చంద్రమౌళి సూర్యనారాయణ గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు. ***** రాజేశ్వరి అక్కయ్యా, మీ పూరణ బాగున్నది. అభినందనలు. ***** జిలేబీ గారూ, _/\_ ***** గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు. కాని ‘జ్యేష్ఠాదేవీపతి’ అన్నారు. అంటే వరుణుడు. ఇది అన్వయానికి కుదరడం లేదు. పరిశీలించండి. జ్యేష్ఠాదేవి : వరుణుని భార్యలలో ఒకతె. ఈమె ధాతృవిధాతలతోఁ గూడ పుట్టింపఁబడిన బ్రహ్మమానసపుత్రిక. ఈమె చెలియలు లక్ష్మి. ఈమె వరుణునివలన అధర్ముఁడు అను సుతుని పడసెను. ఈజ్యేష్ఠాదేవినే కాళికాదేవి అనియు అందురు. [పురాణనామచంద్రిక (యెనమండ్రం వెంకటరామయ్య) 1879]
గురుదేవులకు ధన్యవాదములు. జేష్ట అంటే దరిద్రదేవత అని ఆంధ్రభారతి నిఘంటువు తెలియజేస్తుంది. శనీశ్వరుని భార్య అని గుగుల్ సర్చ్ లో చూస్తే 'మనసాంప్రదాయాలు' లో కూడా ఉంది.
సహదేవుడు గారూ, నిజానికి ఆ శబ్దం ‘జ్యేష్ఠ’... జేష్ట కాదు. ఆంధ్రభారతి కేవలం రవ్వాశ్రీహరి నిఘంటువునే పేర్కొన్నది. ఆ నిఘంటువులో వ్యావహారిక పదాలకూ అర్థాలిచ్చారు. జేష్ట వ్యావహారికం. ఇక జ్యేష్టాదేవి శని భార్య అన్న విషయం నాకు కొత్తది. మీ వివరణతో అన్వయం కుదురుతున్నది. సంతోషం!
గుండు మధుసూదన్ గారూ, పురాణకథాప్రసక్తితో మీ పూరణ బాగున్నది. అభినందనలు. మీ రెండవ పూరణ నిస్సందేహంగా అద్భుతంగా ఉంది. ***** డా. బల్లూరి ఉమాదేవి గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు. రెండవపాదంలో గణదోషం. ‘పతిపోగొట్టు కొనుచున్న భర్తను గనుచున్’ అందామా? ***** బొడ్డు శంకరయ్య గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు. ‘ఆడే’ అని వ్యావహారికాన్ని ప్రయోగించారు. ‘జూద మాడెడు’ అనండి. ***** కెంబాయి తిమ్మాజీ రావు గారూ, మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు. మొదటి పూరణలో ‘బీగముచే నితమును..’? ***** కె.యస్. గురుమూర్తి ఆచారి గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు. ***** కె. ఈశ్వరప్ప గారూ, మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు. మొదటి పూరణలో ‘రీతి+ఔ’ అన్నప్పుడు యడాగమం వస్తుంది. అక్కడ ‘రీతిన్’ లేదా ‘విధమౌ’ అనండి. ***** అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు. ***** పి.యస్.ఆర్. మూర్తి గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు. చివరిపాదంలోని గణదోషం గురించి గుండు మధుసూదన్ గారి సవరణను గమనించండి. ***** పోచిరాజు సుబ్బారావు గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు. ‘అతలాకుతలం’ వ్యావహారికం. ‘అతలకుతలమ్మగు బ్రతుకు’ అనండి. ***** గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
ఒక్కొక్క నిఘంటుకారుం డొక్కొక్క యర్థమ్ముఁ జెప్పి రొప్పుగ, వానిన్ జక్కగ మనకు ప్రయోజన మెక్కరణిని కలుగు వానినే వాడఁదగున్.
మల్లెల సోమనాథ శాస్త్రి గారూ, మీ ఐదుపూరణలు బాగున్నవి. అభినందనలు. ***** రెండుచింతల రామకృష్ణ మూర్తి గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు. ***** గోలి హనుమచ్ఛాస్త్రి గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు.
గతితప్పిన తనభర్తను
రిప్లయితొలగించండిసుతిమెత్తగహెచ్చరించి సుద్దులు చెప్పన్
మితిమీరిన వ్యసనములను
పతి విడనాడిన, సతికి శుభమ్ములుకలుగున్
వెతలకు భయపడి నిరతము
రిప్లయితొలగించండిమతిలేకను దిరుగు నట్టి మగనికి తానై
హితమును పలుకగ బాధను
పతి విడనాడిన ,సతికి శుభమ్ములు గలుఁగున్
ఆదరాబాదరా హైదరాబాదున
రిప్లయితొలగించండిడమాలు డమాలు ఆఫీసుకి బోవ
సతిని మోటరు బైకున పతి విడనాడిన
సతికి శుభమ్ములు గలుఁగున్ !!
చీర్స్
జిలేబి
పతి సతుల బంధమందున
రిప్లయితొలగించండివెతలుఁ దొలగె శనికి మ్రొక్క వేదనదీరెన్
గతమున, జేష్టా దేవీ
పతి విడనాడిన సతికి శుభమ్ములు గలుఁగున్!
చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
రిప్లయితొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
*****
రాజేశ్వరి అక్కయ్యా,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
*****
జిలేబీ గారూ,
_/\_
*****
గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
కాని ‘జ్యేష్ఠాదేవీపతి’ అన్నారు. అంటే వరుణుడు. ఇది అన్వయానికి కుదరడం లేదు. పరిశీలించండి.
జ్యేష్ఠాదేవి :
వరుణుని భార్యలలో ఒకతె. ఈమె ధాతృవిధాతలతోఁ గూడ పుట్టింపఁబడిన బ్రహ్మమానసపుత్రిక. ఈమె చెలియలు లక్ష్మి. ఈమె వరుణునివలన అధర్ముఁడు అను సుతుని పడసెను. ఈజ్యేష్ఠాదేవినే కాళికాదేవి అనియు అందురు. [పురాణనామచంద్రిక (యెనమండ్రం వెంకటరామయ్య) 1879]
గురుదేవులకు ధన్యవాదములు. జేష్ట అంటే దరిద్రదేవత అని ఆంధ్రభారతి నిఘంటువు తెలియజేస్తుంది. శనీశ్వరుని భార్య అని గుగుల్ సర్చ్ లో చూస్తే 'మనసాంప్రదాయాలు' లో కూడా ఉంది.
రిప్లయితొలగించండిసహదేవుడు గారూ,
రిప్లయితొలగించండినిజానికి ఆ శబ్దం ‘జ్యేష్ఠ’... జేష్ట కాదు. ఆంధ్రభారతి కేవలం రవ్వాశ్రీహరి నిఘంటువునే పేర్కొన్నది. ఆ నిఘంటువులో వ్యావహారిక పదాలకూ అర్థాలిచ్చారు. జేష్ట వ్యావహారికం.
ఇక జ్యేష్టాదేవి శని భార్య అన్న విషయం నాకు కొత్తది.
మీ వివరణతో అన్వయం కుదురుతున్నది. సంతోషం!
గురుదేవులకు ధన్యవాదములు.
రిప్లయితొలగించండిసవరించిన పద్యం :
పతి సతుల బంధమందున
వెతలుఁ దొలగె శనికి మ్రొక్క వేదనదీరెన్
గతమున, జ్యేష్ఠా దేవీ
పతి విడనాడిన సతికి శుభమ్ములు గలుఁగున్!
మిత్రులందఱకు నమస్సులు!
రిప్లయితొలగించండికవిమిత్రులు శ్రీ గుండా వేంకట సుబ్బ సహదేవుడుగారూ!
పద్మపురాణాంతర్గత కార్తీకపురాణ కథయందు సూతమహర్షి తెలిపిన ప్రకారముగ జ్యేష్ఠాదేవి భర్త "ఉద్దాలకుఁడు":
(చూడుఁడు:http://www.teluguone.com/devotional/mobile/content/సంపూర్ణ-కార్తీక-మహాపురాణము-ముప్పదియవ-రోజు-పారాయణము-1045-25537.html)
నా పూరణము:
సతియగు జ్యేష్ఠాదేవిని
పతి యుద్దాలకుఁడు విడచి పర సీమఁ జనన్
గతి నిడెను లక్ష్మి! యేత
త్పతి విడనాడిన సతికి శుభమ్ములు గలుగున్!
.ఆ.వె:అతిగా తాగుచు తనపర
రిప్లయితొలగించండిపతిపోగొట్టు కొనియెడి భర్తను గనుచున్
హితమును పలికినను వినని
పతి విడనాడిన సతికి శుభమ్ములు గలుగున్.
అతిగా మద్యముఁ ద్రావుచు
రిప్లయితొలగించండినతివలతో దిరిగి జూదమాడే పతితో
సతి వేడఁ వ్యసనముల నా
పతి విడనాడిన, సతికి శుభమ్ములు గలుగున్!
నా రెండవ పూరణము:
రిప్లయితొలగించండి(శ్రీరాముఁడు జనాపవాదభీతిచే సీతాపరిత్యాగముం జేసిన విషయమును యోగదృష్టిచేఁ గనుఁగొనిన వాల్మీకమహాముని తన మనస్సులో ననుకొనిన సందర్భము)
"మతిలేని చాకి వదరఁగ;
మితిలేని వనమ్ములందు మిథిలుని కూఁతున్
గతిలేక విడిచె! నా రఘు
పతి విడనాడిన సతికి, శుభమ్ములు గలుగున్!"
రిప్లయితొలగించండిసమస్య:పతి విడనాడిన సతికి శుభమ్ములు కలుగున్
పూరణ: సతి శీలము శంకించుట
నతిభద్రముగా గృహమ్ము నకు బీగముచే
నితమును బందీ సేయుట
పతి విడనాడిన, సతికి శుభమ్ములు కలుగున్
శ్రీ కే*యస్.గురుమూర్తి గారి పూరణం
రిప్లయితొలగించండిపతి సంపాదన లోనె-వ
సతి సమకూర్చుకొని-బ్రతుకు సాగించుచున
ర్హత మించిన కోరిక పర
పతి విడనాడిన సతికి శుభమ్ములు గలుగున్
శ్రుతిలయ రాగము లట్లుగ
రిప్లయితొలగించండిసతిపతి లేకున్న?పాట సాగని రీతౌ|
హితము గుర్చని –దౌ పర
పతి విడనాడిన సతికి శుభమ్ములు గలుగున్|
2.పతి జెప్పిన?వినకను-పశు
పతి విడనాడిన సతికి?”శుభమ్ములుగలుగున్
సతతము ననుకొన?”దక్షుడు
క్రతువున నవమాన బరచె రాగా?సుతనే
గతమున చెడుదారిఁదిరిగి,
రిప్లయితొలగించండిపతితుండను పేరుఁబొంది, పరవనితల సం
గతి, కూడదటంచు నెఱిగి,
పతివిడనాడిన, సతికి శుభమ్ములు కలుగున్
సతమతమగు గద మనుగడ
రిప్లయితొలగించండిపతి విడనాడిన సతికి, శుభమ్ములు గలుఁగున్
సతిపతులు కలిసియున్న, ప
డతి నొంటరిగా వసించుట క్లేశమగున్
అతలా కుతలమె బ్రదుకులు
రిప్లయితొలగించండిపతివిడ నాడిన సతికి ,శుభమ్ములు గలుగు
న్బతినిల సేవించు సతికి
సతతము సంతసము గూడ సలుపగ వచ్చున్
వరుణుండని యొక చోటను,
రిప్లయితొలగించండిపరిశీలించగ శనియని బల్కిరి యొకచో,
సరియే యుద్ధాలకుడన?
కరుణార్ధ్రహృదయ నిజమ్ముఁ గనిపెట్టుటెటో?
సతతము త్రాగుడు, జూదము,
రిప్లయితొలగించండిపతితలతో సంగమమ్ము వదలని వాడై
చితికియు తప్పని వాటిని
పతి విడనాడిన, సతికి శుభమ్ములు గలుఁగున్!
సతి పురుడు తల్లి చేయగ
రిప్లయితొలగించండినతి సౌఖ్యమ్మని వచింప సత్యమ్మనుచున్,
సతిఁ దల్లి వారలింటను
పతి విడనాడిన,సతికి శుభమ్ములు గలుఁగున్!
Murthy Psr గారూ!
రిప్లయితొలగించండిమీ పూరణ నాలుగవపాదమున యతిమైత్రి తదుపరియక్షరము "ట"గురువుకాదు. గణభంగమగురున్నది. దీనిని "టయె"యనిని సరిపోవును.
రిప్లయితొలగించండిసతతము మదిరను గ్రోలుట,
మితిమీరిన సంగమమ్ము మిండలతోడన్
మతిచెడి తిరుగు రివాజులు
పతి విడనాడిన, సతికి శుభమ్ములు కలుగున్
గుండు మధుసూదన్ గారూ,
రిప్లయితొలగించండిపురాణకథాప్రసక్తితో మీ పూరణ బాగున్నది. అభినందనలు.
మీ రెండవ పూరణ నిస్సందేహంగా అద్భుతంగా ఉంది.
*****
డా. బల్లూరి ఉమాదేవి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
రెండవపాదంలో గణదోషం. ‘పతిపోగొట్టు కొనుచున్న భర్తను గనుచున్’ అందామా?
*****
బొడ్డు శంకరయ్య గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
‘ఆడే’ అని వ్యావహారికాన్ని ప్రయోగించారు. ‘జూద మాడెడు’ అనండి.
*****
కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
మొదటి పూరణలో ‘బీగముచే నితమును..’?
*****
కె.యస్. గురుమూర్తి ఆచారి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
*****
కె. ఈశ్వరప్ప గారూ,
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
మొదటి పూరణలో ‘రీతి+ఔ’ అన్నప్పుడు యడాగమం వస్తుంది. అక్కడ ‘రీతిన్’ లేదా ‘విధమౌ’ అనండి.
*****
అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
*****
పి.యస్.ఆర్. మూర్తి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
చివరిపాదంలోని గణదోషం గురించి గుండు మధుసూదన్ గారి సవరణను గమనించండి.
*****
పోచిరాజు సుబ్బారావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
‘అతలాకుతలం’ వ్యావహారికం. ‘అతలకుతలమ్మగు బ్రతుకు’ అనండి.
*****
గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
ఒక్కొక్క నిఘంటుకారుం
డొక్కొక్క యర్థమ్ముఁ జెప్పి రొప్పుగ, వానిన్
జక్కగ మనకు ప్రయోజన
మెక్కరణిని కలుగు వానినే వాడఁదగున్.
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
గురుదేవులకు ధన్యవాదములు. తమరి పద్యం మొదటి,రెండవ పాదాల్లో గణభంగమైన దనిపిస్తోందండీ.
రిప్లయితొలగించండిగురుదేవులు సూచించిన సవరణతో...
రిప్లయితొలగించండిఅతిగా మద్యముఁ ద్రావుచు
నతివలతో దిరిగి జూదమాడెడు పతితో
సతి వేడఁ వ్యసనముల నా
పతి విడనాడిన, సతికి శుభమ్ములు గలుగున్!
గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
రిప్లయితొలగించండినిజమే! అంతకుముందే గుండువారు ఫోన్‍లో ఆ గణదోషం గురుంచి హచ్చరించారు. ఇద్దరికీ ధన్యవాదాలు. ‘ఒక్కొక నిఘంటుకారుం| డొక్కొక యర్థమును...’ అని ఉండాలి.
అతి కాముకుడగుచు, బృహ
రిప్లయితొలగించండిస్పతి సతి తారను హరించె జంద్రుడధముడై
చతురాననునానతి యుడు
పతివిడనాడిన సతికి శుభమ్ములు గలుగున్
అశ్వత్థ నారాయణ మూర్తి గారూ,
రిప్లయితొలగించండిమీ పూరణ చాలా బాగున్నది. అభినందనలు.
గురువుగారు
రిప్లయితొలగించండినిన్న,నేడు, ఇతరపనుల్లో నిమగ్నుడై ఆలస్యంగా పాల్గొన్నాను.
మీ ' చాలా ' విశేషణానికి ఆనందిస్తూ, కృతజ్ఞతలు.
నిమగ్నుడనై అని వ్రాయాలనుకొంటాను.
తొలగించండిచాలా క్రియా విశేషణమా?
పతియింట సతియు నుండిన
రిప్లయితొలగించండిసతి యాషాఢము పతియిలు సమ్మతమౌనా
యతులిత ప్రేమను గలిగిన,
పతివిడనాడిన సతికి శుభమ్ములు గలుగున్
పతి త్రాగుబోతుగ తిరుగ
సతి,నాబిడ్డల నరయమి,సత్వరమామే
వెతనంది యయిన,దుష్టపు
పతి విడనాడిన సతికి శుభమ్ములు గలుగున్
అతివల సంతుగ నొల్లక
సతిదే బాధ్యత యనుచును సతతము నేచే
మతిహీనుడైన వానిని,
పతి విడనాడిన సతికి శుభమ్ములు కలుగున్
అతులిత ప్రేమను బిడ్డల
పతికిని పంచగ కలుగును ప్రధమపు ప్రేమే
నుతిగా బిడ్డల,ప్రజకై
పతి విడనాడిన సతికి శుభమ్ములు కలుగున్
సతి గర్భంబందిన,నెల
లతి దగ్గరయయి పురిటికి,నతివకు మేలౌ
సతి,పతి దూరము నుండుట,
పతి విడనాడిన సతికి శుభమ్ములు కలుగున్
శృతిమించిన యలవాటులు(వ్యసనమ్ములు)
రిప్లయితొలగించండిమతిదప్పిన దుడుకుతనము మాత్సర్యంబుల్
కుతకుతలాడుచు నుండెడు
పతి,విడనాడిన-సతికి శుభమ్ములు కలుగున్
మితిమీరి ఖర్చు జేయుట
రిప్లయితొలగించండిఅతిథుల బట్టించు కొనక నటునిటు జనుటల్
సుతిమెత్తగ చెప్పగ తన
పతి - విడనాడిన సతికి శుభమ్ములు కలుగున్
మల్లెల సోమనాథ శాస్త్రి గారూ,
రిప్లయితొలగించండిమీ ఐదుపూరణలు బాగున్నవి. అభినందనలు.
*****
రెండుచింతల రామకృష్ణ మూర్తి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
*****
గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
పతి తా బెంగాలి నరుడు
రిప్లయితొలగించండిమితిమీరిన యుబ్బసమున మ్రింగుచు గుళికల్
సతమత మౌచును హోమియొ
పతి విడనాడిన; సతికి శుభమ్ములు గలుగున్
రిప్లయితొలగించండిమందూ భాయ్ జర సంభాలో :(
అతుకుల బొంతగు తమ జీ
విత మందున మందుకొట్టు విపరీతపు చే
ష్ట తన పెనిమిటిది! దానిని
పతి విడనాడిన సతికి శుభమ్ములు గలుగున్ !
జిలేబి
కుతి తీరక మతి పోవగ
రిప్లయితొలగించండిసతమతమై కల్లునిడని జవరాల్ తోడన్
గతుకులదౌ కాపురమున
పతి విడనాడిన సతికి శుభమ్ములు గలుగున్