24, జూన్ 2015, బుధవారం

సమస్యా పూరణము - 1712 (కన్నబిడ్డ కంటఁ గార మిడెను)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది....
కన్నబిడ్డ కంటఁ గార మిడెను.

45 కామెంట్‌లు:

  1. మురిసి పోయె తాను ముద్దు బిడ్ఢను జూచి
    లేకలేక పుట్టెనా కొమరుడు
    కారకుండ పెంచె కన్నీరునెప్పుడు
    కన్నబిడ్డ కంటఁ - గార మిడెను

    రిప్లయితొలగించండి
  2. తల్లి యనగ నెపుడు తన్మయమున బెంచు
    కంటి రెప్ప వలెను కాపు గాసి
    ప్రాణ మైన నిచ్చి పసివాని దీవించు
    కన్న బిడ్డ కంటఁ గార మిడెను

    రిప్లయితొలగించండి
  3. చోరుడొకడు వచ్చి చేరదీయగఁ బోవ
    కేకఁ బెట్టి బాబు గింజు కొనగ
    తల్లి వేచి చూచి, తప్పించుకొని రాగ
    కన్నబిడ్డ, కంటఁ గారమిడెను!

    రిప్లయితొలగించండి
  4. చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    ‘కంటఁ గార మిడెను’ అన్నచోట మీ భావం?
    *****
    రాజేశ్వరి అక్కయ్యా,
    మీ పూరణ బాగుంది. అభినందనలు.
    మీరుకూడ ‘కంటఁ గారమిడెను’ అన్నదానిని ఏ అర్థంలో ప్రయోగించారు?
    *****
    గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
    విరుపుతో మీ పూరణ బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  5. మిత్రులు శ్రీ కంది శంకరయ్యగారికి, సుకవి మిత్ర బృందమునకు నమస్కారములతో...

    దొంగయొకఁడు నింట దోచుకొనంగనుఁ
    జూచుచుండ, లేచి, చూచి, తల్లి
    కేకవేయ, వాఁడుఁ గినిసి, చంపఁగఁ జూడఁ
    గన్నబిడ్డఁ, గంట కారమిడెను!!

    రిప్లయితొలగించండి
  6. గుండు మధుసూదన్ గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    గుండా, గుండు వారల ఇంటిపేర్లలోనే కాదు, పూరణలలోనూ సామ్యం కనబడుతున్నది (సరదాకి!)

    రిప్లయితొలగించండి
  7. మిత్రులు శ్రీ కంది శంకరయ్యగారికి, సుకవి మిత్ర బృందమునకు నమస్కారములతో...

    దొంగయొకఁడు నింట దోచుకొనంగనుఁ
    జూచుచుండ, లేచి, చూచి, తల్లి
    కేకవేయ, వాఁడుఁ గినిసి, చంపఁగఁ జూడఁ,
    గన్నబిడ్డ, కంటఁ గారమిడెను!!

    రిప్లయితొలగించండి

  8. అయిన వారి కంట నాకులలోతిండి
    కానివారికంట కంచములను
    యూరి బిడ్డకు చవులూరు వంటకమిడె
    కన్నబిడ్డ కంట గారమిడెను

    రిప్లయితొలగించండి

  9. అయిన వారి కంట నాకులలోతిండి
    కానివారికంట కంచములను
    యూరి బిడ్డకు చవులూరు వంటకమిడె
    కన్నబిడ్డ కంట గారమిడెను

    రిప్లయితొలగించండి
  10. ఇంటిలోన దూరి వంటింటిలోనున్న
    తల్లి నోరునొక్కి దాడిసేయ
    దొంగ నెదిరి తాను దొరకక నాతల్లి
    కన్నబిడ్డ కంట గారమిడెను

    రిప్లయితొలగించండి
  11. చప్పదనము తగ్గి చవులూరునట్టుల
    గలుపు చుండె గూర గటువు గాను
    దాని బట్టి తినగ యాయమ్మ, యొడిలోని
    కన్నబిడ్డ కంట గారమిడెను

    రిప్లయితొలగించండి
  12. ఆటవెలది తనువు నాలింగనముసేయు
    తనను గాంచెననుచు తండ్రి యొకడు
    కడుపు తీపి ఘనత గాంచలేక తనదు
    కన్నబిడ్డ కంటఁ గార మిడెను

    రిప్లయితొలగించండి
  13. ఆటవెలది తనువు నాలింగనముసేయు
    తనను గాంచెననుచు తండ్రి యొకడు
    కడుపు తీపి ఘనత గాంచలేక తనదు
    కన్నబిడ్డ కంటఁ గార మిడెను

    రిప్లయితొలగించండి
  14. రిప్లయిలు
    1. సహదేవుడు గారూ
      మీరు మిమ్మల్ని ఊహించుకొని అలాంటి వార ఉంటారా అని ఆశ్చర్య పోతున్నారు. ఈ మధ్యనే మా అనంతపురం జిల్లాలో కన్న తల్లీ, ఆమె ప్రియుడు కలసి భర్త, పిల్లను చంపేశారు.
      కుమాతా నభవతి, అని అమ్మ ను అలా చెప్పడం ఇష్టం లేక ఇలా చెప్పాను. ఇంతకన్నా దారుణమైన వ్యసనపరులు మనం పేపర్లలో చదువుతున్నాము కదా!
      కవిత్వానికి అతిశయము కూడా ఒక అలంకారమే కదా

      తొలగించండి
    2. సహదేవుడు గారూ
      మీరు మిమ్మల్ని ఊహించుకొని అలాంటి వార ఉంటారా అని ఆశ్చర్య పోతున్నారు. ఈ మధ్యనే మా అనంతపురం జిల్లాలో కన్న తల్లీ, ఆమె ప్రియుడు కలసి భర్త, పిల్లను చంపేశారు.
      కుమాతా నభవతి, అని అమ్మ ను అలా చెప్పడం ఇష్టం లేక ఇలా చెప్పాను. ఇంతకన్నా దారుణమైన వ్యసనపరులు మనం పేపర్లలో చదువుతున్నాము కదా!
      కవిత్వానికి అతిశయము కూడా ఒక అలంకారమే కదా

      తొలగించండి
  15. భార్య కాలమొంద బాధల కోర్వక
    మంచి చెడును గనక మరల పెండ్లి
    యాడె సవితి కరుణ వీడి మొదటి భార్య
    కన్న బిడ్డ కంటఁ గార మిడెను.

    రిప్లయితొలగించండి
  16. కన్న బిడ్డ కంట గా రమిడెను నొక
    తల్లి దయయ నునది దరిని లేక
    పేగు బంధ మునకు ప్రేమయిం చుకయును
    లేదు గదమ ఱి ధర లీల ! కంటె !

    రిప్లయితొలగించండి

  17. పప్పు ధప్పళములు పాయసాన్నములును
    కన్నబిడ్డ కంట గార మిడెను
    సవతి బిడ్డ తినగ,చాకిరీ చేయించి
    పట్టె దన్న మైన పెట్ట దంట

    రిప్లయితొలగించండి
  18. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి

  19. పప్పు ధప్పళములు పాయసాన్నములును
    కన్నబిడ్డ కంట గార మిడెను
    సవతి బిడ్డ తినగ,చాకిరీ చేయించి
    పట్టె డన్న మైన పెట్ట దంట

    రిప్లయితొలగించండి
  20. త్రాగుబోతు కొడుకు ధనమును కోరుచు
    తండ్రి పైన కనలి దాడి చేయ
    కాంచి, పతిని కావ నెంచి, రయమ్మునఁ
    కన్నబిడ్డ కంటఁ గారమిడెను

    రిప్లయితొలగించండి
  21. కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
    మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
    ‘అయినవారి కంట యాకులలో’ అనండి. ‘కంచములను + ఊరి’ అన్నప్పుడు యడాగమం రాదు. సంధి నిత్యం. ‘కానివారికేమొ కంచములట’ అందామా?
    *****
    గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *****
    మాజేటి సుమలత గారూ,
    మీ పూరణ బాగుంది. అభినందనలు.
    ‘తినగ నాయమ్మ...’ అనండి.
    *****
    అశ్వత్థ నారాయణ మూర్తి గారూ,
    మీ పూరణ బాగుంది. అభినందనలు.
    *****
    గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
    “రసపట్టులో తర్కం కూడదు” అన్నాడు మాయాబజారు శ్రీకృష్ణుడు. అలాగే సమస్యాపూరణలో యుక్తాయుక్తాలను కాస్త పక్కన పెట్టవలసి ఉంటుంది. అయినా పత్రికల్లో, టీవీల్లో ఎన్ని వార్తలు చూడడం లేదు... తండ్రిని చంపిన కొడుకు... కొడుకును చంపిన తండ్రి... అనీ..
    *****
    నాగరాజు రవీందర్ గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *****
    గండూరి లక్ష్మినారాయణ గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    ‘సవతి’ అనండి.
    *****
    పోచిరాజు సుబ్బారావు గారూ,
    మీ పూరణ బాగుంది. అభినందనలు.
    *****
    అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  22. గురువుగారికి ధన్యవాదములు సవరించిన పద్యము
    అయిన వారి కంట యాకులలోతిండి
    కానివారికేమో కంచములట
    ఊరి బిడ్డకు చవులూరు వంటకమిడె
    కన్నబిడ్డ కంట గారమిడెను

    రిప్లయితొలగించండి
  23. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
  24. శ్రీకే.యస్ గురుమూర్తి గారి పూరణం
    ----------------------
    పాలబుగ్గ గిల్లి థాలము ముద్దిడి
    రాగమెసగు చుండ కౌగీలించి
    చూచుకమును నోట చుక్కించు తల్లికి
    కన్నబిడ్డ కంట గారామిడెను|

    రిప్లయితొలగించండి
  25. మాష్టారూ! కారకుండపెంచె కన్నీరునెప్పుడు కన్నబిడ్డకంట---కన్నబిడ్డ కంట కన్నీరు కారకుండా పెంచె అని...గారము= గారాబము, ప్రేమ ఇడెను.... సరిపొలేదంటారా?

    రిప్లయితొలగించండి
  26. ఆ.వె:కఱకు ఱాతి గుండె గల్లిన యాతల్లి
    మానవత్వ మెల్ల మంట గలిపి
    తాపమోర్వ లేక తప్పటడుగు వేసి
    కన్నబిడ్డ కంటఁగార మిడెను.

    రిప్లయితొలగించండి
  27. గురుదేవులకు మరియు వివరించిన శ్రీమూర్తి గారికి ధన్యవాదములు.

    రిప్లయితొలగించండి
  28. కె. ఈశ్వరప్ప గారూ,
    మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
    ‘పదవియందు’ అనండి.
    *****
    కె.యస్. ఆచారి గురుమూర్తి గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    ‘ఫాలము’ టైపాటువల్ల ‘థాలము’ అయింది.
    *****
    నాగరాజు రవీందర్ గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *****
    చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
    ‘కంటన్+కారము = కంటఁ గారము’. అక్కడ అరసున్నా లేనప్పుడే దానిని ‘గారము’గా స్వీకరించాలి.
    *****
    డా. బల్లూరి ఉమాదేవి గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  29. ఆడ పిల్ల బుట్ట పీడగా దలచుచు
    చంప బోవు సుతుని చాచి గొట్టి
    దయను వీడు వాని దండింప నాతల్లి
    కన్నబిడ్డ కంట గారమిడెను!!!


    రిప్లయితొలగించండి
  30. శైలజ గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  31. ఆ.వె:కఱకు ఱాతి గుండె గల్లిన యాతల్లి
    మానవత్వ మెల్ల మంట గలిపి
    తాపమోర్వ లేక తప్పటడుగు వేసి
    కన్నబిడ్డ కంటఁగార మిడెను.

    రిప్లయితొలగించండి
  32. తల్లి ప్రేమ బంచి తనయుని బెంచగా
    దొంగతనము జేసి దొరకి పోయె
    వాని మందలించి బాగుచేయ దలచి
    ​కన్న బిడ్డ కంటఁ గారమిడెను​!

    రిప్లయితొలగించండి
  33. శ్రీ భాగవతుల కృష్ణారావు గారి పూరణ

    గొడ్డురాలె యనుచు కొందరు బిల్వగా
    కొంత కాలమునకు కొడుకు బుట్ట
    సంతసమున తల్లి చనుబాలనిడి, గని
    కన్నబిడ్డ కంటఁ,- గార మిడెను.

    రిప్లయితొలగించండి
  34. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
  35. ముసలితనము నందు మోదాన గడుసుగా
    తానుతలచె నొకడు,తండ్రి జేర్చె
    వేగ కొడుకునతని వృద్ధాశ్రమము నందు
    కన్నబిడ్డకంట కారమిడెను

    కన్నబిడ్డయైన గారాబు గుణనిధి
    గుణము విడిచి తాను కులపు యశము
    మంట గలుప,తండ్రి మధనపడెను గాదె
    కన్నబిడ్డకంట కారమిడెను

    కొడుకు చదువు కొనుచు కొంపగోడులమ్మి
    పట్టణమునకంప,పతితుడగుచు
    వ్యసనపరుడునైన,బాధను జెందడే
    కన్నబిడ్డకంట గారమిడెను

    అమెరికాను కొడుకు నార్జనపరుడని
    వానిపెండ్లి చేయ పాట్లుపడగ
    వాడుచెప్పకుండ భార్యతోదిగబడె
    కన్నబిడ్డకంట కారమిడెను

    రిప్లయితొలగించండి
  36. ఆస్తులమ్మి చదువు నంటగ జేసిన
    పదవియందుజేరి’పట్టనట్లు
    బ్రతుకు సాగు నందు వెతలను బంచుచు
    కన్నబిడ్డ-కంటఁ గారమిడెను
    2.తల్లి దండ్రి ప్రేమ,తరుగని యాస్తిని
    సంతు సంగ్రహించి| వింతగాను
    ముసలి తనము నందు –విసుగునుబంచుచు
    కన్నబిడ్డ-కంటఁగారమిడెను

    రిప్లయితొలగించండి
  37. శొంటి కార మదియె శోధించు నదియన్న
    శీత బాధ దీర్చి ఊత మిచ్చు ,
    తనయు డచట జేరి తల నొప్పి యని జెప్ప
    కన్న బిడ్డ కంట c గార మిడెను
    కొరుప్రోలు రాధా కృష్ణ రావు

    రిప్లయితొలగించండి
  38. నమస్కారములు
    ప్రాణమైనా ధారపోసి పెంచిన తల్లి , కన్నబిడ్డ కంట , గారాబము చేసిదంట . అని నాఉద్దేశ్యము [ కంట్లో కారం పెట్టలేదుకదా అందుకని ]
    అన్వయం కుదరకపోతే ఇంకేముంది ? గురువులు మన్నించడమే మరి

    రిప్లయితొలగించండి
  39. చిన్నపిల్లవీవు నన్నెదిరించి వా
    గకుమని తన "సవతి కన్నబిడ్డ
    కంటఁ గార మిడెను" గయ్యాళి కాంతమ్మ
    గొల్లుమనుచునేడ్చె పిల్లయకట

    రిప్లయితొలగించండి
  40. ఎవరు కన్న బిడ్డొ యిచ్చట దొరికెను
    వెక్కి వెక్కి యేడ్చె గుక్క పెట్టి
    కన్నకడుపుతీపి కటువాయె తల్లికి
    కన్నబిడ్డ కంట కారమిడెను.

    రిప్లయితొలగించండి
  41. డా. బల్లూరి ఉమాదేవి గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *****
    బొడ్డు శంకరయ్య గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *****
    భాగవతుల కృష్ణారావు గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    అది ‘గారము’ కాదు, ‘కారము’. దానిముందున్న అరసున్నాను గమనించండి.
    *****
    మల్లెల సోమనాథ శాస్త్రి గారూ,
    మీ పూరణలన్నీ బాగున్నవి. అభినందనలు.
    *****
    కె. ఈశ్వరప్ప గారూ,
    సవరించిన మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
    *****
    కొరుప్రోలు రాధాకృష్ణ రావు గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *****
    చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *****
    మిస్సన్న గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  42. ధన్యవాదములు గురువు గారు.
    సవరించిన పద్యం :
    చప్పదనము తగ్గి చవులూరునట్టుల
    గలుపు చుండె గూర గటువు గాను
    దాని బట్టి తినగ నాయమ్మ, యొడిలోని
    కన్నబిడ్డ కంట గారమిడెను

    రిప్లయితొలగించండి