట గ్రహముల’ అన్న పాదంలో గణదోషం లేదు. ‘దుష్టగ్రహముల’ అన్నప్పుడు గ్ర వల్ల ష్ట గురువౌతున్నది. రేఫసంయుక్తాక్షరానికి ముందున్న అక్షరాన్ని సౌలభ్యాన్ని బట్టి గురువుగాను, లఘువుగాను స్వీకరించే సౌలభ్యం ఉంది. దీని గురించి మన బ్లాగులో గతంలో పెద్ద చర్చే జరిగింది.
*****
పోచిరాజు సుబ్బారావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
*****
గండూరి లక్ష్మినారాయణ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
మందుల విందుల చిందులు
రిప్లయితొలగించండిచిందర వందరగ మారి చిక్కులు చెలగన్,
మందుల విందుల యాగము
అందరకును గీడు గల్గు యాగము జేయన్
కొరుప్రోలు రాధ కృష్ణ రావు
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిగురువు గారూ
రిప్లయితొలగించండిమీరు అన్యథా భావించకపోతే, నాకోసందేహం
నిన్నటి నా పూరణ లో ' కవులిల గ్రీష్మ ' లో ల ను గ్రీ లోని రేఫ
వల్ల గురువు గా తీసుకొనే సౌలభ్యం ఉంది కదా
క్షమించండి, ఆ సౌలభ్యం సంయుక్తాక్షరానికి మాత్రమే అని మీ నిన్నటి వివరణ బట్టి అర్థము వచ్చు లాగున్నది
తొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
తొలగించండికొందరు యాగము జేయగ?
రిప్లయితొలగించండిఅందుంచెడి సరుకు లన్ని,అర్పిత ఘ్రుతమున్
గంధము కల్తీ మయమా?
అందఱకును గీడు గల్గు యాగము జేయన్|
రసాయనము అను పదమునకు బదులుగా రసాయణము అను పదం టైపాటుకు చింతిస్తున్నాను గురువు గారు...
రిప్లయితొలగించండిఅశ్వత్థనారాయణమూర్తిగారూ,
రిప్లయితొలగించండిరేఫసంయుక్తమునకు ముందున్న యక్షరము సౌలభ్యమునుఁ బట్టి గురువుగ మారవలెనన్న నది యేకపదముగనో లేక యేకసమాసముగనో యుండవలెను. ఉదాహరణమునకు..."గురుపదముల గ్రహియించిన..."లో ’ల’ను లఘువుగను, "గురుపాదగ్రహణముచే..."లో ’ద’ను గురువుగను స్వీకరించవలెను. ఒకోసారి లఘువుగ/గురువుగఁ బరిగణింపఁబడవలెనన్నచోఁ బదము పూర్తియై తదుపరి పదము సంయుక్తాక్షరముతో మొదలుకావలెను. ఆ రెండు పదములును సమసించుచుండవలెను. అప్పుడే రేఫసంయుక్తమునకు ముందఱి యక్షరము లఘువుగనో/గురువుగనో పరిగణింపఁబడును. స్వస్తి.
మమధుసూదన్ గారూ
తొలగించండిచాలా చాలా కృతజ్ఞతలు. అదే ఈ వేదిక ప్రత్యేకత. గురువు గారే అని కాకుండా మీలాంటి విజ్ఞులు ఈ ప్రస్థానం లో మాతోపాటు ఉంటూనే మావంటి వారికి మీ జ్ఞానాన్ని పంచుతుంటారు .
మీరు నా ఉదాహరణ కు సమాధానం ఇవ్వలేదు. 'కవులిల గ్రీష్మ' లో లిల తో పూర్తియై తదుపరి పదము సంయుక్తాక్షరం తో మొదలవుతుంది కదా, ల గురువు కావచ్చునా?
గుండు వారి వివరణ సమగ్రముగానున్నది. వారు కూడా ఉపాధ్యాయులని అనిపించుచున్నది. వారిలాంటి వారే గుణదోష విచారణ చేయుటకు సమర్ధులు అర్హులు అనుట ఉచితమే గదా!
రిప్లయితొలగించండిమూర్తిగారు,
రిప్లయితొలగించండికవులిల గ్రీష్మ తాపము
ఈ పాదములో ఇల తో పదము పూర్తయింది. గ్రీష్మముతో సంస్కృతపదము మొదలయింది. ఈ రెండూ వేర్వేరు పదాలే తప్ప సమాసం కాదు. కాబట్టి గ్రీ వల్ల ల గురువు కాదు. గ్రీ గురువు కావడం వల్ల గణదోషం వచ్చింది. మీరూ గణదోషం తొలగించి సరి చేశారు.
కొరుప్రోలు రాధాకృష్ణ రావు గారూ,
రిప్లయితొలగించండిఆలస్యంగా స్పందిస్తున్నందుకు మన్నించండి. వృద్ధాశ్రమంలో నేనింకా సర్దుకోలేదు.
శబ్దాలంకారంతో మీ పూరణ వినసొంపుగా ఉంది. అభినందనలు.
*****
అశ్వత్థ నారాయణ మూర్తి గారూ,
‘కవి లిల గ్రీష్మ’లో నిజానికి ఇల శబ్దం తత్సమమే. కాని అది సమాసాంతర్గతం కాదు. అలా కావాలంటే ‘ఇల’ శబ్దం ఆకారాంత స్త్రీలింగశబ్దం. కాబట్టి ‘ఇలాతలము’ వంటి సమాస మేర్పడుతుంది. మీ ఉదాహరణంలో అది ఈలోకంలో అనే అర్థంలో ద్రుతం లోపిందిన ‘ఇలన్’ కనుక దాని తరువాత ఉన్న సంయుక్తాక్షరం వల్ల అది గురువు కాదు.
ఈ విషయమై స్పదించి, వివరణ ఇచ్చిన గుండు మధుసూదన్ గారికి, లక్ష్మీదేవి గారికి ధన్యవాదాలు.
*****
కె. ఈశ్వరప్ప గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
అందమ్ముగ జేసెదనిక
రిప్లయితొలగించండిసుందర చండీ హవనము శుభకరముంగన్
వందలు వందల పగతురు
లందఱకును గీడు గల్గు యాగముఁ జేయన్
నందముతో తెలగాణను
రిప్లయితొలగించండికొందరు మిత్రులను గూడి కూరిమి తోడన్
చందురు డేగెను శత్రువు
లందఱకును గీడు గల్గు యాగముఁ జేయన్