21, జూన్ 2015, ఆదివారం

పద్య రచన - 938

కవిమిత్రులారా,
పై చిత్రాన్ని పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.

23 కామెంట్‌లు:

  1. అందరికీ వందనములు !
    అందరి పూరణలూ అలరించు చున్నవి !

    నేల నడయాడు దైవమే - కన్నతల్లి :

    01)
    __________________________

    పీక వరకు నీరు - వెల్లువగట్టినన్
    పిచ్చి తల్లి బాలు - విడువలేదు
    కన్నతల్లి సాటి - కన్నతల్లేగదా !
    దైవమిలను తిరుగు - తల్లివోలె !
    __________________________
    వోలిగె

    వోలిగె : నల్లగొండజిల్లా మాండలిక పదకోశం (రవ్వా శ్రీహరి) 1986
    అవ్యయం
    వలె
    నీవోలిగె ఎవరు కష్టపడతారు?

    రూపాం. వోలె

    రిప్లయితొలగించండి
  2. కాదాయె తానేమి కపివంశ తిలకుడు
    జలమును లంఘింప శ్రమము లేక
    కాదాయె తానింక కాకుత్స్థుఁడు మరల
    వారధి నిర్మింప వాగు పైన
    అసలు కాదాయె తాన్ వసుదేవుడైనను
    పారు నది తొలగి దారినివ్వ
    కాదాయె మరి తాను కమలనాభుండైన
    శేషతల్పంబును చేరి నిల్వ

    అమృత మూర్తియైన యమ్మయె తానౌను
    కన్నబిడ్డనిటుల కావనెంచి
    కదిలి వచ్చె తాను కంఠంబు మునగంగ
    తట్టపైన కూర్మి తనయుడుండ

    రిప్లయితొలగించండి
  3. వశమే దాటగ నీనది
    వసుదే వుడుకాదు తాను పరమా త్మునికై
    కుశలముగ నిల్లుజేరిన
    పసివాడి.. క... దక్కెనేని భగవత్ కృపచే
    ----------------------------------------
    కుదురుగ నుండుము బిడ్డా
    పదిలముగా గంప బట్టి భయమన కుండా
    నదిదాటిన వెను వెంటనె
    ముదమారగ నిత్తు నీకు మోదకములనే

    రిప్లయితొలగించండి
  4. వసంత కిశోర్ గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.
    ‘తల్లి+పోలె= తల్లివోలె’ ఇది శుద్ధవ్యాకరణప్రయోగం... సలక్షణం... ఇక్కడ మాండలికం ప్రస్తావవ అవసరం లేదు.
    *****
    జిగురు సత్యనారాయణ గారూ,
    ఉదయాన్నే అద్భుతమైన పద్యాన్ని చదివే అవకాశం కల్పించారు. చాల బాగుంది. అభినందనలు.
    *****
    రాజేశ్వరి అక్కయ్యా,
    మీ పద్యాలు బాగున్నవి. అభినందనలు.
    ‘భయ మనకుండన్’ అనండి.

    రిప్లయితొలగించండి
  5. వాగువంకలు పొంగగ వేగముగను
    దాటు చుండెను శ్రీమూర్తి ధాటిగాను
    తనయు శిరముపైన నునిచి తట్టలోన
    భయము లేకుండ కూర్చున్న బాలుఁగనుడు

    రిప్లయితొలగించండి
  6. యమునా నది జేసెను సా
    యము నా బాలుండు హరికి " నది జరగ " దపా
    యమునాకని తెలిసియును భ
    యమునావలనెట్టి వేసె యరిగితి వమ్మా !

    రిప్లయితొలగించండి
  7. తల్లి ప్రేమకు సాటిది ధర ణి గలదె ?
    కన్న కొడుకును నునిచియు గంప లోన
    దాటు చుండెను వాగును దరము తోడ
    అమ్మ ! యోయమ్మ ! వందన మందు కొనుము

    రిప్లయితొలగించండి
  8. ఇంకోవైపు ఫాదర్స్ డే అంటున్నారు. ఇక్కడ తల్లితనపు చిత్రమూ ఉంది.
    తల్లి అయినా, తండ్రి అయినా కన్న ప్రేమ ఒక్కటే.

    కన్న ప్రేమకు సాటియౌ కనకమెద్ది?
    తలకు మించిన యాపద తనకు కలుగు
    వేళ నైన బిడ్డనెపుడు వీడ లేని
    మమత మహిని వెలసె; ప్రణామములు కోటి!

    రిప్లయితొలగించండి
  9. తనయుని తట్టను బెట్టుకు
    నణుమాత్రము జంకకుండ నావలి యొడ్డున్
    వెనువెంటనెచేరుటకై
    ధుని లో బడి నీదుచుండె తొయ్యలి రయమున్!!!

    రిప్లయితొలగించండి
  10. గొంతువరకు నీళ్లున్నను,
    చింతలలో చిక్కియున్న, చితిలోనున్నన్,
    సంతును గావగఁ జడవని
    యింతెవరయ తల్లి గాక యిలలో జూడన్!

    రిప్లయితొలగించండి
  11. గురువు గారు ధన్యవాదాలు.
    హనుమచ్ఛాస్త్రి గారు ప్రతి పాదములోను యమునా ప్రవాహాన్ని చూపారు. బాగుంది.

    రిప్లయితొలగించండి
  12. తనయుని నెత్తికెత్తుకొని తల్లి నదీవలయంబునందు యా
    తన పడుచున్నదే మది విదారకమయ్యెను భారతావనిన్
    మన ఘన నాయకోత్తములు మౌనముగా గమనించుచుండ్రు, వే
    దన భరితంబులయ్యె కద ధారుణి జీవితమెంచి చూడగాన్.

    రిప్లయితొలగించండి
  13. కవి మిత్రుల వారి పద్యములు అలరించుచున్నవి. ప్రత్యెకముగా శ్రీ జిగురువారి, శ్రీ గోలి వారి పద్యములు.

    రిప్లయితొలగించండి
  14. ఆకలిదప్పు లార్పుటకు ఆనది దాటుట తప్పదాయనా?
    వ్యాకులమందు ముంచకను బాలుని రక్షణ గాగ గంపయే
    సాకెడి తల్లియున్ మమత సాయముబంచగ?పువ్వునవ్వులా
    లోకుల కంద జేయగ?-ప్రలోభము నందున బాల భాగ్యమే|

    రిప్లయితొలగించండి
  15. బిడ్డరక్షగ తల్లి గడ్డు సమస్యను
    -----తలఫైన గంపతో తొలగజేసె|
    తల్లి రక్షగ బిడ్డ తల ఫైన గూర్చొని
    -----కాళ్ళకు బలమిచ్చి కదలజేసె|
    ఆకలి వెంటాడ?రూకల కొరకేమొ
    -----అమ్మనావేదనల్ నణగ జేసె|
    సాగుచున్నట్టి సంసార సాగు బడికి
    -----దైవమే మనసుకు ధైర్యమివ్వ?
    నీటి కెదురు వెళ్లు నిలఫైన శక్తిగా|
    లక్ష్య మెంచుకొన్న లక్ష్మి లాగ|
    ప్రాణ భయము మాన్పు వాణియు రీతియౌ
    అమ్మ,ఆది శక్తికంతుగలద?

    రిప్లయితొలగించండి
  16. జిగురు వారూ ! సంపత్ గారూ ! ధన్యవాదములు.....చాలా దినముల తరువాత మీ మీ పద్యమాధుర్యాన్ని పంచారు...బహు పసందుగానున్నవి.

    రిప్లయితొలగించండి
  17. యేరు దాట సాగె వెరపు లేక
    కన్న బిడ్డ కొఱకు కష్టము భరియించు
    ధరను తల్లి కన్న దైవ మేది/మెవరు

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఆ.వె:తల్లి నెత్తి మీద తనయునెత్తికొనుచు
      యేరు దాట సాగె వెరపు లేక
      కన్న బిడ్డ కొఱకు కష్టము భరియించు
      ధరను తల్లి కన్న దైవ మేది/మె

      తొలగించండి
    2. ఆ.వె:తల్లి నెత్తి మీద తనయునెత్తికొనుచు
      యేరు దాట సాగె వెరపు లేక
      కన్న బిడ్డ కొఱకు కష్టము భరియించు
      ధరను తల్లి కన్న దైవ మేది/మె

      తొలగించండి
  18. యేరు దాట సాగె వెరపు లేక
    కన్న బిడ్డ కొఱకు కష్టము భరియించు
    ధరను తల్లి కన్న దైవ మేది/మెవరు

    రిప్లయితొలగించండి
  19. నిన్నటి పద్యరచన శీర్షికలో ఉత్సాహంలో పాల్గొని చక్కని పద్యాలను అందించిన కవిమిత్రులు....
    అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారికి,
    గోలి హనుమచ్ఛాస్త్రి గారికి,
    పోచిరాజు సుబ్బారావు గారికి,
    లక్ష్మీదేవి గారికి,
    శైలజ గారికి,
    గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారికి,
    జిగురు సత్యనారాయణ గారికి,
    సంపత్ కుమార్ శాస్త్రి గారికి,
    కె. ఈశ్వరప్ప గారికి,
    డా. బల్లూరి ఉమాదేవి గారికి,
    అభినందనలు, ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి