25, జూన్ 2015, గురువారం

సమస్యా పూరణము - 1713 (హరుని వక్షస్స్థలమ్మున నమరె లక్ష్మి)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది....
హరుని వక్షస్స్థలమ్మున నమరె లక్ష్మి.

23 కామెంట్‌లు:

 1. మిత్రులు శ్రీ కంది శంకరయ్యగారికి, సుకవి మిత్ర బృందమునకు నమోవాకములతో...

  బ్రహ్మ ముఖమున నమరెను వాణి! హరుని
  తలను గంగ, దేహార్ధమం దమరె గౌరి!
  శ్రీశు కేశవు పరమేశు జిష్ణుని ముర
  హరుని వక్షస్స్థలమ్మున నమరె లక్ష్మి!!

  రిప్లయితొలగించండి
 2. ఆది శంకరు సతియైన యాది లక్ష్మి
  దక్ష యజ్ఞము నందున దహన మవగ
  యవత రించెను పలునామ మన్న పూర్ణ
  హరుని వక్షస్ద్స్థ లమ్మున నమరె లక్ష్మి

  రిప్లయితొలగించండి
 3. పాలకడలిపై శేష తల్పమ్ముపైన
  పవ్వళించిన విష్ణుని వలపుగెలిచి
  ప్రాణసఖునిగ తానొంది రయమునంశ
  హరుని వక్షస్స్థలమ్మున నమరె లక్ష్మి
  (అంశహరుఁడు=భాగస్వామి)

  రిప్లయితొలగించండి
 4. బ్రహ్మముఖనివాసినిసుమ్మ పలుకు బోటి
  శివుని యర్థభాగమ్మయ్యె సింహయాన
  పద్మనాభుడు కైటభవైరి కంస
  హరుని వక్ష స్స్థలమ్మున నమరె లక్ష్మి

  రిప్లయితొలగించండి
 5. గుండు మధుసూదన్ గారూ,
  చక్కని పూరణతో బోణీ చేశారు. చాల బాగుంది. అభినందనలు.
  *****
  రాజేశ్వరి అక్కయ్యా,
  పద్యం బాగుంది. కాని సతీదేవిని ఆదిలక్ష్మి అనడం అర్థం కాలేదు.
  ‘దహనమయ్యు|నవతరించెను...’ అనండి.
  *****
  చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  *****
  అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 6. పాలకడలిని మధియించు వేళ బుట్టి
  తెల్ల సంద్రము పైనున్న నల్లనయ్య
  నచ్చి నాడని హరి, పద్మనాభుని, ముర
  హరుని వక్షస్స్థలమ్మున నమరె లక్ష్మి.

  రిప్లయితొలగించండి
 7. పాల కడలిన ప్రభవించి పద్మవాస
  నల్ల వేల్పును బెండ్లాడి నయము గాను
  శేషశయనుడు వనమాలి జిష్ణువు ముర
  హరుని వక్షస్థ్సలమ్మున నమరె లక్ష్మి!!!

  రిప్లయితొలగించండి
 8. హరుని దనువు లోన సగము నందె నార్య
  యజుని వాక్కున వాణియు నధివసించె
  పృథివి యూర్ధ్వమందుండియు భృగువు గర్వ
  హరుని వక్షస్థలమ్మున నమరె లక్ష్మి

  వరాహ రూపమున భూమిని పైన పెట్టుకున్నాడు
  అనంతుడు విష్ణువు అవతారమంటారు. అనంతుడు భూమిని
  నెత్తిన పెట్టుకున్నాడు.
  భూదేవిని నెత్తిన శ్రీదేవిని గుండెల్లో ఉంచుకున్నాడు.
  భృగువు పాదమందలి కంటిని చిదిమి, విష్ణువు ఆయన గర్వ మణచాడు

  రిప్లయితొలగించండి
 9. హరుని యర్ధ భాగమ్మున నమరె గిరిజ
  అమరె శారద కంజుని యాననమున
  శిష్ఠ రక్షకుడు శ్రీహరి దుష్ట ముర
  హరుని వక్షస్స్థలమ్మున నమరె లక్ష్మి.

  రిప్లయితొలగించండి
 10. గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  *****
  శైలజ గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  *****
  అశ్వత్థ నారాయణ మూర్తి గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  *****
  గండూరి లక్ష్మినారాయణ గారూ,
  మీ పూరణ బాగుంది. అభినందనలు.
  మూడవపాదంలో గణదోషం. ‘శిష్టరక్షకు డగు హరి...’ అనండి.

  రిప్లయితొలగించండి
 11. గురువుగారికి నామస్కారములు
  సవరించాను
  హరుని యర్ధ భాగమ్మున నమరె గిరిజ
  అమరె శారద కంజుని యాననమున
  శిష్ట రక్షకుండుగు హరి దుష్ట ముర
  హరుని వక్షస్స్థలమ్మున నమరె లక్ష్మి.

  రిప్లయితొలగించండి
 12. గౌరి వాపోయె సిరి కడ ' కౌగిలింప
  మరులుగొని పతిదేవుని, మాయపాము
  ముందె నాకన్న కంఠము నందు చుట్టి
  హరుని వక్షస్స్థలమ్మున నమరె లక్ష్మి. '

  రిప్లయితొలగించండి
 13. హిమ గిరీశుని బుత్రిక యిమిడె సామి !
  హరుని వక్షస్థ లమ్మున ,నమరె లక్ష్మి
  విశ్వ మాడించు బోషించు విష్ణు నెదను
  హరిహ రులకు నే వందన మాచ రింతు

  రిప్లయితొలగించండి
 14. అర్ధనారిగ పార్వతి,నాడు నాగు
  “హరుని వక్షస్థ్సలమ్మున నమరె”|”లక్ష్మి
  హరియు మదియందు ఎదయందునణిగియుండె|”
  “వాణి బ్రహ్మయుతలయందు వరలుచుండె|”

  రిప్లయితొలగించండి
 15. కలియుగమ్మున భక్తులఁ గాచు వాని
  శ్రీనివాసాయనుచుఁ గొల్వ సిరులఁ బంచ
  వేంకటేశ్వర నాముని సంకటముల
  హరుని వక్షస్థలమ్మున నమరె లక్ష్మి!

  రిప్లయితొలగించండి

 16. దేవదానవుల్ వార్ధి మథించు నపుడు
  గరళ ముద్భవింపగ మ్రింగె పురహరుండు
  అఖిల జగముల పాలించు హరిని కలుష
  హరుని వక్షస్థలమ్మున నమరె లక్ష్మి!

  రిప్లయితొలగించండి
 17. త్రీడి చిత్ర పటమ్మది తిరిగిచూడ?
  మూర్తిత్రయమును భార్యలు ముగ్గురున్న?
  హరుని వక్షస్స్థలమ్మున నమరె లక్ష్మి
  కంటిచూపును మార్చగ? కానరాదు|

  రిప్లయితొలగించండి
 18. గండూరి లక్ష్మినారాయణ గారూ,
  నా దృష్టికి రాని మరో దోషం. అదే పాదంలో ‘దుష్ట ముర’ అన్నచోటకూడా గణదోషం. ‘దుష్టదనుజ’ అనండి.
  *****
  మిస్సన్న గారూ,
  మీ పూరణ ప్రశస్తంగా, వైవిధ్యంగా ఉంది. అభినందనలు.
  *****
  పోచిరాజు సుబ్బారావు గారూ,
  మీ పూరణ బాగుంది. అభినందనలు.
  *****
  కె. ఈశ్వరప్ప గారూ,
  మీ పూరణ బాగుంది. అభినందనలు.
  ‘బ్రహ్మయుతలయందు’...? ‘బ్రహ్మ ముఖమ్మున’ అంటే బాగుంటుందేమో!
  మీ ‘త్రిడి’ చిత్రపటం పూరణ బాగున్నది. అభినందనలు.
  *****
  గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  *****
  కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  *****
  నాగరాజు రవీందర్ గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 19. హరియు,హరుడును నొకటని యనెను వేద
  మటులె లక్ష్మియు,నగజయు నౌదురొకటె
  మనదు భావానభేదంబు మాయమైన
  హరుని వక్షస్థలంబున నమరె లక్ష్మి

  తిక్కయజ్వయు తానట్లు తేటపరచె
  హరి హరుడన నారూపంబు నౌను నొకటె
  మతము భేదాలు మానిన మనము కనమె
  హరుని వక్షస్థలంబున నమరె లక్ష్మి

  అంబ రూపాలె లక్ష్మియు నగజలగుట
  శక్తి తానయి భగవాను సర్వమగుచు
  వెలిగె,గుండెను,దేహాన వింతగాను
  హరుని వక్షస్థలంబున నమరె లక్ష్మి

  భార్యె లక్ష్మని లోకాన వాడుకగును
  హరుడు దేహాన సగమీయ నందమగుచు
  నెడమ భాగాన గుండెయై యింతి దనరె
  హరుని వక్షస్థలంబున నమరె లక్ష్మి

  హరుని పేరుగానందిన యతడు నొకడు
  లక్ష్మి పేరైన వనితను లక్షణముగ
  పెండ్లి యాడెను నిరువురు వెలుగనొకట
  హరుని వక్షస్థలమున నమరె లక్ష్మి

  రిప్లయితొలగించండి
 20. సగము మేనయ్యె పార్వతి శంకరునకు
  వదనమందున తానిల్చె వాణి పతికి
  జలనిధి సుత తా సతియై చక్కగ ముర
  హరుని వక్షస్స్థ లమ్మున నమరె లక్ష్మ

  రిప్లయితొలగించండి
 21. సగము మేనయ్యె పార్వతి శంకరునకు
  వదనమందున తానిల్చె వాణి పతికి
  జలనిధి సుత తా సతియై చక్కగ ముర
  హరుని వక్షస్స్థ లమ్మున నమరె లక్ష్మి

  రిప్లయితొలగించండి
 22. సగము మేనయ్యె పార్వతి శంకరునకు
  వదనమందున తానిల్చె వాణి పతికి
  జలనిధి సుత తా సతియై చక్కగ ముర
  హరుని వక్షస్స్థ లమ్మున నమరె లక్ష్మి

  రిప్లయితొలగించండి