10, జూన్ 2015, బుధవారం

పద్య రచన - 928

కవిమిత్రులారా,

పై చిత్రాన్ని పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.

19 కామెంట్‌లు:

  1. అమ్మను నమ్మిన వారికి
    కమ్మని మమతలను పంచు కరుగుచు ప్రేమన్
    సొమ్ములు కోరదు , ప్రియముగ
    అమ్మాయని బిలిచి నంత యాదర మొప్పన్

    రిప్లయితొలగించండి
  2. పెంచెడి ప్రేమకు భేదము
    నెంచుట కాదెవరి తరము నెవ్విధి నైన
    న్నించుక జంతువు పొందిన
    పంచును తనమమత నంత భక్తిగ తానై

    రిప్లయితొలగించండి
  3. రాజేశ్వరి అక్కయ్యా,
    మీ పద్యాలు బాగున్నవి. అభినందనలు.

    రిప్లయితొలగించండి

  4. అమ్మను మించిన దైవము
    ఇమ్మహిలో గానరాదు నెందున వెతకన్
    అమ్మయె తొలి గురువాయెను
    అమ్మకు జేజేలు గొట్ట హాయిని నిచ్చున్ .

    రిప్లయితొలగించండి
  5. పోచిరాజు సుబ్బారావు గారూ,
    మీ పద్యం బాగుంది. అభినందనలు.
    కొన్ని సవరణలతో మీ పద్యం....
    అమ్మను మించిన దైవ
    మ్మిమ్మహిలో గానరాదు నెందు వెదకిన
    న్నమ్మయె మన తొలి గురువయె
    నమ్మకు జేజేలు గొట్ట హాయిని గూర్చున్.

    రిప్లయితొలగించండి
  6. మొదటి చిత్రము జూడగ మోద మయ్యె
    కన్న ప్రేమను దెలిపెను మిన్న గాను
    దిగువ చిత్రము జూడగ తెలివి కలిగి
    పెంచు ప్రేమకు వందనం బిత్తు సామి !

    రిప్లయితొలగించండి
  7. పోచిరాజు సుబ్బారావు గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  8. అమ్మను మించిన దైవము
    ఇమ్మహిలో నెందు గనిన నెచ్చట లేదే
    కమ్మగ బిడ్డలు తల్లిని
    అమ్మా యని పిలువగనె హాయిని బొందున్

    రిప్లయితొలగించండి
  9. డా. బల్లూరి ఉమాదేవి గారూ,
    మీ పద్యం బాగుంది. అభినందనలు.
    ‘దైవ మ్మిమ్మహిలో, తల్లిని నమ్మా యని’ అనండి. పద్యంలో అచ్చులు రాకుండా చూడండి.

    రిప్లయితొలగించండి
  10. “అమ్మనురాగ బంధమును అందలమందున నుంచి బిడ్డకై
    సొమ్ముకు మట్టి గంపలను శోధన లాగున అమ్మనింపగా”?
    ముమ్మి పదాలకే మురిసి |ముద్దగుకుక్కభుజాల నెక్కినా?
    సమ్మతి సంతుతో నడక సంబర మౌనట|షావుకార్లకున్|.

    రిప్లయితొలగించండి
  11. అమ్మా యనుచు సుతుడు నాప్యాయముగ పిలు
    వ పరవశము నొందు బాధ లెన్ని
    యైన తాభరించు నట్టి తల్లి నెపుడు
    దైవ మనెడి బిడ్డ ధన్యు డిలను

    రిప్లయితొలగించండి
  12. దుమ్మున పని జేయుచు సహ
    నమ్మున సుతు మోయగల్గు నమ్మను గనుమా!
    మమ్మి తన'మున్ని' నెత్తుకు
    బొమ్మగమోయంగఁదాను ముమ్మీ యగునా?
    (మున్ని కుక్కపిల్ల పేరు)

    రిప్లయితొలగించండి
  13. కె. ఈశ్వరప్ప గారూ,
    మీ పద్యం బాగుంది. అభినందనలు.
    ‘అమ్మ+అనురాగ’మన్నపుడు యడాగమం వస్తుంది.
    *****
    డా. బల్లూరి ఉమాదేవి గారూ,
    మీ రెండవపద్యం బాగున్నది. అభినందనలు.
    ‘అమ్మ’ టైపాటువల్ల ‘అమ్మా’ అయింది.

    రిప్లయితొలగించండి
  14. గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  15. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
  16. కన్నబిడ్డను మోయుచు కరము తృప్తి
    పాటుపడుచుండె నోయమ్మ కూటి కొరకు
    కుక్కపిల్లను మోయుచురెక్కపైన
    కన్నబిడ్డను నడిపించు కనుడు మమ్మి

    రిప్లయితొలగించండి
  17. కె. ఈశ్వరప్ప గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.
    ‘భావన+అదియె’ అన్నప్పుడు సంధి లేదు. ‘భావన యదె’ అనండి.
    ******
    అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
    మీ పద్యం బాగుంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  18. అవని|అమ్మను బెంచ?ఆస్పుర్తితోఅమ్మ
    -----------బిడ్డను భుజముఫై విడిది గూర్చె|
    నేలనునమ్మిన జాలియు గదిలించ?
    ---------ఊహలయుసుకను ఊడ్చుటాయె|
    కార్లను నమ్మియు కలిమి బలిమి యున్న?
    ----------సంతు కాలి నడక సాగుటాయె|
    కుక్క భుజముఫైన కూర్చుండి కులుకగ?
    -----------ముమ్మి పదాలతో మురియకమ్మ
    అమ్మ స్పర్సయె-ననురాగమమ్మ జూడ?
    మమత మాధుర్యమే గూర్చి సమత బేర్చు|
    షావుకార్లకుజేరని భావన నది|
    కష్ట జీవుల యిష్టమే పుష్టి భువికి|

    రిప్లయితొలగించండి
  19. “ప్రేమలు మార్చుచుసతతము
    కాముకులు పవిత్రు లనుటకల్ల”యెటులగున్?
    క్షేమంబొసగక,నీతిని
    యేమాత్రము లెక్క లేక యిమడకఫలమా?

    రిప్లయితొలగించండి