కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది....
సోముఁడు నిప్పులను గురిసె సూర్యునివలెనే.
ఈ సమస్యను పంపిన రెండుచింతల రామకృష్ణ మూర్తి గారికి ధన్యవాదాలు.
(మూడు రోజులు ‘పద్యరచన’ శీర్షిక ఉండదు. సమస్యలను షెడ్యూల్ చేశాను.
ఈమూడురోజులు నేను బ్లాగుకు అందుబాటులో ఉండకపోవచ్చునని గమనించ మనవి)
ఈమూడురోజులు నేను బ్లాగుకు అందుబాటులో ఉండకపోవచ్చునని గమనించ మనవి)
హోమాగ్నిని సతి చచ్చుట
రిప్లయితొలగించండినేమాత్రము సైపనట్టి యీశుండు సుహృ
ద్ధాముఁడు చూడాలంకృత
సోముఁడు నిప్పులను గురిసె సూర్యుని వలెనే!
నమస్కారములు
రిప్లయితొలగించండిగురువుగారూ ! మీ పద్యం అద్భుతంగా ఉంది
సరిగ్గా నేనుకుడా శివును గురించే అనుకున్నాను గానీ ప్చ్ ! నాకంత తొందరగా రాదుగా
అందుకే మీ....రు గువులు
కాముని బాణము తగులగ
రిప్లయితొలగించండియేమా త్రముజాగు లేక నిటలాక్షముతో
ధూమము గ్రక్కుచు మారుని
సోముఁడు నిప్పులను గురిసె సూర్యుని వలెనే
కామజ్వర పీడితుడై
రిప్లయితొలగించండిరామన యోనిజఁ చెరగొన, రాక్షస పతిపై
భీముడగుచు ననిఁ రవికుల
సోముడు నిప్పులను గురిసె సూర్యుని వలెనే
రాజెశ్వరి అక్కయ్యా,
రిప్లయితొలగించండికామదహనం విషయంగా మీ పూరణ బాగున్నది. అభినందనలు.
మూడవపాదాన్ని ‘ధూమము లెగయ మరునిపై’ అనండి. సోముడంటే శివుడనే అర్థంకూడా ఉంది.
మీరు మాత్రం నన్ను ‘గురువుగారు’ అనవద్దు. ‘తమ్ముడు’ అంటేనే సంతోషం!
*****
అశ్వత్థ నారాయణ మూర్తి గారూ,
‘రవికులసోముడు’ విషయంగా మీ పూరణ బాగున్నది. అభినందనలు.
కామాగ్నిజ్వలితహృదయ
రిప్లయితొలగించండిభామిని విరహమ్ముతోడ విలవిలలాడెన్
వేమాఱు శీతకరుఁడగు
సోముఁడు నిప్పులను గురిసె సూర్యుని వలెనే!
సేమముగా లంకకు జన
రిప్లయితొలగించండినీమని ప్రార్థింప జలధి నెమ్మది నుండన్
రాముడు రఘుకుల వార్నిధి
సోముడు నిప్పులను గురిసె సూర్యుని వలెనే.
మిస్సన్న గారూ,
రిప్లయితొలగించండిరఘుకులాబ్ధిసోముడైన రాముని గురించిన మీ పూరణ బాగున్నది. అభినందనలు.
నమస్కారములు
రిప్లయితొలగించండిఎంత తమ్ముడైనా , కొడుకే ఐనా వాళ్ళ ఉన్నత స్తానానికీ,పదవికీ, మనసులో నాటుకు పోయిన గుర్తింపు తప్పకుండా అలాగే ఉంటుంది .ధన్య వాదములు
మామక జనగణములపై
రిప్లయితొలగించండియేమది మీపెత్తనంబులికమేమొప్పన్
బోమని తేల్చి సుభాసిత
సోముడు నిప్పులను గురిసె సూర్యుని వలెనే
( సుభాష్ చంద్రుడు : సుభాసిత సోముడు అన్నాను
గురువుగారి approval అపేక్షిస్తూ)
భూమిజను చూఱలాడిన
రిప్లయితొలగించండికాముకుడా రావణుడిని కడతేర్చంగా
రాముడు రఘుకులజాతుడు
సోముడు నిప్పులను గురిసె సూర్యుని వలెనే !!!
మిత్రులందఱకు నమస్సులతో...
రిప్లయితొలగించండి(సభలో శిశువాలుఁడు శ్రీకృష్ణు నధిక్షేపించు సందర్భము)
"వేమఱుఁ బొగడఁగనేలా?
ధీమతుఁడా యాదవుండు దివిజేశుండా?
సేమము కా" దన యదుకుల
సోముఁడు నిప్పులను గుఱిసె సూర్యునివలెనే!
మిత్రులు శంకరయ్యగారి పూరణము ప్రశస్తముగనున్నది. అభినందనలు.
రిప్లయితొలగించండికాముని దహియించెను గద
రిప్లయితొలగించండిసోముడు, నిప్పులను గురిసె సూర్యుని వలెనే
సోముడ నంగుని గాంచగ
కామము మఱి గౌరి పైన గలుగుట వలనన్
భీముండై రణమందున
రిప్లయితొలగించండిభీమంబౌ శస్త్రములను రావణు పైనన్
ఏమఱక వేయ రఘుకుల
సోముఁడు , నిప్పులను గురిసె సూర్యునివలెనే.
రిప్లయితొలగించండిసమస్య :సోముదు నిప్పులను గురిసె సూర్యునివలెనే
పూరణ:రాముడు యినకులమునకే
సోముదు నిప్పులను గురిసె సూర్యునివలెనే
భీమపరాక్రమముతో సం
గ్రామమునన్ దుష్టుడైన రావణు గాంచన్
జూన్ 03, 2015 9:15 [AM]
శ్రీమతిచరవిడిపించగ
రిప్లయితొలగించండిసోమముతోనసురపతిని స్రుక్కగజేయన్
భీమబలంబున రవికుల
సోముడు నిప్పులనుగురిసె సూర్యునివలెనే
కామిత మొసగెడి శివుడికి
రిప్లయితొలగించండికామము బంచంగ నెంచ? గలిగెడి ముప్పే
కాముని నాశన బరచగ
సొముడు నిప్పులను గురిసె సుర్యుని వలెనే
సాహితీ మిత్రులూ
రిప్లయితొలగించండిమీ వీలునుబట్టి ఈ క్రింది లింకును చూడగలరు
http://www.andhrafolks.net/ReadArticle.asp?Type=A&ID=78
కాముని చేష్టల సెగలో
రిప్లయితొలగించండిప్రేమే పెంపొందగానె? ప్రేయసి లేకన్
క్షెమంబొసగెడి” మదిలో
సోముడు” నిప్పులనుగురిసె?సూర్యుని వలెనే
దామోదరుఁ జూపు మనచుఁ
రిప్లయితొలగించండిదా మోదగ కంభము నట! దానవుడంత
న్నేమర! ప్రహ్లాద హృదయ
సోముడు నిప్పులను గురిసె సూర్యుని వలెనే!
భాగవతుల కృష్ణారావుగారి పూరణ
రిప్లయితొలగించండికౌముది నిండుగ నింపెడి
సోముని పున్నమిని గ్రహము క్షోబను గూర్చె
న్నామరు క్షణమున విడువగ
సోముఁడు నిప్పులను గురిసె సూర్యునివలెనే.
సోముని జేరగ పార్వతి
రిప్లయితొలగించండికాముడు విడిచెను శరముల,కటువుగ మదనున్
భీమపు ముక్కన్నుదెరచి
సోముడు నిప్పులను గురిసె సూర్యుని వలెనే!
కామము తోడను ప్రియులల
సోముని రాత్రిని తమకపు సోయగమందన్
సోముని వెన్నెల సెగయై
సోముడు నిప్పులను గురిసె సూర్యుని వలెనే!
సోముడు,సూర్యుడు కాంతిని
తామటు విడినను,చలువయు,తాపము కలుగున్
కాముకులకు వేడి నిడుచు
సోముడు నిప్పులను గురిసె సూర్యుని వలెనే!
భీమపు వేసవి నిపుడును
సోముని పున్నమి సమయము సోలగ జేసెన్
సేమము విడగా-కనగను
సోముడు నిప్పులను గురిసె సూర్యుని వలెనే!
వివరణ;సోముడు=చంద్రుడు,శివుడు
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిభీముండై రణమందున
రిప్లయితొలగించండిభీమంబౌ శస్త్రములను వేయగ రావణు
పై మండిపడుచు రఘుకుల
సోముఁడు , నిప్పులను గురిసె సూర్యునివలెనే.
భూమిజ నెత్తుకు పోయిన
రిప్లయితొలగించండికాముకుడగు టక్కరి దశకంఠుని గూల్చన్
మీమాంస వదలి రఘుకుల
సోముడు నిప్పులను గురిసె సూర్యుని వలెనే!
అశ్వత్థ నారాయణ మూర్తి గారూ,
రిప్లయితొలగించండిమీ రెండవ పూరణ బాగుంది. అభినందనలు.
*****
శైలజ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
నా సవరణలతో మీ పద్యం.....
భూమిజను చూఱనాడిన
కాముకుడగు రావణు ననిఁ గడతేర్చంగన్
రాముడు రఘుకులవార్నిధి
సోముడు నిప్పులను గురిసె సూర్యుని వలెనే !!!
*****
గుండు మధుసూదన్ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
నా పూరణ నచ్చినందుకు ధన్యవాదాలు.
*****
పోచిరాజు సుబ్బారావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
*****
నాగరాజు రవీందర్ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
చివరి రెండు పాదాలను ఇలా సవరిస్తే బాగుంటుందేమో!
‘రాముని కడ కేగెఁ బరశు
రాముఁడు విషయమ్ము నరసి రక్తాక్షుండై’
*****
గండూరి లక్ష్మినారాయణ గారూ,
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
రెండవపూరణలో రెండవపాదం చివరి అక్షరం తప్పక గురువై ఉండాలి కదా! ‘వేయ నసురుఁ డా|పై మండిపడుచు...’ అనండి.
*****
కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
‘రాముడు+ఇనకుల’ అన్నప్పుడు యడాగమం రాదు. ‘రాముం డినకులమునకే’ అనండి. మూడవపాదంలో గణదోషం. ‘భీమపరాక్రమమున సం...’ అనండి.
*****
అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
*****
కె. ఈశ్వరప్ప గారూ,
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
మొదటిపూరణలో ‘కాముని నశింపజేయగ’ అనండి.
*****
శ్రీఆదిభట్ల కామేశ్వర శర్మ గారూ,
మీ దత్తోదాహరణము ప్రింటు పుస్తకమే ఉంది నా దగ్గర. దీనిని సమీక్షించాలని ఎన్నిసార్లు అనుకున్నా ఏదో ఒక అవాంతరం వస్తున్నది. మీరు అనుమతిస్తే దీనిని ‘శంకరాభరణం’ బ్లాగులో ప్రకటిస్తాను రోజుకొక విభక్తిచొప్పున.
*****
గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
‘కంబము (లేదా) స్తంభము’ అనండి.
*****
భాగవతుల కృష్ణారావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
*****
మల్లెల సోమనాథ శాస్త్రి గారూ,
మీ నాలుగు పూరణలు బాగున్నవి. అభినందనలు.
*****
కొరుప్రోలు రాధాకృష్ణ రావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
‘కార్ముక’మనండి.
*****
బొడ్డు శంకరయ్య గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
గురుదేవులకు ధన్యవాదములు. టైపాటు సవరణతో :
రిప్లయితొలగించండిదామోదరుఁ జూపు మనుచుఁ
దా మోదగ కంబము నట! దానవుడంత
న్నేమర! ప్రహ్లాద హృదయ
సోముడు నిప్పులను గురిసె సూర్యుని వలెనే!
శ్రీ శంకరార్యా
రిప్లయితొలగించండినా ఉదాహరణం శంకరాభరణంలో ఉంచడానికి నాకే అభ్యంతరమూ లేదు.
కామంబును రగిలింపగ
రిప్లయితొలగించండికాముడు సంధించినాడు కార్ముక మనగన్,
నీమము వీడుచు శివుడగు
సోముడు నిప్పులను గురిసె సూర్యుని వలెనే
కొరుప్రోలు రాధా కృష్ణ రావు
ఆ మాల్యా విజయుండే
రిప్లయితొలగించండిధీమాతో లండనందు దీటుగ దాగన్
భీముడు కోశాగారపు
సోముఁడు నిప్పులను గురిసె సూర్యునివలెనే
భీముడు = భయంకరుడు
సోముడు = కుబేరుడు
రిప్లయితొలగించండిరాముని యనుంగు మిత్రుడు
సోముఁడు, నిప్పులను గురిసె సూర్యునివలెనే
భీముని పైనాతండట
రాముని కొట్టగ, జిలేబి రాధనమొందన్ !
జిలేబి
కోమల కమలము వీడుచు
రిప్లయితొలగించండిప్రేమను సైకిలును త్రొక్కి పెడసరి తనమున్
ఢామని నేలను కూలగ
సోముఁడు నిప్పులను గురిసె సూర్యునివలెనే
సోముడు = చంద్రుడు