రాజేశ్వరి అక్కయ్యా, మీ పూరణ బాగున్నది. అభినందనలు. ‘నిప్పు+ఎప్పటికి’ అన్నప్పుడు సంధి నిత్యం, నుగాగమం రాదు. ‘నిజము దెలియ నిప్పె యెప్పటికైనను’ అనండి. ***** అశ్వత్థ నారాయణ మూర్తి గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు. ‘తప్పు+అనుట’ అన్నప్పుడు యడాగమం రాదు. ‘తప్పనుటయు’ అనండి. ***** శైలజ గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు. ***** డా. బల్లూరి ఉమాదేవి గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు. ‘తోడను’ అనండి. ***** నాగరాజు రవీందర్ గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు. మీ రన్నమాట నిజం. “పూరణమ్ము జేసె పోనిమ్ము లెమ్మని" కొందరి పద్యాల్లో కొన్ని తప్పులను చూసీచూడనట్టు వదిలేస్తూ ఉంటాను. ప్రతి పద్యాన్నీ శల్యపరీక్ష చేసి విశ్లేషించే ఓపిక ఎలాగూ నాకు లేదు. ఒకవేళ చేసినా ఇన్ని తప్పులతో పద్యాలు వ్రాయడం ఎందుకు అనుకొని కొందరు బ్లాగునుండి తప్పుకొనే ముప్పు ఉంది. అందుకే ‘తప్పు లొప్పు లన్నఁ దప్పు ముప్పు’! ***** గండూరి లక్ష్మినారాయణ గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు.
అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు. ***** పి.యస్.ఆర్. మూర్తి గారూ, మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు. ***** కెంబాయి తిమ్మాజీ రావు గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు. ***** కె. ఈశ్వరప్ప గారూ, మీ మూడు పూరణలు బాగున్నవి. అభినందనలు. మూడవపూరణలో ‘కలతలొచ్చు’ అన్నారు. ఒచ్చు అన్న పదం లేదు. ‘కలత లగును’ అనండి.
ముప్పు తప్ప దెపుడు మూర్ఖుని రంజింప తప్పు లెత్తి జూపి తనరు నపుడు , తప్పు గప్పి బుచ్చి తగు రీతి మెప్పించి తప్పు లొప్పు లన్న ( దప్పు ముప్పు కొరుప్రోలు రాధా కృష్ణ రావు
మల్లెల సోమనాథ శాస్త్రి గారూ, మీ నాలుగు పూరణలు బాగున్నవి. అభినందనలు. మొదటిపూరణలో ‘పలికినంత నొరులు మెత్తు| రెరుకలేనిచోట...’ అనండి. అన్నపరెడ్డి వారి పూరణలోని దోషాన్ని నేను గమనించలేదు. తెలియజేసినందుకు ధన్యవాదాలు. వారుకూడా మీ సూచనను గమనించి ఆటవెలదిలో పూరణ నందించారు. ***** రెండుచింతల రామకృష్ణ మూర్తి గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు. ‘తప్పు+ఎన్నడైన’ అన్నప్పుడు సంధి నిత్యం, యడాగమం రాదు. ‘తప్పు చూడ సతము తప్పె యగును గాని’ అందామా? ***** కొరుప్రోలు రాధాకృష్ణ రావు గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు. ***** అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ, తప్పు తెలిసికొని ఆటవెలదిలో పూరణ నందించినందుకు ధన్యవాదాలు. పూరణ బాగున్నది. అభినందనలు.
తప్పు జేయు చుండి తగులము లేకున్న
రిప్లయితొలగించండితప్పు లొప్పు లన్నఁ దప్పు ముప్పు
నిజము తెలియ నిప్పు నెప్పడి కైనను
కాల్చి చంపు నంట కాటి వరకు
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిముప్పు తప్పదిలను ముమ్మాటికి జనులు
రిప్లయితొలగించండితప్పు లొప్పు లన్న , దప్పు ముప్పు
కప్పి యుంచ కున్న తప్పుల నెప్పుడు
ముప్పు దప్పు గాదె ముందుముందు !!!
.ఆ.వె: మొండి వారి తోడ మూర్ఖుల తోడనూ
రిప్లయితొలగించండిముచ్చటింప ఫలిత ముండదు గద
వారి తోడ శుష్క వాదమాడక వారి
తప్పు లొప్పు లన్న దప్పు ముప్పు
.ఆ.వె: మొండి వారి తోడ మూర్ఖుల తోడనూ
రిప్లయితొలగించండిముచ్చటింప ఫలిత ముండదు గద
వారి తోడ శుష్క వాదమాడక వారి
తప్పు లొప్పు లన్న దప్పు ముప్పు
తప్పు చేయువారు తండోప తండంబు
రిప్లయితొలగించండితప్పు లెన్ను వారి తప్పు లెంత్రు
తప్పు లని తెలిసిన దప్పించు కొనుటకై
తప్పు లొప్పు లన్నఁ దప్పు ముప్పు!
రాజేశ్వరి అక్కయ్యా,
రిప్లయితొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
‘నిప్పు+ఎప్పటికి’ అన్నప్పుడు సంధి నిత్యం, నుగాగమం రాదు. ‘నిజము దెలియ నిప్పె యెప్పటికైనను’ అనండి.
*****
అశ్వత్థ నారాయణ మూర్తి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
‘తప్పు+అనుట’ అన్నప్పుడు యడాగమం రాదు. ‘తప్పనుటయు’ అనండి.
*****
శైలజ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
*****
డా. బల్లూరి ఉమాదేవి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
‘తోడను’ అనండి.
*****
నాగరాజు రవీందర్ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
మీ రన్నమాట నిజం. “పూరణమ్ము జేసె పోనిమ్ము లెమ్మని" కొందరి పద్యాల్లో కొన్ని తప్పులను చూసీచూడనట్టు వదిలేస్తూ ఉంటాను. ప్రతి పద్యాన్నీ శల్యపరీక్ష చేసి విశ్లేషించే ఓపిక ఎలాగూ నాకు లేదు. ఒకవేళ చేసినా ఇన్ని తప్పులతో పద్యాలు వ్రాయడం ఎందుకు అనుకొని కొందరు బ్లాగునుండి తప్పుకొనే ముప్పు ఉంది. అందుకే ‘తప్పు లొప్పు లన్నఁ దప్పు ముప్పు’!
*****
గండూరి లక్ష్మినారాయణ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తప్పు లెప్పుడైన తప్పదు సేయక
రిప్లయితొలగించండితప్పులెపుడుసేయు తప్పు, ముప్పు
తప్పు తప్పనుటను తప్పు కాదు
తప్పు లొప్పు లన్న, తప్పు, ముప్పు
గురువుగారు
తొలగించండిసవరించానండీ, కృతజ్ఞతలు.
ఆరడీలఁ బెట్టు యత్తగారింటిలో
రిప్లయితొలగించండికొత్త కోడలమ్మ చిత్తగించి
యక్కడున్నవారలలవోకగాఁ జేయు
తప్పు లొప్పు లన్నఁ దప్పు ముప్పు!
మిత్రులు శ్రీ కంది శంకరయ్యగారికి, సుకవి మిత్ర బృందమునకు నమస్సులతో...
రిప్లయితొలగించండితప్పు చేసినట్టి తన యజమానినిఁ
"దప్పుచేసితి"వని తఱచి యనఁగ;
దండనమ్ము నీకు తప్పదు! కావునఁ
దప్పు లొప్పు లన్నఁ దప్పు ముప్పు!
గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
రిప్లయితొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
*****
గుండు మధుసూదన్ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తప్పు పనులు చేసి తప్పించుకొనువారు
రిప్లయితొలగించండిగొప్ప బలుకు నదియె గొప్ప యనుచు
శివుని ముందు వారి చిత్తమొప్పనపుడు
తప్పు లొప్పు లన్నఁ దప్పు ముప్పు
కవిశ్రీ సత్తిబాబు గారూ,
రిప్లయితొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
నీతికై దుష్టులనుగూర్చి నిజముఁజెప్ప
రిప్లయితొలగించండితిప్పలబడుటెవరికైనఁదప్పదవని
నిజముఁదాచిపెట్టిసతము నియతివీడి
తప్పులొప్పులన్నఁదప్పుముప్పు
మంచి జెప్ప జూడ మన్నించరు జనులు
రిప్లయితొలగించండితాము జేయు నట్టి తప్పు గనరు
పెద్ద చిన్న యనక పెట్రేగి పోదురు
తప్పు లొప్పు లన్నఁ దప్పు ముప్పు.
తప్పు జూచు వారు తప్పని జెప్పరు
తప్పు జేయు వారు తప్పు గనరు
తప్పు తెలియక యువత తమ నడత తప్పు
తప్పు నెరుక పరచు తప్పు గాదు.
నిప్పువంటి మనిషి నేతగ తగినవా
రిప్లయితొలగించండిడంచు"రాష్ట్రపతిగ"నెంచుకొనగ
"తప్పు గాదె"యతడు "తప్పు జేసె ననగ"
"తప్పులొప్పులన్న,తప్పు ముప్పు"
పెద్దవాళ్ళ తిట్లు పేరంటమున షోకు
రిప్లయితొలగించండిఉద్దరించ లేని యుహలగును|
సర్దుబాటు లందు సహనంబుగా బల్కు
తప్పులొప్పు లన్న దప్పు ముప్పు.
2.కట్న మడుగ బోగ?కాదనిదేల్పినా
లంచమెంచబూన వంచననిన
ఎదుటి వాడిచేష్ట పదునగు బాణమౌ
తప్పు లొప్పు లన్న దప్పు ముప్పు
3.భార్య భర్త లందు బంధము లొకటైన?
కార్య దూరు లైన?కలత లొచ్చు
అట్టివారి పట్టు నణచెడి మార్గము
తప్పులొప్పులన్న దప్పుముప్పు
అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
రిప్లయితొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
*****
పి.యస్.ఆర్. మూర్తి గారూ,
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
*****
కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
*****
కె. ఈశ్వరప్ప గారూ,
మీ మూడు పూరణలు బాగున్నవి. అభినందనలు.
మూడవపూరణలో ‘కలతలొచ్చు’ అన్నారు. ఒచ్చు అన్న పదం లేదు. ‘కలత లగును’ అనండి.
తప్పుచేయు పెద్ద దండించు వాడైన
రిప్లయితొలగించండితప్పులెన్న వలదు ముప్పు కలుగు
తప్పుచేయు నట్టి తమ యధికారితో
తప్పులొప్పులన్న తప్పుముప్పు!
తప్పుచేయు పెద్ద దండించు వాడైన
రిప్లయితొలగించండితప్పులెన్న వలదు ముప్పు కలుగు
తప్పుచేయు నట్టి తమ యధికారితో
తప్పులొప్పులన్న తప్పుముప్పు!
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిబొడ్డు శంకరయ్య గారూ,
రిప్లయితొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
అన్నపురెడ్డివారి పూరణ తేటగీతి లోఉన్నట్లున్నది.కాని సమస్య ఆటవెలది గదా!
రిప్లయితొలగించండితప్పు పలికి నంత తప్పదు ముప్పదే
యొప్పు పలికినంత నొరులు మెచ్చు
యెరుకలేని చోట నేదెట్లు పలికినన్
తప్పులొప్పులన్న దప్పు ముప్పు
తొలగె పైట యనిన దూరుదు రెంతయో
చెప్పకున్న వాని చెనకుదురుగ
ముప్పు తప్పదెందు ముదమునచ్చో వీడ
తప్పులొప్పులన్న దప్పు ముప్పు
ప్రశ్న నడిగినంత బదులును చెప్పగా
తప్పులొప్పులన్న దప్పుముప్పు
నాన్చియొప్పదైన నసిగిన తిట్టరే!
తప్పటంచునంద్రు ధరణి జనులు
నాదు జాతి కిదియ నాచారమని నంత
తప్పులొప్పులన్న తప్పుముప్పు
చేయు పనిని తాను చెందగా సంశయం
బదియ తప్పుననరె యవనిలోన
తప్పుయెన్నడైన తప్పెయగునుగాని
రిప్లయితొలగించండితప్పుపెద్దదగును యొప్పనంగ
తప్పలేనివారు ధరణిలేరది యెట్లు
తప్పులొప్పులన్న దప్పుముప్పు?
ముప్పు తప్ప దెపుడు మూర్ఖుని రంజింప
రిప్లయితొలగించండితప్పు లెత్తి జూపి తనరు నపుడు ,
తప్పు గప్పి బుచ్చి తగు రీతి మెప్పించి
తప్పు లొప్పు లన్న ( దప్పు ముప్పు
కొరుప్రోలు రాధా కృష్ణ రావు
నీతినియమములకు నిలబడువారలు
రిప్లయితొలగించండితిప్పలబడుచుంద్రు తప్పకుండ
నిజముఁదాచిపెట్టి నియతిని విడనాడి
తప్పులొప్పులన్నఁదప్పుముప్పు
మల్లెల సోమనాథ శాస్త్రి గారూ,
రిప్లయితొలగించండిమీ నాలుగు పూరణలు బాగున్నవి. అభినందనలు.
మొదటిపూరణలో ‘పలికినంత నొరులు మెత్తు| రెరుకలేనిచోట...’ అనండి.
అన్నపరెడ్డి వారి పూరణలోని దోషాన్ని నేను గమనించలేదు. తెలియజేసినందుకు ధన్యవాదాలు. వారుకూడా మీ సూచనను గమనించి ఆటవెలదిలో పూరణ నందించారు.
*****
రెండుచింతల రామకృష్ణ మూర్తి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
‘తప్పు+ఎన్నడైన’ అన్నప్పుడు సంధి నిత్యం, యడాగమం రాదు. ‘తప్పు చూడ సతము తప్పె యగును గాని’ అందామా?
*****
కొరుప్రోలు రాధాకృష్ణ రావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
*****
అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
తప్పు తెలిసికొని ఆటవెలదిలో పూరణ నందించినందుకు ధన్యవాదాలు. పూరణ బాగున్నది. అభినందనలు.
ఖలులతోడ గొంతు కలిపెడు వేళను,
రిప్లయితొలగించండిబలయుతులను చేరి చెలగువేళ,
కోపమూనినట్టి కులకాంత నూరార్చ-
తప్పులొప్పులన్నఁదప్పుముప్పు
‘అష్టావధాని’ రాంభట్ల పార్వతీశ్వర శర్మ గారూ,
రిప్లయితొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.