27, జూన్ 2015, శనివారం

సమస్యా పూరణము - 1715 (శ్రవణానందమ్ముఁ గూర్చె రాసభము సభన్)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది....
శ్రవణానందమ్ముఁ గూర్చె రాసభము సభన్.

35 కామెంట్‌లు:

 1. కవితాపఠనమ్మెంతయొ
  శ్రవణానందమ్ము గూర్చె - రాసభము సభన్
  రవములు చేయుచు వచ్చెను
  చెవులకు చిల్లుపడునట్లు ఛీకొట్టె జనుల్

  రిప్లయితొలగించండి
 2. చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
  విరుపుతో మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  ‘జనుల్’ బహువచనం, క్రియాపదం ‘చీకొట్టె’ ఏకవచనం. అక్కడ ‘చీకొట్ట జనుల్’ అంటే సరి!

  రిప్లయితొలగించండి
 3. అవనిని గాడిద మందలు
  భవనమునకు బయట జేరి " భళి భళి " యనగా
  రవమును పెంచుచు నొక్కటి
  శ్రవణానందమ్ముఁ గూర్చె రాసభము సభన్.

  రిప్లయితొలగించండి
 4. భువి నుష్ట్రవివాహంబున
  శ్రవణానందమ్ము గూర్చె రాసభము సభన్
  అవి యన్యోన్యముమెచ్చెన్
  అవురా!గానమ్ము రూపమవురా!యంచున్.

  రిప్లయితొలగించండి
 5. గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  *****
  దువ్వూరి రామమూర్తి గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 6. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

  రిప్లయితొలగించండి
 7. దవమున పోటీలు జరుగ
  సవురుగ తము బాడలేక జంతువులన్నీ
  చివరకు ఖరమును బంపన్
  శ్రవణానందమ్ము గూర్చె రాసభము సభన్!!!

  రిప్లయితొలగించండి
 8. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

  రిప్లయితొలగించండి

 9. చివురును తిని కూయ పికము
  శ్రవణానందమ్ము గూర్చె రాసభము సభన్,
  యవహేళన జేసెను ఘన
  రవమున నో౦డ్రి౦ఛి, వానరమ్ములు పొగడన్

  రిప్లయితొలగించండి
 10. కవితా గానము మీయది
  శ్రవణా నందమ్ము గూర్చె, రాసభము సభన్
  రవములు సేయుచు దిరుగగ
  నవసరమగు వస్తు తతులు నప్పడ మయ్యెన్

  రిప్లయితొలగించండి
 11. శైలజ గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  ‘అన్నీ’ అనడం వ్యావహారికం. ‘జంతువు లెల్లన్’ అనండి.
  *****
  కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  ‘సభన్+అవహేళన’ అన్నప్పుడు యడాగమం రాదు. ‘సభ| న్నవహేళన’ అనవచ్చు (తప్పని పరిస్థితిలో).
  *****
  పోచిరాజు సుబ్బారావు గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 12. గురువుగారి సూచన ప్రకారం సవరించిన పద్యం
  చివురును తిని కూయ పికము
  శ్రవణానందమ్ము గూర్చె రాసభము సభ,
  న్నవహేళన జేసెను ఘన
  రవమున నో౦డ్రి౦ఛి, వానరమ్ములు పొగడన్

  రిప్లయితొలగించండి
 13. శివ సన్నిధిలో గానము
  శ్రవణానందమ్ముఁగూర్చె, రాసభము సభన్
  చెవులనువ్రయ్యలఁ జేసెను
  శివమెత్తియఱుపులతోడ శీఘ్రముగనటన్

  రిప్లయితొలగించండి
 14. మిత్రులు శ్రీ కంది శంకరయ్యగారికి, సుకవి మిత్ర బృందమునకు నమస్సులతో...

  అవధినిడె నూరు తప్పుల
  కవలం బరిమార్ప వృష్ణి! యా శిశుపాలుం
  డవహేళన సేసె! హరికి
  శ్రవణానందమ్ముఁ గూర్చె రాసభము సభన్!!

  రిప్లయితొలగించండి
 15. అవధాని గళానుకరణ
  స్తనవనీయము! 'నల్లువారి' దస్రపు కూతల్
  కవనము నందున గూర్చగ
  శ్రవణానందమ్ముఁ గూర్చె రాసభము సభన్!
  (పద్మశ్రీ అల్లురామలింగయ్య గారు ఓ పాటలో తనరాగం గాడిద కూతలతో సమాంతరంగా తీస్తూ నవ్వు తెప్పించి నది గుర్తురాగా ఇలా పూరించాను.)

  రిప్లయితొలగించండి
 16. కం: అవలీలగ పద్యమొకటి
  వివరించెదనంచొకండు వెంటపడంగన్
  యవునా యనునంత నరిచె
  శ్రవణానంద కరమ్ముగ రాసభము సభన

  రిప్లయితొలగించండి
 17. కం: అవలీలగ పద్యమొకటి
  వివరించెదనంచొకండు వెంటపడంగన్
  యవునా యనునంత నరిచె
  శ్రవణానంద కరమ్ముగ రాసభము సభన్

  రిప్లయితొలగించండి
 18. కం: అవలీలగ పద్యమొకటి
  వివరించెదనంచొకండు వెంటపడంగన్
  యవునా యనునంత నరిచె
  శ్రవణానంద కరమ్ముగ రాసభము సభన్

  రిప్లయితొలగించండి
 19. నా రెండవ పూరణము:

  నవకవనమంచుఁ బలుకుచుఁ
  గవనము నల్లియు విచిత్ర గానోత్కరయై
  చవి లేక కూసి పసులకు
  శ్రవణానందమ్ముఁ గూర్చె రాసభము సభన్!

  (గార్దభగానామృతమును జంతువులే యాస్వాదించునని చమత్కారము)

  రిప్లయితొలగించండి
 20. కవితాసక్తిగపాటలు
  శ్రవణానందమ్ము గూర్చె|”రాసభము సభన్
  భవితపు సినిమా పాటల
  కవనము,సంగీత మెంచ?”ఖరములు మెచ్చున్|

  రిప్లయితొలగించండి
 21. అవనిఁ వర్షశకునమై
  శ్రవణానందమ్ముఁ గూర్చె రాసభము, సభన్
  భువిఁ భేకములన్నియు నట
  వివిధ స్వరముల బొగడుచు వేడ్కగ సలుపున్

  వర్షాగమన శకునంగా గాడిద ఓండ్రింపును భావిస్తారు.
  కప్పలకు వర్ష సూచన ఆనందాన్ని కలిగిస్తుంది. నేలపైని కప్పలన్నీ
  సభ జరిపి ఆ రాసభ గానాన్ని పొగిడాయని, నా భావము

  రిప్లయితొలగించండి
 22. అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  *****
  నాగరాజు రవీందర్ గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  *****
  గుండు మధుసూదన్ గారూ,
  మీ రెండు పూరణలు వైవిధ్యంగా ఉండి అలరించాయి. అభినందనలు.
  *****
  గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  *****
  డా. బల్లూరి ఉమాదేవి గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  ‘పడంగన్+అవునా’ అన్నచోట యడాగమం రాదు. ‘పడంగ| న్నవునా’ అనండి (తప్పని పరిస్థితిలో).
  *****
  నాగరాజు రవీందర్ గారూ,
  మీ రెండవ పూరణ బాగున్నది. అభినందనలు.
  *****
  కె. ఈశ్వరప్ప గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 23. అశ్వత్థ నారాయణ మూర్తి గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 24. శ్రీ భాగవతుల కృష్ణారావు గారి పూరణ

  కవియును గాయకు డొక్కడు
  నవరాగము లాలపింతు ననియనె శునిగా
  పనిగొని శునులే బిల్వగ
  శ్రవణానందమ్ముఁ గూర్చె రాసభము సభన్.

  రిప్లయితొలగించండి
 25. భాగవతుల కృష్ణారావు గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 26. అవె జంతులు సభ దీరగ
  భవమున నుష్ట్రము నటనను,పరుగున తాబే
  లవ,మొదటివిగను,నట
  శ్రవణానందమ్ము గూర్చె రాసభము సభన్

  భవమగు నాదము మనకును
  శ్రవణానందము నిడుగద సంగీతమునై
  చెవికా గాడిద కూతయె
  శ్రవణానందమ్ము గూర్చె-"రాసభము సభన్"

  నవసంగీతము వినినను
  శ్రవణానందమ్ము గూర్చె,"రాసభము సభన్"
  చెవిపగిలెడు కూతలతో
  నవమది యైనను సొగసగు నాదము కలుగున్

  చెవి యెట్టిధ్వని నేలిన
  క,వడిగ,నిశ్శబ్దమునను కనగా ధ్వనియే
  కవయును నానందమదియ
  శ్రవణానందమ్ము గూర్చె రాసభము సభన్

  రిప్లయితొలగించండి
 27. మల్లెల సోమనాథ శాస్త్రి గారూ,
  మీ పూరణలు బాగున్నవి. అభినందనలు.
  చివరిపద్యమే అర్థం కాలేదు. వివరించవలసిందిగా మనవి.

  రిప్లయితొలగించండి
 28. చివరి పద్యము లో టైపాటు వచ్చింది సవరణ చేస్తాను

  చెవియెట్టి ధ్వనినే విన
  క,వడిగ నిశ్శబ్దమునను కనగా,ధ్వనియే
  గవయును నానందమదియ
  శ్రవణానందమ్ము గూర్చె రాసభము సభన్

  రిప్లయితొలగించండి
 29. రవమే వినిపించని నీ
  రవమున నెటువంటి రవము రవళించిన నా
  రవమగు చెవులకు నింపుగ
  శ్రవణానందమ్ము గూర్చె రాసభముసభన్

  భవు భౌ మను శునకమ్ముల
  రవముల నేదాటివచ్చు రమ్య రవమ్ముల్,
  కవనపు యరుపుల కంటెను
  శ్రవణానందమ్ము గూర్చె రాసభము సభన్

  రిప్లయితొలగించండి
 30. వెంటన్ పడగా/నవునా
  అంటే సరిపోతుందా గురువు గారూ

  రిప్లయితొలగించండి
 31. మల్లల సోమనాథ శాస్త్రి గారూ,
  ‘ఎట్టి ధ్వని’ అన్నప్పుడు ‘ట్టి’ గురువు కాదు కదా! అక్కడ గణదోషం. ‘చెవి యేధ్వనినైనను విన...’ అందామా?
  *****
  రెండుచింతల రామకృష్ణ మూర్తి గారూ,
  మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
  ‘కవనపు టరుపుల’ అనండి.
  *****
  డా. బల్లూరి ఉమాదేవి గారూ,
  చక్కగా సరిపోతుంది.

  రిప్లయితొలగించండి
 32. అవిరళమౌ సూక్తులతో
  కవి సమ్మేళనమున నహ! కాంగ్రెసు ప్రభువున్
  చవిగొని స్తుతిజేయు వడిని
  శ్రవణానందమ్ముఁ గూర్చె రాసభము సభన్

  రిప్లయితొలగించండి


 33. అవకతవకల పరుగెడుచు
  జవరాలి పదముల పద్య జావళి చదువన్
  కవకవ నవ్వుల తోడై
  శ్రవణానందమ్ముఁ గూర్చె రాసభము సభన్.

  జిలేబి

  రిప్లయితొలగించండి
 34. చవిగొని చెరువుకు నొడ్డున
  నవయుగమును మెచ్చి పొగడ నగరపు వాసుల్
  కవివరుల బోరు వినగను
  శ్రవణానందమ్ముఁ గూర్చె రాసభము సభన్

  రిప్లయితొలగించండి