గుండు మధుసూదన్ గారూ, లలాటరేఖపై మీ పూరణ బాగున్నది. అభినందనలు. ***** గోలి హనుమచ్ఛాస్త్రి గారూ, నుదుటి గీతపై మీ పూరణ బాగున్నది. అభినందనలు. రెండవపాదంలో గణదోషం. ‘పైనఁ గలవాఁడె చూచును...’ అనండి. ***** డా. బల్లూరి ఉమాదేవి గారూ, కృష్ణుడను మందబుద్ది పేరుతో మీరు చెప్పిన పూరణ బాగున్నది. అభినందనలు. కొన్ని పాదాలు పునరుక్త మయ్యాయి. ***** అశ్వత్థ నారాయణ మూర్తి గారూ, మూఢులను గురించిన మీ పూరణ బాగున్నది. అభినందనలు. ***** అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ, కర్ణుని గురించిన మీ పూరణ బాగున్నది. అభినందనలు. ***** పోచిరాజు సుబ్బారావు గారూ, స్వదేశానికి తిరిగి వచ్చారా? ఫోన్‍లో మీ ఎస్సెమ్మెస్ చూశాను. మీ పూరణ బాగున్నది. అభినందనలు. ***** కెంబాయి తిమ్మాజీ రావు గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు. ***** గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు.
గీతా సారము దెలియని
రిప్లయితొలగించండిమోతుబరి సభలోన బలికె మోజుగ వినగన్
నీతులు వినుటకె మంచిది
గీత నిస్సారమని చెప్పెఁ గృష్ణుఁ డౌరా !
అక్కయ్యా,
రిప్లయితొలగించండిపప్పులో కాలేశారు. సమస్య తేటగీతిలో ఉంటే మీరు కందపద్యం వ్రాశారు.
avunu kadaa kamdamamTe ishTamtO sarigaa gamanimcha lEdu imkO prayatnam chestaanu
రిప్లయితొలగించండిమిత్రులు శ్రీ కంది శంకరయ్యగారికి, సుకవి మిత్ర బృందమునకు నమోవాకములతో...
రిప్లయితొలగించండి(కురుక్షేత్రమందు శ్రీకృష్ణుం డర్జునునకు హితమును బోధించు సందర్భము)
"జనుల కందఱకును బ్రహ్మ సారవంత
మైన గీత గీయఁడు, విను, మాన్యచరిత!
అదియుఁ గౌరవులకుఁ గల నుదుటి పైని
గీత, నిస్సార"మని చెప్పెఁ గృష్ణుఁ డౌర!!
రిప్లయితొలగించండికర్మలేవియు జేయక కష్ట బడక
పైని వాడే జూచును బాగులనుచు
పలుకు చుండెడి నరులకు వారి నుదుటి
గీత, నిస్సార"మని చెప్పెఁ గృష్ణుఁ డౌర!
కృష్ణు డనుపేరు గలవాడు కృష్ణునివలె
రిప్లయితొలగించండివేషము ధరించి చేబూని వేణువు కర
మందు పలికె గ్రామమునందు మంద బుద్ధిఁ
" గీత నిస్సార మని చెప్పెకృష్ణు డనుపేరు గలవాడు కృష్ణునివలె
వేషము ధరించి చేబూని వేణువు కర
మందు పలికె గ్రామమునందు మంద బుద్ధిఁ
" గీత నిస్సార మనెగద కృష్ణుడౌర "
తనను సర్వ భూతమయుగా దలచు బుధులు,
రిప్లయితొలగించండిమాన్యులకు, గీత సురధేను వనుచు బల్కి
మూఢ జనులు, మాయానుగాములకు నిలను
గీత నిస్సార మని జెప్పెఁ గృష్ణుఁ డౌర
'జగత్ మోహితం నాభిజానాతి' భగవద్గీత ..వి.యో.13
నీకుమారునిఁజంపిన నీచుడతడు
రిప్లయితొలగించండిసమయజేయుము కర్ణుని సత్వరముగ
రణమునందున మరణించు రవిసుతునకు
గీతనిస్సారమనిచెప్పెఁకృష్ణు డౌర
గీత నిస్సారమని చెప్పె కృష్ణు డౌర !
రిప్లయితొలగించండియనుట కాదుస మంజస మార్య ! మీకు
గీత బోధించె గ్రీడికి కృష్ణుడు గద
మనకు గాదె ప్రా మాణిక మైన దదియ ?
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిసమరమందున తాతల జంపు మనెడి
రిప్లయితొలగించండిగీత నిస్సార మని జెప్పె, కృష్ణు, డౌర!
పార్థ!క్షాత్ర నీతిని పోరి భండనమున
జయము నందుము పాపపు భయము మాని
విజయమందిన తదుపరి వినగ గీత
రిప్లయితొలగించండినరుడుఁ గోర, నది జగజ్జనని మహిమని
నిజము! శక్తిఁ దా నివ్వక నే బలికెడు
గీత నిస్సారమని జెప్పెఁ గృష్ణుడౌర!
గుండు మధుసూదన్ గారూ,
రిప్లయితొలగించండిలలాటరేఖపై మీ పూరణ బాగున్నది. అభినందనలు.
*****
గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
నుదుటి గీతపై మీ పూరణ బాగున్నది. అభినందనలు.
రెండవపాదంలో గణదోషం. ‘పైనఁ గలవాఁడె చూచును...’ అనండి.
*****
డా. బల్లూరి ఉమాదేవి గారూ,
కృష్ణుడను మందబుద్ది పేరుతో మీరు చెప్పిన పూరణ బాగున్నది. అభినందనలు.
కొన్ని పాదాలు పునరుక్త మయ్యాయి.
*****
అశ్వత్థ నారాయణ మూర్తి గారూ,
మూఢులను గురించిన మీ పూరణ బాగున్నది. అభినందనలు.
*****
అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
కర్ణుని గురించిన మీ పూరణ బాగున్నది. అభినందనలు.
*****
పోచిరాజు సుబ్బారావు గారూ,
స్వదేశానికి తిరిగి వచ్చారా? ఫోన్‍లో మీ ఎస్సెమ్మెస్ చూశాను.
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
*****
కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
*****
గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
గీత,సంగీతమన్నదే నీతి|”జాతి
రిప్లయితొలగించండిమెచ్చగలిగిన? మనసుకునచ్చినట్టి
దయ్యు|”అవినీతి పరులన?దలచనట్టి
గీత నిస్సార మని చెప్పె గృష్ణు డౌర”|
2,ఆకురుక్షేత్ర యుద్దాన అర్జునుండు
అన్నదమ్ముల, గురువుల నణచునట్టి
గీత?నిస్సారమని జెప్పె|”.గృష్ణు డౌర
తప్పునీదని నెంచకు జెప్ప నాదె”.
గీత?నీవ్రాత చేయూత|నీతిబంచి
రిప్లయితొలగించండిజాతి జాగృతి జగతిలో జరుప నెంచ?
భావమెరుగ-న భాగ్యుల జీవితాన
గీత?నిస్సార మని చెప్పె గృష్ణు డౌర|
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండికె. ఈశ్వరప్ప గారూ,
రిప్లయితొలగించండిమీ మూడు పూరణలు బాగున్నవి. అభినందనలు.
‘నీదని+ఎంచకు’ అన్నప్పుడు యడాగమం వస్తుంది.
ధర్మ సమ్మత పథమున కర్మలన్ని
రిప్లయితొలగించండిఆచరించక ఫలమున కాశపడుచు
మమత వలలోన జిక్కిన మానవులకు
గీత నిస్సారమని జెప్పె గృష్ణు డౌర
ఉన్న దానితో సంతౄప్తి నొందకుండ
పరుల మానవిత్తములప హరణజేసి
మానవాళిని హింసించు దానవులకు
గీత నిస్సారమని జెప్పె గృష్ణు డౌర
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిశ్లోకములు శ్రుత పరచుచు సూరినంచు
రిప్లయితొలగించండిగొప్పలను చెప్పుకొందురీ క్షోణి యందు
గీత బోధానుసారము క్రియలు లేని
గీత నిస్సార మని చెప్పెఁ గృష్ణుఁడౌర!
విదుడు నౌచును తాజూడ విజ్ఞుడదియ
రిప్లయితొలగించండివినిన గీతను సారంబు కనును వాడె
సారమెరుగని యతడటు,చదువ,విన్న
గీత నిస్సారమనిచెప్పె గృష్ణుడౌర!
కర్మ చేయగ ఫలితము కాంచకుండు
కర్మ సన్యాస ఫలమున కాంచునెల్ల
కర్మ చేయకున్నను ముక్తి గాంచు గనుక
గీత నిస్సారమని జెప్పె గృష్ణుడౌర!
ఆత్మ సన్యాస,మఱియును నాత్మయోగ
మొకటి యంచును తెలిపెను,మూర్ఖ కర్మ
చేయ ఫలమేమి లేదని,చేయకుడని
గీత నిస్సారమని జెప్పె గృష్ణుడౌర!
తానె సర్వంబునని దెల్పి,ధరణి కర్మ
చేయుటొక్కటె విహితము,పాయకనుచు
ననెడి వైరుధ్య వాక్యాల ననుచు తాను
గీత నిస్సారమని జెప్పె గృష్ణుడౌర!
వేద పండితు డొకనాడు విసుగు చెంది
రిప్లయితొలగించండినీతి నియమము లందున నిష్ట వీడి
కామి తార్ధము లీయని నీమ మేల
గీత నిస్సారమని చెప్పెఁ గృష్ణుఁ డౌర
నీతి నియమాల మనుజాళి నిల్చునాడు
రిప్లయితొలగించండిగీత నిస్సారమని జెప్పె గృష్ణు;డౌర!
యటుల గాకున్న శాంతికై చటులరీతి
భారతమ్మును చదువుడు మీరలెపుడు
మాస్టరు గారూ ! దోష సవరణకు ధన్యవాదములు...
రిప్లయితొలగించండిచిన్న సవరణ తో....
కర్మలేవియు జేయక, కష్ట బడక
పైని భగవంతుడే జూచు బాగులనుచు
పలుకు చుండెడి నరులకు, వారి నుదుటి
గీత, నిస్సారమని చెప్పెఁ గృష్ణుఁ డౌర!
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండియావానర్థ ఉదపానే సర్వతః సంప్లుతోదకే ।
రిప్లయితొలగించండితావాన్సర్వేషు వేదేషు బ్రాహ్మణస్య విజానతః ।।
"చెట్టు నెక్కగ నేలర పట్టుబట్టి?
చేతి నుండగ నుసిరిక చెన్నుగాను
తనను తానెరిగిన మేటి తాత్త్వికునకు
వేద శాస్త్రము లన్నియు వెర్రి గదర!
గీత నిస్సార" మని చెప్పెఁ గృష్ణుఁ డౌర!