చంద్రమౌళి సూర్యనారాయణ గారూ, మీ పద్యం బాగున్నది. అభినందనలు. ‘ఊరూరా’ అంటే వ్యావహారికం. ‘ఊరూరను’ అనండి. ***** రాజేశ్వరి అక్కయ్యా, మీ పద్యం బాగుంది. అభినందనలు.
శైలజ గారూ, మీ పద్యం బాగుంది. అభినందనలు. ***** అశ్వత్థ నారాయణ మూర్తి గారూ, మీ పద్యం బాగుంది. అభినందనలు. ***** కె. ఈశ్వరప్ప గారూ, మీ పద్యాలు బాగున్నవి. అభినందనలు. ***** గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ, మీ పద్యం బాగుంది. అభినందనలు. మొదటిపాదంలో గణదోషం. ‘పళ్ళెరమ్మున నున్నగున్నవి...’ అన్నదానికి టైపాటా?
నోరూరించెడి రుచితో
రిప్లయితొలగించండివారించిననాగలేని వాంఛ గొలుపుచున్
తీరైన గులాబ్ జాముల
నూరూరా జనులుతిందురోహొయనుచున్
ఎంతో రుచికర మైనవి
రిప్లయితొలగించండివంతులుగా తినెదరంట పాకము తోడ
న్నెంతటి తీయని వంటని
సంతో షంబున గులాబు జాముల ప్రీతిన్
చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
రిప్లయితొలగించండిమీ పద్యం బాగున్నది. అభినందనలు.
‘ఊరూరా’ అంటే వ్యావహారికం. ‘ఊరూరను’ అనండి.
*****
రాజేశ్వరి అక్కయ్యా,
మీ పద్యం బాగుంది. అభినందనలు.
జిలేబిలకి పోటీ గా
రిప్లయితొలగించండిగులాబ్జామున్ల పెట్టిన వైనం
ఫారెన్ను బొక్కసానికి పోటీ గా
రాజే లలిత మోడీ మోదుడు !!
శుభోదయం
జిలేబి
గుల్లాబ్ జామూన్ గనగా
రిప్లయితొలగించండినుల్లాసము, జలము నోట నూరుచు నుండున్
మెల్లగ తినుడీ రొజే
యిల్లాలే ప్రియముతోడ నింటను జేయన్.
జిలేబీ గారూ,
రిప్లయితొలగించండి_/\_
*****
గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు.
చిత్రము జూడగ బెదవులు
రిప్లయితొలగించండినాత్రుతతో కదులు చుండె హర్షము తోడన్
మిత్రమ ! తెమ్ముము నాకొక
పత్రము నగులా బుజాము వందన మిడుదు న్
గులగులలాడును తనమది
రిప్లయితొలగించండిగులాబి జాములను గాంచ కొమరున కెపుడున్
కలలందు కలవరించును
తలపుల మళ్ళించ లేడు తనియుచుఁగుడుచున్
పోచిరాజు సుబ్బారావు గారూ,
రిప్లయితొలగించండిమీ పద్యం బాగున్నది. అభినందనలు.
*****
అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు.
చిక్కని గులాబు జాములు
రిప్లయితొలగించండిచక్కెర పాకమును బీల్చి జవరగ నుండున్
పెక్కురు జేయుదు రిండ్లను
చక్కని జామూన్ల రుచిని చాటగ తరమే? !!!
మధుర మకరంద మాధుర్య మహిమ సమము
రిప్లయితొలగించండిశర్కరాపూర్ణ సంపూర్ణ స్వాదు భరము
జలము లూరించు జామూను జయము జయము
నీకు నీడొచ్చు నెద్దియు నేను గనను
జామునుండలన్ని జతగ కలసిపోయి
రిప్లయితొలగించండిపాకమందు మునిగి పరవశాన
ఆలుమగల రీతి ఆనంద బంధపు
రుచిని బంచగలుగు రూప మౌర|
రుచికర మైన గులాబ్ జామ్
రిప్లయితొలగించండిరచనల సారాంశమెల్ల?రసగుల్లలుగా|
నచిరంబందున వంటై
సచివులు మెచ్చంగ నుండు సంఘము నందున్.
2.తీపిని దాచిపెట్టి తగు తీరిక యందున పంచి బెట్టగా?
రూపపుగోలియుండలుగ|రోదనమాన్పునుపిల్లవాళ్లకున్
నీపనియన్న చందమున నిక్కుచునున్న”గులాబు జామువై”
చూపరులెంచు రీతిగ రశోత్తమమట్లు |”గులాముజామువా”.?
నోరులూరఁగ పళ్లెరమ్మునున్నగున్నవి మెత్తగన్ !
రిప్లయితొలగించండిజీరఁ బట్టి గులాబు జాములు!! జివ్వుమన్నది ప్రాణమే!!!
యోరి నాయనొ! నిల్వపెట్టిన నోగిరమ్ములఁ దిన్నచో!!
దారదమ్మని మాధ్యమమ్ములు త్రవ్వి చెప్పుచునున్నవే!!!
( దారదము = విషము)
శైలజ గారూ,
రిప్లయితొలగించండిమీ పద్యం బాగుంది. అభినందనలు.
*****
అశ్వత్థ నారాయణ మూర్తి గారూ,
మీ పద్యం బాగుంది. అభినందనలు.
*****
కె. ఈశ్వరప్ప గారూ,
మీ పద్యాలు బాగున్నవి. అభినందనలు.
*****
గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
మీ పద్యం బాగుంది. అభినందనలు.
మొదటిపాదంలో గణదోషం. ‘పళ్ళెరమ్మున నున్నగున్నవి...’ అన్నదానికి టైపాటా?
గురుదేవులకు ధన్యవాదములు. టైపాటు సవరణతో :
రిప్లయితొలగించండినోరులూరఁగ పళ్లెరమ్మున నున్నగున్నవి మెత్తగన్!
జీరఁ బట్టి గులాబు జాములు!! జివ్వుమన్నది ప్రాణమే!!!
యోరి నాయనొ!నిల్వ పెట్టిన నోగిరమ్ములఁ దిన్నచో!!
దారదమ్మని మాధ్యమమ్ములు త్రవ్వి చెప్పుచునున్నవే!!!
( దారదము = విషము)