చంద్రమౌళి సూర్యనారాయణ గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు. ఏదో మొక్కుబడిగా అయిందనిపించలేదు. సలక్షణంగా, సమర్థంగా ఉంది మీ పూరణ. సంతోషం! ***** రాజేశ్వరి అక్కయ్యా, మీ ప్రయత్నం ప్రశంసనీయం. రావణునకు (యక్ష్మము) క్షయరోగమా? చివర ‘లంకకు రాజై’ అన్నదానికి అన్వయం?
పోచిరాజు సుబ్బారావు గారూ, లక్ష్మకం లేనివిధంగా చక్కని పూరణ నందించారు. అభినందనలు. ***** మిస్సన్న గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు. ***** గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు. ‘సీత+అని’ అన్నప్పుడు యడాగమం వస్తుంది. అక్కడ ‘లక్ష్మియె సీతగ దెలిసిన’ అనండి.
మల్లెల సోమనాథ శాస్త్రి గారూ, మీ నాలుగు పూరణలు బాగున్నవి. అభినందనలు. ***** బొడ్డు శంకరయ్య గారూ, ధన్యవాదాలు. ***** అశ్వత్థ నారాయణ మూర్తి గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు. (నిన్న నేను పదిగంటలకే పడుకున్నాను. మీరు పదకొండు గంటలకు నా మెయిల్‍కు మీ పూరణను పంపారు. ఇప్పుడు లేచి చూచి దానిని బ్లాగులో ప్రకటిద్దామనుకుంటే ఉదయం ఐదు గంటలకే మీరు పోస్ట్ చేసినట్లు కనిపించింది.)
ఆ క్ష్మాసుత పతి గూడగ
రిప్లయితొలగించండిలక్ష్మణుడానందమందె - లంకకురాజై
సూక్ష్మత తోడ విభీషణు
డా క్ష్మా వలయమ్మునేల నాసన్నుడయెన్
హమ్మయ్య! అయింది అనిపించా!
తమ్ముడూ ! ఇంచక్కాఉంది మీ పద్యం .ఇంక నేనేం చెయ్యాలో ?
రిప్లయితొలగించండియక్ష్మము గలిగిన రావణు
రిప్లయితొలగించండిడాక్ష్మా సుతను గొనిపోయె డంభము తోడన్
సూక్షమముగ జంపె రాముడు
లక్ష్మణుఁ డానంద మందె లంకకు రాజై
చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
రిప్లయితొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
ఏదో మొక్కుబడిగా అయిందనిపించలేదు. సలక్షణంగా, సమర్థంగా ఉంది మీ పూరణ. సంతోషం!
*****
రాజేశ్వరి అక్కయ్యా,
మీ ప్రయత్నం ప్రశంసనీయం. రావణునకు (యక్ష్మము) క్షయరోగమా? చివర ‘లంకకు రాజై’ అన్నదానికి అన్వయం?
ఆక్ష్మాసుత జాడదెలియ
రిప్లయితొలగించండిలక్ష్మణుడానందమొందె, లంకకు రాజై
లక్ష్మకము లేక సుఖముగ
సూక్ష్మము గవిభీషణుండు క్షోణిని యేలెన్ !!!
క్షమించాలి " యక్ష్మము "
రిప్లయితొలగించండిముందు " కిట్టించడానికి,రెండు , అదొక జాడ్యము [ [సీత పట్ల అని] " ఇంక మిగిలిన అన్వయం ......????? ఇం....తే........ సంగతులు
మిత్రులు శ్రీ కంది శంకరయ్యగారికి, సుకవి మిత్ర బృందమునకు నమోవాకములతో...
రిప్లయితొలగించండిపనియొత్తిడిచే రెండు దినములుగా నేను మన శంకరాభరణమునకు దూరము గావలసివచ్చినందులకు క్షంతవ్యుఁడను!
నా పూరణము:
(రావణ సంహారము పిదప విభీషణుఁడు శ్రీరామునితో భాషించిన సందర్భము)
ఈ క్ష్మాజ నిన్నుఁ జేరఁగ
లక్ష్మణుఁ డానందమందె! లంకకు రాజై
యీ క్ష్మాతల మేలుమయా!
సూక్ష్మమిది! యయోధ్యయేల? శూరోత్కృష్టా!!
ఆక్ష్మాసుతకై రావణు
రిప్లయితొలగించండినాక్ష్మాపతి దాశరథియె హతమొనరించన్
సూక్ష్మత మెచ్చ విభీషణు
లక్ష్మణుఁ డానంద మందె లంకకు రాజై.
శైలజ గారూ,
రిప్లయితొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
‘క్షోణిని నేలెన్’ అనండి.
*****
గుండు మధుసూదన్ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
*****
గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందలు.
కాని ‘లంకకు రాజై’ అన్నదానికి అన్వయమె సందిగ్ధం!
రిప్లయితొలగించండిలక్ష్మిగ సీతను గాంచిన
లక్ష్మణు డానంద మందె,లంకకు రాజై
ఈ క్ష్మాతలమున రాముని
లక్ష్మణుని విభీషణుండు రాజిల జేసెన్
కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
రిప్లయితొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
ఆ క్ష్మా సుతపతి జూడగ
రిప్లయితొలగించండిలక్ష్మణు డా నంద మందె ,లంకకు రాజై
లక్ష్మకము లేక ధరణిని
సూక్ష్మత నవిభీ ష ణుం డు సుమతిని నేలెన్
లక్ష్మణ జలముల తెమ్మిపు
రిప్లయితొలగించండిడే క్ష్మానాథునిగ జేతు నీ యసురు ననం
గా క్ష్మాజ వరుడు, నీరిడ
లక్ష్మణు, డానంద మందె లంకకు రాజై.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిలక్ష్మియె సీతని దెలిసిన
రిప్లయితొలగించండిలక్ష్మణుఁ డానందమందె, లంకకు రాజై
సూక్ష్మము దెలిసియు రావణు
డా క్ష్మాజాతఁ గొనిపోయె నతిమోహమునన్!
పోచిరాజు సుబ్బారావు గారూ,
రిప్లయితొలగించండిలక్ష్మకం లేనివిధంగా చక్కని పూరణ నందించారు. అభినందనలు.
*****
మిస్సన్న గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
*****
గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
‘సీత+అని’ అన్నప్పుడు యడాగమం వస్తుంది. అక్కడ ‘లక్ష్మియె సీతగ దెలిసిన’ అనండి.
లక్ష్మీ వారము నందున
రిప్లయితొలగించండిలక్ష్మణ రేఖలను దాటి రావణు డోడన్|
లక్ష్మీపతి తమ్ముని కల
లక్ష్మణు డానంద మొందె-లంకకు రాజై|
లక్ష్మీపతి=రాముడు
కె. ఈశ్వరప్ప గారూ,
రిప్లయితొలగించండివైవిధ్యంగా పూరించే ప్రయత్నం చేశారు. అభినందనలు.
కాని అన్వయం సందిగ్ధంగా ఉంది. భావం వివరిస్తారా?
ఆ క్ష్మాజను దొంగిలు లం
రిప్లయితొలగించండికాక్ష్మావిభు రాముచేత కడదేర్చఁగఁ దా
సూక్ష్మముఁ దెలిపి విభీషణ
లక్ష్మణుఁ డానంద మందె లంకకు రాజై.
(లక్ష్మణము = పేరు; లక్ష్మణుఁడు = పేరు గలవాడు)
ఆక్ష్మాసుత చరవిడగా
రిప్లయితొలగించండిలక్ష్మణు డానందమందె, లంకకురాజై
సూక్ష్మపు దృష్టినశించగ
నాక్ష్మాపతి లంకరేడె యనిలో సమసెన్
అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
రిప్లయితొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
చెర -> చర... టైపాటు.
ఆ క్ష్మాపతి సీతను గొన
రిప్లయితొలగించండిలక్ష్మణు డానంద మందె, లంకకు రాజై
సూక్ష్మమగు ధర్మ మెరిగియు
నా క్ష్మా రావణుని పిదిప యనుజుండేలెన్!
నిన్నటి దత్తపదికి పద్యం...
రిప్లయితొలగించండిసైరంధ్రి కీచకునితో...
దరికి రాకోయి లయదప్పి తాకకోయి
యబల నేకాకి ననుకొని హద్దు మీర
కోడి పోదువు నా పతి యొడలు విరువ
తగునె మలిన పరచ నన్ను తప్పు కాదె!
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిగురుదేవులకు ధన్యవాదములు. సవరించిన పద్యం :
రిప్లయితొలగించండిలక్ష్మియె సీతగ దెలిసిన
లక్ష్మణుఁ డానందమందె, లంకకు రాజై
సూక్ష్మము దెలిసియు రావణు
డా క్ష్మాజాతఁ గొనిపోయె నతిమోహమునన్!
బొడ్డు శంకరయ్య గారూ,
రిప్లయితొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
‘క్ష్మా’ శబ్దానికి తెలుగులో వ్యస్తప్రయోగం లేదు.
శ్రీ భాగవతుల కృష్ణారావు గారి పూరణ
రిప్లయితొలగించండిఈక్ష్మా రాముండేలగ
లక్ష్మణుఁ డానంద మందె;లంకకు రాజై
సూక్ష్మ గ్రాహి విభీషణు
డాక్ష్మా నేలంగ నసురులా నందించన్
భాగవతుల కృష్ణారావు గారూ,
రిప్లయితొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
‘క్ష్మా’ శబ్దాన్ని రెండుసార్లు ప్రయోగించారు. కాని దానికి వ్యస్తప్రయోగం లేదు.
ఈ క్ష్మాప్రాసే బేషౌ
రిప్లయితొలగించండిలక్ష్మణ శశిశేఖరులకు లంకపొలంబుల్
ఓక్ష్మాపతి దానమిడన్
లక్ష్మణుడానంద మొందె లంకకు రాజై.
దువ్వూరి రామమూర్తి గారూ,
రిప్లయితొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
కంది శంకరయ్యగారూ! మీ పూరణ మద్భుతముగ నున్నది. అభినందనలు!
రిప్లయితొలగించండినా రెండవ పూరణము:
పక్ష్మలకాకయె సీతయు
నా క్ష్మావరుఁ గన, విభీషణాఖ్య సుగుణుఁడౌ
సూక్ష్మదృ గధిగత వినమిత
లక్ష్మణుఁ డానందమందె, లంకకు రాజై!
గుండు మధుసూదన్ గారూ,
రిప్లయితొలగించండిమీ పూరణ మనోజ్ఞంగా ఉంది. అభినందనలు.
శ్రీకందిశంకరయ్య గురువుగారికి వందనములచేనాభావన
రిప్లయితొలగించండిలక్ష్మీవారమున సీతలక్ష్మణ రేఖదాటుటచే రావణుడుఓటమి
పొందుటచేలక్ష్మణుడుకలయందులంకకు రాజైనట్లు భావన.
తా క్ష్మాపుత్రియె కాంతిని,
రిప్లయితొలగించండిలక్ష్మణుడానందమందె;లంకకు రాజై
పక్ష్మముల భక్తిగొలిచెను
లక్ష్మణునగ్రజునకంత రావణు వధకున్
పక్ష్మముల సీతకాంతిని,
లక్ష్మణుడానందమందె;లంకకు రాజై
సూక్ష్మపు నయము విభీషణు
డాక్ష్మానేలెను చిరముగ నంచిత రీతిన్
లక్ష్మణుడునేమి యందెను-(1)
సూక్ష్మముగ విభీషణును చూడగ నేమౌ?(2)
యా క్ష్మా రాజటు మడియగ
లక్ష్మణుడానందమందె-లంకకు రాజై
(క్రమాన్వయం)
సూక్ష్మపు ధర్మము నెరిగిన
లక్ష్మణుడానందమందె;లంకకు రాజై
యాక్ష్మాపతి రావణుడటు
సూక్ష్మముగా విష్ణుపదము చొరగనె నపుడున్
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిగురువు గారి పూరణ అద్భుతంగా ఉంది.
రిప్లయితొలగించండిపక్ష్మము లనార్పక గనుచు
రిప్లయితొలగించండిలక్ష్మణుడానందమందె, లంకకు రాజై
లక్ష్మాప్తతన్ విభీషణు
డు క్ష్మాసుతాహృయస్థుడు బొగడ నడరెన్
లక్ష్మ+ ఆప్తత :ముఖ్యమైన మైత్రి
మల్లెల సోమనాథ శాస్త్రి గారూ,
రిప్లయితొలగించండిమీ నాలుగు పూరణలు బాగున్నవి. అభినందనలు.
*****
బొడ్డు శంకరయ్య గారూ,
ధన్యవాదాలు.
*****
అశ్వత్థ నారాయణ మూర్తి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
(నిన్న నేను పదిగంటలకే పడుకున్నాను. మీరు పదకొండు గంటలకు నా మెయిల్‍కు మీ పూరణను పంపారు. ఇప్పుడు లేచి చూచి దానిని బ్లాగులో ప్రకటిద్దామనుకుంటే ఉదయం ఐదు గంటలకే మీరు పోస్ట్ చేసినట్లు కనిపించింది.)