15, జూన్ 2015, సోమవారం

పద్య రచన - 933

కవిమిత్రులారా,
పై చిత్రాన్ని పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.

19 కామెంట్‌లు:

  1. చెక్కలు బియ్యపు పిండని
    మిక్కిలి శ్రేయస్క రమట మేలొన రించన్
    చక్కగ పదుగురు మెచ్చిన
    మక్కువగా పిల్ల లంత మైమరచి తినన్

    రిప్లయితొలగించండి
  2. రాజేశ్వరి అక్కయ్యా,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  3. చెక్క వడలు జూడ జక్కగా నుండెను
    దినగ దినగ నవియ తీ య గుండు
    వేడి నీటి లోన బియ్యపు పిండిని
    ముద్ద వోలె గలిపి పెద్ద చేయు

    రిప్లయితొలగించండి
  4. పోచిరాజు సుబ్బారావు గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  5. ఆ.వె: చేతి తోడ తట్టి చెక్కలు చేయంగ
    పిల్లలనక మరియు పెద్దలనక
    యందరిష్ట పడుచు యారగించిరిగదా
    మీరు తినగ రండు మిత్రులార.

    రిప్లయితొలగించండి
  6. డా. బల్లూరి ఉమాదేవి గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  7. బియ్యపు పిండిలో తగిన వియ్యము లందుచు నీరుజేరగా
    సయ్యని బెల్లమే గలువ?సంతసమిచ్చు వడందు బుట్టగా?
    తియ్యగ మారి నోటబడ?తీరిక లేకను పళ్ళు దంచగా|
    అయ్య నిదేమి తీపియని/ఆశగ నాలుకనాట్య మాడుగా|
    2”.చక్కదనము లేని చక్క వడ లనకు
    రుచులు బంచగలుగు|’”రూపులేని
    భార్య మమత లందు బాధ్యత నింప|
    భర్త సంతసించు?కర్తలాగ|

    రిప్లయితొలగించండి
  8. సుబ్బరముగ నుంచి రచట
    'పబ్బిల్లల',వేరశనగ వక్కలు దెలియ
    న్నబ్బబ్బో నువ్వులమర!
    పబ్బమ్మౌ పిల్లపాప పంచుకు తినగన్! ( మేమిక్కడ వాటిని చెక్కలనకుండా పబ్బిల్లలంటాము. )

    రిప్లయితొలగించండి
  9. ఉమాదేవి గారి పద్యంలో మూడవపాదాన్ని ఇలా సవరిస్తే బాగుంటుందేమో

    "అందరిష్టపడుచు నారగించిరిగదా"

    సహదేవుడుగారు సుబ్బరము అన్నారు.

    రిప్లయితొలగించండి
  10. చక్కగ కరకర లాడెడు
    చెక్కల రుచి జెప్పనేల చిక్కును మనసే!
    మిక్కిలిగ పప్పు లద్దిన
    మక్కువతో దినని వారు మహిలో గలరే ? !!!

    రిప్లయితొలగించండి
  11. గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.
    శ్రీఆదిభట్ల వారి వ్యాఖ్యను గమనించారు కదా.. ‘సుబ్బరముగ’ అన్నది ‘శుభ్రముగ’ అన్నదానికి మాండలికం. వ్యాకరణ సమ్మతం కాదు. అక్కడ ‘అబ్బురముగ’ అనండి.
    *****
    శ్రీఆదిభట్ల కామేశ్వర శర్మ గారూ,
    ధన్యవాదాలు. ఉమాదేవి గారి దోషం నా దృష్టికి రాలేదు. మీ సవరణ బాగున్నది.
    *****
    శైలజ గారూ,
    మీ పద్యం బాగుంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  12. చక్కటి వడలను జూడగ
    మక్కువ తోడను జలములు మరిమరి యూరన్
    లెక్కకు మిక్కిలి గైకొని
    పుక్కిట నిడుకొని గబగబ బొక్కుట తప్పా

    రిప్లయితొలగించండి
  13. ధన్యవాదాలండీ శ్రీ ఆదిభట్ల కామేశ్వరశర్మగారూ మరియు శంకరయ్యగారూ.అచ్చు రాకూడదనుకొని యడాగమం చేశానండి.సవరించుకొంటాను.భాషలోగానీ భావంలో గానీ తప్పులుంటే తెలుపగలరు.

    రిప్లయితొలగించండి
  14. పెసరపప్పులో బియ్యపు పిండిఁజేర్చి
    వెన్నతో ముద్దగాజేసి, పెనముపైన
    పలచగావత్తి చేతితో, సులువుగాను
    వేడినూనెలో తగఁగాల్చి, వేడ్కతోడ
    చెక్కగారెలఁ జేడియల్ చేయుచుంద్రు

    రిప్లయితొలగించండి
  15. గురుదేవులకు ధన్యవాదములు. సవరించిన పద్యం :
    అబ్బురముగ నుంచి రచట
    ' పబ్బిల్లల ' వేరుశనగ వక్కలు దెలియ
    న్నబ్బబ్బో నువ్వులమర!
    పబ్బమ్మౌ పిల్లపాప పంచుకు తినగన్!

    శ్రీ ఆదిభట్ల కామేశ్వర శర్మ గారికి ధన్యవాదములు.

    రిప్లయితొలగించండి
  16. అశ్వత్థ నారాయణ మూర్తి గారూ,
    మీ పద్యం బాగుంది. అభినందనలు.
    *****
    అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
    మీ పద్యం బాగుంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  17. చక్కగ జేసిన బియ్యపు
    చెక్కలు తినుడయ్య వెన్న చిక్కగ గలిసెన్
    ముక్కను గొరుకగ కారము
    మిక్కుటముగ లేక తినుచు మెత్తురు మీరే !

    రిప్లయితొలగించండి
  18. రండి రండి దొంతరలుగను రుచికర
    వడలనిడిరి మనద వడలు నొవ్వ
    భక్షణంబుసేసి బ్రావుమనుచు దేన్చి
    కుక్షి నింప వచ్చు గొప్ప గాను

    రిప్లయితొలగించండి
  19. గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.
    *****
    అశ్వత్థ నారాయణ మూర్తి గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి