16, జూన్ 2015, మంగళవారం

సమస్యా పూరణము - 1705 (కన్నులుండి కూడ కాంచలేరు)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది....
కన్నులుండి  కూడ  కాంచలేరు.
ఈ సమస్యను పంపిన రెండుచింతల రామకృష్ణ మూర్తి గారికి ధన్యవాదాలు.

35 కామెంట్‌లు:

 1. కన్నపిల్లలందు నున్నప్రేమ వలన
  నమ్ము చుండు వారినతిగనెపుడు
  బిడ్డచేసినట్టి పెద్దతప్పులనైన
  కన్నులుండి కూడ కాంచలేరు

  రిప్లయితొలగించండి
 2. ఎదుటి వ్యక్తి లోని యెదలోని భావాలు
  మధుర రసము లొలుకు మాట లందు
  తరచి చూడ వెనుక గరళ ముండెనేని
  కన్నులుండి కూడ కాంచ లేరు

  రిప్లయితొలగించండి
 3. చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  *****
  రాజేశ్వరి అక్కయ్యా,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 4. అర్థమునధికారమనునవి విషదంష్ట్ర
  పూరితంబులైన భోగవరులు
  ఏతదురగ దష్ట హీనులుసత్యంబు
  గన్ను లుండి కూడ కాంచలేరు

  రిప్లయితొలగించండి
 5. అశ్వత్థ నారాయణ మూర్తి గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  ‘భోగవరులు+ఏతదురగ’ అన్నప్పుడు సంధి నిత్యం. మీరు విసంధిగా వ్రాశారు. ‘భోగసక్తు| లేతదురగ...’ అందామా?

  రిప్లయితొలగించండి
 6. మాయ తోడ బుట్టి మాయలో బెరుగుచు
  మాయ జగతి లోన మంచి చెడులు
  కన్ను లుండి కూడ కాంచ లేరు జనులు
  మిన్న విరిగి మీద నున్న గాని!!!

  రిప్లయితొలగించండి
 7. గురువుగారు కృతజ్ఞతలు
  మీ సూచనల ప్రకారము సవరించిన తరువాత

  అర్థమునధికారమనునవి విషదంష్ట్ర
  పూరితంబులైన భోగసక్తు
  లేతదురగ దష్ట హీనులుసత్యంబు
  గన్ను లుండి కూడ కాంచలేరు

  'భోగభద్రు' లనవచ్చా

  రిప్లయితొలగించండి
 8. దేవుడెక్కడుండు దెలియు వారెవ్వరు?
  దైవ మెట్టి రూపు దాల్చి యుండు?
  సర్వ వ్యాప్త మైన సర్వభూతస్థుని
  కన్ను లుండి కూడ కాంచలేరు!!!

  రిప్లయితొలగించండి
 9. శైలజ గారూ,
  మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
  ‘మిన్న విరిగి మీద నున్న గాని’... అర్థం కాలేదు. అది ‘మిన్ను విరిగి’ అనుకుంటాను. మిన్ను విరిగి మీద పడడం ఉంది కాని మీద ఉండడం లేదు... ‘మిన్ను విరిగి వచ్చి మీదపడిన’ అందామా?
  రెండవ పూరణలో ‘సర్వవ్యప్త’మన్నప్పుడు ‘ర్వ’ గురువై గణదోషం. సవరించండి.

  రిప్లయితొలగించండి
 10. పట్టు కున్న వలువ పావురంబైనను!
  తాడు పాము వోలె నాడి నంత!!
  కళ్ళ ముందు సాగు కనికట్టు విద్యను
  కన్ను లుండి కూడ కాంచలేరు!!!

  రిప్లయితొలగించండి
 11. ధన్యవాదములు గురువుగారు...సవరణలతో...

  మాయ తోడ బుట్టి మాయలో బెరుగుచు
  మాయ జగతి లోన మంచి చెడులు
  కన్ను లుండి కూడ కాంచ లేరు జనులు
  మిన్ను విరిగి వచ్చి మీద బడిన !!!  దేవుడెక్కడుండు దెలియు వారెవ్వరు?
  దైవ మెట్టి రూపు దాల్చి యుండు?
  సకలమందు నుండు సర్వభూతస్థుని
  కన్ను లుండి కూడ కాంచలేరు!!!

  రిప్లయితొలగించండి
 12. కన్ను లుండి కూడ కాంచలే రుగమఱి
  చుట్టు ప్రక్క జరుగు నట్టి పనుల
  మనసు బాగు లేక మధనప డునపుడు
  నెంత వారి కైన నిట్లె యుండు

  రిప్లయితొలగించండి
 13. బావి లోని కప్ప భావించు లోకము
  చూడ గలుగు మేర చూచి నంత
  మూఢ జనుల బుద్ది మూర్తీభ వించదు
  కన్నులుండి కూడ కాంచలేరు

  రిప్లయితొలగించండి
 14. గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
  మీ పూరణ బాగుంది. అభినందనలు.
  *****
  శైలజ గారూ,
  రెండవపూరణలో మీ సవరణ బాగుంది. సంతోషం!
  *****
  పోచిరాజు సుబ్బారావు గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  *****
  కవిశ్రీ సత్తిబాబు గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.

  రిప్లయితొలగించండి

 15. సమస్య:కన్నులుండి గూడ కాంచ లేరు
  పూరణ:దురభిమాన కర్ణ దుర్యోధనుం డక్ష
  ధూర్తుడైన శకుని దుస్ససేను
  లా యదుకులమణిని ఆదిదేవుడనగ
  కన్నులుండి గూడ కాంచ లేరు

  రిప్లయితొలగించండి
 16. ప్రజలసొమ్ము బొక్కి పరవశించెడువారు
  ధర్మ మార్గము మదిఁ దలచరెపుడు
  తనమనుషులు చేయు తప్పుడు పనులను
  కన్నులుండికూడ కాంచ లేరు

  రిప్లయితొలగించండి
 17. పరుల తప్పు లెదుకు పలుమార్లు శోధించి
  తనదు బంధు హితుల తప్పు లెపుడు
  గప్పి పుచ్చుచుంద్రు కపటంపు మనుజులు
  కన్నులుండి కూడ కాంచలేరు

  రిప్లయితొలగించండి
 18. గాలి,జాలి,ప్రేమ- కనుపించ దెక్కడ|
  ఆశ ?దోష మందుఅణగి యున్న?
  స్వార్థ చింతలందు సాగని మంచియు
  కన్నులుండి కూడ కాంచలేరు|
  2.అమ్మ మనసులోని ఆప్యాయతల ఊట
  నాన్న –ప్రేమయందు నాటు మమత
  అవ్వ,తాత లందు అణగిన నవ్వులు
  కన్నులుండి కూడ కాంచలేరు|

  రిప్లయితొలగించండి
 19. కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  ‘కర్ణ దుర్యోధనులు’ అనాలి. మీరు ‘కర్ణ దుర్యోధనుడు’ అన్నారు. ‘మణిని+ఆదిదేవు’ అని విసంధిగా వ్రాశారు. ‘దురభిమాన కర్ణ దుర్యోధనులు నక్ష| ధూర్తి.... యదుకులమణిని నాదిదేవు...’ అనండి.
  *****
  డా. బల్లూరి ఉమాదేవి గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  మూడవపాదంలో గణదోషం. ‘పెంచి పెద్ద జేయ పెరిగినట్టి సుతులు/ పెంచి పెద్ద జేయ ప్రేమవీడి సుతులు’ అనండి.
  *****
  అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  *****
  గండూరి లక్ష్మినారాయణ గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  ‘వెదకు’ను ‘ఎదకు’ అన్నారు. ‘పరుల తప్పు లరయు...’ అనండి.
  *****
  కె. ఈశ్వరప్ప గారూ,
  మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.

  రిప్లయితొలగించండి

 20. నలువదేండ్లు గడచి నట్టి మానవులకు
  కన్ను లుండికూడ గాంచలేరు
  కంటి వైద్యుడిచ్చు కండ్లజోడును ధరిం
  చంగ దృష్టియంత చక్కబడును
  వలువలొల్చు చుండ కులసతి కృష్ణకు
  మిన్నకుండిరి గద కన్నులుండి
  కూడ.గాంచలేరు కురుపితామహుడును
  గ్రుడ్డిరాజు తోడ గ్రుడ్డియగుచు

  రిప్లయితొలగించండి

 21. గురుదేవులసూచనలతో సవరించిన పద్యము
  దురభిమాన కర్ణదుర్యొధనులు నక్ష
  ధూర్తుడైన శకుని దుస్ససేను
  లాయదుకులమణిని నాదిదెవుడనగ
  కన్నులుండికూడ గాంచలేరు

  రిప్లయితొలగించండి
 22. వీను లుండి కూడ వినిపించు కొనలేరు
  కన్నులుండి కూడ కాంచ లేరు
  నోటినిండ నెపుడు మాటలాడరు"నడ
  మంత్రపుసిరి"రాగ మనుజు లకట!

  రిప్లయితొలగించండి
 23. కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
  మీ తాజా పూరణలు బాగున్నవి. అభినందనలు.
  *****
  దువ్వూరి రామమూర్తి గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 24. సాటి వారి బాధ చదివేటి హృదయంబు
  కాంచ గలదు బాధ కన్ను యగుచు ,
  సాటి వారి బాధ చదువని వారలు
  కన్ను లుండి కూడ కాంచ లేరు
  కొరుప్రోలు రాధా కృష్ణా రావు

  రిప్లయితొలగించండి
 25. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

  రిప్లయితొలగించండి
 26. శ్రీ భాగవతుల కృష్ణారావు గారి పూరణ

  సకల జీవరాశి సాకెడు వానిని
  కండ్లు లేక యున్న గాంచె నొకడు
  నమ్మకమ్ము లేని నాస్తికు లెందరో
  కన్నులుండి కూడ కాంచలేరు.

  రిప్లయితొలగించండి
 27. కొరుప్రోలు రాధాకృష్ణారావు గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  ‘చదివేటి’ అన్నదానిని ‘చదివెడు’ అనండి. ‘కన్ను+అగుచు’ అన్నప్పుడు యడాగమం రాదు. ‘కన్ను లగుచు’ అనండి.
  *****
  భాగవతుల కృష్ణారావు గారూ,
  మీ పూరణ చాలా బాగున్నది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 28. విశ్వవిభుని దివ్య విశ్వరూపమ్మును
  గాంచ దివ్యదృష్టి కావలయును
  మనుషు లట్టి రూపు మాంసనిర్మితమైన
  కన్నులుండి కూడ కాంచ లేరు.

  రిప్లయితొలగించండి
 29. మమత గప్పినంత,మనవారె యనుచును
  వారుచేయు చెడుగు బాగెయనుచు
  తలచుచుండి నిజము తలపక యుండి తా
  కన్నులుండి కూడ కాంచలేరు

  మదముచేత తానె మాన్యుండ ననుచును
  రావణుండు మదిని,రామశక్తి
  దలచెగాదె యనిని తక్కువనుచు తాను
  కన్నులుండి కూడ కాంచలేరు

  ఎదుటివారుచెప్పు నింపైన నిజములన్
  సరకుజేయకుంద్రు సరిగనెపుడు
  మనమె గొప్పయనుచు మదితల్చువారలే
  కన్నులుండి కూడ కాంచలేరు

  వాసుదేవుడట్లు పాడిచెప్పినగాని
  రాజరాజు వినడు,రాజ్యమీయ
  దుష్టులైన సఖుల దుష్ట బోధలు నమ్మి
  కన్నులుండి కూడ కాంచలేరు

  రిప్లయితొలగించండి
 30. మిస్సన్న గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  నేను విద్యార్థిగా ఉన్నప్పుడు వ్రాసిన ‘వరదశతకం’లోని పద్యం...
  ఓ దేవ! మాంసచక్షువు
  నీ దివ్యాకారముఁ గననేరదు కరుణా
  త్మా దివ్యదృష్టి నొసఁగిన... (తరువాత గుర్తుకు రావడం లేదు!)
  శ్రీకృష్ణునిపై మీరు వ్రాసిన పద్యానికి ఫేస్‍బుక్‍లో వచ్చిన/ వస్తున్న ప్రతిస్పందనలు చూసి మహదానందం పొందుతున్నాను. అందరి ప్రశంసలు పొందే అర్హత ఉన్న మనోజ్ఞమైన పద్యం అది. మీకు నా అభినందనలు.
  *****
  బొడ్డు శంకరయ్య గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  *****
  మల్లెల సోమనాథ శాస్త్రి గారూ,
  మీ పూరణలన్నీ బాగున్నవి. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 31. తిరుమలగిరినెక్కి తిరుమల వాసుని
  దివ్యమైనరూపు తీరుబడిగ
  సరణిలోనను జనసమ్మర్దముండగ
  కన్నులుండి కూడ కాంచలేరు.

  రిప్లయితొలగించండి
 32. గురువుగారూ ధన్యవాదాలు.
  మీ బోటి గురువుల అనుగ్రహం వల్ల అప్పుడప్పుడు నాలుగు మంచిపదాలతో ఒక పద్యం వస్తూ ఉంటుంది.
  శిష్యుల ప్రాజ్ఞత చూసి మహదానంద పడే వాత్సల్యం మీది.
  మీ బ్లాగు పరిచయం అయ్యాకే నాకు మంచి పద్యం వ్రాసి పెద్దల మెప్పు పొందాలనే కుతూహలం పెరిగింది.
  దానికి మీ ప్రోత్సాహం పుష్కలంగా లభించింది.
  అందులో సందేహం లేదు.
  మరొక్కసారి మీకు ధన్యవాదాలు.

  రిప్లయితొలగించండి
 33. సాటి వారి బాధ చదివెడు హృదయంబు
  కాంచ గలదు బాధ కన్ను ల గుచు ,
  సాటి వారి బాధ చదువని వారలు
  కన్ను లుండి కూడ కాంచ లేరు
  కొరుప్రోలు రాధా కృష్ణా రావు 16/06/15

  రిప్లయితొలగించండి
 34. మిత్రులందఱకు నమస్సులతో...

  (కనులముందు జరుగు దుర్మార్గము నెదిరింపనివారు కన్నులుండియు గ్రుడ్డివారే యనుట)

  (1)
  కనుల యెదుట జరుగు కాకుదనము నెల్లఁ
  జూచుచు నెదిరింపఁ జూడకున్నఁ,
  జెడును పృచ్ఛసేయఁ గడఁగ కున్నను వారు
  కన్నులుండి కూడ కాంచలేరు!

  *** *** ***

  (తనకు విశ్వరూపమ్మునుం జూపిన శ్రీకృష్ణుని నర్జునుఁడు నుతించు సందర్భము)

  (2)
  తల్లి తండ్రి గురువు దైవమ్ము నీవంచు
  విశ్వరూప మిపుడు ప్రేమఁ గంటి!
  పరుల కీవు నిట్టి భాగ్య మ్మొసంగినఁ
  గన్నులుండి కూడ కాంచలేరు!!

  రిప్లయితొలగించండి
 35. గుండు మధుసూదన్ గారూ,
  మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.

  రిప్లయితొలగించండి