మూర్తి వై యస్ యె యెన్ గారూ , శ్రీ శంకరయ్యగారు చెప్పినట్లుగా మీ పూరణ చదువగానే మనసుకు హత్తుకునేలా ఉంది, అభినందనలు. మొదటి పాదానికి ఈ సవరణ చేయండి - నిర్దోషంగా ఉంటుంది - ' పంచ వత్సరముల పసి బాలుఁడొకఁడు దా నుపనయన .... '
అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు. ***** డా. విష్ణునందన్ గారూ, ధన్యవాదాలు. ***** పోచిరాజు సుబ్బారావు గారూ, విరుపుతో మీ పూరణ బాగుంది. అభినందనలు. కాని అవసానదశలో శ్రీనాథుడు కష్టాలనుభవించాడు కాని బిచ్చమెత్తుకున్నట్లు ఎక్కడా లేదే!
సిరుల నోల లాడు శ్రీనాధ కవియన్న
రిప్లయితొలగించండిచెన్ను దనము నందు మిన్న గాను
విధిని దాట లేక వెతల పాలబడెను
అక్ష రములు నేర్చి బిచ్చ మెత్తె
---------------------
సకల లోక ములకు సర్వేశ్వరుం డైన
శంక రుండు గాదె శనికి దడిసె
దైవ లీల తెలిసి తనకు తానుగలొంగి
అక్షర ములు నేర్చి బిచ్చ మెత్తె
రాజేశ్వరి అక్కయ్యా,
రిప్లయితొలగించండిమీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
నేటి బడిపిల్లల పరిస్థితి;
రిప్లయితొలగించండిబడికి పోయినంత భారంబు భుజమెక్కె
వ్రాయలేక యతని చేయి వాచె
చెప్పునంతయు పెడచెవి నిటు పెట్టగా
నక్షరములునేర్చి బిక్షమెత్తె
రెండుచింతల రామకృష్ణ మూర్తి గారూ,
రిప్లయితొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
అక్కయ్య గారి పద్యా లద్భుతము ! గురువు గారికి వందనములు !
రిప్లయితొలగించండివిద్య లన్ని నేర్చి , విరివిగా సిరులుండి
వటువు రూపమెత్తి వామనుండు
వడిగ బలిని జేరి వరద హస్తముఁ జాపె
నక్షరములు నేర్చి బిక్షమెత్తె !!
గన్నవరపు నరసింహ మూర్తి గారూ,
రిప్లయితొలగించండిమీ పూరణ ప్రశంసనీయంగా ఉంది. అభినందనలు.
రిప్లయితొలగించండిదేవ హితము గోరి దెవుడు శ్రీహరి
వామనుడుగ బుట్టి బలిని బ్రోవ
మూడడుగులమేర పుడికిలింతను పొంద
అక్షరములు నేర్చి భిక్షమెత్తె
రిప్లయితొలగించండిపాఠశాలలొనిపదవ తరగతి ప్యాసు
వృత్తి విద్య నేర్వ వీలు పడక
అక్షరములు నేర్చి భిక్షమెత్తెను గాని
అక్కరకును రాదు అచటి చదువు
కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
రిప్లయితొలగించండిమీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
రెండవపూరణ మొదటిపాదంలో గణదోషం. సవరించండి.
*****
నాగరాజు రవీందర్ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
షిర్డి పురమునన్ మసీదున కొలువుండు
రిప్లయితొలగించండిభక్త జనుల పాలి బలిమి సాయి!
శ్రద్ధయున్ సబూరి సాగించ మేలనె
డక్షరములు నేర్చి భిక్ష మెత్తె!
గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
రిప్లయితొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
కొలువు కొరకు తాను కొండంత యాశతో
రిప్లయితొలగించండిదేశమంత తిరిగి తిరిగి విసిగె
జేబులోన నింత చిల్లరైననులేక
అక్షరములు నేర్చి బిక్షమెత్తె
ఆ.వె:చదువు సంధ్య నేర్చి చక్కగ మనలేక
రిప్లయితొలగించండియున్న కొలువు వీడి యూరు విడిచి
కొత్త చోట చేర కూడు గుడ్డకఱువై
అక్షరములు నేర్చి బిక్ష మెత్తె.
భార్య పోరు కొంత కార్యభారము చింత
రిప్లయితొలగించండిసంతుచదువు ఖర్చు సాగుచుండ?
బాకి చేయలేక బాధ్యత విడలేక
అక్షరములు నేర్చి బిక్షమెత్తె.
చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
రిప్లయితొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
*****
డా. బల్లూరి ఉమాదేవి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
*****
కె. ఈశ్వరప్ప గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
శివుని లీల లెన్న జిత్రంబుగాదోచు
రిప్లయితొలగించండికాలకూటవిషము కంఠ మలర
నౌర!ఢక్కతోడ న,ఇ,ఉణ్ లు పలికించి
అక్షరములు నేర్చి భిక్షమెత్తె.
రామమూర్తి గారూ,
రిప్లయితొలగించండిశంకరాభరణం బ్లాగు మీకు స్వాగతం పలుకుతున్నది.
చక్కని పూరణ నందించారు. అభినందనలు.
(మీరూ, మద్దెర్ల రామమూర్తి గారూ ఒక్కరే కాదు కదా!)
శిక్షణాలయాలు సిరిసంపదల యాశ
రిప్లయితొలగించండిపక్షమైన? విద్య పరిగిలాగ
కక్షలందు బెరుగ?కలిమి బలిమి దగ్గ
అక్షరములు నేర్చి?బిక్షమెత్తె
2.సంతు పంతమందు చింతల గంతల
వంతు?వింత|కొంత సుంత బెరుగ?
ఉన్న ఆస్తు లన్ని ఊడిన పక్షాన?
అక్షరములు నేర్చి బిక్షమెత్తె|
కె. ఈశ్వరప్ప గారూ,
రిప్లయితొలగించండిమీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
ఎంత చదువు చదివి యెంతయున్నతిగన్న
రిప్లయితొలగించండిపదవి కొరకు విద్య పరచ వలెను
చేయి జాచి పదవి చేపట్టినప్పుడే
అక్షరములు నేర్చి బిక్షమెత్తె
కవిశ్రీ సత్తిబాబు గారూ,
రిప్లయితొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
పంచవత్సరంపు పసిబాలుడొక్కడు
రిప్లయితొలగించండియుపనయన శుభద మహోత్సవంబు
గలుగ, వీనులందు గాయత్రి మంత్రంపు
టక్షరములు నేర్చి భిక్షమెత్తె
రిప్లయితొలగించండిసవరించినపూరణ
పాఠశాలలోన పదియవ తరగతి
ప్యాసు,గాని సాగుబాటు కొరకు
పనుల నిర్వహించు ప్రౌఢిమ నేర్వక
అక్షరమ్ము నేర్చి భిక్ష మెత్తె
అశ్వత్థ నారాయణ మూర్తి గారూ,
రిప్లయితొలగించండివాహ్! ఈనాటి పూరణలలో మీది నిస్సందేహంగా ఉత్తమమైనది. అభినందనలు.
*****
కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
సవరించిన మీ పూరణ బాగున్నది. అభినందనలు.
గురువు గారికి
రిప్లయితొలగించండిశతాధిక కృతజ్ఞతలు
పదవి పొంద నెంచి పల్లెపల్లె దిరిగి
రిప్లయితొలగించండికూలివారియిండ్ల కూడుఁగుడిచి
బడుగువారియోట్లఁ బడయబడా నేత
అక్షరములు నేర్చి బిక్షమెత్తె
మూర్తి వై యస్ యె యెన్ గారూ , శ్రీ శంకరయ్యగారు చెప్పినట్లుగా మీ పూరణ చదువగానే మనసుకు హత్తుకునేలా ఉంది, అభినందనలు. మొదటి పాదానికి ఈ సవరణ చేయండి - నిర్దోషంగా ఉంటుంది -
రిప్లయితొలగించండి' పంచ వత్సరముల పసి బాలుఁడొకఁడు దా
నుపనయన .... '
విష్ణునందన్ గారూ
రిప్లయితొలగించండిధన్యోస్మి. కృతజ్ఞతలు. మీసూచనలతో
సవరించినతరువాత
పంచవత్సరముల పసిబాలుడొకడు దా
నుపనయన శుభద మహోత్సవంబు
గలుగ, వీనులందు గాయత్రి మంత్రంపు
టక్షరములు నేర్చి భిక్షమెత్తె
సాటి కవుల యందు మేటియ య్యెధరను
రిప్లయితొలగించండిఅక్షరములు నేర్చి ,భిక్ష మెత్తె
చివర దశ యందు శ్రీ నాధ కవివరు
డుతను, దిండి లేని కతన నపుడు
అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
రిప్లయితొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
*****
డా. విష్ణునందన్ గారూ,
ధన్యవాదాలు.
*****
పోచిరాజు సుబ్బారావు గారూ,
విరుపుతో మీ పూరణ బాగుంది. అభినందనలు.
కాని అవసానదశలో శ్రీనాథుడు కష్టాలనుభవించాడు కాని బిచ్చమెత్తుకున్నట్లు ఎక్కడా లేదే!
శ్రీ అశ్వర్థనారాయణమూర్తి గారికి అభినందనలు.
రిప్లయితొలగించండిబ్రహ్మచారి తాను బహునేమముల తోడ
రిప్లయితొలగించండిగురులశిక్షణంది గొప్పగాను
విద్యనేర్చు కొనును,బిక్షమెత్తుకొనుచు
అక్షరములు నేర్చి బిక్షమెత్తె
అక్షరుండు శివుడు నంతయు తానై
ఢక్కమోతలందు డంబుగాను
అక్షరాలనిచ్చె నన్నిశాస్త్రాలకు
నక్షరములు నేర్చి బిక్షమెత్తె
వామనుండు తానువటుడునై యేతెంచి
బలిని దానమడిగె,వానినడ్డు
శుక్రు,గ్రుడ్డిజేసి చొక్కమౌ వాడునై
అక్షరములు నేర్చి బిక్షమెత్తె
అక్షరాలునేర్వ కుక్షికి కాదుగా
తిమిరముడుగు దాన తేజమబ్బు
మర్మమెరుగకుండ మానవుండును తాను
నక్షరములు నేర్చి భిక్షమెత్తె
అక్షరంబు నేర్వ నజ్ఞాన మంతమౌ
కుక్షి కొరకు నేర్చు శిక్ష వేరు
సకల మిదియు తెలిసి సన్యాసియే తాను
నక్షరములు నేర్చిబిక్షమెత్తె
సహదేవుడు గారూ
రిప్లయితొలగించండిమీ అభినందనలకు కృతజ్ఞతలు
అక్షరములు నేర్చి బిక్షమెత్తెననుట
రిప్లయితొలగించండికల్ల యగును గాని గలదె నిజము
అక్షరములె మనకు లక్షల విలువౌను
బిక్ష మెత్తనేల విశ్వ మందు? !!!
విద్య లెన్నొ దెలియు విద్వాంసు డైనను
కావరమున రగిలె రావణుండు
సాధు వేష మందు సాధ్విని గొనిపోవ
నక్షరములు నేర్చి బిక్షమెత్తె !!!
మిత్రులు శ్రీ కంది శంకరయ్యగారికి, సుకవి మిత్ర బృందమునకు నమస్సులతో...
రిప్లయితొలగించండిఅతఁడు పేద; పనియు నతనికి నెవ్వరు
నీయ రైరి! బ్రదుకు నెట్ట నతఁడు
రామ నామ సుధల రమ్యమౌ గేయంపు
టక్షరములు నేర్చి, భిక్షమెత్తె!!
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండికొలువులేక మరియు కుడువ కూడునులేక
రిప్లయితొలగించండిచదువుకు తగినట్టి పదవిలేక
వృత్తివిద్యలేక వేదమంత్రములలో
నక్షరములు నేర్చి బిక్షమెత్తె!
మల్లెల సోమనాథ శాస్త్రి గారూ,
రిప్లయితొలగించండిమీ ఐదు పూరణలు బాగున్నవి. అభినందనలు.
మొదటిపూరణలో ‘బహునేమములు’ అని దుష్టసమాసం వేశారు. ‘బహునియమములతో’ అనండి.
రెండవపూరణ మొదటి పాదంలో ‘తానై’ అన్నచోట గణదోషం. ‘తానెయై’ అనండి (బహుశా టైపాటు కావచ్చు).
****
శైలజ గారూ,
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
*****
గుండు మధుసూదన్ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
*****
బొడ్డు శంకరయ్య గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
శ్రీ భాగవతుల కృష్ణారావు గారి పూరణ
రిప్లయితొలగించండివేద విద్య ,కడగి విజ్ఞాన విద్యను
గ్రహగతులను మార్చి మహిని గాచు
పండితుండు నేడు పట్టెడన్నమునకై
అక్షరములు నేర్చి బిక్షమెత్తె.
భాగవతుల కృష్ణారావు గారూ,
రిప్లయితొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
నమస్కారములు
రిప్లయితొలగించండిగురువులకు ,శ్రీ గన్నవరపు సోదరులకు ,ధన్య వాదములు
అశ్వత్థ నారాయణ మూర్తి గారూ...బహు చక్కని పూరణ చేశారు...అభినందనలు..
రిప్లయితొలగించండినేనూ మీబాటలోనే...నా బాణీలో...
తండ్రి చెవిని జెప్ప తన్మయమ్మున జదువ
చుట్టములును తనకు చుట్టు నిలువ
వటువు మంత్రమందు బరగుచుండెడి గొప్ప
అక్షరములు నేర్చి బిక్షమెత్తె.
శ్రీ హనుమచ్ఛాస్త్రి గారికి
రిప్లయితొలగించండికృతజ్ఞతా పూర్వక నమస్సులు
మూర్తి గారు, మీ పద్యం చాలా బాగున్నది.
రిప్లయితొలగించండిత్యాగరాజుల వారిది "భక్తి బిచ్చమియ్యవే" అని ఒక కీర్తన వున్నది. దానినుద్దేశించి....
భావుకమగు సత్వ భక్తి బిచ్చమడుగ
తంబుర శృతి చేసి తనువు మరచి
మనసు రంజిలగను మహనీయ మధుర బీ
జాక్షరములు నేర్చి బిక్షమెత్తె
నా రెండవ పూరణము:
రిప్లయితొలగించండి(బ్రహ్మచర్య దీక్షఁ బూని, గురువుఁ జేరి, శ్రద్ధతో పరావిద్యకు సంబంధించిన సన్మంత్రాక్షరాలను నేర్చి, భిక్షాటనకు వెడలిన శిష్యుని విషయము)
బ్రహ్మచారియై పరావిద్యలను నేర్చ
గురువుఁ జేరి శ్రద్ధ కొనలు సాఁగ
మహితమైన యట్టి మాన్య సన్మంత్రంపు
టక్షరముల నేర్చి, భిక్ష మెత్తె!
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిభావుకమగు సత్వ భక్తి బిచ్చమడుగ
రిప్లయితొలగించండితంబుర శృతి చేసి తనువు మరచి
మనసు రంజిలగను మహనీయ మధుర స్వ
రాక్షరములు నేర్చి (కూర్చి) బిక్షమెత్తె
సుమలత గారూ
రిప్లయితొలగించండిఅభినందించినందుకు కృతజ్ఞతలు
గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
రిప్లయితొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
*****
మాజేటి సుమలత గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
*****
గుండు మధుసూదన్ గారూ,
మీ రెండవ పూరణకూడ బాగున్నది. అభినందనలు.
'భిక్ష మెత్తె' టైపు పొరపాటు
రిప్లయితొలగించండి