30, జూన్ 2015, మంగళవారం

పద్య రచన - 946

కవిమిత్రులారా,
పై చిత్రాన్ని పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.

22 కామెంట్‌లు:

 1. మిత్రులందఱకు నమస్సులతో...

  పాండవుల నడ్డి యభిమన్యు పాలిట యముఁ
  డైన కతమున సైంధవుఁ డర్జున కృత
  శపథ ఫలముగ ననిలోన జడిసి డాఁగఁ
  జక్ర మడ్డుగఁ బెట్టియుఁ జక్రి రవి కి
  రణము లడ్డంగఁ జీఁకటి రణతలమునఁ
  గాంచి చనుఁదెంచ నర్జునుం డంచితముగ
  వానిఁ జంపియుం బ్రతిన నప్పగిదిఁ దీర్చె!

  రిప్లయితొలగించండి
 2. గుండు మధుసూదన్ గారూ,
  సైంధవవధపై మీ చిన్న తేటగీతకలో సమగ్రంగా తెలియజేశారు. బాగుంది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 3. తలకొరివి బెట్టు వానికి
  తలపెట్టగ వాడు కీడు ధరణిని బడగా
  తలదీసె నరుడు సైంధవు
  తలపించగ రాహువు, హరి దయతో నపుడే !

  రిప్లయితొలగించండి
 4. ఆ చిత్రం కురుక్షేత్రమున అర్జునుని వీరవిహారమన్న భావనతో..

  సత్తెముఁ దెలుపగఁ గృష్ణుడు
  సత్తువతో నర్జునుండు సమరము నందున్
  కత్తులు దూయగ వైరుల
  కుత్తుక లాకసము నెగయ గొరకలు వైచెన్!

  రిప్లయితొలగించండి
 5. గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
  మీ పద్యం బాగున్నది. అభినందనలు.
  *****
  గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
  మీ పద్యం బాగున్నది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 6. తాను జేసిన శపధమ్ము దలచు కొనుచు
  ననిని చక్రము సూర్యున కడ్డు గాను
  కవ్వ డి యపుడు సంధించ కాగ యస్త
  మయము చంపెను సైంధవుని నిక యార్య !

  రిప్లయితొలగించండి
 7. పోచిరాజు సుబ్బారావు గారూ,
  మీ పద్యం బాగున్నది. అభినందనలు.
  కొంత అన్వయలోపం, చివరిపాదంలో యతిదోషం, తడబడిన పద్యపు నదక... మీ పద్యానికి నా సవరణ....
  తాను జేసిన శపధమ్ము దలచె నరుడు,
  హరియు చక్రము సూర్యున కడ్డు పెట్టె,
  కవ్వడి యలుగు సంధించి కాగ యస్త
  మయము చంపెను సైంధవు నయముగాను!

  రిప్లయితొలగించండి
 8. అశ్వత్థ నారాయణ మూర్తి గారూ,
  మీ సీసపద్యం బాగుంది. అభినందనలు.
  సీసం మొదటిపాదంలో గణదోషం. ‘ద్రోణవ్యూహమ్ము’ అన్నచోట ‘ణ’ గురువవుతుంది. అక్కడ ‘ద్రోణు వ్యూహమ్మును ద్రోయంగ...’ అనండి.
  ఎత్తుగీతి మొదటిపాదంలోను గణదోషం. ‘అంత నరుఁడు సూర్యాస్తమయమునకు మును’ అందామా?

  రిప్లయితొలగించండి
 9. జలజాత యూధమ్ము సాధింప గాకుండె
  సైన్యంబు నడ్డంగ సైంధవుండు
  వ్యూధ విచారుడై యున్న యుధిష్ఠిరు
  దాపము దీర్చనుత్తరస ఖుండు
  ననిభయంకరుడయ్యె నంతక సముడయ్యె
  ప్రళయంబు గల్పించె ప్రతిన బూని
  ధూర్తులా దుష్టచ తుష్టయంబు కుటిలు
  రైబోర అభిమన్యు డంతమొంద
  తే గీ
  నంత పార్థుడా రవిగృంకు కన్న ముందు
  సైంధ వున్జంప భీకర శపథ మూని
  మాయ గల్పించ కృపతోడ మాధవుండు,
  నొక్క శరమున కంఠంబు నుత్త రించెద

  రిప్లయితొలగించండి
 10. చక్రి మాయనెరుంగక సైంధవుండు
  భాను డస్తమించె ననుచు బయటపడగ
  వాని శిరమును ఖండించి వాసిగాను
  శపధమునెరవేర్చుగొనెను సవ్యసాచి!!!

  రిప్లయితొలగించండి
 11. అశ్వత్థ నారాయణ మూర్తి గారూ,
  మీ సవరణ బాగుంది. అభినందనలు.
  *****
  శైలజ గారూ,
  మీ పద్యం బాగుంది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 12. వీరుడౌ యభిమన్యుని పోరునందు
  సంహరించగ వైరులు, సవ్యసాచి,
  చావుకున్ కారణంబైన సైంధవు తల,
  ఖండన మొనరించెను తాను భండనమున

  రిప్లయితొలగించండి
 13. చేయ ప్రతిజ్ఞ అర్జునుడు జేయగ సాయము కృష్ణ?” చక్రమే
  వేయగ?సూర్యకాంతి గనుపించక సైందవ యూహ మారగా”?
  ధ్యేయపు నర్జనుండిదుట దేలగ|శత్రువుమట్టు బెట్టగా
  చేయు-ప్రయత్నమే విషయ చిత్రము భారతంబునన్.

  రిప్లయితొలగించండి
 14. .వె;పాండు సుతుని సుతుని బవరాన తాజంపె
  సైంధ వుండు;ప్రతిన జేసె సవ్యసాచి
  సంజ లోపు వాని పరిమార్చ సాధ్యమయ్యె
  కాదె కవ్వడికట చక్రి వలన

  రిప్లయితొలగించండి
 15. అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
  మీ పద్యం బాగుంది. అభినందనలు.
  *****
  కె. ఈశ్వరప్ప గారూ,
  మీ ఉత్పలమాల బాగున్నది. అభినందనలు.
  కొన్ని లోపాలు... ‘చేయగ సాయము కృష్ణ’ అని కృష్ణ శబ్దాన్ని విభక్తిప్రత్యయం లేకుండా ప్రయోగించారు. ‘చేయగ సాయము శౌరి’ అనండి. అలాగే ‘సైంధవ యూహ’ అనడమూ దోషమే. ‘సైంధవు నూహ’ అనండి. ‘అర్జునుం డిదుట’.. ఇది అర్థం కాలేదు. చివరిపాదంలో గణదోషం. ‘చిత్ర మిదేకద భారతంబునన్’ అందామా?
  *****
  డా. బల్లూరి ఉమాదేవి గారూ,
  మీ పద్యం బాగున్నది. అభినందనలు.
  రెండవ, మూడవ పాదాలలో గణదోషం. మీ పద్యానికి నా సవరణ.....
  పాండు సుతుని సుతుని బవరాన తాజంపె
  సైంధ వుండు; తలచె సవ్యసాచి
  సంజ లోపు వాని పరిమార్చ సాధ్యమౌఁ
  గాదె కవ్వడికట చక్రి వలన.

  రిప్లయితొలగించండి
 16. అశ్వత్థ నారాయణ మూర్తి గారి పద్యం.....

  కన్న బిడ్డని మరణంబు గాంచినంత
  క్రోధ నేత్రము లనలము గురియు చుండ
  శరము సంధించి సైంధవున్ సంహరించె
  కృష్ణ సారథ్య వైభవ కృప తోడ.

  రిప్లయితొలగించండి
 17. అశ్వత్థ నారాయణ మూర్తి గారూ,
  మీ పద్యం బాగుంది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 18. కాలము మూడె సైంధవుని కంఠము నుండి శిరమ్ము వేర్వడెన్
  బాలుని వెంట పద్మమున బంధుల నడ్డిన ధూర్తుడై తృటిన్
  కాలుని వీటి కేగె తన కర్మము పండగ, పార్థు డల్లదే
  రాలగ జేసె నా తలను లాఘవ మొప్పగ తండ్రి దోయిటన్.

  రిప్లయితొలగించండి
 19. మిస్సన్న గారూ,
  చక్కని పద్యాన్ని అందించారు. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 20. రవిఁ గానపడకుండ రణరంగము
  న విజృంభణమునర్జున రథమును
  గవగవనడుపుచు గనెనట సైం
  ధవ వధ కృష్ణుడు ధర్మముకై.

  రిప్లయితొలగించండి