కె. ఈశ్వరప్ప గారూ, మీ పద్యం బాగున్నది. అభినందనలు. ‘ఆదరణంబునకు’ అనడం సాధువు. అక్కడ ‘ఆదరణంబున మూలహేతువై’ అనండి. ‘పరిణయ’ అని ప్రత్యయం లేకుండా ప్రయోగించారు. ‘పరిణయవేళ పండుగల భావన...’ అనండి.
అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ, మీ పద్యం బాగున్నది. అభినందనలు. ‘బాగుగ నరిసెలన్’ అన్నప్పుడు గణదోషం. ‘బాగుగ నరిసెల్’ అనండి. ***** గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ, మీ పద్యం బాగున్నది. అభినందనలు. ‘పెనము’ను ‘పెన్నము’ అన్నారు. ‘చెన్నుగ పెనమున పాకము’ అంటే ఎలా ఉంటుంది? ***** కె. ఈశ్వరప్ప గారూ, సవరించిన పద్యమూ, తాజా పద్యమూ బాగున్నవి. అభినందనలు.
నమస్కారములు పెళ్ళిలో ఆడపిల్ల తల్లిగారు ప్రత్యేకం " "వియ్యపురాలి తగువు " కోసం అని పెద్ద పెద్ద లడ్డూలు , అరిసెలు మినప సున్ని 108 చేయించి చీర సారెలతొ ఇస్తారు అదన్నమాట మన ఆమంద్రా వైపు
లక్ష్మీదేవి గారూ, మీ పద్యం బాగున్నది. అభినందనలు. ‘దార్ఢ్యసిరులు’ అని దుష్టసమాసం చేశారు. ***** కె. ఈశ్వరప్ప గారూ, మీ తాజా పద్యం బాగుంది. అభినందనలు. ‘పంచే’ అని వ్యావహారికాన్ని ప్రయోగించారు. ***** అక్కయ్యా, ఆడపెళ్ళివారు రకరకాల పిండివంటలు 108 చొప్పున ఇచ్చే ఆచారం ఇటు తెలంగాణాలోనూ ఉంది. అయితే వాటికి ‘వియ్యపురాలి తగువు’ అన్న పేరున్నట్టు నాకు తెలియదు.
అతిరసములఁ జూడఁ గలిగె నంతయింతయగునెవో మతులు పోవునుల్లసములు; మనుజ ప్రకృతిఁ గనుడుమీ! బ్రతుకు నందు మధురరుచుల ప్రాప్తి లేకనుంటయున్ చితికి పోవు దేహమనెడు స్థితికి యొక్క ఋజువగున్.
1995 నాటి మాట ! ఒకాయన అధిక బరువు సమస్య గురించి డాక్టర్ ను కలిశాడు. ఆ డాక్టర్ భోజనం విషయం లో కొన్ని విధి నిషేదాలు చెప్పాడు. అప్పటినుండి ఈయన లంచ్ కు ఇంటికి వెళ్ళడు, ఇంటినుండి ఏమీ తెప్పించుకోడు. లంచ్ టైం లో మా కళాశాల ముందు ఉండే ఓ టీ స్టాల్ కెళ్ళి,అక్కడ చేసే టిఫినేదో తిటూండే వాడు.ఓసారి నేను వెళ్ళే సరికి బోండాలు తింటున్నాడు. "ఏమిటి సంగతి"? అనడిగితే విషయం చెప్పాడు.వేంటనే నాలో రూపుదిద్దుకున్న ఓ పద్యం చెప్పాను. అదాయన కెంతగా నచ్చిందంటే సంబర పడిపోయి నాకు రెండు బోండాలు పారితోషికంగా ఇచ్చాడు.ఇరవై సంవత్సరాల తర్వాత ఇప్పటికీ ఆయనకా పద్యం నోటికి వచ్చు. ఇప్పుడు కూడా ఆయన్నడిగే ఇది పోస్ట్ చేస్తున్నాను. ఇంతకీ ఆ పద్యం ఏమిటంటారా ? ఇదిగో ! కం. కొండొక వైద్యుడు తనతో 'మెండగు భోజనము మాను ' మేలగుననగా తిండిని తగ్గింప దలిచి బోండాలరవై నమిలెను బొరుగుల వలెనే ! (చివర hyperbole)
పరిణయ మందున శుభమని
రిప్లయితొలగించండివిరివిగ యరిసెలను వండి వెటకార ముగన్
వరుసగు వియ్యపు రాలికి
సరసమ్ముగ నిత్తు రంట సారూప్యము గన్
ఆ.వె:వనిత లెల్ల చేరి వండిరి యరిసెలు
రిప్లయితొలగించండివంట యింటలోన బాగుగాను
వహ్వ యంచు పెళ్ళి వారెల్ల మెచ్చంగ
మురిసి పోయి రపుడు ముదిత లచట.
తే.గీ:పెళ్ళి సమయాన వంటింట పడతులెల్ల
చేరి చక్కగాతీయని యరిసెలను గ
సాలు పైనవేయుచు వండ సంబరమున
యారగించిరి యెల్లరు యమృతమనుచు
రాజేశ్వరి అక్కయ్యా,
రిప్లయితొలగించండిమీ పద్యం బాగున్నది. అభినందనలు.
వియ్యపురాళ్ళకు అరిసెలు పెట్టే వేడుక నాకైతే తెలియదు. క్రొత్తవిషయం చెప్పినందుకు ధన్యవాదాలు.
‘విరివిగ నరిసెలను...’ అనండి.
*****
డా. బల్లూరి ఉమాదేవి గారూ,
మీ పద్యాలు బాగున్నవి. అభినందనలు.
‘ఎల్లరు+అమృతము’ అన్నప్పుడు యడాగమం రాదు. ‘ఎల్లరు నమృత మనుచు’ అనండి.
అరిసెలు సేతురు విరివిగ
రిప్లయితొలగించండినరయంగా బెళ్లి జరిగి నప్పుడు భామ
ల్యిరవుగ నీయగ సారె గ
పొరపుచ్చెము తొలగ కొఱకు పోడిమి తోడన్
పోచిరాజు సుబ్బారావు గారూ,
రిప్లయితొలగించండిమీ పద్యం బాగున్నది. అభినందనలు.
‘భామల్+ఇరవుల=భామ లిరవుల’ అవుతుంది. అక్కడ ‘జరిగినపుడు వనితలే| యిరవుగ...’ అనండి.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండికె. ఈశ్వరప్ప గారూ,
రిప్లయితొలగించండిమీ పద్యం బాగున్నది. అభినందనలు.
‘ఆదరణంబునకు’ అనడం సాధువు. అక్కడ ‘ఆదరణంబున మూలహేతువై’ అనండి. ‘పరిణయ’ అని ప్రత్యయం లేకుండా ప్రయోగించారు. ‘పరిణయవేళ పండుగల భావన...’ అనండి.
బెల్లపు పాకముమరియును
రిప్లయితొలగించండితెల్లని బియ్యపుపొడియును తేరిన ఘ్రుతమం
దుల్లాసముగా పడతులు
పల్లెలలోచేయుచుంద్రు బాగుగ నరిసెలన్
పెన్నమ్మున పాకమునన్
రిప్లయితొలగించండిగిన్నెల్లో ప్రాల పిండి, ఘృతముఁగలుపుచున్
సన్నటి వడలుగ జేయుచుఁ
జెన్నుగ కాల్చగ నరిసెలు! జిహ్వలు నూరున్!
అరిసెలు నారగించుటన?ఆదరణంబునమూల హేతువై|
రిప్లయితొలగించండిపరిణయ,వేళపండుగలభావన భాగ్యముబంచు రీతిగా
విరియు గులాభిలట్లుగ|కవీశ్వరు లెంచెడి కల్పితాలచే
మరువని పాక శాస్త్ర పరిమాణము నందున బుట్టెతియ్యగా|
బియ్యపు పిండికి అండగ
రిప్లయితొలగించండినెయ్యమునన్ పాకముంచి నేర్పరి తనమున్
జెయ్యగ?అరిసలు-తినుటకు
సయ్యను సంతోషబరచు?సంబర మందున్
అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
రిప్లయితొలగించండిమీ పద్యం బాగున్నది. అభినందనలు.
‘బాగుగ నరిసెలన్’ అన్నప్పుడు గణదోషం. ‘బాగుగ నరిసెల్’ అనండి.
*****
గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు.
‘పెనము’ను ‘పెన్నము’ అన్నారు. ‘చెన్నుగ పెనమున పాకము’ అంటే ఎలా ఉంటుంది?
*****
కె. ఈశ్వరప్ప గారూ,
సవరించిన పద్యమూ, తాజా పద్యమూ బాగున్నవి. అభినందనలు.
అతిరసములఁ జూడఁ గలిగె నంతయింతయగునెవో
రిప్లయితొలగించండిమతులు పోవునుల్లసములు; మనుజ ప్రకృతిఁ గనుడుమీ!
బ్రతుకు నందు మధురరుచుల ప్రాప్తి లేకనుంటయున్
చితికి పోవు దేహ దార్ఢ్యసిరుల కొక్క ఋజువగున్.
అందము తగ్గిన అరిసలు
రిప్లయితొలగించండివిందున విడ్డూర మొసగు|ప్రీతిని బంచే
బంధము,ఆనందానికి
గంధములాఆంద్రవరుల ఘనతను బెంచున్|
నమస్కారములు
రిప్లయితొలగించండిపెళ్ళిలో ఆడపిల్ల తల్లిగారు ప్రత్యేకం " "వియ్యపురాలి తగువు " కోసం అని పెద్ద పెద్ద లడ్డూలు , అరిసెలు మినప సున్ని 108 చేయించి చీర సారెలతొ ఇస్తారు అదన్నమాట మన ఆమంద్రా వైపు
లక్ష్మీదేవి గారూ,
రిప్లయితొలగించండిమీ పద్యం బాగున్నది. అభినందనలు.
‘దార్ఢ్యసిరులు’ అని దుష్టసమాసం చేశారు.
*****
కె. ఈశ్వరప్ప గారూ,
మీ తాజా పద్యం బాగుంది. అభినందనలు.
‘పంచే’ అని వ్యావహారికాన్ని ప్రయోగించారు.
*****
అక్కయ్యా,
ఆడపెళ్ళివారు రకరకాల పిండివంటలు 108 చొప్పున ఇచ్చే ఆచారం ఇటు తెలంగాణాలోనూ ఉంది. అయితే వాటికి ‘వియ్యపురాలి తగువు’ అన్న పేరున్నట్టు నాకు తెలియదు.
గురువుగారు,
రిప్లయితొలగించండిసవరించిన పద్యం.
అతిరసములఁ జూడఁ గలిగె నంతయింతయగునెవో
మతులు పోవునుల్లసములు; మనుజ ప్రకృతిఁ గనుడుమీ!
బ్రతుకు నందు మధురరుచుల ప్రాప్తి లేకనుంటయున్
చితికి పోవు దేహమనెడు స్థితికి యొక్క ఋజువగున్.
గురుదేవలకు ధన్యవాదములు.
రిప్లయితొలగించండి'చెన్నుగ' అనే పదం చివరి పాదంలో వాడానండి.
సవరించిన పద్యాన్ని దయతో పరిశీలించ ప్రార్థన.
తిన్నఁగ పాకము నందున్
గిన్నెల్లో ప్రాల పిండి, ఘృతముఁగలుపుచున్
సన్నటి వడలుగ జేయుచుఁ
జెన్నుగ కాల్చగ నరిసెలు! జిహ్వలు నూరున్!
1995 నాటి మాట ! ఒకాయన అధిక బరువు సమస్య గురించి డాక్టర్ ను కలిశాడు. ఆ డాక్టర్ భోజనం విషయం లో కొన్ని విధి నిషేదాలు చెప్పాడు. అప్పటినుండి ఈయన లంచ్ కు ఇంటికి వెళ్ళడు, ఇంటినుండి ఏమీ తెప్పించుకోడు. లంచ్ టైం లో మా కళాశాల ముందు ఉండే ఓ టీ స్టాల్ కెళ్ళి,అక్కడ చేసే టిఫినేదో తిటూండే వాడు.ఓసారి నేను వెళ్ళే సరికి బోండాలు తింటున్నాడు. "ఏమిటి సంగతి"? అనడిగితే విషయం చెప్పాడు.వేంటనే నాలో రూపుదిద్దుకున్న ఓ పద్యం చెప్పాను. అదాయన కెంతగా నచ్చిందంటే సంబర పడిపోయి నాకు రెండు బోండాలు పారితోషికంగా ఇచ్చాడు.ఇరవై సంవత్సరాల తర్వాత ఇప్పటికీ ఆయనకా పద్యం నోటికి వచ్చు. ఇప్పుడు కూడా ఆయన్నడిగే ఇది పోస్ట్ చేస్తున్నాను. ఇంతకీ ఆ పద్యం ఏమిటంటారా ? ఇదిగో !
రిప్లయితొలగించండికం. కొండొక వైద్యుడు తనతో
'మెండగు భోజనము మాను ' మేలగుననగా
తిండిని తగ్గింప దలిచి
బోండాలరవై నమిలెను బొరుగుల వలెనే !
(చివర hyperbole)
--Gurram.
Janardhana Rao