27, జూన్ 2015, శనివారం

పద్య రచన - 943

కవిమిత్రులారా,
పై చిత్రాన్ని పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.

22 కామెంట్‌లు:

 1. మా అన్నగారు, అందవోలు రామ్మోహన్ గారి పూరణ:

  కం||
  మరిమరి యందరి కన్నులు
  మిరుమిట్లను గొలుపు రీతి మెఱుపుల తోడ
  న్నురిమెడు శ్రావణ మాసము
  తరుముచు వచ్చెను జగతిని తడుపగ నీటన్.

  కం||
  సప్త స్వరములె మింటను
  గుప్తంబై యున్న వనుచు గొప్పగ జాటెన్
  లిప్త సమయంబు నందున
  సుప్తంబై నట్టి మొయిలు సురుచిర మతియై.

  రిప్లయితొలగించండి
 2. అందవోలు విద్యాసాగర్ గారూ,
  బహుకాల దర్శనం.... సంతోషం!
  మీ అన్నగారు రామ్మోహన్ గారి పద్యాలు చాల బాగున్నవి. వారికి నా అభినందనలు.

  రిప్లయితొలగించండి
 3. ధర తాపము తొలగగ తొల
  కరి వానలు కురియ మేను కందగ సుఖమే
  మురియుచు నవ్వగ మన్నే
  మెరుపులతో " హాయి " జెప్పె మిన్నే కనుమా !

  రిప్లయితొలగించండి
 4. గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
  మీ పద్యం బాగున్నది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 5. ఉరుములు మరియును గనబడె
  మెరుపులతో గగన మంత మెరయుచు మిగుల
  న్నరయగ శ్రావణ మాసము
  నరుదెంచెనుననుచుదెలిసె యార్యా! మాకున్

  రిప్లయితొలగించండి
 6. తే.గీ:భాను వేడిమి చేజనులు భయము నొంద
  వరుణు దేవుడు కరుణింప వాన కురిసె
  వర్ష ధారల చేధాత్రి పరవశింప
  హర్ష భరితుడయ్యె తానన్నదాత.

  రిప్లయితొలగించండి
 7. పోచిరాజు సుబ్బారావు గారూ,
  మీ పద్యం బాగున్నది. అభినందనలు.
  ‘అరుదెంచె నటంచు దెలిసె...’ అనండి.
  *****
  డా. బల్లూరి ఉమాదేవి గారూ,
  మీ పద్యం బాగుంది. అభినందనలు.
  మొదటి, చివరి పాదాల్లో గణదోషం. ‘వేడిమిచే జనుల్ భయము... హర్షభరితుడయ్యె గద తా నన్నదాత/ హర్షభరితాంతరాత్ముడౌ నన్నదాత’ అనండి.

  రిప్లయితొలగించండి
 8. మిలమిలమను కాంతులతో
  జలదములు గగనమునుండి క్ష్మాతలమునకున్
  వెలుగులు చిమ్ముచు మెరయగ
  తిలకించితి కళ్ళ ముందు దేదీప్యమయెన్

  రిప్లయితొలగించండి
 9. మిన్నున మెరిసెడి మెరుపులు
  కన్నుల మిరుమిట్లు గొలుపు కమనీయముగన్
  చిన్నగ వానలు గురియగ
  నిన్నటి వేడిమిని మరచు నెమ్మిగ నిలయే!!!

  రిప్లయితొలగించండి
 10. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

  రిప్లయితొలగించండి
 11. చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
  మీ పద్యం బాగుంది. అభినందనలు.
  *****
  శైలజ గారూ,
  మీ పద్యం బాగున్నది. అభినందనలు.
  *****
  కె. ఈశ్వరప్ప గారూ,
  మీ పద్యాలు చాల బాగున్నవి. అభినందనలు.
  వ్యావహారిక పదాలు ఎక్కువయ్యాయి. ‘వెళ్ళి (యేగి), ఉఱిమే (ఉఱిమెడు), మెరిసే (మెరసెడు), కురిసే (కురిసెడు)’

  రిప్లయితొలగించండి
 12. మెల్లగ గాలియేగి పరమేశ్వరు నాజ్ఞగ పట్టి కొట్టగా|
  కళ్ళకు బైర్లు గమ్మగనె కాంతులు జిమ్ముచుమేఘ మేడ్వగా?
  ఉల్లము సంతసంబొసగె|నుజ్వల జీవనకాంతి గన్పడన్|
  2.ఉఱిమెడి నుఱుముల నలజడి
  మెరిసెడి మేఘాల కాంతి మిరుమిట్లయినన్
  కురిసెడి వర్షపు జల్లుల
  తరుణము గుర్తించ గానే తరుగును భయమే|

  రిప్లయితొలగించండి
 13. కె. ఈశ్వరప్ప గారూ,
  సవరణల తర్వాత మీ పద్యాలు ఇంకా బాగున్నవి. సంతోషం!

  రిప్లయితొలగించండి
 14. ఉఱుములయూహ లెంచకనె?నుజ్వల కాంతి-విశిష్ట బ్రాంతిగా
  తరిమెడి తత్వ మేమిటన?ధర్మ-ప్రవృత్తికి మూలహేతువై
  వరుణుని నేలకంపుటకు వాదన లట్లుగ మేఘ గర్జనల్
  మెఱుపులు మేలుజేయుటకె మిక్కిలి తోడ్పడు వాన జల్లుకున్|

  రిప్లయితొలగించండి
 15. కె. ఈశ్వరప్ప గారూ,
  మీ తాజా పద్యం చక్కగా ఉంది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 16. నాడు...
  క్యుములోనింబస్ మేఘపు
  నిమేషకృత్తువది యేమొ నేలకు దిగెనా?
  నిమిషమున'రాజశేఖరుని'
  యములోరి బంటు వోలె నాయువుఁ దీసెన్

  రిప్లయితొలగించండి
 17. మేఘముల ఘర్షణలతోడ మెఱపులచట
  కానుపించెను కరమగు కాంతితోడ
  వర్షములు కురియునంచు కర్షకజను
  లందరున్ సంతసమునొందిరవనియందు

  రిప్లయితొలగించండి
 18. అశ్వత్థ నారాయణ మూర్తి గారూ,
  మీ పద్యం బాగుంది. అభినందనలు.
  రెండవపాదంలో గణయతి దోషాలు. ‘ఉరుముల స్వర’ అన్నచోట ‘ల’ గురువు కాదు, ఉ-వు లకు యతి లేదు. ‘ఉరుము స్వరముల కనువుగ నొగి గదలుచు’ అందామా?
  *****
  గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
  మీ పద్యం బాగుంది. అభినందనలు.
  మూడవ నాల్గవ పాదాలలో గణదోషం. ‘నిమిషమున రాజశేఖరు| యము నింటన్ బంటువోలె...’ అనండి. (‘రిబంటు’ అని జగణం వేశారు).
  *****
  అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
  మీ పద్యం బాగున్నది. అభినందనలు.
  మూడవపాదంలో గణదోషం. ‘కురియు ననుచు’ అంటే సరి.

  రిప్లయితొలగించండి
 19. గురుదేవులకు ధన్యవాదములు. సవరించిన పద్యం :
  నాడు...
  క్యుములోనింబస్ మేఘపు
  నిమేషకృత్తువది యేమొ నేలకు దిగెనా?
  నిమిషమున'రాజశేఖరు'
  యమధర్మజు బంటు వోలె నాయువు దీసెన్

  రిప్లయితొలగించండి
 20. గురువుగారు, ఈవిధంగా సవరించాను

  మెరుపు దీవెలు భామలై మింటి నడుమ
  మేఘ వాద్యపు లయలకు మేను గదిపి
  శాబ్ద గాంభీర్య నాట్యవిస్ఫార మంద
  ప్రకృతి చిత్రమ్ము పాత్రమై బరగు చుండె

  రిప్లయితొలగించండి
 21. గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
  అశ్వత్థ నారాయణ మూర్తి గారూ,
  మీ సవరణలు బాగున్నవి. సంతోషం, అభినందనలు.

  రిప్లయితొలగించండి