అశ్వత్థ నారాయణ మూర్తి గారూ, మీ పద్యం బాగున్నది. అభినందనలు. ***** గుండు మధుసూదన్ గారూ, మీ పద్యం బాగున్నది. అభినందనలు. మీ పద్యాన్ని చదవగానే ‘మేరా నామ్ జోకర్’ సినిమాలోని ‘తీతర్ కే దో ఆగే తీతర్, తీతత్ కే దో పీఛే తీతర్, ఆగే తీతర్ పీఛే తీతర్... బోలో కిత్‍నే తీతర్’ పాటు గుర్తుకు వచ్చింది.
గోలి హనుమచ్ఛాస్త్రి గారూ, వృత్త్యనుప్రాసతో మీ పద్యాలు హృద్యంగా ఉన్నాయి. అభినందనలు. ద్రోణాచార్యుడి ముందు అర్జునుడిలా మీకు కారే కనిపించింది. ధర్మజాదుల్లా మేము కార్లతోపాటు రోడ్లు, ఫ్లైఓవర్, చెట్లు, భవనాలు అన్నీ చూస్తున్నాము!
పోచిరాజు సుబ్బారావు గారూ, మీ పద్యం బాగున్నది. అభినందనలు. ***** శైలజ గారూ, మీ పద్యం బాగుంది. అభినందనలు. ‘ఉన్నచొ’ అని ప్రత్యయాన్ని హ్రస్వంగా ప్రయోగించారు. ‘వేరుగ నున్నను’ అనండి.
గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ, మీ పద్యం బాగున్నది. అభినందనలు. అది ట్రాఫిక్ జామ్ అన్న విషయాన్ని మీరొక్కరే గ్రహించారు (ఇప్పటివరకు). ఆ చిత్రం చైనాలో ఒకానొక సందర్భంలో జరిగిన ప్రపంచంలో రికార్డ్ సృష్టించిన పెద్ద ట్రాఫిక్ జామ్‍కు సంబంధించినది(ట!).
కె. ఈశ్వరప్ప గారూ, మీ పద్యాలు బాగున్నవి. అభినందనలు. ‘పద్ధతి+ అందు’ అన్నప్పుడు సంధి లేదు. యడాగమం వస్తుంది. ***** అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ, మీ పద్యం బాగున్నది. అభినందనలు. ‘కాలుష్యమ్ము’ అన్నచోట గణదోషం. ‘శబ్దకల్మషమ్ము’ అనండి. ***** సంపత్ కుమార్ శాస్త్రి గారూ, మీ పద్యం బాగున్నది. అభినందనలు.
దారులు వేరే యైనను
రిప్లయితొలగించండిబారులు తీరుచును బోవ వాహన ములనన్
నేరుగ వంతెన దాటగ
చేరును గమ్యమ టంచు చెలువము తోడన్
రాజేశ్వరి అక్కయ్యా,
రిప్లయితొలగించండిమీ పద్యం బాగున్నది. అభినందనలు.
‘గమ్య మటంచు’ అన్నచోట గణదోషం. ‘గమ్య మ్మటంచు’ అంటే సరి!
మానవసృజన ధిషణకు మచ్చు తునక
రిప్లయితొలగించండిఇన్ని వాహనములొకచో నేక రీతి
సాధు సహచర గాములై జనుట వింత
మనిషి మేధకసాధ్యంబు మహిని గలదె
మిత్రులందఱకు నమస్సులతో...
రిప్లయితొలగించండికారుముందు కారు! కారువెనుక కారు!
కారు పార్శ్వములను గార్లె కార్లు!
కార్లు నిండియున్న గమనవేగము మిన్న!
కాని, యాక్సిడెంట్లు కానెకావు!!
అశ్వత్థ నారాయణ మూర్తి గారూ,
రిప్లయితొలగించండిమీ పద్యం బాగున్నది. అభినందనలు.
*****
గుండు మధుసూదన్ గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు.
మీ పద్యాన్ని చదవగానే ‘మేరా నామ్ జోకర్’ సినిమాలోని ‘తీతర్ కే దో ఆగే తీతర్, తీతత్ కే దో పీఛే తీతర్, ఆగే తీతర్ పీఛే తీతర్... బోలో కిత్‍నే తీతర్’ పాటు గుర్తుకు వచ్చింది.
కారు కారు ముందు కారు కారే కారు
రిప్లయితొలగించండికారు కారు వెనుక కారె కారు
కారు మారె రారు కారులేక జనులు
కారు బారు తీరు జోరు జోరు
నాకక్కడ ఇంకేమీ కనబడట్లేదు....కారుల బారు తప్ప...
రిప్లయితొలగించండికారు కారు కారు కారు కారే కారు
కారు కారు కారు కారు కారు
కారు కారు కారు కారు కారే కారు
కారు కారు కారు కారు కారు
గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
రిప్లయితొలగించండివృత్త్యనుప్రాసతో మీ పద్యాలు హృద్యంగా ఉన్నాయి. అభినందనలు.
ద్రోణాచార్యుడి ముందు అర్జునుడిలా మీకు కారే కనిపించింది. ధర్మజాదుల్లా మేము కార్లతోపాటు రోడ్లు, ఫ్లైఓవర్, చెట్లు, భవనాలు అన్నీ చూస్తున్నాము!
రాత్రి ,పగలు కూడ రయ్యుమనుచు కార్లు
రిప్లయితొలగించండిబళ్ళు ,కాలి నడక వారు పోవు
చుండ్రి చూడు మచట చోద్యము గాలేదె
వారి వేగ మాప నేరి తరము ?
కారులు బారులు దీరుచు
రిప్లయితొలగించండిజోరుగ బోవంగ జూడ చోద్యము గాదే
దారులు వేరుగ నున్నచొ
చేరు నటుల వాహనములు సేమంబుగనే!!!
పోచిరాజు సుబ్బారావు గారూ,
రిప్లయితొలగించండిమీ పద్యం బాగున్నది. అభినందనలు.
*****
శైలజ గారూ,
మీ పద్యం బాగుంది. అభినందనలు.
‘ఉన్నచొ’ అని ప్రత్యయాన్ని హ్రస్వంగా ప్రయోగించారు. ‘వేరుగ నున్నను’ అనండి.
ఆ.వె:తీరుగాను తీర్చి దిద్దిన యీరహ
రిప్లయితొలగించండిదారు లందు రహిని రయము తోడ
వాహనముల యందుబయనించ వచ్చును
భయము లేక జనులు భద్రముగను.
ఆ.వె:తీరుగాను తీర్చి దిద్దిన యీరహ
రిప్లయితొలగించండిదారు లందు రహిని రయము తోడ
వాహనముల యందుబయనించ వచ్చును
భయము లేక జనులు భద్రముగను.
ఆ.వె:తీరుగాను తీర్చి దిద్దిన యీరహ
రిప్లయితొలగించండిదారు లందు రహిని రయము తోడ
వాహనముల యందుబయనించ వచ్చును
భయము లేక జనులు భద్రముగను.
ఆ.వె:తీరుగాను తీర్చి దిద్దిన యీరహ
రిప్లయితొలగించండిదారు లందు రహిని రయము తోడ
వాహనముల యందుబయనించ వచ్చును
భయము లేక జనులు భద్రముగను.
డా. బల్లూరి ఉమాదేవి గారూ,
రిప్లయితొలగించండిమీ పద్యం బాగున్నది. అభినందనలు.
*****
నాగరాజు రవీందర్ గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు.
జోరుగ లోహవిహంగము
రిప్లయితొలగించండిచేరిచె నను వేల మైళ్ళు శీఘ్రపు రీతిన్!
బారులు దీరగ కారులు
చేరెద నేనింటికెపుడు చెప్పగ దరమా?
గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
రిప్లయితొలగించండిమీ పద్యం బాగున్నది. అభినందనలు.
అది ట్రాఫిక్ జామ్ అన్న విషయాన్ని మీరొక్కరే గ్రహించారు (ఇప్పటివరకు). ఆ చిత్రం చైనాలో ఒకానొక సందర్భంలో జరిగిన ప్రపంచంలో రికార్డ్ సృష్టించిన పెద్ద ట్రాఫిక్ జామ్‍కు సంబంధించినది(ట!).
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిజనుల జీవనమ్ము స్తంభించె నచ్చోట
రిప్లయితొలగించండికారులమయమవ్వ దారులన్ని
గాలి కలుషిత మవ గాఢమౌ పొగతోడ
శబ్ద కాలుష్యమ్ము జటిలమయ్యె
కారులు బారులు తీరిన
రిప్లయితొలగించండితీరును గని దారి తెన్ను దెలియనివారై
కారణమేమియొ తెలియక
నోరెళ్ళగబెట్టిరే వినోదము చూడన్.
కె. ఈశ్వరప్ప గారూ,
రిప్లయితొలగించండిమీ పద్యాలు బాగున్నవి. అభినందనలు.
‘పద్ధతి+ అందు’ అన్నప్పుడు సంధి లేదు. యడాగమం వస్తుంది.
*****
అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు.
‘కాలుష్యమ్ము’ అన్నచోట గణదోషం. ‘శబ్దకల్మషమ్ము’ అనండి.
*****
సంపత్ కుమార్ శాస్త్రి గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు.
మాస్టరుగారూ ! ధన్యవాదములు...
రిప్లయితొలగించండిఆకాశంబున చుక్కలు
రిప్లయితొలగించండిఈకాలపు భూమి ఫైన నెంచగ కార్లే
లోకములో లెక్కించుట?
ఏకంప్యూటర్ల కగును?నెంచుటకిలలో|
2.కారుపుకార్లు గాదట షికారులు బోవగ షావుకారులీ
కారుల బారులన్నియు|-వికారము లేకను మార్గమందునే
దారియు జూపుచున్ విధి విధానము లందున వెళ్లు చుండు|ఆ
కారము లన్ని పారుట|సకాలము నందునజేరు టందుకే.
3.క్రమ శిక్షణయే రక్షణ
క్రమమే లేకున్న?భువిన కష్టము లెన్నొ
అమరిక నద్భుతరీతిగ
గుమిగూడిన కార్లుగనగ? గోప్యముగాదే|