రాజేశ్వరి అక్కయ్యా, మీ పద్యం బాగున్నది. అభినందనలు. ***** శైలజ గారూ, మీ పద్యం బాగుంది. అభినందనలు. ***** పోచిరాజు సుబ్బారావు గారూ, మీ పద్యం బాగుంది. అభినందనలు. ***** అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ, మీ పద్యం బాగున్నది. అభినందనలు. ***** గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ, మీ పద్యం బాగుంది. అభినందనలు. ***** కె. ఈశ్వరప్ప గారూ, మీ పద్యాలన్నీ బాగున్నవి. అభినందనలు.
చిల్లర కొట్టును గట్టున
రిప్లయితొలగించండిపిల్లలు సరదాకి జేరి వేడుక మీరన్
మెల్లగ పైసలు కూడిన
చల్లని పానీయ మంది సంతస మొందన్
కమ్మగ నవ్వులు రువ్వుచు
రిప్లయితొలగించండిబొమ్మల నట బేర్చినారె పొత్తును జేయ
న్నిమ్మగు సెలవులు ముగిసెను
బొమ్మలనిక కట్టి బెట్టి బోవరె బడికిన్!!!
పొత్తు = వ్యాపారము
పిల్ల లచ్చట మనసున నుల్ల మలర
రిప్లయితొలగించండియాడు చుండిరి చక్కగ నమ్మ నాన్న
యాట లచ్చట చూడుము హరిత ! నీవు
గూడ పోయియా డుకొనుము వీడి నన్ను
కల్లకపటము లేనట్టి పిల్లలంత
రిప్లయితొలగించండిసెలవులందున నటచేరి చెన్నుగాను
బొమ్మలాటలతోడుత మురియుచుండ్రి
చిఱుత చేష్టలు మరిమరి గురుతు వచ్చె
నిన్నటి పద్య రచన :
రిప్లయితొలగించండిచెలులొక్క చోటఁ జేరియు
తలపులు తెరిచియు వరించు తరిదాల్పునకై
పులకలు పోవుచు సరసఁపు
పలుకుల, గోరింటఁ దీర్చు భంగమలొదువెన్!
కమ్మని జీవితమనుచున్
రిప్లయితొలగించండిసమ్మోదముఁ జెంది వారు సావాసులతో
బొమ్మలఁ బేర్చియు పిల్లలు
నమ్మా నాన్నాటలాడుటందరు గనరే!
అమ్మిన బొమ్మకమ్మ-మనఅమ్మగ నెంచిన? చెల్లియౌను|శో
రిప్లయితొలగించండికమ్మున-శోయగాలపదకమ్మున జేరిన?మిత్రురాలిగా?
“నమ్మియునాడు బృందమున నవ్వులు బంచెడి నాటవస్తువుల్
సొమ్ములు,షోకులై నిలచు|చూడగ పిల్లల మానసంబుకున్|”
2.నవ్వెడి బాలబాలికలు నాగారికంబును రువ్వబూనినా?
సవ్వడిలేని సంస్కుతిని సాకుచు బొమ్మలచేత నాడుచున్
దివ్వెల దీప్తియౌ మనసు తీరిచి దిద్దెడి అమ్మనాన్నకున్
రువ్వెడి సంతసంబుగన?రోదన మాన్పెడినౌషదంబగున్.
బాలలయూహలు బంధుత్వమేగాగ?
రిప్లయితొలగించండి----------ఆటవస్తువులెల్లపాటలేక
పువ్వుల నవ్వులా పురిగొల్ప భావాలు
---------వెలుగుల అలుగులో నిలువలగును|
కదలని బొమ్మలు కదలించ మనసును
------------కళలను బంచు వికాశ మందు|
రంగులద్దిన బొమ్మ పొంగించి యూహల
----------నందించ గలిగిన పొందికందు|
ఆటలాడగ అభిలాష ?పాటబాడు|
తోడునీడగ మిత్రులు జోడుగాగ?
బాల్య మనగానె?సంతస మూల్య మనుచు
తెలుపు బొమ్మలు|మాటలుదెలియకున్న|.
రాజేశ్వరి అక్కయ్యా,
రిప్లయితొలగించండిమీ పద్యం బాగున్నది. అభినందనలు.
*****
శైలజ గారూ,
మీ పద్యం బాగుంది. అభినందనలు.
*****
పోచిరాజు సుబ్బారావు గారూ,
మీ పద్యం బాగుంది. అభినందనలు.
*****
అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు.
*****
గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
మీ పద్యం బాగుంది. అభినందనలు.
*****
కె. ఈశ్వరప్ప గారూ,
మీ పద్యాలన్నీ బాగున్నవి. అభినందనలు.